నిశ్శబ్దమై, ఉరకుండుము
గాలులు మన చుట్టూ తీవ్రంగా వీచేటప్పుడు మరియు ఉప్పొంగుతున్న అలలు మన ఆశలను ముంచివేయడానికి భయపెట్టినప్పుడు కూడా శాంతి మరియు నెమ్మదిని ఎలా అనుభవించాలో ఆయన మనకు బోధిస్తాడు.
మా పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు, మా కుటుంబము ఒక అందమైన సరస్సు వద్ద కొన్ని రోజులు గడిపాము. ఒక మధ్యాహ్నం పిల్లలలో కొందరు ఓడ పైభాగము నీటిలోకి దూకడానికి ముందు లైఫ్ జాకెట్లు వేసుకున్నారు. మా చిన్న కుమార్తై తన తోబుట్టువులను జాగ్రత్తగా గమనిస్తూ, సందేహముతో చూసింది. ఆమె సమీకరించగల సమస్త ధైర్యంతో, ఆమె ఒక చేత్తో ముక్కును మూసుకొని దూకింది. ఆమె వెంటనే పైకి వచ్చి, తన గొంతులో కాస్త భయాందోళనతో కేకలేసింది, “నాకు సహాయం చెయ్యండి! నాకు సహాయం చెయ్యండి!”
ఇప్పుడు, ఆమె ఏ ప్రాణ ప్రమాదంలో లేదు, ఆమె లైఫ్ జాకెట్ సహాయపడుతున్నది, మరియు ఆమె క్షేమంగా తేలుతున్నది. మేము సమీపించి ఆమెను స్వల్ప ప్రయత్నంతో డెక్ పైకి లాగగలిగాము. అయినప్పటికీ ఆమె దృష్టికోణములో ఆమెకు సహాయమవసరము. బహుశా అది నీటి యొక్క చల్లదనము లేక క్రొత్త అనుభవము వలన కావచ్చు. ఏదిఏమైనా ఆమె ఓడ పైభాగాన్ని ఎక్కి వచ్చింది, మేము ఆమెను పొడి టవలుతో చుట్టాము మరియు తన ధైర్యము కొరకు ఆమెను పొగిడాము.
మనము పెద్ద లేక చిన్నవారమైనప్పటికినీ, మనలో అనేకమంది, నిరాశగల క్షణాలందు, “నాకు సహాయం చెయ్యండి!” వంటి మాటలను అత్యవసరంగా పలికాము. “నన్ను రక్షించుము!” లేక “దయచేసి, నా ప్రార్ధనకు జవాబియ్యుము!”
ఆయన మర్త్య పరిచర్య సమయంలో యేసు యొక్క శిష్యులతో అటువంటి సంఘటన జరిగింది. యేసు “సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా, బహు జనులాయన యొద్దకు కూడి వచ్చి యుండెను,”1 అని మార్కులో మనము చదువుతాము. జనసమూహము బహు విస్తారము కావడంతో యేసు “దోనె యెక్కి కూర్చుండెను”2 మరియు దాని పైనుండి ప్రసంగించాడు. రోజంతా వారు సముద్రతీరమును కూర్చోన్నప్పుడు, ఆయన జనులకు ఉపమానములలో బోధించాడు.
“[సాయంకాలము] అయినప్పుడు, …” ఆయన తన శిష్యులతో, “అద్దరికి పోవుదమని వారితో చెప్పెను. మరియు వారు జనులను పంపివేసినప్పుడు,”3 వారు సముద్ర తీరము నుండి బయలుదేరి, గలిలయ సముద్రం మీదుగా వెళ్తున్నారు. దోనె వెనుక ఒక స్థలము కనుగొని, యేసు పండుకొని వెంటనే నిద్రపోయెను. త్వరలో “పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను.”4
యేసు యొక్క శిష్యులలో అనేకులు అనుభవజ్ఞులైన జాలరులు మరియు తుఫానులో దోనెను ఎలా నడపాలో ఎరుగుదురు. వారు ఆయన నమ్మదగినవారు—వాస్తవానికి, ఆయన ప్రియమైన—శిష్యులు. యేసును అనుసరించుటకు వారు తమ వృత్తులను, వ్యక్తిగత ఆసక్తులను, మరియు కుటుంబమును విడిచిపెట్టారు. ఆయనయందు వారి విశ్వాసము దోనెలో వారి సమక్షము ద్వారా స్పష్టమగుచున్నది. మరియు ఇప్పుడు వారి దోనె తుఫాను మధ్యలో ఉన్నది మరియు మునిగిపోయే స్థితిలో ఉన్నది.
