మరలా నమ్మండి
దేవునిని మరియు ఒకరినొకకిని నమ్మడం పరలోకపు దీవెనలను తెస్తాయి.
ఒకసారి, నేను చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు, ఇంటి నుండి పారిపోవడం గురించి క్లుప్తంగా ఆలోచించాను. నన్ను ఎవరూ ప్రేమించలేదని చిన్నపిల్లల మనస్తత్వంతో నేను భావించాను.
గమనించిన నా తల్లి విని, నాకు హామీ ఇచ్చింది. నేను సురక్షితంగా ఇంటిలో ఉన్నాను.
ఇంటి నుండి పారిపోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? తరచుగా, ఇంటి నుండి పారిపోవడమంటే మనతో, ఒకరినొకరితో మరియు దేవునితో నమ్మకం దెబ్బతినడం లేదా కోల్పోవడం అని అర్థము. నమ్మకం సవాలు చేయబడినప్పుడు, మరలా ఎలా నమ్మాలని అని మనము ఆశ్చర్యపోతాము.
ఈ రోజు నా సందేశం ఏమిటంటే, మనం ఇంటికి వస్తున్నా లేదా ఇంటికి వెళ్తున్నా, దేవుడు మనల్ని కలవడానికి వస్తున్నారు.1 మరలా నమ్మడానికి, ఆయనయందు విశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని, జ్ఞానాన్ని మరియు వివేచనను మనం కనుగొనగలము. అదేవిధంగా, ఒకరికొకరు వెలుగును చూపించుకొనుచూ, మనల్ని మరియు ఒకరినొకరు మరింత క్షమించేవారిగా మరియు తక్కువ విమర్శించే వారిగా ఉండాలని ఆయన మనల్ని కోరుచున్నారు, తద్వారా మనం మొదటిసారి వస్తున్నా లేదా తిరిగి వస్తున్నా ఆయన సంఘం మన గృహంగా భావించే స్థలముగా ఉండగలదు.
నమ్మకం అనేది విశ్వాసం యొక్క చర్య. దేవుడు మనపై విశ్వాసముంచుతారు. అయినప్పటికీ, ఇప్పుడు చెప్పబోయే సందర్భాలలో మానవ విశ్వాసం దెబ్బతినవచ్చు లేదా విచ్ఛిన్నం కావచ్చు:
-
స్నేహితుడు, వర్తక సహచరుడు, లేదా మనం నమ్మిన వ్యక్తి నిజాయితీపరుడు కాక, మనల్ని బాధపెట్టి లేదా మన మంచితనాన్ని అన్యాయంగా వాడుకున్నప్పుడు.2
-
వివాహ భాగస్వామి నమ్మకద్రోహి యైనప్పుడు.
-
బహుశా అనుకోకుండా, మనం ప్రేమించే వ్యక్తి మరణం, గాయం, లేదా అనారోగ్యాన్ని పొందినప్పుడు.
-
మనము ఊహించని సువార్త ప్రశ్నను బహుశా సంఘ చరిత్ర లేదా సంఘ విధానానికి సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు, మరియు ఎవరైనా మన సంఘము ఏదో దాచిపెట్టిందని లేదా నిజం చెప్పలేదని ఎవరైనా చెప్పినప్పుడు.
ఇతర పరిస్థితులు తక్కువ నిర్దిష్టంగా ఉండవచ్చు కానీ అంతే ఆందోళనకరంగా ఉండవచ్చు.
బహుశా సంఘంలో మనల్ని మనం చూడలేకపోవచ్చు, మనము సరిపోమని భావించవచ్చు, ఇతరుల చేత విమర్శించబడినట్లు భావించవచ్చు.
లేదా, మనము అంచనాలకు తగినట్లు ప్రతిదాన్ని చేసినప్పటికీ, మనం అనుకున్న ఫలితాలు రాలేదు. పరిశుద్ధాత్మతో మనకు వ్యక్తిగత అనుభవాలు ఉన్నప్పటికీ, దేవుడు జీవిస్తున్నాడని లేదా సువార్త నిజమని మనకు ఇంకా తెలియనట్లు భావించవచ్చు.
