సర్వసభ్య సమావేశము
ప్రభువుచేత అధికముగా అనుగ్రహింపబడితిని
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


ప్రభువుచేత అధికముగా అనుగ్రహింపబడితిని

ఆయన మనల్ని అభిమానంగా చూస్తూ, దీవిస్తున్నప్పుడు కష్టాలు, నిరాశలుగల సమయాలు ప్రభువు యొక్క శ్రద్ధగల దృష్టిని మార్చవు.

చాలా ఏళ్ళ క్రితం, జపానులో అమామి ఓషిమా యొక్క చిన్న ద్వీపం పైనున్న చిన్న శాఖలో పనిచేస్తున్న యౌవన సువార్తికులుగా నేను, నా సహవాసి అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఆసియాను సందర్శించబోతున్నారని మరియు జపానులోని సభ్యులు, సువార్తికులందరూ ఒక ప్రాంతీయ సమావేశంలో ప్రవక్తను వినడానికి టోక్యోకు ఆహ్వానించబడ్డారని తెలుసుకొని పారవశ్యం చెందాము. శాఖ సభ్యులు, నేను, నా సహవాసి జపాను ప్రధాన భూభాగానికి తూర్పు చైనా సముద్రం గుండా పడవలో 12 గంటలు, ఆ తర్వాత టోక్యోకు రైలులో 15 గంటలు ప్రయాణించి సమావేశానికి వెళ్ళడానికి ఉత్సాహంగా ప్రణాళికలు వేయడం మొదలుపెట్టాము. అయినప్పటికీ, అది జరగకపోవడం విచారకరం. సమయము మరియు దూరాభారము వలన నేను, నా సహవాసి టోక్యోలో సమావేశానికి హాజరు కాలేమని మా మిషను అధ్యక్షుని నుండి మేము సమాచారము అందుకున్నాము.

చిత్రం
ఎల్డర్ స్టీవెన్‌సన్ మరియు అతని మిషనరీ సహవాసి

మా చిన్న శాఖ యొక్క సభ్యులు టోక్యోకు బయలుదేరగా, మేము ఆగిపోయాము. తరువాతి రోజులు నిశ్శబ్దంగా, శూన్యంగా తోచాయి. జపానులోని కడవరి-దిన పరిశుద్ధులు, సువార్తికులు సమావేశానికి హాజరవుతుండగా, ఒంటరిగా చిన్న సంఘ భవనంలో మేము సంస్కార సమావేశం జరిపాము.

చిత్రం
ఆసియా ప్రాంతీయ సమావేశము

రోజుల తర్వాత సమావేశం నుండి తిరిగి వచ్చిన శాఖ సభ్యులు, టోక్యోలో ఒక దేవాలయమును అధ్యక్షులు కింబల్ ప్రకటించారని చెప్పగా నేను ఆనందంగా వినినప్పటికీ నా వ్యక్తిగత నిరాశ తీవ్రతరమైంది. వారి కల నెరవేరబోతున్నదని చెప్పినప్పుడు వారు అత్యంత ఉద్వేగంతో మాట్లాడారు. దేవాలయ ప్రకటన వినినప్పుడు సభ్యులు, సువార్తికులు వారి ఆనందాన్ని ఆపుకోలేక వారి చేతులతో ఆకస్మాత్తుగా ఎలా చప్పట్లు కొట్టారో వారు వివరించారు.

చిత్రం
టోక్యోలో ఒక దేవాలయమును అధ్యక్షులు కింబల్ ప్రకటించుట

సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఆ చారిత్రాత్మక సమావేశానికి వెళ్ళలేకపోయినందుకు నేను అనుభవించిన నిరాశ నాకింకా గుర్తున్నది.

ఒక యౌవన సువార్తికునిగా నా అనుభవము కంటే ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారి తీసుకువచ్చిన అత్యధికమైన మరియు లోతైన తీవ్ర నిరాశను, బాధను ఇతరులు అనుభవించడం నేను గమనించినప్పుడు ఇటీవలి నెలల్లో ఈ అనుభవం గురించి నేను లోతుగా ఆలోచించాను.

