ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి, మరియు మహానందమని యెంచుకొనుడి!
మనము ఓపికను సాధన చేసినప్పుడు, విశ్వాసము వృద్ధి చెందును. మన విశ్వాసము వృద్ధి చెందినప్పుడు, మన సంతోషము కూడ వృద్ధి చెందును.
రెండు సంవత్సరాల క్రితం, మా చిన్న తమ్ముడు చాడ్ చనిపోయాడు. ఈ జీవితంనుండి మరొకవైపుకు అతడి మార్పు, మా మరదలు స్టిఫనీ; వారి ఇద్దరు చిన్న పిల్లలు, బ్రాడన్ మరియు బెల్లా; అదేవిధంగా మిగిలిన మా కుటుంబపు హృదయాలలో ఖాళీని వదిలాడు. చాడ్ చనిపోయే వారము ముందు సర్వసభ్య సమావేశములో ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సన్ యొక్క మాటలలో ఓదార్పును మేము కనుగొన్నాము: “భూలోకము యొక్క అతి తీవ్రమైన పరీక్షలలో, ఓపికగా ముందుకు సాగుము, మరియు రక్షకుని యొక్క స్వస్థపరచే శక్తి మీకు వెలుగును, అవగాహనను, శాంతిని, మరియు నిరీక్షణను తెస్తుంది” (“Wounded,” Liahona, Nov. 2018, 85).
మేము యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియున్నాము; చాడ్‌ను మేము మరలా చేరతామని మాకు తెలుసు, కానీ అతడి భౌతిక సమక్షమును కోల్పోవటం బాధ కలిగిస్తుంది! అనేకమంది ప్రియమైన వారిని కోల్పోయారు. మనము వారిని తిరిగి కలుసుకొనే సమయం కోసం ఓపికగా ఉండి ఎదురుచూడటం కష్టమైనది.
అతడు చనిపోయిన తరువాత సంవత్సరం, ఒక చీకటి మేఘం మమ్మల్ని కప్పివేసినట్లుగా మేము భావించాము. మా లేఖనాలు చదువుట, ఎక్కువ తీక్షణతతో ప్రార్ధన చేయుట, మరియు దేవాలయమునకు ఎక్కువ తరచుగా హాజరగుటలో ఆశ్రయాన్ని మేము వెదికాము. ఈ కీర్తననుండి పంక్తులు ఆ సమయంలో మా భావాలను సంగ్రహించాయి: “ప్రాతఃకాలము ప్రారంభమైంది, ప్రపంచము మేల్కొచున్నది, రాత్రి యొక్క చీకటి మేఘాలు పారిపోతున్నాయి” (“The Day Dawn Is Breaking,” Hymns, no. 52).
2020 ఉపశమింప చేసే సంవత్సరంగా ఉంటుందని మేము తీర్మానించాము! మేము 2019 నవంబరు చివరిలో ఒక ఇతివృత్తము మాకు బయల్పరచబడినప్పుడు, మా క్రొత్త నిబంధన గ్రంథములో రండి, నన్ను వెంబడించుము అధ్యయనము చేస్తున్నాము. “నా సహోదరులారా, మీరు నానావిధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి” (జోసెఫ్ స్మిత్ అనువాదము, యాకోబు 1:2 [లో యాకోబు 1:2, footnote a]). ఒక క్రొత్త సంవత్సరమును, ఒక క్రొత్త దశాబ్దమును, సంతోషముతో తెరవాలనే మా కోరికలో, 2020లో “మహానందమని యెంచుకోవాలి” అని మేము నిర్ణయించాము. మేము ఎంత బలముగా భావించామంటే, గత క్రిస్టమస్ మేము మా తోబుట్టువులకు “మహానందమని యెంచుకోవాలి” అని పెద్ద అక్షరాల మాటలు గల టీ-షర్టులను బహుమతిగా ఇచ్చుకున్నాము. 2020 సంవత్సరం ఖచ్చితంగా ఆనందం మరియు సంతోషం కలిగించే సంవత్సరం అవుతుంది.
మంచిది, ఇక్కడ మనమున్నాము బదులుగా 2020 — ప్రపంచవ్యాప్త కోవిడ్-19 మహమ్మారి, పౌర అశాంతి మరియు ఎక్కువ ప్రకృతి వైపరిత్యాలు, ఆర్థిక సవాళ్లను తీసుకువచ్చింది. మన పరలోక తండ్రి ఓర్పు గురించి మన అవగాహనను మరియు ఆనందాన్ని ఎన్నుకోవాలనే మన తెలివైన నిర్ణయాన్ని ప్రతిఫలించడానికి మరియు పరిగణించడానికి మనకు సమయాన్ని అనుమతిస్తూ ఉండవచ్చు.
