సర్వసభ్య సమావేశము
భరించు శక్తి
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


భరించు శక్తి

మన యొక్క అంతరాత్మను నింపగల విశ్వాసము, దైవ వాక్యము మాత్రమే మనలను బ్రతికించడానికి—మరియు మనము ఆయన యొక్క శక్తిని అందుకొనుటకు అనుకూలించును.

మన ప్రియమైన ప్రవక్త , అధ్యక్షుడు రస్సెల్ ఎమ్. నెల్సన్. యొక్క బోధలను సమీక్షించుచుండగా ఆయన అనేక ప్రసంగాలలో తరచూ వాడిన మాట ఒకటి నేను కనుగొన్నాను. ఆ మాట, శక్తి.

ఆయన ఒక అపొస్తలునిగా అంగీకరింపబడిన తరువాత మొదటి సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు నెల్సన్ శక్తిని గూర్చి మాట్లాడారు. 1 సంవత్సరాల తరబడి ఆయన శక్తిని గూర్చి బోధించడం కొనసాగించారు. మనము అధ్యక్షుడు నెల్సన్ గారిని ప్రవక్తగా ఆమోదించినప్పటి నుండి ఆయన శక్తి యొక్క సూత్రమును—నిర్దిష్టమైన దేవుని శక్తి—దానిని ఏ విధంగా పొందగలము అను దాని గూర్చి బోధించారు. ఇతరులకు పరిచర్య చేయునప్పుడు ఏ విధంగా మనము దేవుని శక్తిని అందుకోగలమో2 పశ్చాత్తాపము ఏ విధంగా యేసు క్రీస్తు మరియు ఆయన యొక్క ప్రాయశ్చిత్తపు శక్తిని మన జీవితాలలోనికి ఆహ్వానిస్తుందో3, యాజకత్వము అనగా దేవునియొక్క శక్తి మరియు అధికారము ఆయనతో నిబంధన చేసుకొని పాటించు వారందరిని ఏ విధంగా దీవించునో4 ఆయన బోధించియున్నారు. పరిశుద్ద దేవాలయములో దీవించబడిన వారందరు నిబంధనలను పాటించునప్పుడు దేవుని శక్తి వారిలో ప్రవహించునని అధ్యక్షులు నెల్సన్ సాక్ష్యమిచ్చియున్నారు.5

ముఖ్యంగా ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు నెల్సన్ చేసిన సవాలు వలన నేను చలించిపోయాను. మీరు దీవెనగా పొందిన శక్తి, మరియు విజ్ఞానమును గూర్చి గాని—లేక మీరు ఇంకా పొందబోవుచున్న దీవెనల గూర్చిగాని, మరింత తెలుసుకొనుటకు అధ్యయనం మరియు ప్రార్థిన చేయండి” అని ఆయన ఆదేశించియున్నారు.6

ఈ సవాలునకు స్పందించి, నేను అధ్యయనంచేసి, ప్రార్ధించి, నేను దీవెనగా పొందిన శక్తి మరియు విజ్ఞానమును గూర్చి, ఇంకా నేను పొందబోవు దీవెనను గూర్చి కొన్ని ప్రయోజనకరమైన విషయములను నేర్చుకున్నాను.

మన జీవితాలలో దేవుని శక్తిని పొందడానికి మనము ఏమి చేయాలో గ్రహించడం సులభం కాదు. కాని, మన మనసులో అధ్యయనం చేయుట ద్వారా పరిశుద్ధాత్మ మనకు జ్ఞానోదయము కలిగించునట్లు ప్రార్ధనచేయుట ద్వారా అది సాధ్యమని నేను తెలుసుకున్నాను. 7 ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ దేవుని శక్తి అంటే: “మనం సొంతంగా చేయగలిగిన దానికంటే అధికంగా చేయగల శక్తి”8 అని స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు.