మహమ్మారి ప్రబలుతున్నప్పుడు ఈ సంవత్సరం ఆరంభంలో, “సంఘము, దాని సభ్యులు మంచి పౌరులుగా, మంచి పొరుగువారిగా ఉంటామనే తమ నిబద్ధతను విశ్వాసంతో ప్రదర్శిస్తారని,“1 “అత్యంత జాగ్రత్త వహిస్తారని“2 ప్రథమ అధ్యక్షత్వము ప్రతిజ్ఞ చేసింది. ఆ విధంగా, ప్రపంచవ్యాప్తంగా సంఘ కూడికలు నిలిపివేయబడడం, సంఘ సువార్తికుల బలగంలో సగానికిపైగా వారి స్వదేశాలకు తిరిగి వెళ్ళడం, సంఘమంతటా దేవాలయాలన్నిటిని మూసివేయడాన్ని మనం అనుభవించాము. దేవాలయ ముద్రణలతో పాటు—జీవిస్తున్నవారి విధుల కోసం దేవాలయానికి రావడానికి మీలో వేలమంది సిద్ధపడుతున్నారు. మీలో ఇతరులు సువార్తికులుగా మీ సేవను త్వరగా ముగించారు లేదా తాత్కాలికంగా విడుదల చేయబడి, తిరిగి నియమించబడ్డారు.

చిత్రం
కొవిడ్ మధ్య సువార్తికులు తిరిగివచ్చుట

ఈ సమయంలో ప్రభుత్వము, విద్యా విధాన నాయకులు పాఠశాలలను మూసివేసారు—దాని మూలంగా పట్టభద్రతలు మార్చబడ్డాయి, క్రీడలు, సామాజిక, సంప్రదాయక, విద్యా-సంబంధిత ఘటనలు, ప్రోత్సాహ కార్యక్రమాలు బలవంతంగా రద్దు చేయబడ్డాయి. మీలో అనేకమంది హాజరుకాని కార్యక్రమాలకు, వినబడని ప్రదర్శనలకు, జరుగని క్రీడా పోటీలకు సిద్ధపడ్డారు.

ఈ సమయంలో ఆప్తులను పోగొట్టుకొనిన కుటుంబాలకు సంబంధించిన ఆలోచనలు మరింత బాధాకరమైనవి; చాలామంది వారు ఆశించినట్లుగా అంత్యక్రియలు లేక ఇతర సున్నితమైన కూడికలు జరుపలేకపోయారు.

క్లుప్తంగా, మీలో అనేకానేకులు గుండెను బ్రద్దలుచేసే నిరాశను, బాధను, నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నారు. పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు, మనము ఎలా స్వస్థపరచబడి, సహించి, ముందుకు సాగగలము?

ప్రవక్త నీఫై పెద్దవాడైనప్పుడు చిన్న పలకలపై చెక్కడం ప్రారంభించాడు. అతని జీవితం మరియు పరిచర్యను అతడు గమనించినప్పుడు, మోర్మన్ గ్రంథము యొక్క మొట్టమొదటి వచనంలో అతడొక ముఖ్యమైన ఆలోచనను అందించాడు. మన కాలంలో పరిగణించవలసిన ఒక ముఖ్య సూత్రాన్ని ఈ వచనం మన కోసం రూపొందిస్తుంది. “మంచివారైన తల్లిదండ్రులకు జన్మించిన నీఫై అను నేను … ,” అనే అతడి సుపరిచియమైన పదాల తర్వాత అతడిలా వ్రాసాడు, “నా జీవిత కాలములో అనేక బాధలను చూచినప్పటికీ, నా దినములన్నిటిలో ప్రభువు చేత అధికముగా అనుగ్రహింపబడితిని.”3

మోర్మన్ గ్రంథ విద్యార్థులుగా, నీఫై సూచిస్తున్న అనేక కష్టాలతో మనకు బాగా పరిచయముంది. అయినప్పటికీ అతని దినములలో అతని బాధల గురించి అంగీకరించిన తర్వాత, అతని దినములన్నిటిలో ప్రభువు చేత అధికముగా అనుగ్రహింపబడ్డాడనే సువార్త దృష్టికోణాన్ని నీఫై ఇస్తాడు. ఆయన మనల్ని అభిమానంగా చూస్తూ, దీవిస్తున్నప్పుడు కష్టాలు, నిరాశలుగల సమయాలు ప్రభువు యొక్క శ్రద్ధగల దృష్టిని మార్చవు.