అప్పటి నుండి యాకోబు పత్రిక మాకు క్రొత్త అర్ధమును కలిగియున్నది. యాకోబు, 1 అధ్యాయము, 3 వచనము మరియు 4 కొనసాగును:
“మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.
“మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.”
మన శ్రమల మధ్య ఆనందాన్ని పొందే మన ప్రయత్నాలలో, ఆ శ్రమలు మన మేలు కోసం పని చేయనివ్వడానికి ఓర్పు కలిగి ఉండటం ముఖ్యమైనదని మనము మర్చిపోయాము.
రాజైన బెంజిమెన్ ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించమని, “ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము ద్వారా ఒక పరిశుద్ధుడై మరియు విధేయుడు, సాత్వికుడు, వినయము, సహనము కలిగి ప్రేమతో నిండి ఒక పిల్లవాడు తన తండ్రికి లోబడునట్లు కూడ అతనిపై చేయుటకు తగినవని ప్రభువు చూచు విషయములన్నిటికి లోబడుటకు ఇష్టపడాలని,” మనకు బోధించాడు (మోషైయ 3:19).
నా సువార్తను ప్రకటించుడి 6 అధ్యాయము మనము అనుకరించగల క్రీస్తు యొక్క ముఖ్యమైన లక్షణాలను బోధించును: “ఓర్పు ఆలస్యమును, ఇబ్బందిని, వ్యతిరేకతను సహించే సామర్ధ్యము, లేక కోపము, విసుగు, లేక ఆందోళన లేకుండా భరించుట. అది దేవుని యొక్క చిత్తమును చేయుటకు మరియు ఆయన సమయాన్ని అంగీకరించే సామర్ధ్యము. మీరు సహనము కలిగియున్నప్పుడు, మీరు ఒత్తిడి క్రింద బలముగా నిలిచియుంటారు, మరియు ప్రతికూలతను ప్రశాంతగా మరియు నిరీక్షణతో ఎదుర్కొంటారు” (Preach My Gospel: A Guide to Missionary Service, rev. ed. [2019], 126).
సహనము యొక్క పరిపూర్ణమైన క్రియ క్రీస్తు యొక్క ప్రాచీన శిష్యులలో ఒకరైన కనానీయుడైన సీమోను జీవితంలో కూడ వివరించబడింది. జెలోతే అనబడిన యూదా జాతీయవాదుల గుంపు రోమా పాలనను బలంగా తిరస్కరించారు. జెలోతే ఉద్యమం వాటి హేతువును సమర్ధించుటకు ఆహారపదార్ధాల కోసం దాడి చేయుట మరియు ఇతర కార్యక్రమాలను అనుసరించుట ద్వారా రోమన్లు, వారి యూదా సహకారులు, మరియు సద్దూకయ్యులకు వ్యతిరేకంగా హింసను సమర్ధించింది (Encyclopedia Britannica, “Zealot,” britannica.com చూడండి). కనానీయుడైన సీమోను ఒక జెలోతే (లూకా 6:15 చూడుము). సీమోను రక్షకుడిని మృదువుగా పొగిడి ఆయుధాలు తీసుకోవటానికి, ఒక మిలిటెంట్ గుంపుకు నాయకత్వం వహించడం లేదా యెరూషలేములో గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఊహించండి. యేసు ఇలా బోధించెను:
“సాత్వికులు ధన్యులు: వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.…
“కనికరముగల వారు ధన్యులు: వారు కనికరము పొందుదురు.…
“సమాధానపరచువారు ధన్యులు: వారు దేవుని కుమారులనబడుదురు” (మత్తయి 5:5, 7, 9).
సీమోను తన తత్వాన్ని ఉత్సాహంతో మరియు ఉద్రేకంతో స్వీకరించి, సమర్థించి ఉండవచ్చు, కాని రక్షకుడి ప్రభావం మరియు మాదిరి ద్వారా అతని దృష్టి మారిందని లేఖనాలు సూచిస్తున్నాయి. క్రీస్తు యొక్క అతడి శిష్యత్వము అతడి జీవితకాలపు ప్రయత్నాలలో ప్రధాన కేంద్రంగా మారింది.
మనము దేవునితో నిబంధనలు చేసి పాటించినప్పుడు, రక్షకుడు మనము “తిరిగి జన్మించుటకు; సహాయపడును, అవును దేవుని వలన జన్మించి, వారి శరీర సంబంధమైన మరియు పతనమైన స్థితి నుండి ఒక పరిశుద్ధమయిన స్థితికి మారి దేవునిచే విమోచించబడి ఆయన కుమారులు మరియు కుమార్తైలు కావలెను” (మోషైయ 27:25).