దోనెను తేలునట్లు చేయడానికి వాళ్లు ఎంతసేపు ప్రయాసపడ్డారో మనకు తెలియదు, కానీ వారి స్వరములలో కాస్త భయముతో వారు యేసును లేపారు:
“బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింతలేదా?”5
“ప్రభువా, నశించిపోవుచున్నాము: మమ్మును రక్షించుము.”6
వారు ఆయనను, “బోధకుడా,” అని పిలిచారు, మరియు ఆయన బోధకుడే. ఆయన “యేసు క్రీస్తు, దేవుని యొక్క కుమారుడు పరలోకము మరియు భూమి యొక్క తండ్రి, అది నుండి అన్ని వస్తువుల యొక్క సృష్టికర్త”7 కూడా.
దోనెలో ఆయన ఉన్న స్థానము నుండి, యేసు పైకిలేచి, గాలిని మరియు ఉప్పొంగుచున్న సముద్రమును గద్దించెను, “నిశ్శబ్దమై ఉరకుండుము. “గాలి [అణగి], మిక్కిలి నిమ్మళమాయెను ”8 ఎప్పటికీ ప్రవీణుడైన బోధకుడు, యేసు సాధారణమైనవి కాని ప్రేమగల ప్రశ్నల ద్వారా తన శిష్యులకు బోధించెను. ఆయన ఇట్లనెను:
“మీరెందుకు భయపడుతున్నారు?”9
“మీ విశ్వాసమెక్కడ?”10
శ్రమలు, కష్టాలు, లేక బాధల మధ్యలో మనల్ని మనం కనుగొన్నప్పుడు, “బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింతలేదా?” అని అడిగే మానవ ధోరణి, లేక ఒక శోధన కూడా ఉన్నది. నన్ను రక్షించుము.” భయంకరమైన చెరసాలలో నుండి జోసెఫ్ స్మిత్ కూడా వేడుకున్నాడు, ”ఓ, దేవా, నీవు ఎక్కడ ఉన్నావు? నీవు దాగుకొనే స్థలమును కప్పే గుడారము ఎక్కడున్నది?”11
ఖచ్చితంగా, లోక రక్షకుడు మన మర్త్య పరిమితులను అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే మన చుట్టూ గాలులు తీవ్రంగా వీచేటప్పుడు మరియు ఉప్పొంగుతున్న అలలు మన ఆశలను ముంచివేయడానికి భయపెట్టినప్పుడు కూడా శాంతి మరియు నెమ్మదిని ఎలా అనుభవించాలో ఆయన మనకు బోధిస్తాడు.
నిరూపించబడిన విశ్వాసము, బిడ్డ వంటి విశ్వాసము గల వారికి, లేక స్వల్ప పరిమాణంలో విశ్వాసము కూడా వున్నవారికి,12 “నా యొద్దకు రండి”13 అని చెప్తూ యేసు ఆహ్వానిస్తున్నాడు. “నా నామముపై విశ్వసించుము”14 “నా నుండి నేర్చుకొనుము, మరియు నా మాటలను వినుము.”15 ఆయన మృదువుగా ఇలా ఆజ్ఞాపించును, “పశ్చాత్తాపపడి మరియు నా నామమునందు బాప్తీస్మము [పొందుము],”16 “నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను,”17 మరియు “ఎల్లప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము.”18 ఇలా వివరిస్తూ యేసు అభయమిచ్చెను: “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును: అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించి యున్నాననెను.”19
తుఫానుతో కొట్టబడిన దోనెలో యేసు శిష్యులు ఆవశ్యకతతో, అలలు దోనె పైన మీద పడటం గమనిస్తూ మరియు దోనె నుండి నీటిని బయటకు తోడుతూ, తీరిక లేకుండా ఉన్నారని నేను నేనూహించగలను. నేను వారి పడవను నిర్వహించడం మరియు వారి చిన్న పడవపై కొంత నియంత్రణను కాపాడటానికి ప్రయత్నించుట నేను ఊహిస్తున్నాను. ఆ క్షణములో బ్రతకడంపై వారి దృష్టి ఉన్నది, మరియు సహాయము కొరకు వారి మనవి అత్యవసరంగా మనఃపూర్వకమైనది.