చిత్రం
వర్చువల్ మిషను సమావేశము
చిత్రం
ఎల్డర్ మరియు సహోదరి స్టీవెన్‌సన్‌లతో వర్చువల్ మిషను సమావేశము
చిత్రం
ఎల్డర్ మరియు సహోదరి స్టీవెన్‌సన్‌లతో వర్చువల్ మిషను సమావేశము

నేను, లీసా ఇటీవల పరోక్షంగా ఆస్ట్రేలియాలోని సుమారు 600 మంది సువార్తికులను కలుసుకున్నాము, వారిలో చాలామంది కొవిడ్-19 కు సంబంధించిన నిర్భంధాలు లేక ఆంక్షలు కలిగియున్నారు, అనేకమంది వారి ఇళ్ళ నుండి పనిచేస్తున్నారు. క్రొత్త నిబంధన, మోర్మన్ గ్రంథము, సిద్ధాంతము మరియు నిబంధనలలో దుర్దశలో గొప్పవాటిని సాధించడానికి ప్రభువు దీవించిన వ్యక్తుల గురించి మేమంతా కలిసి ఆలోచించాము. వారి నిర్భంధములు, ఆంక్షల ఫలితంగా వారు ఏమి చేయలేకపోయారు అనేదానికంటే ప్రభువు సహాయంతో వారు ఏమి చేయగలిగారు అనేదానితో అందరూ ఎక్కువగా వర్ణించబడ్డారు.

వారి కాళ్ళకు బొండ వేసి చెరసాలలో వేయబడినప్పుడు, పౌలును సీలయు ప్రార్థించారు, కీర్తనలు పాడారు, బోధించారు, సాక్ష్యమిచ్చారు—చెరసాల నాయకుడికి బాప్తీస్మమిచ్చారని మనం చదువుతాం.4

మరలా రోమ్‌లో పౌలును గూర్చి, రెండు సంవత్సరాలపాటు గృహనిర్భంధంలో ఉంచబడ్డాడని, ఆ సమయంలో అతడు నిరంతరం “దేవుని రాజ్యము గురించి సాక్ష్యమిస్తూ, వివరిస్తూ,”5 “ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెనని”6 మనం చదువుతాం.

హింసించబడి, చెరసాలలో వేయబడిన తర్వాత, ప్రభువు యొక్క “పరిపూర్ణ మృదుత్వము గల నిర్మలమైన స్వరము … (వారిని బంధించినవారిని) సూటిగా ఆత్మకు కూడా గ్రుచ్చుకొనినప్పుడు”7 రక్షణగా అగ్ని చేత చుట్టబడిన హీలమన్ కుమారులైన, నీఫై, లీహై గురించి చదువుతాం.

వారు ఎగతాళి చేయబడి, ఆహారం, నీరు, వస్త్రాలు లేకుండా కట్టివేయబడి, చెరసాలలో బంధించబడినప్పటికీ, అనేకులు “విశ్వసించి … పశ్చాత్తాపపడుటకు, లేఖనములను పరిశీలించుటకు మొదలుపెట్టిరని”8 కనుగొనిన అమ్మోనైహాలోని ఆల్మా, అమ్యులెక్‌ల గురించి చదువుతాం.9

చిత్రం
లిబర్టీ చెరసాలలో జోసెఫ్ స్మిత్

చివరగా, లిబర్టీ చెరసాలలో కొట్టుమిట్టులాడుతూ, వదిలివేయబడినట్లుగా, ప్రభువు దాక్కున్నట్లు భావించిన జోసెఫ్ స్మిత్, “ఇవన్నియు … నీ మేలుకొరకేనని,”10 “దేవుడు నిరంతరము నీకు తోడైయుండును“11 అని విన్నాడని అతడి గురించి చదువుతాం.

వారిలో ప్రతిఒక్కరు నీఫై ఎరిగిన దానిని గ్రహించారు: వారి కాలగమనంలో వారు అనేక శ్రమలను చూచినప్పటికీ, వారు ప్రభువు చేత అధికముగా అనుగ్రహింపబడ్డారు.