ఆధునిక సమాజాన్ని మరియు మానవ సంబంధాలలో నమ్మకాన్ని పునరుద్ధరించవలసిన గొప్ప అవసరత ఉందని చాలా మంది నేడు భావిస్తున్నారు.3
నమ్మకం గురించి మనం ఆలోచించినప్పుడు, దేవుడు సత్యమైన దేవుడని మరియు “అబద్ధమాడలేడని”4 మనకు తెలుసు. సత్యమనగా, ప్రస్తుతము ఉన్నవిధముగా, గతములో ఉన్నవిధముగా, భవిష్యత్తులో ఉండబోవు విధముగా ఉన్న సంగతులు యొక్క జ్ఞానము అని మనకు తెలుసు.5 మారుతున్న పరిస్థితులకు, మారని సత్యానికి కొనసాగుతున్న బయల్పాటు మరియు ప్రేరణ సరిపోతుందని మనకు తెలుసు.
ఉల్లంఘించబడిన నిబంధనలు విరిగిన హృదయాలకు దారితీస్తాయని మనకు తెలుసు. “నేను తెలివి తక్కువ పనులు చేశాను,” అని అతడు అంటాడు. “ఎప్పటికైనా నువ్వు నన్ను క్షమించగలవా?” భార్యాభర్తలు చేతిలో చెయ్యివేసి, మరలా నమ్మాలని ఆశిస్తూ ఉండవచ్చు. వేరొక సందర్భములో, జైలు ఖైదీ ఇలా ఆలోచిస్తాడు, “నేను జ్ఞాన వాక్యాన్ని పాటించి ఉంటే, ఇక్కడ ఉండేవాడను కాను.”
ప్రభువు యొక్క నిబంధన మార్గంలో ఆనందం మనకు తెలుసు మరియు ఆయన సంఘంలో సేవ చేయడానికి ఇవ్వబడే పిలుపులు, మనకు మరియు ఒకరినొకరి కొరకు దేవుని విశ్వాసం మరియు ప్రేమను అనుభవించడానికి ఆహ్వానాలు. ఒంటరి యువజనులతో సహా సంఘ సభ్యులు, సంఘమంతటా మరియు మన సమాజాలలో క్రమం తప్పకుండా సేవ చేస్తారు.
ప్రేరేపణ ద్వారా, బిషప్పు ఒక యువ దంపతులను వార్డు నర్సరీలో సేవ చేయడానికి పిలుస్తారు. మొదట, భర్త మూలలో కూర్చుని, నిర్లిప్తంగా మరియు దూరంగా ఉంటాడు. క్రమంగా, అతడు పిల్లలతో నవ్వడం ప్రారంభిస్తాడు. తరువాత, దంపతులు కృతజ్ఞతలు తెలుపుతారు. ఇంతకుముందు, భార్యకు పిల్లలు కావాలి కానీ భర్తకు ఇష్టం లేదని వారు చెప్తారు. ఇప్పుడు, సేవ చేయడం వారిని మార్చి, ఏకం చేసింది. ఇది వారి వివాహములో మరియు గృహములో పిల్లల యొక్క ఆనందాన్ని కూడా తీసుకువచ్చింది.
మరొక నగరంలో, ఒక యౌవన తల్లి వార్డు ఉపశమన సమాజ అధ్యక్షురాలిగా పనిచేయడానికి పిలువబడినప్పుడు చిన్న పిల్లలు కలిగియున్న ఆమె మరియు ఆమె భర్త ఆశ్చర్యానికి గురి అవుతారు మరియు ముంచివేయబడినట్లు భావిస్తారు, కానీ అంగీకరిస్తారు. కొంతకాలం తర్వాత, మంచు తుఫానులు విద్యుచ్ఛక్తి కోతవలన అంగడి అల్మారాలు ఖాళీ చేయబడ్డాయి మరియు ఇళ్ళను మంచు డబ్బాల వలె చల్లగా చేసాయి. వారికి విద్యుచ్ఛక్తి మరియు ఉష్ణం ఉన్నందున, ఈ యువ కుటుంబం తుఫానును తట్టుకోవడానికి అనేక కుటుంబాలను మరియు వ్యక్తులను తమ ఇంటిలోనికి ఉదారంగా ఆహ్వానిస్తారు.
మనం విశ్వాసంతో కష్టమైన పనులు చేసినప్పుడు నమ్మకం నిజమవుతుంది. సేవ మరియు త్యాగం సామర్థ్యాన్ని పెంచుతాయి మరియు హృదయాలను మెరుగుపరుస్తాయి. దేవునియందు మరియు ఒకరినొకరియందు నమ్మకము పరలోకపు దీవెనలను తెస్తాయి.
క్యాన్సర్ నుండి బయటపడిన తరువాత, నమ్మకమైన సహోదరుడు కారు చేత కొట్టబడ్డాడు. అతడు తన గురించి జాలిపడే బదులు, “ఈ అనుభవం నుండి నేను ఏమి నేర్చుకోగలను?” అని ప్రార్థనాపూర్వకంగా అడుగుతాడు. తన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో, తన భర్త మరియు పిల్లల కోసం ఆందోళన చెందుతున్న ఒక నర్సును గమనించడానికి అతడు ప్రేరేపించబడ్డాడు. బాధలో ఉన్న రోగి దేవునిని నమ్మి ఇతరులకు చేరువైనప్పుడు సమాధానాలు కనుగొంటాడు.
తన స్టేకు అధ్యక్షుడి కార్యాలయం వెలుపల అశ్లీలచిత్రాల గురించి ఆందోళనలో ఉన్న సహోదరుడు వేచి ఉన్నప్పుడు, స్టేకు అధ్యక్షుడు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి ప్రార్థిస్తాడు. “తలుపు తెరిచి అతడిని లోపలికి అనుమతించుము” అని స్పష్టమైన మనోభావం కలుగుతుంది. దేవుడు సహాయం చేస్తాడనే విశ్వాసం మరియు నమ్మకంతో, ఆ యాజకత్వ నాయకుడు తలుపు తెరిచి సహోదరుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఇద్దరూ దేవుని కొరకు మరియు ఒకరికొకరు రూపాంతరము చేయు ప్రేమను, నమ్మకాన్ని భావిస్తారు. బలపర్చబడిన, సహోదరుడు పశ్చాత్తాపపడటం మరియు మార్పుచెందడం ప్రారంభించగలడు.
మన పరిస్థితులు వ్యక్తిగతమైనప్పటికీ, సువార్త సూత్రాలు మరియు పరిశుద్ధాత్మ మరలా ఇతరులను ఎలా, ఎప్పుడు మరియు అసలు నమ్మాలా వద్దా అని తెలుసుకోవడానికి మనకు సహాయపడతాయి. నమ్మకద్రోహం లేదా మోసం చేయబడినప్పుడు, నిరాశ మరియు భ్రమనిజమైనవిగా ఉంటాయి; అదేవిదంగామానవ సంబంధాలపై తిరిగినమ్మడానికి ఎప్పుడు విశ్వాసం మరియు ధైర్యం అవసరమో వివేచించవలసిన అవసరమున్నది.
అయినప్పటికీ, దేవునికి మరియు వ్యక్తిగత బయల్పాటుకు సంబంధించి, “మీరు ఎవరిని సురక్షితంగా నమ్మవచ్చోనని ఆశ్చర్యపోనవసరం లేదు”6 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ హామీ ఇచ్చారు. మనం ఎల్లప్పుడూ దేవుడిని నమ్మగలము. ప్రభువు మనల్ని మనము బాగా ఎరుగును మరియు మనల్ని మనం తెలుసుకోవడం లేదా ప్రేమించడం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆయన అనంతమైన ప్రేమ మరియు భూత, వర్తమాన, భవిష్యత్ కాలము గురించి పరిపూర్ణ జ్ఞానం ఆయన నిబంధనలను, వాగ్దానాలను స్థిరంగా మరియు ఖచ్చితంగా చేస్తాయి.
“కొంతకాలమైన తరువాత”7 అని లేఖనాలు చెప్పే దానిని నమ్మండి. దేవుని యొక్క దీవెన, కాలగమనము, నిరంతర విశ్వాసం మరియు విధేయతతో, మనం దృఢనిశ్చయమును మరియు శాంతిని కనుగొనవచ్చు.