మన కాలములో మనలో చాలా మంది ఆవిధంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరియు మన దేశాలు, సంఘాలు మరియు కుటుంబాలలో ఇటీవలి సంఘటనలు ముందుగా ఊహించని పరీక్షలతో మనల్ని పలుమార్లు కొట్టాయి. సంక్షోభ సమయాలలో మన విశ్వాసము మన సహనము మరియు అవగాహన యొక్క పరిమితులకు సాగదీయబడుటను భావించవచ్చు. దేవుని యొక్క మంచితనమును మరచిపోవునట్లు చేస్తూ భయము యొక్క అలలు మనల్ని అంతరాయపరచగలవు, ఆవిధంగా మన దృష్టికోణము చాలా పరిమితంగా లేక అస్పష్టముగా విడవబడింది. అయినప్పటికినీ మన ప్రయాణములో ఈ కఠినమైన క్షణాలలో మన విశ్వాసము పరీక్షించబడుట మాత్రమే కాదు కాని బలపరచబడుతుంది.
మన పరిస్థితులను లక్ష్యపెట్టకుండా, యేసు క్రీస్తునందు మన విశ్వాసమును నిర్మించుటకు, హెచ్చించుటకు మనము ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నాలను చేయగలము. మనము దేవుని యొక్క పిల్లలమని, మరియు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనము జ్ఞాపకముంచుకొన్నప్పుడు అది బలపరచబడుతుంది. నిరీక్షణ మరియు శ్రద్ధతో దేవుని వాక్యము పై మనము ప్రయోగించి మరియు క్రీస్తు యొక్క బోధనలు అనుసరించుటకు మన శాయశక్తులా ప్రయత్నించినప్పుడు మన విశ్వాసము ఎదుగుతుంది. అనుమానించుట కంటె నమ్ముటకు, విమర్శించుట కంటె క్షమించుట, తిరగబడుట కంటె పశ్చాత్తాపపడుటను మనము ఎంపిక చేసినప్పుడు, మన విశ్వాసము వృద్ధి చెందుతుంది. పరిశుద్ధ మెస్సీయా యొక్క మంచితనము, కనికరము మరియు కృపపై మనము ఓపికగా ఆధారపడినప్పుడు మన విశ్వాసము శుద్ధి చేయబడుతుంది.20
“విశ్వాసము పరిపూర్ణమైన జ్ఞానము కాదు,” “అది దేవునియందు లోతైన నమ్మకమును తెచ్చును, ఆయన జ్ఞానము పరిపూర్ణమైనది!”21 అని ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ చెప్పారు. సంక్షోభ సమయాలలో కూడా, క్రీస్తుయందు విశ్వాసము తీర్మానము, ధైర్యమును మరియు స్థితిస్థాపకతను చూపును. ముఖ్యముకాని పరధ్యానాలను తీసివేయుట ద్వారా అది మనకు సహాయపడుతుంది. అది నిబంధన బాట వెంబడి ముందుకు సాగుటకు మనల్ని ప్రోత్సహించును. నిరాశ ద్వారా విశ్వాసము త్రోసుకొనివెళ్లును మరియు భవిష్యత్తును తీర్మానముతో, ధైర్యముతో ఎదుర్కొవడానికి మనకి వీలు కల్పించును. ఆయన కుమారుని నామములో తండ్రికి మనము ప్రార్ధించినప్పుడు విడుదల మరియు ఉపశమనము కొరకు అడుగుటకు మనల్ని ప్రేరేపించును. ప్రార్ధనాపూర్వకమైన మనవులు జవాబివ్వబడనట్లు కనబడినప్పుడు, యేసు క్రీస్తునందు మన పట్టుదలగల విశ్వాసము, ఓపికను, దీనమనస్సును, మరియు “మీ చిత్తము జరుగునుగాక” ఈ మాటలను భక్తితో చెప్పగల సామర్ధ్యమును ఇచ్చును.22
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు:
“మన భయాలు మన విశ్వాసాన్ని స్థానభ్రంశం చేయనివ్వవలసిన అవసరం లేదు. మన విశ్వాసమును బలపరచుట ద్వారా ఆ భయాలను మనము జయించగలము.