సభ్యులుగా, ఒక సంఘముగా గత కొన్ని నెలలుగా మనం ఎదుర్కొన్న కష్ట సమయాల్లో మనం ప్రభువు చేత అధికముగా అనుగ్రహింపబడిన విధానాన్ని వారి పరిస్థితులతో మనం కూడా పోల్చవచ్చు. నేను ఈ ఉదాహరణలను చెప్పినప్పుడు, అవి జీవించియున్న మన ప్రవక్త యొక్క దీర్ఘదర్శకత్వము గురించి మీ సాక్ష్యాన్ని బలపరచనివ్వండి, ఈ మహమ్మారి గురించి ఏ జాడ తెలియకముందే వచ్చిన సవాళ్ళను సహించడాన్ని మనకి సాధ్యపరుస్తూ ఆయన సర్దుబాటులతో మనల్ని సిద్ధం చేసారు.

మొదట, సంఘముచేత సహకారమివ్వబడి, మరింతగా గృహ కేంద్రీకృతమవ్వడం.

రెండు సంవత్సరాల క్రితం, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “మనము ‘సంఘమును’ గూర్చి ఇంటిలో జరిగే దానిచేత సహకరించబడి, మన సమావేశ గృహాలలో జరిగే దానిగా ఆలోచించుటకు అలవాటుపడ్డాము. ఈ నమూనాకు ఒక సవరణ మనకవసరము. … మన భవనాల లోపల జరిగే దానిచేత సహకరించబడిన గృహ-కేంద్రీకృత సంఘము.” 12 ఇది ఎంత గొప్ప ప్రవచనాత్మక సవరణ! సమావేశగృహాలు తాత్కాలికంగా మూసివేయడంతో గృహ-కేంద్రీకృత సువార్త అభ్యాసము ఆచరించబడుతోంది. ప్రపంచం మామూలు స్థితికి వచ్చి, మనం సంఘ భవనాలకు తిరిగి వెళ్ళడం ప్రారంభమైనా, ఈ మహమ్మారి సమయంలో వృద్ధి చేసుకున్న మన గృహ-కేంద్రీకృతమైన సువార్త అధ్యయన, అభ్యాసాల మాదిరులను నిలుపుకోవాలని మనం కోరుకుందాం.

ప్రభువుచేత అధికముగా అనుగ్రహింపబడడానికి రెండవ మాదిరి ఏదనగా ఉన్నతమైన, పరిశుద్ధ విధానంలో పరిచర్య చేయడానికి సంబంధించిన బయల్పాటు.

చిత్రం
పరిచర్య

2018లో, పరిచర్యను “మనం ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ చూపే విధానంలో“ ఒక సవరణగా అధ్యక్షులు నెల్సన్ పరిచయం చేసారు.13 ఈ మహమ్మారి మన పరిచర్య నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి లెక్కలేనన్ని అవకాశాలను పరిచయం చేసింది. పరిచర్య చేసే సహోదర, సహోదరీలు, యువతీ,యువకులు మరియు ఇతరులు సంప్రదించుటకు, సంభాషించుటకు, పెరటిని శుభ్రం చేయడానికి, భోజనాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సందేశాలు అందించడానికి, అవసరమైన వారిని దీవించడానికి, సంస్కారవిధిని అందించడానికి సమీపించారు. ఆహార బ్యాంకులు, అనాథాశ్రమాలు, వలసదారుల సహాయకేంద్రాలు మరియు ప్రపంచ అత్యంత గంభీరమైన ఆకలి పరిస్థితులకు ఉద్దేశించబడిన పథకాలకు అసాధారణంగా సామాగ్రిని పంపిణీ చేస్తూ ఈ మహమ్మారి సమయంలో సంఘము కూడా ఇతరులకు పరిచర్య చేస్తోంది. ఆరోగ్య కార్యకర్తల కోసం మిలియన్ల సంఖ్యలో మాస్కులను తయారుచేసే సవాలుకు ఉపశమన సమాజ సహోదరీలు, వారి కుటుంబాలు స్పందించాయి.