కష్టతరమైన ఈ దినములలో మనము సహాయము కొరకు దేవుని శక్తిని అందుకొనుటకు మన హృదయాలను, మన ఆత్మలను కూడా దేవుని వాక్యముతో నింపుకొని, యేసు క్రీస్తునందు విస్వాసమను పునాధిని కలిగియుండుట కీలకమైయున్నది. దేవుని వాక్యమును పొందక, యేసు క్రీస్తు నందు విశ్వాసము హృదయము నందు లోతుగా నుండని యెడల మన సాక్ష్యము, మన విశ్వాసము విఫలము కాగలవు మరియు దేవుడు మనకు అనుగ్రహింపదలచిన శక్తిని అందుకొనుటను మనం పోగొట్టుకోగలము. బాహ్యమైన విశ్వాసము సరిపోదు. మన యొక్క అంతరాత్మను నింపగల విశ్వాసము, దైవవాక్యము మాత్రమే మనలను బ్రతికించడానికి—మరియు మనము ఆయన యొక్క శక్తిని అందుకొనుటకు అనుకూలించును.

సహోదరి జాన్సన్, నేను మా పిల్లల యొక్క పెంపకములో ప్రతి ఒక్కరు ఒక సంగీత వాయిద్యమును నేర్చుకోవలెనని ప్రోత్సహించాము. కానీ వారు తమ వంతుగా సాధన చేస్తేనే మా పిల్లలు సంగీత శిక్షణ పొందడానికి మేము అంగీకరిస్తాము. ఒక శనివారం, మా మూడవ కుమార్తె జేలిన్ తన స్నేహితులతో వెళ్లి ఆడుకోడానికి ఉత్సాహపడింది, కాని ఆమె ఇంకా పియానో సాధన చెయ్యలేదు. 30 నిమిషాలపాటు పియానో సాధన చెయ్యడానికి ఒప్పుకున్న విషయం ఆమెకు తెలుసు కనుక అవసరమైన సమయం కంటే ఒక్క నిమిషం కూడా ఎక్కువసేపు సాధన చేయకుండా ఉండటానికి టైమర్ను పెట్టుకోవాలనుకున్నది.

పియానో దగ్గరికి వెళ్తూ, మైక్రోవేవ్ పొయ్యి ప్రక్కగా నడుస్తూ ఆగి, కొన్ని మీటలు నొక్కింది. కాని, టైమర్ సెట్ చేయడానికి బదులు మైక్రో వేవ్ ను 30 నిమిషాల వంటకు సెట్ చేసి ఆన్ చేసింది. 20 నిమిషాలు సాధన చేసిన తరువాత ఇంకా ఎంత సమయం మిగిలిందో చూడ్డానికి వంటగదిలోకి వెళ్ళిన తను, మైక్రోవేవ్ మంటల్లో ఉండటం చూసింది.

అప్పుడామె ఇల్లు కాలిపోతోంది అని అరుస్తూ పెరట్లో పనిచేస్తున్న నా దగ్గరకు పరుగున వచ్చిది. నేను వెంటనే ఇంట్లోకి పరుగున వెళ్లి; నిజంగానే మైక్రోవేవ్ మంటల్లో ఉండటం నేను చూశాను.

మా ఇల్లు కాలిపోకుండా కాపాడే ప్రయత్నంలో కాలుతున్న మైక్రోవేవ్ దగ్గరకు వెళ్లి ప్లగ్గును ఊడదీసి ఆ వైరుతోనే దాన్ని ఆ స్థానంలో నుండి తొలగించాను. ఆ రోజు గండం నుండి, మా ఇంటిని అగ్ని ప్రమాదంనుండి ఓక హీరోలాగా రక్షించాలని ఆశిస్తూ మండుచున్న ఆ మైక్రోవేవ్ వైరుతో తిప్పుతూ నా శరీరం కాలకుండా దూరంగా పట్టుకొని వెనక పెరట్లోకి తీసుకు వెళ్లి ఒక్క ఊపుతో ఆ మైక్రోవేవ్ ను మైదానంలోనికి విసిరేశాను. అక్కడ మేము నీటి గొట్టంతో మంటలను ఆర్పగలిగాము.

జరిగిన అనర్ధం ఏమిటి? మైక్రోవేవ్ లోపల ఏదైనా పదార్ధం పెడితే అది ఆ వేడిని గ్రహించి అది వేడెక్కుతుంది. కాని, ఖాళీగా ఉన్నప్పుడు అలా చేస్తే ఆ వేడిని గ్రహించడానికి ఏమీ లేక వేడెక్కిపోయి మంటలు చెలరేగి అది కాస్తా తగులబడి బూడిదైపోవచ్చును.9 మా మైక్రోవేవ్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది ఎందుకంటే దానిలోపలి భాగం ఖాళీగా ఉంది.

అదే విధంగా ఎవరైతే విశ్వాసం కలిగి, హృదయాంతరంగంలో దేవుని వాక్యం కలిగియుంటారో వారు నాశనంచేయుటకు అపవాది పంపే అగ్ని బాణములను తప్పకుండా జయించగలరు.10 లేనిచో మన విశ్వాసము, నిరీక్షణ, నమ్మకము నిలువజాలవు. కనుక ఆ ఖాళీ మైక్రోవేవ్ వలె మనము ప్రమాదమునకు గురికాగలము.

దేవుని వాక్యము లోతుగా నా యొక్క ఆత్మలో నిలిచి యేసు క్రీస్తు నందు విశ్వాసముతోను ఆయన యొక్క ప్రాయశ్చిత్తముతోను జతపరచబడినప్పుడు అపవాదిని, అతడు నామీదికి ప్రయోగించు దేనినైనా జయించుటకు దేవుని శక్తిని పొందుకొనునట్లు అది అనుకూలించునని నేను నేర్చుకున్నాను. మనము సవాళ్లు ఎదుర్కొనునప్పుడు ఆ ప్రభువు యొక్క వాగ్దానము మీద ఆధారపడవచ్చును. పౌలు బోధించినట్లు: “ఏలయనగా దేవుడు మనకు శక్తియు, ప్రేమయు ఇంద్రియ నిగ్రహముగల ఆత్మ భావమునే ఇచ్చెను కాని, పిరికితనము గల ఆత్మభావమును నియ్యలేదు.”11

మనకు తెలుసు రక్షకుడు బాలునిగా ఉన్నప్పుడు, “జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయన మీద నుండెను.”12 మనకు తెలుసు ఆయన పెద్దవాడైనప్పుడు: “యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.” 13 మనకు తెలుసు ఆయన పరిచర్య మొదలు పెట్టినప్పుడు ఆయనను విన్నవారు “ఆయన వాక్యము అధికారముతో కూడినదైయుండుట వలన వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.14

సిద్ధపడుట ద్వారా, ఆ రక్షకుడు శక్తియందు ఎదిగెను, సాతాను యొక్క శోధనలన్నిటిని ఎదిరించగలిగెను.15 మనము ఆ రక్షకుని మాదిరిని అనుసరించుచు దేవుని వాక్యమును ధ్యానించుట, మరియు మన విశ్వాసమును లోతుగా స్థిరపరచుకొనుట ద్వారా మనము కూడా శోధనలను ఎదిరించుటకు దేవుని శక్తిని అందుకోగలము.

ఈ రోజులలో నియంత్రిత కూటముల వలన క్రమమైన దేవాలయ సందర్శనము అసాధ్యమైనందున, నేను దేవాలయ నిబంధనలను చేయుట, మరియు ఆచరించుట ద్వారా మనకు కలుగు దేవుని శక్తిని గూర్ఛి అధ్యయనం చేసి నేర్చుకొనుట కొనసాగించాలని వాస్తవంగా ఒక నియమం చేసుకున్నాను. కర్ట్లాండ్ దేవాలయము యొక్క ప్రతిష్టార్పణ ప్రార్దనలో వాగ్దానము చేసిన విధంగా మనము ఈ దేవాలయమును దైవ శక్తి చేత యుద్ధసన్నద్ధము గావించుచున్నాము.16 దేవాలయ ఒడంబడికలను చేసి వాటిని ఆచరించేవారిపై కుమ్మరించబడే దేవుని శక్తికి గడువు తేదీ లేదు, లేదా ఈ మహమ్మారి సమయంలో ఆ శక్తిని పొందటానికి ఎలాంటి పరిమితి లేదు. మన ఒడంబడికలను పాటించడంలో విఫలమైనప్పుడు మరియు ఆయన శక్తిని పొందటానికి నిరంతరం అర్హత సాధించటానికి అనుగుణంగా జీవించకపోతే మాత్రమే అతని శక్తి మన జీవితంలో తగ్గిపోతుంది.

