సర్వసభ్య సమావేశము
దేవుడు ఏదైన ఊహింపశక్యముకాని దానిని చేస్తాడు
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


15:17

దేవుడు ఏదైన ఊహింపశక్యముకాని దానిని చేస్తాడు

ఈ సమయం కోసం దేవుడు తన బిడ్డలను, ఆయన సంఘమును సిద్ధపరిచాడు.

సాల్ట్‌లేక్ లోయలో ప్రవేశించిన వెంటనే కడవరి-దిన పరిశుద్ధులు ఒక పరిశుద్ధ దేవాలయమును నిర్మించుట ప్రారంభించారు. సమాధానముతో, హింసకు దూరంగా వారు దేవుని ఆరాధించునట్లు చివరకు ఒక స్థలాన్ని కనుగొన్నామని వారు భావించారు.

అయినప్పటికినీ, దేవాలయ పునాది పూర్తి కావస్తుండగా, అమెరికా సైనిక దళము ఒక క్రొత్త గవర్నరును బలవంతంగా నియమించడానికి ప్రతిపాదించారు.

సైన్యం ఎంత విరోధంగా ఉంటుందో సంఘ నాయకులకు తెలియదు గనుక, బ్రిగమ్ యంగ్ పరిశుద్ధులను దేవాలయ పునాదిని ఖాళీ చేసి పూడ్చిపెట్టమని ఆదేశించారు.

దేవుని రాజ్యమును నిర్మించడానికి వారి ప్రయత్నాలు ఎందుకు నిరంతరం ఆపివేయబడుతున్నాయోనని కొందరు సంఘ సభ్యులు ఆశ్చర్యపడి ఉంటారని నేను భావిస్తున్నాను.

చివరకు, అపాయం గడిచింది, దేవాలయ పునాదులు తవ్వబడి మరియు పరిశీలించబడినవి. అప్పుడే మొదట వేయబడిన పునాది రాళ్ళలో అనేకము పగిలియున్నాయని, అవి పునాదిలో వేయడానికి సరిపోవని అగ్రగామి నిర్మాణకులు కనుగొన్నారు.

పర్యవసానంగా, గంభీరమైన సాల్ట్ లేక్ దేవాలయం2 యొక్క గ్రానైట్ 1 గోడలకు తగిన విధంగా మద్దతు ఇవ్వడానికి బ్రిగమ్ వాటి పునాదిని మరమ్మతు చేయించారు. చివరకు, పరిశుద్ధులు “How Firm a Foundation”3 కీర్తన పాడగలిగి మరియు వారి పరిశుద్ధ దేవాలయము తరతరములు నిలిచియుండే దృఢమైన పునాదిపై కట్టబడినది తెలుసుకున్నారు.

సాల్ట్ లేక్ దేవాలయము పునరుద్ధరణ

ఆయన ఉద్దేశములను నెరవేర్చుటకు దేవుడు ప్రతికూలతను ఎలా ఉపయోగిస్తాడో ఈ వృత్తాంతము మనకు బోధించగలదు.

ఒక విశ్వవ్యాప్తమైన మహమ్మారి

ఈ రోజు మనం కనుగొన్న పరిస్థితులను బట్టి ఇది సుపరిచయమైనదిగా అనిపిస్తే, దానికి కారణం అదే.

నా స్వరము వినువారు లేక చదివే వారిలో ఏ ఒక్కరైనా ప్రపంచవ్యాప్త మహమ్మారిచేత బాధింపబడకుండా ఉన్నారా అని నా అనుమానము.

కుటుంబ సభ్యులను, స్నేహితులను కోల్పోయి దుఃఖిస్తున్న వారికి నేను తెలియజేయునదేమనగా మేము మీతో దుఃఖిస్తున్నాము. మిమ్మల్ని ఓదార్చమని, ఆదరించమని పరలోక తండ్రిని మేము వేడుకుంటున్నాము.

ఈ వైరస్ యొక్క దీర్ఘ-కాల పర్యవసానాలు శారీరక ఆరోగ్యమును మించియున్నవి. అనేక కుటుంబాలు ఆదాయాలను కోల్పోయి, ఆకలి, అస్థిరత, దిగులుతో భయపెట్టబడ్డాయి. ఈ వ్యాధి వ్యాప్తిని నిర్మూలించడానికి అనేకమంది యొక్క నిస్వార్ధమైన ప్రయత్నాలను మేము మెచ్చుకుంటున్నాము. అవసరతలో ఉన్న జనులకు సహాయపడుటకు, స్వస్థపరచుటకు, మరియు చేయూతనిచ్చుటకు వారి స్వంత భద్రతను అపాయంలో ఉంచిన వారి మౌన త్యాగమును మరియు దివ్యమైన ప్రయత్నముల చేత మేము దీనులుగా చేయబడ్డాము. మీ మంచితనము మరియు కనికరము కొరకు మా హృదయాలు కృతజ్ఞతతో నింపబడినవి.

దేవుడు పరలోకపు వాకిండ్లను విప్పి, దేవుని యొక్క శాశ్వతమైన దీవెనలతో మీ జీవితాలను నింపమని మేము బలముగా ప్రార్ధిస్తున్నాము.

మనము విత్తనాలు

ఈ వైరస్ గురించి ఇంకా తెలియనిది అనేకమున్నది. కానీ నాకు తెలిసిన ఒక విషయమేమిటంటే, ఈ వైరస్ పరలోక తండ్రిని ఆశ్చర్యపరచలేదు. ఊహించని అవసరాన్ని నిర్వహించడానికి ఆయన అదనపు దేవదూతల సైన్యమును సమీకరించడం, అత్యవసర సమావేశాలను ఏర్పాటుచేయడం లేదా ప్రపంచ-సృష్టి విభాగం నుండి వనరులను మళ్లించడం చేయనవసరం లేదు.

ఈరోజు నా సందేశమేమంటే, ఈ మహమ్మారి మనము కోరినది లేక ఆశించినది కానప్పటికినీ, ఈ సమయం కోసం దేవుడు తన బిడ్డలను మరియు ఆయన సంఘమును సిద్ధపరిచాడు.

అవును, మనము దీనిని సహిస్తాము. కానీ కేవలము మన పళ్లను బిగబట్టడమే కాక, పట్టుదలతో, పరిస్థితులు పూర్వస్థితికి తిరిగి వెళ్లేవరకు వేచియుంటాము. మనము ముందుకు సాగిపోతాం, ఫలితంగా మనము ఉత్తమంగా ఉంటాము.

ఒక విధంగా, మనమంతా విత్తనాలు. విత్తనాలు వాటి సామర్థ్యాన్ని సమీపించుటకు, అవి మొలకెత్తాలంటే అవి మొదట పాతిపెట్టబడాలి. జీవితపు శ్రమల చేత మనము సమాధి చేయబడినట్లు లేక కష్టమైన భావావేశ సమస్యలతో చుట్టముట్టబడినట్లు భావించిన సమయాలు ఉన్నప్పటికినీ, దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క దీవెనలు ఊహింపశక్యముకాని దానిని మొలకెత్తించును.

కష్టమైన దానినుండి దీవెనలు కలుగుతాయి.

ప్రతీ యుగము దాని శ్రమ, కష్టము గల సమయాలను ఎదుర్కొన్నది.

హానోకు మరియు అతని జనులు దుష్టత్వము, యుద్ధములు, మరియు రక్తపాతముగల కాలములో జీవించారు. “అయితే ప్రభువు వచ్చి, తన జనులతో నివసించెను.” ఆయన మనస్సులో వారి కోసం ఊహింపశక్యముకాని దానిని కలిగియున్నాడు. ఆయన సీయోనును స్థాపించుటకు వారికి సహాయపడ్డాడు—“ఏక హృదయము, ఏక మనస్సుగల ” జనులు వారు “నీతియందు నివసించారు.”4

యాకోబు కుమారుడును యువకుడైన యోసేపు, గోతిలోనికి త్రోసివేయబడి, అమ్మివేయబడి, మోసగించబడి, విడిచిపెట్టబడ్డాడు.5 దేవుడు తనను మరచిపోయాడేమోనని యోసేపు ఆశ్చర్యపడియుండవచ్చు. దేవుడు తన మనస్సులో యోసేపు కొరకు ఊహింపశక్యముకాని దానిని కలిగియున్నాడు. ఆయన ఈ క్లిష్టసమయాన్ని యోసేపు యొక్క స్వభావాన్ని బలపరచుటకు ఉపయాగించాడు మరియు అతడి కుటుంబాన్ని కాపాడే స్థానములో అతడిని నిలబెట్టాడు.6

లిబర్టీ జైలులో జోసెఫ్

ప్రవక్త జోసెఫ్ స్మిత్ లిబర్టీ జైలులో ఖైదీగా ఉండగా, పరిశుద్ధుల బాధలకు ఉపశమనం కొరకు అతడు ఎలా వేడుకున్నాడో ఆలోచించండి. ఆ పరిస్థితులలో సీయోను ఎలా స్థాపించబడుతుందోనని అతడు ఆశ్చర్యపడియుండవచ్చు. కానీ అతనితో ప్రభువు సమాధానంతో మాట్లాడాడు, దాని తరువాత కలిగిన మహిమకరమైన బయల్పాటు పరిశుద్ధులకు సమాధానాన్ని తెచ్చింది— అది మీకు, నాకు సమాధానం తేవడం కొనసాగించింది.7

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రారంభ దినాలలో పరిశుద్ధులు దేవుడు వారిని మరచిపోయాడేమోనని ఎన్నిసార్లు నిరాశచెంది, ఆశ్చర్యపడియుంటారు? కానీ హింసలు, అపాయములు, మరియు నిర్మూలనా బెదిరింపుల ద్వారా, ఇశ్రాయేలు యొక్క ప్రభువైన దేవుడు తన చిన్నమంద కొరకు తన మనస్సులో వేరే దానిని కలిగియున్నాడు. ఏదైనా ఊహింపశక్యము కానిదానిని కలిగియున్నాడు.

ఈ మాదిరులు —మరియు లేఖనాలలో మిగిలిన వందల మాదిరుల నుండి మనము ఏమి నేర్చుకోగలము?

మొదటిది: నీతిమంతులు కష్టాలు మరియు శ్రమలు అనుభవించుట నుండి మినహాయించబడలేరు. మనమందరం కష్టమైన సమయాలను అనుభవించాలి, ఏలయనగా ఈ ప్రతికూల సమయాలలో మన స్వభావాలను పటిష్టపరిచే సూత్రములను మనము నేర్చుకుంటాము మరియు అవి దేవునికి మనల్ని దగ్గరగా చేస్తాయి.

రెండవది: మనము బాధపడతామని మన పరలోక తండ్రికి తెలుసు, ఎందుకనగా మనము ఆయన బిడ్డలము, ఆయన మనల్ని విడిచిపెట్టడు.8

కనికరముగల రక్షకుని గూర్చి ఆలోచించండి, ఆయన తన జీవితములో ఎక్కువభాగం రోగులు, ఒంటరివారు, సందేహించువారు, మరియు నిరాశ చెందినవారికి పరిచర్య చేయుచూ గడిపాడు.9 ఈ రోజు ఆయన మీగురించి ఏమైన తక్కువ చింత కలిగియున్నాడని మీరనుకుంటున్నారా?

నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన సహోదర, సహోదరలారా, ఈ అస్థిరమైన, భయపెట్టే సమయాలలో దేవుడు మీకు కావలికాసి, మిమ్మల్ని నడిపించును. ఆయన మిమ్ములను యెరిగియున్నాడు. ఆయన మీ ప్రార్ధనలు ఆలకిస్తాడు. ఆయన నమ్మకస్తుడు మరియు ఆధారపడదగినవాడు ఆయన తన వాగ్దానములను నెరవేర్చును.

దేవుడు తన మనస్సులో మీ కొరకు వ్యక్తిగతంగా—మరియు సమిష్ఠిగా సంఘము కొరకు ఏదైన ఊహింపశక్యముకాని దానిని కలిగియున్నాడు.