ప్రభువు ఓదార్చును:
“సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.”8
“మీ భారాన్ని ప్రభువుపై వేయండి మరియు ఆయన నిరంతర సంరక్షణను నమ్మండి.”9
“పరలోకము స్వస్థపరచలేని దుఃఖం భూమిపైన ఏదీ లేదు.”10
దేవుడు11 మరియు ఆయన అద్భుతాలను నమ్మండి. మనం మరియు మన సంబంధాలు మారవచ్చు. ప్రభువైన క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా, మనం మన స్వార్థపూరిత సహజ స్వభావాన్ని విసర్జించి, సాత్వీకము, వినయము12, విశ్వాసమునిండి మరియు తగిన నమ్మకము గల దేవుని బిడ్డగా మారగలము. మనం పశ్చాత్తాపపడినప్పుడు, మన పాపాలను ఒప్పుకొని, విడిచిపెట్టినప్పుడు, ప్రభువు వాటిని ఇకపై జ్ఞాపకముంచుకోరని సెలవిచ్చారు.13 ఆయన మరచిపోతారని కాదు; బదులుగా, విశేషమైన రీతిలో, ఆయన వాటిని జ్ఞాపకముంచుకోకూడదని ఎంచుకుంటారు, కాబట్టి మనము కూడా జ్ఞాపకముంచుకోవలసిన అవసరం లేదు.
తెలివిగా వివేచించడానికి దేవుని ప్రేరణను నమ్మండి. అయితే “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి”15 అని ప్రభువు చెప్పినట్లుగా మనం తప్పకుండా14 ఇతరులను సరైన సమయంలో మరియు మార్గంలో క్షమించగలము.
కొన్నిసార్లు మన హృదయాలు బహుగా విరిగి నలిగినప్పుడు, మనము పరిశుద్ధాత్మ యొక్క ఓదార్పును, నడిపింపును పొందడానికి ఎక్కువ తెరవబడియున్నాము.16 ఖండించడం మరియు క్షమించడం రెండూ తప్పును గుర్తించడం ద్వారా ప్రారంభమవుతాయి. తరచుగా, ఖండించడం అనేది గతం మీద దృష్టి పెడుతుంది. క్షమాపణ భవిష్యత్తు కోసం స్వేచ్ఛగా కనిపిస్తుంది. “లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.”17
“క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?” అని అపొస్తలుడైన పౌలు అడుగును. “మరణమైనను జీవమైనను, … ఎత్తయినను లోతైనను, …మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను”18 అని ఆయన సమాధానమిచ్చును. అయినప్పటికీ, దేవుడు మరియు యేసు క్రీస్తు నుండి మమ్మల్ని వేరు చేయగలవారు ఒకరు ఉన్నారు, ఆ ఒకరు ఎవరంటే మనమే. యెషయా చెప్పినట్లుగా, “మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను.”19
దైవిక ప్రేమ మరియు దైవిక చట్టం ద్వారా, మన ఎంపికలకు మరియు వాటి పర్యవసానాలకు మనము బాధ్యత వహిస్తాము. కానీ మన రక్షకుని ప్రాయశ్చిత్త ప్రేమ “అనంతమైనది మరియు నిత్యమైనది.”20 మనం ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మనం “ఇంకా చాలా దూరంగా” 21 ఉన్నప్పుడు, దేవుడు మనల్ని స్వాగతించడానికి గొప్ప కరుణతో సిద్ధంగా ఉన్నాడు, తాను కలిగియున్న ఉత్తమమైన వాటిని సంతోషంగా అందిస్తున్నాడు.22
అధ్యక్షులు జె. రూబెన్ క్లార్క్ ఇలా అన్నారు, “మన పరలోక తండ్రి తన ప్రతి బిడ్డను కాపాడాలని కోరుచున్నాడని నేను నమ్ముచున్నాను, … ఆయన తన న్యాయము మరియు కరుణయందు మన చర్యలకు గరిష్ఠ ప్రతిఫలం ఇస్తాడు, ఆయనకు సాధ్యమైనదంతా మనకు ఇస్తాడు, మరియు దానికి వ్యతిరేకముగా, ఆయన విధించే జరిమానాను సాధ్యమైనంత తక్కువగా మనపై విధిస్తాడని నేను నమ్ముతున్నాను.”23
సిలువపై మన రక్షకుడు తన తండ్రికి దయతో చేసిన విన్నపం కూడా షరతులు లేని “తండ్రీ, వీరిని క్షమించు” కాదు, బదులుగా “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు”24 అనునదియే. మన కర్తృత్వము మరియు స్వేచ్ఛకు అర్థం ఉంది, ఎందుకంటే మనం ఎవరమో, మనకు ఏమి తెలుసో మరియు మనం చేసే పనులకు మనకు, దేవుని యెదుట జవాబుదారీగా ఉంటాము. కృతజ్ఞతపూర్వకంగా, మన ఉద్దేశాలు మరియు చర్యలను పరిపూర్ణంగా తీర్పుతీర్చడానికి మనం దేవుని పరిపూర్ణ న్యాయాన్ని మరియు పరిపూర్ణమైన కరుణను నమ్మగలము.
ఆయన యొద్దకు మరియు ఒకరినొకరురు ఇంటికి వచ్చినప్పుడు దేవుని కరుణతో మనము ప్రారంభించినట్లుగానే మనం ముగిస్తాము.
ఇద్దరు కుమారులు కలిగిన ఒక వ్యక్తి గురించి యేసు క్రీస్తు చెప్పిన ఉపమానం మీకు గుర్తుందా?25 ఒక కుమారుడు ఇంటిని విడిచివెళ్ళి, తన స్వాస్థ్యాన్ని వృధా చేశాడు. ఈ కుమారుడు తన తప్పు తెలుసుకున్నప్పుడు, ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నించాడు. మరొక కుమారుడు, “యిన్నియేండ్లనుండి” ఆజ్ఞలను పాటించాడని భావించి, తన సహోదరుడిని ఇంటికి ఆహ్వానించడానికి ఇష్టపడలేదు.26
సహోదర, సహోదరిలారా, మన హృదయాలను, మన అవగాహనను, కరుణ మరియు వినయాన్ని తెరువమని మరియు ఆ రెండు పాత్రలలో మనల్నిమనం చూడాలని యేసు అడుగుతున్నారని మీరు దయచేసి పరిగణిస్తారా?
మొదటి కుమారుడు లేదా కూమార్తెవలె, మనం దారితప్పి తిరుగుతూ ఉండవచ్చు, తర్వాత ఇంటికి తిరిగి రావాలని ప్రయత్నించుచుండవచ్చు. మనల్ని స్వాగతించడానికి దేవుడు వేచియున్నారు.
ఇతర కుమారుడు లేదా కుమార్తె వలె, మనమందరం ఆయనయొద్దకు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కలిసి ఆనందించమని దేవుడు మనల్ని మృదువుగా కోరుచున్నారు. మన జన సమూహములు, సమూహములు, తరగతులు మరియు ప్రోత్సాహకార్యక్రమాలు బహిరంగమైనవిగా, ప్రామాణికమైనవిగా, సురక్షితమైనవిగా—ప్రతి ఒక్కరికి గృహముగా ఉండేలా చేయాలని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. దయ, అవగాహన మరియు పరస్పర గౌరవంతో మనమందరం వినయంగా ప్రభువును వెదకుతాము మరియు అందరికీ పునఃస్థాపించబడిన సువార్త ఆశీర్వాదాలను స్వాగతిస్తాము.
మన జీవిత ప్రయాణాలు వ్యక్తిగతమైనవి, కానీ దేవునిపై, ఒకరినొకరిపై మరియు మనపై నమ్మకముంచడం ద్వారా మన తండ్రి మరియు ఆయన ప్రియ కుమారుని యొద్దకు మనం తిరిగి రాగలము.27 “భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని”28 యేసు సైగ చేయుచున్నారు. ప్రవక్తయైన జోసెఫ్ చేసినట్లుగానే, మన పరలోక తండ్రి సంరక్షణను మనం నిస్సంకోచంగా నమ్మెదము గాక.29 ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రియమైన స్నేహితుడా, దయచేసి నేడు ఆయన మీకు వాగ్దానమిచ్చు ఒక అద్భుతం— విశ్వాసం మరియు నమ్మకం కోసం మరలా చూడండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైన మరియు పవిత్రమైన నామములో, ఆమేన్.