థాయిలాండ్, లావోస్, మియాన్మర్ లలో నా ప్రియమైన భార్యతో కలిసి మిషన్ నాయకులుగా సేవచేసే సమయంలో దేవాలయంలో పవిత్రమైన నిబంధనలు చేసుకొని మరియు ఆచరించు వారికి కలిగే దేవుని శక్తికి మేము స్వయంగా చూడగలిగాము. ఈ మూడు దేశాలలోని పరిశుద్ధులు అనేకులు తాము చేయగలిగిన వ్యక్తిగత త్యాగము, సిద్ధపాటు తరువాత దేవాలయ దర్శకుల సహాయనిధి ద్వారా దేవాలయమును సందర్శించుటకు వారికి వీలు కలుగుతుంది. థాయిలాండ్, బ్యాంకాక్ విమానాశ్రయంలో లావోస్ నుండి వచ్చిన 20 మంది విశ్వాసులైన పరిశుద్ధులను నేను కలుసుకొని వారు బ్యాంకాక్ లోని మరొక విమానాశ్రయం ద్వారా హాంగ్ కాంగ్ వెళ్ళుటకు తగిన విమానమును పట్టుకొనుటకు సహాయము చేసిన విషయము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. ఎట్టకేలకు దేవుని మందిరమునకు ప్రయాణము చేయగలిగినందుకు ఆ సభ్యులు ఉత్సాహముతో నిండియున్నారు.

చిత్రం
లావోస్ లో సభ్యులు

ఈ మంచి పరిశుద్ధులు తిరిగి వచ్చినప్పుడు మేము కలుసుకున్నప్పుడు వారిలో అదనంగా సువార్త పరిపక్వత మరియు దేవాలయవరమును పొందుట ద్వారా, వారు దేవునితో చేసిన నిబంధనల ద్వారా పొందిన శక్తి వారిలో నిరూపితమైనది. ఈ పరిశుద్ధులు స్పష్టముగా “యుద్ధసన్నద్దులై [ఆయన] శక్తి కలిగి”17 దేవాలయము నుండి వెళ్ళిరి. లావోస్ లో వారు తామంతట తాము చేయగల దానికంటే అధికముగా చేయగల ఈ శక్తి ద్వారా ఆ ప్రభువు రాజ్యమును స్థాపించుట కొనసాగించుచుండగా, తమ స్వదేశములో సంఘ సభ్యత్వము వలన వారు ఎదుర్కొను సవాళ్ళను భరించుటకు, “సత్యములో మిక్కిలి అధికమైన మహిమగల వర్తమానము”18 చాటుచు వెళ్ళుటకు బలమును పొందిరి.

మన జీవితాలలో స్పష్టమైన, మారని దిశలో మార్గమును స్థిరపరచుకొనుటకు దేవాలయమునకు హాజరుకాలేని ఈ సమయంలో మనము దేవాలయంలో చేసిన నిబంధనల మీద ఆధారపడ్డామా? ఈ నిబంధనలు, ఆచరించినట్లయితే మన దృక్పధాన్ని, భవిష్యత్తు కొరకు మన అంచనాలను, అర్హత పొందుటకు స్పష్టమైన పట్టుదలను, మన విశ్వాసం ద్వారా ఆ ప్రభువు మనకు వాగ్దానము చేసిన సమస్తమును అనుగ్రహిస్తారు.

దేవుడు మీకు అనుగ్రహించగోరుచున్నశక్తిని వెదకుటకు నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ శక్తి కొరకు వెదకినప్పుడు పరలోక తండ్రికి మన యెడల గల ప్రేమను గూర్చి మరింత గొప్ప అవగాహనతో దీవించబడెదమని సాక్ష్యమిస్తున్నాను.

ఏలయనగా పరలోక తండ్రి మిమ్ములను, నన్ను ప్రేమిస్తున్నాడు గనుక, ఆయన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును మనకు రక్షకునిగాను విమోచకునిగాను పంపియున్నాడని సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తును గూర్చి, ఆయన సమస్త శక్తి గలగియున్నాడని19 యేసు క్రీస్తు నామమున నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు