క్రీస్తు యొక్క సంస్కృతి
మన వ్యక్తిగత భూలోక సంస్కృతులలో శ్రేష్టమైన దానిని మనం ఆనందించగలము మరియు యేసు క్రీస్తు యొక్క సువార్త నుండి వచ్చే నిత్య సంస్కృతిలో పూర్తిగా పాల్గొనేవారిగా ఉండగలము.
మనము జీవించే, పంచుకునే ప్రపంచం ఎంత అద్భుతమైనది! అది గొప్ప భిన్నత్వముగల జనులకు, భాషలు, ఆచారములు, మరియు చరిత్రలకు గృహము—వందలాది దేశాలు, వేలాది సమూహాలలో విస్తరించి ఉంది, వాటిలో ప్రతీ ఒక్కటి గొప్ప సంస్కృతిని కలిగియున్నది. మానవజాతి గర్వపడి, సంబరాలు చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. నేర్చుకొన్న ప్రవర్తన అయినప్పటికినీ—మనం పెరిగే సంస్కృతుల ద్వారా మనం బహిర్గతం చేయబడినవి —మన జీవితంలో గొప్ప బలముగా ఉపయోగపడతాయి, ఇది కొన్ని సమయాల్లో, ఒక ముఖ్యమైన అడ్డంకిగా కూడ మారవచ్చు.
ఆ సంస్కృతి మన ఆలోచన మరియు ప్రవర్తనలో చాలా ఎక్కువగా పొందుపరచబడి, అది మార్చటానికి అసాధ్యమైనదిగా కనబడవచ్చు. ఇది అన్నింటికంటే, మనం భావించే వాటిలో చాలా భాగం మనల్ని నిర్వచిస్తుంది మరియు దాని నుండి మనం ఒక ప్రత్యేక వ్యక్తిగా ఉండుటను గుర్తించుటను అనుభవిస్తాము. అది మన స్వంత సంస్కృతులలో మానవ నిర్మిత బలహీనతలను లేదా లోపాలను చూడటంలో మనం విఫలమైనంత బలమైన ప్రభావం కావచ్చు, ఫలితంగా మన తండ్రుల సంప్రదాయాలలో కొన్నింటిని తీసివేయడానికి ఇష్టపడము. ఒకరి సాంస్కృతిక గుర్తింపుపై స్థిరమైన ఆసక్తి కలిగియుండుట విలువైనది—-దైవభక్తిగల—ఆలోచనలు, లక్షణాలు మరియు ప్రవర్తనను కూడా తిరస్కరించడానికి దారితీయవచ్చు.
సాంస్కృతిక దృష్టిమాంద్యము యొక్క ఈ సార్వత్రిక సూత్రాన్ని వివరించడానికి సహాయపడే అద్భుతమైన పెద్దమనిషిని, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎరుగుదును. అతడి కుటుంబం యొక్క గృహ బోధకునిగా నేను నియమించబడినప్పుడు, నేను మొదట అతడిని సింగపూర్‌లో కలిసాను. సంస్కృతం మరియు తమిళ భాషలకు ఒక ప్రత్యేకించబడిన ప్రొఫెసరు, అతడు మొదట దక్షిణ భారతదేశము నుండి వచ్చాడు. అతడి అద్భుతమైన భార్య, ఇద్దరు కొడుకులు సంఘ సభ్యులు, కానీ అతడు ఎన్నడూ చేరలేదు లేక సువార్త యొక్క బోధనలు ఎక్కువగా వినలేదు. అతడు తన భార్య, కొడుకులు అభివృద్ధి చెందుతున్న తీరుతో సంతోషంగా ఉన్నాడు మరియు వారి కార్యాచరణాలలో మరియు సంఘ బాధ్యతలలో వారికి పూర్తిగా మద్దతు ఇచ్చాడు.
అతడితో సువార్త సూత్రములను బోధించి, మన నమ్మకాలను పంచుకుంటానని నేను అడిగినప్పుడు, మొదట అతడు తిరస్కరించాడు. ఎందుకో తెలుసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది: అలా చేయడం ద్వారా అతను తన గతానికి, తన ప్రజలకు మరియు తన చరిత్రకు దేశద్రోహి అవుతానని అతను భావించాడు! అతని ఆలోచనా విధానములో, అతను ఉన్న ప్రతిదాన్ని, అతని కుటుంబం అతనికి నేర్పించిన ప్రతిదాన్ని, అతని భారతీయ వారసత్వాన్ని నిరాకరిస్తున్నాడని భావించాడు. రాబోయే కొద్ది నెలల్లో, మేము ఈ సమస్యల గురించి మాట్లాడగలిగాము. యేసు క్రీస్తు సువార్త వేరే దృక్కోణానికి అతడి కళ్ళు ఎలా తెరవగలిగిందో నేను (ఆశ్చర్యపోనప్పటికిని!) భయపడ్డాను.