ఓ దేవా, ప్రవక్త కొరకు మీకు కృతజ్ఞతలు

మన శ్రేష్టమైన దినములు మనముందున్నాయి, మన వెనుక కాదు. అందుకే దేవుడు మనకు ఆధునిక బయల్పాటును ఇస్తాడు! అది లేకుండా, మనము క్షేమంగా దిగునట్లు పొగమంచు తీసివేయబడేవరకు ఒక నిర్దిష్ట గగనతలంలో ఎగురుతున్నట్లుగా జీవితం అనిపిస్తుంది. మన కోసం ప్రభువు యొక్క ఉద్దేశములు దానికంటే మరింత ఉన్నతమైనవి. ఇది సజీవ క్రీస్తు యొక్క సంఘము కనుక, ఆయన తన ప్రవక్తలను నడిపిస్తాడు గనుక, మనము ముందుకు, మనం ఎన్నడూ వెళ్లని ఉన్నత స్థలములకు, మనమెన్నడూ ఊహించని ఎత్తులకు సాగిపోతున్నాము!

ఇప్పుడు, మర్త్యత్వము గుండా సాగే మన ప్రయాణములో అల్లకల్లోలములను అనుభవించమని దాని ఉద్దేశము కాదు. ఊహించని పరికర వైఫల్యాలు, యాంత్రిక లోపాలు, మరియు తీవ్రమైన వాతావరణ సవాళ్లు ఉండవని దాని అర్థం కాదు. వాస్తవానికి, విషయాలు మెరుగుపడక ముందే అవి దిగజారిపోవచ్చు.

ఒక ఫైటర్ పైలట్ గా, ఒక విమాన కెప్టెన్‌గా, విమానప్రయాణంలో నేను ఎదుర్కొనే ప్రతికూలతను నేను ఎన్నుకోలేనప్పటికీ, వాటికి ఎలా సిద్ధపడాలో, ఎలా స్పందించాలో నేను ఎంచుకోగలనని తెలుసుకున్నాను. కష్టమైన కాలములలో అవసరమైనదేమిటంటే నెమ్మదిగా, అప్రమత్తమైన విశ్వాసంతో ఉండడం.

దీనిని మనము ఎలా చేస్తాము?

మనము సత్యమును గుర్తించాలి, అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సూత్రములవైపు, ముఖ్యమైన సువార్త సూత్రముల వైపు మరలాలి. ప్రార్ధన, లేఖన అధ్యయనము మరియు దేవుని ఆజ్ఞలను పాటించుట వంటి—మీ వ్యక్తిగత మతపరమైన ప్రవర్తనను మీరు బలపరచుకోవాలి. శ్రేష్టముగా నిరూపించబడిన అభ్యాసములపై ఆధారపడి మీరు నిర్ణయాలు చేయాలి.

మీరు చేయగల విషయాలపై తప్ప మీరు చేయలేని విషయాలపై దృష్టిసారించరాదు.

మీ విశ్వాసమును కూడగట్టుకొనుము. మిమ్మల్నిసురక్షితముకు నడిపించే ప్రభువు మరియు ప్రవక్త యొక్క నడిపింపు మాట కొరకు వినండి.

ఇది యేసు క్రీస్తు యొక్క సంఘము—ఆయన అధికారములో ఉన్నాడని జ్ఞాపకముంచుకొనండి.

గత దశాబ్ధంలో మాత్రమే జరిగిన అనేక ప్రేరేపించబడిన అభివృద్ధులను గూర్చి ఆలోచించండి. ప్రస్థావించుటకు కొన్ని:

  • సంస్కారము మన సబ్బాతు ఆరాధనకు కేంద్రముగా పునరుద్ఘాటించబడింది.

  • వ్యక్తులను మరియు కుటుంబాలను బలపరచుటకు రండి, నన్ను అనుసరించండి గృహము-కేంద్రంగా, సంఘము-సహాయపడే సాధనముగా అందించబడింది.

  • అందరికి పరిచర్య చేయడానికి మనము ఒక మహోన్నతమైన, పరిశుద్ధమైన విధానమును ప్రారంభించాము.

  • సువార్తను పంచుకోవడంలో మరియు ప్రభువు కార్యమును చేయడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుట సంఘమంతటా వ్యాప్తి చెందింది.

ఈ సర్వసభ్య సమావేశ సభలు కూడా అద్భుతమైన సాంకేతిక విజ్ఞాన సాధనాలు లేకుండా సాధ్యమయ్యేవి కాదు.

సహోదర, సహోదరీలారా, క్రీస్తు చుక్కాని వద్ద ఉంటే, విషయాలు సక్రమంగా ఉండటమే కాదు, అవి ఊహింప శక్యముకాని విధంగా ఉంటాయి.

ఇశ్రాయేలును సమకూర్చు కార్యము ముందుకు సాగును

ప్రపంచవ్యాప్త మహమ్మారి ప్రభువు యొక్క కార్యమునికి మొదట ఆటంకంగా కనబడియుండవచ్చు. ఉదాహరణకు, సువార్తను పంచుకోవడానికి సంప్రదాయబద్ధమైన పద్ధతులు సాధ్యముకాలేదు. అయినప్పటికినీ, నిజాయితీగల హృదయాలను సమీపించుటకు మహమ్మారి నూతన, మరింత సృజనాత్మకమైన విధానాలను బయల్పరిచింది. ఇశ్రాయేలును సమకూర్చే కార్యము శక్తినందు, ఉత్సాహమందు వృద్ధి చెందుతున్నది. వందల వేల కథలు దీనిని ధృవీకరిస్తున్నాయి.

మనోహరమైన నార్వేలో నివసిస్తున్న ఒక మంచి స్నేహితురాలు ఇటీవల అధికమగుచున్న బాప్తీస్మములను గురించి నాకు, హేరియెట్‌కు వ్రాసింది. “సంఘము చిన్నదిగా ఉన్న ప్రదేశాలలో” “చిన్న గుంపులు శాఖలుగా, శాఖలు వార్డులుగా అవుతాయి!!”

లాట్వియాలో ఇంటెర్నట్ ప్రకటనను క్లిక్ చేయడం ద్వారా సంఘాన్ని కనుగొన్న ఒక మహిళ, యేసు క్రీస్తు యొక్క సువార్తను గూర్చి నేర్చుకోవడానికి ఎంతగా ఉద్వేగం చెందిందంటే, ఆమె తన అపాయింట్‌మెంట్ కంటే ఒక గంట ముందే వచ్చి, మిషనరీలు మొదటి పాఠాన్ని ముగించకముందే బాప్తీస్మము పొందటానికి ఒక తేదీ కోసం ఆమె అడిగింది.

తూర్పు ఐరోపాలో, సువార్తికుల నుండి ఫోనుచేయబడిన ఒక స్త్రీ, “సహోదరిలారా, మీరెందుకు ముందే నాకు ఫోను చేయలేదు? నేను ఎదురుచూస్తున్నాను!” అని అడిగింది.

మన సువార్తికులలో అనేకమంది మునుపటి కంటే తీరిక లేకుండా ఉన్నారు. అనేకమంది ఎప్పటికంటే ఎక్కువమందికి బోధిస్తున్నారు. సభ్యులు మరియు సువార్తికుల మధ్య బంధము హెచ్చించబడినది.

గతములో, మనము సంప్రదాయబద్ధమైన పద్ధతులకు చాలా కట్టుబడియున్నాము, కనుక మన కళ్లను తెరవటానికి మహమ్మారి అవసరమైంది. బహుశా మనము గ్రానైట్ లభ్యమౌతునప్పుడు ఇంకా ఇసుక రాళ్ల కోసం చూస్తున్నాము. అవసరార్ధం, సాంకేతిక పరిజ్ఞానంతో సహా, ప్రజలను సాధారణమైన, సహజమైన విధానాలలో ఆహ్వానించడానికి, వచ్చి చూడటానికి, వచ్చి సహాయపడటానికి మరియు వచ్చి చేరటానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము.

ఆయన కార్యము, ఆయన మార్గములు

ఇది ప్రభువు యొక్క కార్యము. దానిని చేయడానికి ఆయన మార్గములను కనుగొనమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మరియు అవి మన గత అనుభవాలనుండి భిన్నంగా ఉండవచ్చు.

తిబెరియ సముద్ర తీరమున చేపలు పట్టడానికి వెళ్లిన సీమోను పేతురుకు, మిగిలిన శిష్యులకు ఇది జరిగింది.

“ఆ రాత్రి వారు ఏమీ పట్టలేదు.

“సూర్యోదయమగు[చుండగా], యేసు దరిని నిలిచెను. …

“ఆయన వారితో వలలను [అటువైపు] వేయుడి, మీరు కనుగొందురని చెప్పెను.”

వారు అటువైపు వారి వలలను వేసిరి, మరియు “చేపలు విస్తారముగా పడినందున వలను లాగలేకపోయిరి.”10

దేవుడు తన సర్వశక్తిగల హస్తమును బయల్పరిచారు, మరియు బయల్పరుచుటను కొనసాగిస్తారు. మనము వెనుతిరిగి చూసే రోజు వస్తుంది, ఈ ప్రతికూల సమయంలో, ఆయన రాజ్యమును స్థిరమైన పునాదిపై నిర్మించుటకు—ఉత్తమమైన మార్గాలు—అనగా ఆయన మార్గాలు కనుగొనుటకు, దేవుడు మనకు సహాయపడ్డాడని తెలుసుకుంటాము.

ఇది దేవుని కార్యమని, ఆయన తన బిడ్డలు, తన జనుల మధ్య ఊహించని అనేక విషయాలను చేయుట కొనసాగిస్తాడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన యొక్క శ్రద్ధగల, కనికరముగల హస్తములో దేవుడు మనల్ని ఉంచును.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మన దినము యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

ప్రభువు యొక్క అపొస్తులునిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరియు నేను “[మీ] శక్తి మేరకు అన్ని విషయాలను సంతోషంగా చేయుటకు, [మీరు] పరిపూర్ణమైన అభయంతో, స్థిరంగా నిలబడుటకు, దేవుని యొక్క రక్షణను చూచుటకు, ఆయన బాహువు బయల్పరచబడుటకు”11 మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ నీతిగల పనుల నుండి ఊహింపశక్యముకాని విషయాలు కలుగునట్లు ప్రభువు చేస్తాడని యేసు క్రీస్తు నామములో, నేను వాగ్దానమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. నగరానికి ఆగ్నేయంగా 20 మైళ్ల దూరంలో ఉన్న, లిటిల్ కాటన్‌ఉడ్ కాన్యన్ ముఖద్వారం వద్ద క్వారీ నుండి తీసిన గ్రానైట్ లాగా కనిపించే క్వార్ట్జ్ మోన్జోనైట్.

  2. ఈ చరిత్ర యొక్క కాలము వైపు ఎక్కువ లోతుగా చూచుటకు {Saints: The Story of the Church of Jesus Christ in the Latter Days, vol. 2, No Unhallowed Hand, 1846–1893 (2020), chapters 17, 19, and 21. చూడండి.

  3. “How Firm a Foundation,” Hymns, no. 85.

    ఈ గొప్ప కీర్తన యొక్క పల్లవులు మన కాలములకు ఇతివృత్తంగా ఉపయోగపడతాయి మరియు కొత్త చెవులతో సాహిత్యాన్ని విన్నప్పుడు, అది మనం ఎదుర్కొంటున్న సవాళ్ళపై అంతర్దృష్టిని అందిస్తుంది:

    ప్రతి పరిస్థితిలో— అనారోగ్యంలో, ఆరోగ్యంలో

    పేదరికంలో లేక అధికమైన సంపదలో

    స్వదేశంలో లేక విదేశంలో, భూమిమీద, లేక సముద్రముపై—

    మీ రోజులు కోరినట్లుగా … మీకు సహాయం ఉంటుంది.

    భయపడకు, నేను మీతో ఉన్నాను; ఓహ్ భయపడవద్దు.

    నేను మీ దేవుడును, ఇంకా నేను సహాయం చేస్తాను.

    నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీకు సహాయం చేస్తాను మరియు మిమ్మల్ని నిలబెడతాను,

    నా నీతిమంతులు … సర్వశక్తిమంతుని హస్తముచేత సమర్ధించబడతారు.

    లోతైన జలాల గుండా వెళ్ళమని నేను మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు,

    దుఃఖము యొక్క నదులు మీకు ప్రవహించవు,

    నేన మీతో ఉంటాను, మీ కష్టాలు దీవించుటకు,

    మిమ్మల్ని ప్రతిష్టించుటకు … మీ లోతైన బాధ.

    మండుతున్న పరీక్షల ద్వారా మీ మార్గమున్నప్పుడు,

    నా కృప అంతా సరిపోతుంది, మీ సరఫరాగా ఉంటుంది.

    జ్వాల నిన్ను బాధించదు; నేను మాత్రమే రూపొందించాను.

    మీ మలినాలు దహించుటకు … మీ బంగారము శుద్ధి చేయుటకు

    విశ్రాంతి కొరకు యేసు పై ఆధారపడిన ఆత్మ

    అతడి శత్రువులకు వదలివేయను, నేన వదలలేను;

    నరకమంతా కదిలించడానికి ప్రయత్నించినప్పటికి, ఆ ఆత్మ,

    నేను ఎన్నడూ, ఎన్నడూ … ఎన్నడూ విడిచిపెట్టను!

  4. మోషైయ 7:13–18 చూడండి.

  5. అతడి సహోదరులు అతడిని బానిసత్వానికి అమ్మవేసినప్పుడు యోసేపు బహుశా 17 సంవత్సరాలంత చిన్నవాడు కావచ్చు(ఆదికాండము 37:2 చూడండి). అతడు ఫరో సేవలో ప్రవేశించినప్పుడు 30 సంవత్సరాలవాడు(ఆదికాండము 41:46 చూడండి). శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉన్న ఒక యువకుడు ద్రోహం చేయబడి, బానిసత్వానికి విక్రయించబడి, తప్పుడు ఆరోపణలు చేయబడి, తరువాత జైలులో పెట్టబడటం ఎంత కష్టమో మీరు ఊహించగలరా? యోసేపు నిశ్చయంగా సంఘములోని యువతకు మాత్రమే కాదు, సిలువను ఎత్తుకొని, రక్షకుని వెంబడించగగోరే ప్రతీ పురుషుడు, స్త్రీ, మరియు బిడ్డకు ఒక మార్గదర్శి.

  6. ఆదికాండము 45:4–11; మోషే 50:20–21 చూడండి. కీర్తనలు 105:17–18లో, మనమిలా చదువుతాము: “వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను: “వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి: ఇనుము అతని ప్రాణమును బాధించెను.” “They have afflicted with fetters his feet, Iron hath entered his soul” (వారు అతడి పాదములను సంకెళ్ళచేత బాధించారు, ఇనుము అతడి ప్రాణమును బాధించెను) (Young’s Literal Translation.“) నాకు ఇది జోసెఫ్ యొక్క కష్టాలు ఇనుము వలె బలంగా మరియు స్థితిస్థాపకంగా ఉన్న ఒక ఆత్మను ఇచ్చాయని సూచిస్తుంది—ఈ లక్షణం ప్రభువు అతని కోసం దాచియుంచిన గొప్ప మరియు ఊహింపశక్యముకాని భవిష్యత్తు కోసం అతనికి అవసరం.

  7. సిద్ధాంతము మరియు నిబంధనలు 121–23 చూడండి.

  8. దేవుడు తన బిడ్డలను ఆకలిగొన్నవారు, అవసరతలో ఉన్నవారు, దిగంబరులను, రోగులను, మరియు బాధింపబడిన వారిని ఎరిగి, కనికరము చూపమని ఆజ్ఞాపించాడు, నిశ్చయముగా ఆయన తన బిడ్డలమైన మనల్ని ఎరిగి, కనికరము కలిగియున్నాడు(మోర్మన్ 8:39 చూడండి).

  9. లూకా 7:11–17 చూడండి.

  10. యోహాను 21:1-6 చూడండి.

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 123:17.