చిత్రం
మానవ సంక్షేమ పథకాలు
చిత్రం
మాస్క్‌లు తయారుచేయుట

దుర్దశలో దీవించబడడానికి చివరి ఉదాహరణ ఏదనగా,దేవాలయ విధులు తిరిగిరావడంలో హెచ్చించబడిన ఆనందాన్ని కనుగొనుట.

చిత్రం
సహోదరి కేట్లిన్ పామర్

ఇది ఒక కథ ద్వారా ఉత్తమంగా వివరించబడుతుంది. గత ఏప్రిల్‌లో సహోదరి కేట్లిన్ పామర్ తన సువార్తసేవ పిలుపును అందుకున్నప్పుడు, ఒక సువార్తికురాలిగా పిలువబడినందుకు ఆమె ఉత్సాహపడింది, కానీ తన దేవాలయ దీవెనను పొంది, పరిశుద్ధ నిబంధనలు చేయడానికి దేవాలయానికి వెళ్ళడాన్ని అంతే ముఖ్యంగా, ప్రత్యేకంగా భావించింది. తన దేవాలయ దీవెన కోసం సమయాన్ని ఏర్పరచిన కొంత కాలానికే ప్రపంచవ్యాప్త మహమ్మారి కారణంగా దేవాలయాలన్నీ తాత్కాలికంగా మూసివేయబడుతున్నాయనే ప్రకటన వచ్చింది. ఈ మిక్కిలి విచారకరమైన సమాచారాన్ని అందుకున్న తర్వాత, ఆమె తన ఇంటినుండి పరోక్షంగా సువార్తసేవ శిక్షణా కేంద్రానికి (ఎమ్‌టిసి) హాజరు కాబోతున్నదని తెలుసుకుంది. ఈ నిరాశలను లక్ష్యపెట్టకుండా, కేట్లిన్ మంచి భావనను కాపాడుకోవడంపై దృష్టిసారించింది.

చిత్రం
సహోదరి కేట్లిన్ పామర్ మరియు గృహ ఎమ్‌టిసి

ఈ మధ్య నెలల్లో, సహోదరి పామర్ దేవాలయానికి హాజరవుతానన్న నిరీక్షణను ఎన్నడూ కోల్పోలేదు. ఆమె వెళ్ళడానికి ముందు దేవాలయాలు తెరుచుకోవాలని ఆమె కుటుంబం ఉపవాసముండి, ప్రార్థించింది. “ఈ రోజు ఏదో అద్భుతం జరిగి, దేవాలయాలు తెరుచుకోబోతున్న రోజు కాబోతున్నదా?” అంటూ కేట్లిన్ తరచూ తన ఇంటిలో సువార్తసేవ శిక్షణా కేంద్ర (ఎమ్‌టిసి) ఉదయాలను ప్రారంభిస్తుంది.

ఆగష్టు 10వ తేదీన, ఆమె సువార్తసేవ ప్రయాణానికి ప్రాతఃకాల విమానం సిద్ధంగా ఉన్న అదే రోజు సజీవ విధుల కోసం కేట్లిన్ వెళ్ళే దేవాలయం తెరవబడుతుందని ప్రథమ అధ్యక్షత్వము ప్రకటించింది. ఆమె దేవాలయానికి హాజరై, విమానాన్ని అందుకోలేదు. సఫలం కాగలమన్న చిన్న ఆశతో, ఆమె కుటుంబం దేవాలయ అధ్యక్షులు మైఖేల్ వెల్లింగను సంప్రందించి, వారు ప్రార్థిస్తున్న అద్భుతం నిజమయ్యే మార్గమేదైనా ఉన్నదేమోనని కనుగొన్నారు. వారి ఉపవాస ప్రార్థనలు జవాబివ్వబడ్డాయి!