అనేకమైన మానవ-నిర్మిత సంస్కృతులలో, మంచివి, చెడువి, మిమ్మల్ని మంచిగా చేసేవి మరియు మిమ్మల్ని బలహీనంగా చేసేవి రెండూ కనిపిస్తాయి.
మన ప్రపంచంలోని అనేక సమస్యలు వారి సంస్కృతి నుండి ఉత్పన్నమయ్యే విభిన్న ఆలోచనలు మరియు ఆచారాల మధ్య ఘర్షణల యొక్క ప్రత్యక్ష ఫలితం. కొంత కాలం క్రితం మనమందరం కలిగియున్న మర్త్యతానికి ముందు సంస్కృతిని ప్రపంచం కేవలము అంగీకరిస్తే, వాస్తవంగా సమస్త సంఘర్షణ మరియు గందరగోళం త్వరగా మాయమవుతాయి. ఈ సంస్కృతి మన పూర్వపు ఉనికికి చెందినది. అది ఆదాము మరియు హానోకుల సంస్కృతి. అది ఉత్కృష్టమైన సమయములో రక్షకుని బోధనలపై స్థాపించబడిన సంస్కృతి, మరియు అది మన కాలంలో మరొకసారి స్త్రీలు, పురుషులందరికీ లభ్యమగుచున్నది. ఇది చాలా ప్రత్యేకమైనది! అది అన్ని సంస్కృతుల కంటె మిక్కిలి గొప్పది మరియు సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక నుండి వచ్చును, దేవుని చేత రచించబడింది మరియు క్రీస్తు చేత విజేయమైంది. అది విభజించుట కంటె ఏకము చేస్తుంది. అది గాయపరచుట కంటె స్వస్థపరచును.
యేసు క్రీస్తు యొక్క సువార్త జీవితములో ఉద్దేశమున్నదని మనకు బోధిస్తుంది. ఇక్కడ మనముండటం కేవలం ఏదైనా పెద్ద విశ్వ ప్రమాదం లేక పొరపాటు కాదు! మనము ఇక్కడ ఒక కారణము కోసమున్నాము.
మన పరలోక తండ్రి జీవిస్తున్నాడని, ఆయన నిజమైన వాడు మరియు మనలో ప్రతీ ఒక్కరిని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడనే సాక్ష్యమందు స్థిరమైన పునాదిని ఈ సంస్కృతి కలిగియున్నది. మనము ఆయన “కార్యము మరియు [ఆయన] మహిమ గా” 1 ఉన్నాము. ఈ సంస్కృతి సమాన విలువ అనే భావనను సమర్థిస్తుంది. కులానికి లేక వర్గానికి ఏ గుర్తింపు లేదు. శబ్దార్ధప్రకారం—అన్నిటికి పైగా, మనమందరం, మన పరలోక తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ బిడ్డలము, సహోదర, సహోదరీలము. అన్ని సంస్కృతులలో గొప్పదిలో ఎటువంటి పక్షపాతం లేదా “రెండు గుంపుల మధ్య వ్యతిరేకమైన” మనస్తత్వం లేదు. మనమందరం “మాకు.” మనమందరం “వారు.” మనకై మనం, ఒకరినొకరికి, సంఘము, మరియు మన ప్రపంచానికి బాధ్యులమని మరియు ఉత్తరవాదులమని మనం నమ్ముతాము. బాధ్యత మరియు జవాబుదారిత్వము మన ఎదుగుదలలో ముఖ్యమైన అంశములు.
దాతృత్వము, నిజముగా క్రీస్తువంటి శ్రద్ధ, ఈ సంస్కృతి యొక్క పునాది. మన తోటిమనిషి, తాత్కాలిక మరియు ఆత్మీయ అవసరాలకు మనము నిజమైన ఆందోళన చెందుతున్నాము, మరియు ఆ భావాలను ఆచరణలో పెడతాము. అది పక్షపాతం మరియు ద్వేషాన్ని తొలగిస్తుంది.
ప్రవక్తలచేత స్వీకరించబడినట్లుగా, దేవుని వాక్యముపై కేంద్రీకరించబడిన, బయల్పాటు యొక్క సంస్కృతిని మనము ఆనందిస్తాము (మరియు పరిశుద్ధాత్మ ద్వారా మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ధృవీకరించదగినది). సమస్త మానవాళి దేవుని యొక్క చిత్తమును మరియు మనస్సును తెలుసుకోవచ్చును.
ఈ సంస్కృతి ప్రాతినిధ్యము యొక్క సూత్రమును బలపరచును. ఎంపిక చేసే సామర్ధ్యము మన అభివృద్ధికి మరియు మన సంతోషానికి చాలా ముఖ్యమైనది. తెలివిగా ఎంపిక చేయడం ముఖ్యమైనది.
అది నేర్చుకొనుట మరియు అధ్యయనం యొక్క సంస్కృతి. మనము జ్ఞానమును, తెలివిని, మరియు అన్ని విషయాలందు ఉత్తమమైన దానిని కోరుకుంటాము.
అది విశ్వాసము మరియు విధేయత యొక్క సంస్కృతి. యేసు క్రీస్తునందు విశ్వాసము మన సంస్కృతి యొక్క మొదటి సూత్రము, మరియు దాని ఫలితం ఆయన బోధనలకు, ఆజ్ఞలకు విధేయత. ఇవి ఆత్మ-నిగ్రహానికి దారితీస్తాయి.
అది ప్రార్ధన యొక్క సంస్కృతి. దేవుడు మనల్ని ఆలకించడం మాత్రమే కాదు కాని మనకు సహాయపడతాడు కూడా అని మనం నమ్ముతాము.
అది నిబంధనలు, విధులు, ఉన్నతమైన నైతిక ప్రమాణాలు, త్యాగము, క్షమాపణ, పశ్చాత్తాపము, మరియు మన శరీరాల యొక్క దేవాలయము కొరకు శ్రద్ధ వహించే సంస్కృతి. ఇవన్నీ దేవునిపట్ల మనకున్న ఒడంబడికకు సాక్ష్యమును వహిస్తాయి.
అది దేవుని నామములో పని చేసే అధికారము, ఆయన పిల్లలను దీవించుటకు దేవుని యొక్క శక్తియైన యాజకత్వము చేత పరిపాలించబడిన సంస్కృతి. ఇది వ్యక్తులు మంచి వ్యక్తులుగా, నాయకులుగా, తల్లులు, తండ్రులుగా మరియు సహచరులుగా ఉండటానికి బోధించి, వీలు కల్పిస్తుంది—మరియు ఇది ఇంటిని పరిశుద్ధపరచును.
యేసు క్రీస్తునందు విశ్వాసము, యాజక్వతము యొక్క శక్తి, ప్రార్ధన, స్వీయ-మెరుగుపరచుకొనుట, నిజమైన పరివర్తన, మరియు క్షమాపణ చేత చేయబడిన అన్ని సంస్కృతులలో ప్రాచీనమైన దానిలో నిజమైన అద్భుతాలు విస్తారంగా ఉన్నాయి.
అది సువార్త పరిచర్య యొక్క సంస్కృతి. ఆత్మల యొక్క విలువ గొప్పది.
క్రీస్తు యొక్క సంస్కృతిలో, స్త్రీలు వారి సరైన మరియు శాశ్వతమైన స్థితికి ఎత్తబడతారు. నేటి ప్రపంచంలోని అనేక సంస్కృతుల మాదిరిగా వారు పురుషులకు లోబడి ఉండరు, కానీ ఇక్కడ మరియు రాబోయే ప్రపంచంలో పూర్తి మరియు సమాన భాగస్వాములు.
ఈ సంస్కృతి కుటుంబము యొక్క పరిశుద్ధతను నిర్ధారిస్తుంది. కుటుంబము నిత్యత్వము యొక్క ప్రధాన విభాగము. కుటుంబం యొక్క పరిపూర్ణత ఏదైనా త్యాగం చేయడానికి విలువైనది, ఎందుకంటే బోధింపబడినట్లుగా, “ఇంటిలో వైఫల్యాన్ని ఇతర విజయాలు ఏవి భర్తీ చేయలేవు.” 2 గృహములోనే మన శ్రేష్టమైన పని నెరవేర్చబడును మరియు అక్కడే మన గొప్ప సంతోషము సాధించబడుతుంది.
క్రీస్తు యొక్క సంస్కృతిలో, దృక్పథము—శాశ్వతమైన దృష్టి మరియు నడిపింపు ఉన్నాయి. ఈ సంస్కృతి శాశ్వతమైన విలువగల విషయాలకు సంబంధించినది! అది యేసు క్రీస్తు యొక్క సువార్త నుండి వచ్చును, అది శాశ్వతమైనది, మరియు మన ఉనికి యొక్క “ఎందుకు,” “ఏమిటి,” “ఎక్కడో,” కారణము వివరించును. (ఇది కలుపుకొనేది, ప్రత్యేకమైనది కాదు.) మన రక్షకుని యొక్క బోధనలను అన్వయించుట నుండి ఈ సంస్కృతి కలిగింది కనుక, అటువంటి తీరని అవసరం ఉన్న మన ప్రపంచానికి స్వస్థపరచు ఔషధతైలం అందించడానికి అది సహాయపడుతుంది.