మన దినములోని అన్ని ఉత్సాహపూరితమైన సామాజిక, మతపరమైన మరియు రాజకీయ ప్రయత్నాలు అన్నిటికంటె యేసుక్రీస్తు యొక్క శిష్యుడు మనకు అత్యంత ఉన్నతమైన మరియు ముఖ్యమైన అనుబంధంగా ఉండనివ్వండి. “నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును” (మత్తయి 6:21). విశ్వాసులైన శిష్యులు “దేవుని యొక్క చిత్తమును చేసిన” తరువాత కూడ, [వారికి] “ఓరిమి అవసరమై యున్నది” (హెబ్రీయులకు 10:36) అని కూడ మనము మరచిపోరాదు.
మన విశ్వాసమును పరీక్షించుట మనలో ఓర్పు పని చేసినట్లుగా, మనము ఓర్పును సాధన చేసినప్పుడు మన విశ్వాసము వృద్ధి చెందుతుంది. మన విశ్వాసము వృద్ధి చెందినప్పుడు, మన సంతోషము కూడ వృద్ధి చెందును.
గత మార్చిలో మా రెండవ కూతురు, ఎమ్మా , సంఘములోని అనేకమంది మిషనరీల వలె, తప్పనిసరిగా విడిగా ఒంటరిగా ఉండాల్సి వచ్చెను. అనేకమంది మిషనరీలు ఇంటికి వచ్చేసారు. అనేకమంది మిషనరీలు తిరిగి నియమించబడటానికి ఎదురుచూసారు. మిషను సేవకు వెళ్లకు ముందు అనేకమంది వారి దేవాలయ దీవెనలు పొందలేదు. ఎల్డర్లు, సహోదరిలారా, మీకు కృతజ్ఞతలు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము.
నెదర్లాండ్స్ లో ఎమ్మా మరియు ఆమె సహవాసి ఆ మొదటి కొన్ని వారములు మానసికంగా పరీక్షంచబడ్డారు—అనేక సందర్భాలలో కన్నీళ్ల పర్యంతమైన కష్టమును వారు అనుభవించారు. వ్యక్తిగత-పరస్పర చర్య మరియు పరిమితంగా బయటకు వెళ్లడం కేవలం క్లుప్తమైన అవకాశాలతో, ఎమ్మా దేవునిపై ఆధారపడటం ఎక్కువైంది. మేము ఆమెతో ఆన్‌లైన్‌లో ప్రార్ధించాము, మరియు మేము ఎలా సహాయపడగలమో అడిగాము. ఆమె ఆన్‌లైన్‌లో బోధిస్తున్న స్నేహితులతో స్నేహం ఏర్పరుచకోమని ఆమె మమ్మల్ని అడిగింది!
మా కుటుంబము నెదర్లాండ్స్ లో ఎమ్మా స్నేహితులతో, ఒకరి తరువాత ఒకరు ఆన్‌లైన్ కలుసుకోవడం ప్రారంభించింది. మేము ప్రతీ వారము, విస్తరించబడిన కుటుంబపు, రండి నన్ను వెంబడించుము ఆన్‌లైన్ అధ్యయనములో చేరమని మేము వారిని ఆహ్వానించాము. ఫ్లోర్, లారా, రెన్‌స్కి, ఫ్రీక్, బెంజమిన్, స్టాల్, మరియు ముహమ్మద్ అందరూ మా స్నేహితులయ్యారు. నెదర్లాండ్స్ లో మాస్నేహితులలో కొందరు “ఇరుకు ద్వారములో” (3 నీపై 14:13) ప్రవేశించారు. మిగిలిన వారు “ప్రవేశించ వలసిన మార్గము యొక్క ఇరుకును మరియు ద్వారము యొక్క సంకుచితమును” చూపబడ్డారు (2 నీఫై 31:9). వాళ్లు క్రీస్తుయందు మా సహోదర, సహోదరీలు. ప్రతీవారము నిబంధన బాటపై మా పురోభివృద్ధిలో మేము కలిసి పనిచేసినప్పుడు “మహానందమని యెంచుకొన్నాము.”
కొంత సమయం కోసం వార్డు కుటుంబాలుగా వ్యక్తిగతంగా కలుసుకోలేని మా అసమర్ధతలో మేము “ఓర్పు తన క్రియను కొనసాగింపనిచ్చాము” (యాకోబు 1:4). కానీ మోర్మన్ గ్రంథము యొక్క రండి, నన్ను అనుసరించుడి అధ్యయనము మరియు మా క్రొత్త సాంకేతిక విద్య కలయకలు ద్వారా మా కుటుంబాల యొక్క విశ్వాసము వృద్ధి చెందుతున్నందుకు మేము మహానందముగా యెంచుకున్నాము.
“ఈ లక్ష్యములో మీ నిరంతర ప్రయత్నాలు—మీరు ప్రత్యేకంగా విజయం పొందలేదని మీరు భావించినప్పుడు సమయాలందు కూడ—మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మరియు ప్రపంచాన్ని మారుస్తాయి” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వాగ్దానమిచ్చారు (“Go Forward in Faith,” Liahona, May 2020, 114).
మనము దేవునితో పరిశుద్ధ నిబంధనలు చేయు చోటు—దేవాలయము—తాత్కాలికంగా మూయబడింది. మనము దేవునితో నిబంధనలు పాటించే చోటు—గృహము—తెరవబడియున్నది! ఇంటివద్ద దేవాలయ నిబంధనల యొక్క అసాధారణమైన సౌందర్యమును అధ్యయనము చేసి, ధ్యానించడానికి మనకు అవకాశమున్నది. పరిశుద్ధమైన భౌతిక స్థలములోనికి ప్రవేశము లేనప్పుడు కూడా, మన “హృదయాలు … క్రుమ్మరించబడే దీవెనల ఫలితంగా బహుగా ఉల్లసించును” ( సిద్ధాంతములు మరియు నిబంధనలు 110:9).
అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు; మిగిలిన వారు అవకాశాలు కోల్పోయారు. అయినప్పటికినీ, అధ్యక్షులు నెల్సన్ ప్రక్కన మేము సంతోషిస్తున్నాము, ఆయన ఇటీవల ఇలా వ్యాఖ్యానించారు: “మన సభ్యుల నుండి స్వచ్ఛంధమైన ఉపవాస అర్పణలు, అదేవిధంగా మన మానవ సంక్షేమ నిధులకు స్వచ్ఛంధమైన విరాళములు నిజానికి పెరిగాయి. … కలిసి మనము ఈ కష్టమైన సమయాన్ని జయిస్తాము. మీరు ఇతరులను దీవించుట కొనసాగించినప్పుడు ప్రభువు మిమ్మల్ని దీవించును” (రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క Facebook page, post from Aug.16, 2020, facebook.com/russell.m.nelson).
“ధైర్యము తెచ్చుకొనుడి” ప్రభువు నుండి ఆజ్ఞ, భయము తెచ్చుకొనుట కాదు (మత్తయి 14:27).
మనము “ప్రతీదానిని సరిగా చేస్తున్నాము” అని ఆలోచించినప్పుడు కొన్నిసార్లు మనము అసహనము చెందాము మరియు ఇంకను మనము కోరిన దీవెనలు పొందలేదు. హానోకు మరియు అతడు జనులు రూపాంతరం చెందకముందు అతడు 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మూడువందల ఆరవై ఐదు సంవత్సరాలు ప్రతీదానిని సరిగా చేయుటకు ప్రయాసపడ్డారు మరియు అప్పుడు అది జరిగింది! (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:49 చూడండి.)
యూటా ఓగ్డన్ మిషను పై అధ్యక్షత్వము వహించుట నుండి మేము విడుదల చేయబడిన తరువాత కేవలము కొన్ని నెలలలో మా తమ్ముడు చాడ్ చనిపోయాడు. మేము దక్షిణ కాలిఫోర్నియాలో నివసిస్తున్నప్పుడు, 2015 సంవత్సరంలో మేము నియమించబడే మొత్తం 417 మిషన్లలో, మమ్మల్ని ఉత్తర యూటాకు నియమించబడటం ఆశ్చర్యకరం. మిషను గృహము చాడ్ ఇంటికి 30 నిముషాల కారు ప్రయాణము. మేము మా మిషను నియామకం పొందిన తరువాత చాడ్ యొక్క కాన్సరు నిర్ధారించబడింది. మిక్కిలి పరీక్షగల పరిస్థితిలో కూడా, మన పరలోక తండ్రి మమ్మల్ని జ్ఞాపకముంచుకున్నారని మరియు సంతోషము కనుగొనడానికి మాకు సహాయపడుతున్నాడని మేము ఎరుగుదుము.
రక్షకుడై యేసు క్రీస్తు యొక్క విమోచించు, పరిశుద్ధపరచు, వినయముగా చేయు, మరియు సంతోషకరమైన శక్తిని గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు నామములో మన పరలోక తండ్రికి మనము ప్రార్ధించినప్పుడు, ఆయన మనల్ని ఆలకిస్తాడని నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రభువు మరియు ఆయన జీవిస్తున్న ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క స్వరమును మనము విని, ఆలకించి మరియు లక్ష్యపెట్టినప్పుడు, మనము “ఓర్పు తన క్రియను కొనసాగింపనిస్తాము,” మరియు “మహానందమని యెంచుకొంటాము.” యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.