“మీ పిల్లలతో ప్రారంభించండి. … మీకు భయంకరమైన శ్రమలు కలిగినప్పుడు కూడా, మీ విశ్వాసమును వారు అనుభూతి చెందనియ్యండి. మీ విశ్వాసము మన ప్రేమగల పరలోక తండ్రి మరియు ఆయన ప్రియమైన కుమారుడు, ప్రభువైన యేసుపై కేంద్రీకరించనియ్యుము. … ప్రతీ ప్రశస్తమైన బాలుడు లేక బాలికకు, అతడు లేక ఆమె దేవుని యొక్క బిడ్డ అని, ఒక పరిశుద్ధమైన ఉద్దేశము మరియు సాధ్యతతో, ఆయన ప్రతిరూపములో సృష్టించబడ్డారని బోధించుము. ప్రతిఒక్కరు అధిగమించుటకు సవాళ్లు మరియు అభివృద్ధి చేసుకొనుటకు విశ్వాసముతో జన్మించారు.”23
“యేసుక్రీస్తు మీకు ఎలా సహాయం చేస్తాడు?” అనే ప్రశ్నకు సమాధానమిచ్చినప్పుడు, నాలుగేళ్ల పిల్లలు యేసు క్రీస్తునందు తమ విశ్వాసాన్ని పంచుకున్నారని నేను ఇటీవల విన్నాను. మొదటి బిడ్డ అన్నది, “ఆయన నాకోసం చనిపోయాడు కనుక యేసు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. ఆయన పెద్దవారిని కూడా ప్రేమిస్తాడు.“ రెండవ బిడ్డ చెప్పాడు, “నేను విచారంగా లేక కోపంగా ఉన్నప్పుడు ఆయన నాకు సహాయపడతాడు. నేను కృంగినప్పుడు కూడా ఆయన నాకు సహాయపడతాడు.“
“కాబట్టి, పశ్చాత్తాపపడి మరియు ఒక చిన్న పిల్లవానివలే నాయొద్దకు వచ్చు వానిని నేను చేర్చుకొందును, ఏలయనగా దేవుని యొక్క రాజ్యము అట్టి వారిది,”24 అని యేసు ప్రకటించెను.
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”25
మనము “క్రొత్తగా ప్రారంభించి, నిజముగారక్షకుని యొక్క మాటలను విని, ఆలకించి, మరియు లక్ష్యపెట్టినప్పుడు” “భయము తగ్గించబడి, విశ్వాసము హెచ్చింపబడుట జరుగుతుందని” అధ్యక్షులు నెల్సన్ ఇటీవల వాగ్దానమిచ్చారు.26
సహోదరి, సహోదరులారా, మన ప్రస్తుతపు కష్టమైన పరిస్థితులు మన అంతిమ, నిత్య గమ్యము కాదు. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, మనము నిబంధన ద్వారా యేసు క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొన్నాము. ఆయన విమోచించు శక్తియందు విశ్వాసము మరియు ఆయన గొప్ప, ప్రశస్తమైన వాగ్దానములందు నిరీక్షణను మనము కలిగియున్నాము. మనము సంతోషించడానికి ప్రతీ కారణమున్నది, ఏలయనగా మన ప్రభువు, రక్షకుడు, మన కష్టాలు, చింతలు, మరియు విచారములను బాగా ఎరిగియున్నాడు. యేసు తన ప్రాచీన శిష్యులతో ఉన్నట్లుగా, ఆయన మనతో ఉన్నాడు! మీరు, నేను నశింపకుండునట్లు, ఆయన తన ప్రాణమును ఇచ్చాడని నేను సాక్ష్యమిస్తున్నాను. మనము ఆయనను విశ్వసించి, ఆయన ఆజ్ఞలకు విధేయులమై, మరియు విశ్వాసముతో, “నిశ్శబ్దమై ఉరకుండుము”27 అని ఆయన చెప్పుటను విందాము. యేసు క్రీస్తు పరిశుద్ధమైన మరియు పవిత్రమైన నామములో, ఆమేన్.