ఈ గొప్ప, ఘనమైన జీవిత విధానములో భాగముగా ఉండుట ఒక గొప్ప దీవెన! అన్ని సంస్కృతుల కంటె మిక్కిలి గొప్పదైన, దీనిలో భాగముగా ఉండటానికి, మార్పు అవసరము. మన పాత సంస్కృతులలో క్రీస్తు యొక్క సంస్కృతితో ఏకరీతిగా లేని దేనినైనా వదిలివేయుట అవసరమని ప్రవక్తలు బోధించారు. కానీ మనము ప్రతీదానిని విడిచిపెట్టాలని దాని అర్ధము కాదు. మన విశ్వాసము, ప్రతిభలను మరియు జ్ఞానాన్ని—మన జీవితాల్లో మరియు మన వ్యక్తిగత సంస్కృతులలో మంచివి— మనతో తెమ్మని మరియు సువార్త సందేశము ద్వారా సంఘము “దానిని చేర్చుటకు” అనుమతించమని మనము ఆహ్వానించబడినట్లు ప్రవక్తలు కూడ నొక్కిచెప్పారు. 3
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము పాశ్చాత్య సమాజం లేదా ఒక అమెరికన్ సాంస్కృతిక దృగ్విషయం కాదు. ఇది ఎల్లప్పుడూ ఉద్దేశించబడినట్లుగా, ఇది ఒక అంతర్జాతీయ సంఘము. దానికంటె ఎక్కువైనది, అది దివ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రొత్త సభ్యులు ఎప్పటికప్పుడు పెరుగుతున్న మన కుటుంబంలో గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని మరియు ఉత్సాహాన్ని తెస్తారు. ప్రతీచోటా కడవరి దిన పరిశుద్ధులు వారి స్వంత వారసత్వమును, నాయకులను గౌరవిస్తారు మరియు వేడుక చేసుకుంటారు, కానీ ఇప్పుడు వారు కూడ ఏదైన చాలా గొప్పదానిలో భాగము. క్రీస్తు సంస్కృతి మనల్ని మనం నిజంగానే చూడటానికి సహాయపడుతుంది, మరియు నిత్యత్వం యొక్క దృష్టికోణం ద్వారా చూసి, నీతితో నిగ్రహించుకొన్నప్పుడు, అది సంతోషము యొక్క గొప్ప ప్రణాళికను నెరవేర్చగల మన సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.
అయితే నా స్నేహితుడికి ఏమి జరిగింది? మంచిది, అతడు పాఠములు బోధించబడ్డాడు మరియు సంఘములో చేరాడు. అప్పటి నుండి అతడి కుటుంబము సిడ్నీ ఆస్ట్రేలియా దేవాలయములో కాలము, నిత్యత్వము కొరకు బంధింపబడ్డారు. అతడు కాస్త వదులుకున్నాడు—మరియు సమస్తము కొరకు సాధ్యతను సంపాదించుకున్నాడు. అతడు ఇప్పటికీ తన చరిత్రను వేడుక చేసుకోగలడని, తన పూర్వీకుల గురించి, తన సంగీతం మరియు నృత్యం మరియు సాహిత్యం, తన ఆహారం, తన భూమి మరియు దాని ప్రజల గురించి గర్వపడగలడని అతను కనుగొన్నాడు. తన స్థానిక సంస్కృతిలో ఉత్తమమైన దానిని అన్ని సంస్కృతులలో మిక్కిలి గొప్పదానిలో చేర్చడంలో సమస్య లేదని అతను కనుగొన్నాడు. తన పాత జీవితం నుండి క్రొత్త దానికి సత్యం మరియు నీతికి ఏకరీతిగా ఉన్నదాన్ని తీసుకురావడం పరిశుద్ధులతో తన సహవాసము పెంచడానికి మరియు పరలోకపు సమాజములో అందరినీ ఏకం చేయడంలో సహాయపడటానికి మాత్రమే ఉపయోగపడుతుందని అతను కనుగొన్నాడు.
మన వ్యక్తిగత భూసంబంధమైన సంస్కృతులలో అందరిని మనం ఎంతో ఆదరించగలము మరియు వాటిలో అన్నిటికంటే—యేసుక్రీస్తు సువార్త నుండి వచ్చిన అసలు, అంతిమ, శాశ్వతమైన సంస్కృతి, పురాతన సంస్కృతిలో పూర్తిస్థాయిలో పాల్గొనవచ్చు. మనమందరం ఎంత అద్భుతమైన వారసత్వము పంచుకొంటాము. యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.