చిత్రం
దేవాలయము వద్ద పామర్ కుటుంబము

తెల్లవారుజామున 2 గంటలకు, ఆమె విమానం బయలుదేరడానికి కొన్ని గంటల ముందు, దేవాలయ ద్వారం వద్ద కన్నీళ్ళతో ఉన్న సహోదరి పామర్‌ను, ఆమె కుటుంబాన్ని నవ్వుతూ దేవాలయ అధ్యక్షులు ఇలా ఆహ్వానించారు, “పామర్ కుటుంబానికి, శుభోదయం. దేవాలయానికి సుస్వాగతం!” ఆమె తన దేవాలయ దీవెనను పూర్తిచేసుకున్నప్పుడు, దేవాలయ ద్వారముల వద్ద మరో కుటుంబం వేచియున్నందున, వారు త్వరగా వెళ్ళాలని ప్రోత్సహించబడ్డారు. ఆమె సువార్తసేవకు ప్రయాణించే విమానాన్ని సరైన సమయంలో అందుకోవడానికి వారు తిన్నగా విమానాశ్రయానికి ప్రయాణించారు.

చిత్రం
విమానాశ్రయం వద్ద సహోదరి పామర్

దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు తెరువబడుతుండగా, ఎన్నో నెలలుగా మనము కోల్పోయిన దేవాలయ విధులు ఇంతకుముందు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రత్యేకంగా అనిపించాయి.

నేను ముగించడానికి ముందు, దయచేసి ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క ప్రోత్సాహకరమైన, ఉత్సాహభరితమైన, ఆత్మీయంగా పైకెత్తే మాటలను వినండి. శ్రమలలో, ఒంటరితనంలో, నావూలో ఇంటిలో బలవంతంగా నిర్భంధించబడి, అన్యాయంగా అతడిని ఖైదు చేయాలని చూస్తున్న వారి నుండి దాగుకొనినప్పుడు, అతడు వీటిని వ్రాసాడని ఎవరూ ఎన్నడూ ఊహించలేరు.

”ఇప్పుడు, మనము పొందిన సువార్తలో మనం ఏమి వింటాము? సంతోషకరమైన స్వరము! పరలోకమునుండి కరుణగల స్వరము; భూమినుండి సత్య స్వరము; మృతుల కొరకు సువర్తమానము; సజీవులు, మృతుల కొరకు సంతోషకరమైన స్వరము; మహా సంతోషకరమైన సువర్తమానము. …

”… మనము ఒక గొప్ప కార్యములో ముందుకు సాగటం లేదా? వెనుకకు మరలక ముందుకు సాగుడి. ధైర్యము తెచ్చుకొనుడి, … జయము పొందుటకు, ముందుకు సాగుడి! మీ హృదయములు సంతోషించి, గొప్ప ఆనందమును పొందనీయుడి. భూమిని అకస్మాత్తుగా పాడనీయుడి.”14

సహోదర సహోదరీలారా, మీలో ప్రతిఒక్కరు ఒకనాడు వెనుదిరిగి చూసినప్పుడు, మనం ఎదుర్కొంటున్న క్లిష్ట సమయాల్లో వెంటవచ్చిన రద్దయిన కార్యక్రమాలు, బాధ, నిరాశలు, ఒంటరితనం శ్రేష్టమైన దీవెనల చేత, హెచ్చించబడిన విశ్వాసము, సాక్ష్యములచేత కప్పివేయబడడం చూస్తారని నేను నమ్ముతున్నాను. ఈ జీవితంలో, రాబోయే జీవితంలో, మీ శ్రమలు, మీ అమ్మోనైహా, మీ లిబర్టీ చెరసాల, మీ లాభం కోసం ప్రతిష్టించబడతాయని నేను నమ్ముతున్నాను.15 నీఫైతోపాటు మన కాలగమనంలోని శ్రమలను మనం కూడా గుర్తించగలమని, అదే సమయంలో మనం ప్రభువు చేత అధికముగా అనుగ్రహించబడ్డామని గుర్తించగలమని నేను ప్రార్థిస్తున్నాను.

యేసు క్రీస్తు గురించి నా సాక్ష్యముతో నేను ముగిస్తాను, ఆయన శ్రమలతో పరిచయం లేనివాడు కాదు మరియు అనంతమైన ఆయన ప్రాయశ్చిత్తములో భాగంగా వీటన్నిటికంటే హీనమైనవాటిని అనుభవించాడు.16 ఆయన మన దుఃఖాన్ని, బాధను, నిరాశను అర్థం చేసుకుంటాడు. ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, మన నిరీక్షణ, మన ఓదార్పు మరియు మనలను విడిపించువాడు. దీని గురించి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు