2024 రండి, నన్ను అనుసరించండి
ఏప్రిల్ 8-14: “ప్రభువు మనతో కలిసి పనిచేయును.” జేకబ్ 5–7


“ఏప్రిల్ 8-14: ‘ప్రభువు మనతో కలిసి పనిచేయును.’ జేకబ్ 5–7,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“ఏప్రిల్ 8–14: జేకబ్ 5–7,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

చిత్రం
ఒలీవ చెట్ల తోటలో పని చేస్తున్న పురుషులు

Allegory of the Olive Tree [ఒలీవ చెట్టు ఉపమానము], బ్రాడ్ టియెర్ చేత

ఏప్రిల్ 8-14: “ప్రభువు మనతో కలిసి పనిచేయును”

జేకబ్ 5–7

యేసు క్రీస్తు సువార్తను ఇంకా వినని వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా ప్రభువు సంఘములో వారిని పోగుచేసే మహత్వపూర్ణమైన కార్యము గురించి ముంచివేయబడినట్లు భావిస్తే, జేకబ్ 5లో ఒలీవ చెట్ల గురించి జేకబ్ చెప్పినది తిరిగి అభయాన్నిచ్చే జ్ఞాపికను కలిగియుంది: తోట ప్రభువుకు చెందినది. ఆయన మనలో ప్రతీఒక్కరికి తన పనిలో సహాయపడడానికి ఒక చిన్న ప్రాంతాన్ని ఇచ్చారు—మన కుటుంబం, మన స్నేహితుల సమూహం, మనం ప్రభావం కలిగియుండగల ప్రదేశము. అలాగే, కొన్నిసార్లు సమకూర్చడానికి మనం సహాయపడే మొదటి వ్యక్తి మనమే. కానీ ఈ పనిలో మనం ఎప్పుడూ ఒంటరిగా లేము, ఎందుకంటే తోట యొక్క యజమాని తన సేవకులతో కలిసి పనిచేస్తున్నారు (జేకబ్ 5:72 చూడండి). దేవుడు ఆయన పిల్లలను యెరిగియుండి, వారిని ప్రేమిస్తారు మరియు గతంలో ఆయనను తిరస్కరించిన వారితో పాటు, వారిలో ప్రతీఒక్కరు ఆయన సువార్తను వినుటకు ఒక మార్గమును సిద్ధపరుస్తారు (జేకబ్ 4:15–18 చూడండి). ఆ తర్వాత, పని పూర్తయినప్పుడు, “[ఆయనతో] కలిసి పనిచేయుటలో శ్రద్ధగల వారందరూ… [ఆయన] తోట యొక్క ఫలము వలన [ఆయనతో] పాటు సంతోషం” కలిగియుందురు (జేకబ్ 5:75).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

జేకబ్ 5

యేసు క్రీస్తు తోట యొక్క యజమాని.

జేకబ్ 5 చిహ్నరూపకమైన అర్థము గల ఒక కథ. అది చెట్లు, ఫలము మరియు పనివారి గురించి వివరిస్తుంది, కానీ నిజానికి అది చరిత్ర అంతటా ఆయన జనులతో దేవుని సంభాషణల గురించినది. కాబట్టి మీరు మూలకథను చదివినప్పుడు, కథలో ఉన్న కొన్ని విషయాలు వేటికి చిహ్నంగా ఉన్నాయో ఆలోచించండి.

ఉదాహరణకు, తోట లోకాన్ని సూచిస్తే మరియు పెంపుడు ఒలీవ చెట్టు ఇశ్రాయేలును సూచిస్తే (లేదా దేవునితో నిబంధనలు చేసిన వారిని; జేకబ్ 5:3 చూడండి), అడవి ఒలీవ చెట్టు దేనిని సూచిస్తున్నది? మంచి మరియు చెడు ఫలము దేనిని సూచించవచ్చు? ఏ ఇతర చిహ్నాలను మీరు చూస్తున్నారు?

జేకబ్ 5 దేశాలు మరియు శతాబ్దాల ప్రపంచ చరిత్ర గురించి బోధిస్తున్నప్పటికీ, అది మీరు మరియు మీ జీవితం గురించినది కూడా. జేకబ్ 5లో మీ కొరకు మీరు ఏ సందేశాలను కనుగొంటారు?

జేకబ్ 5 యేసు క్రీస్తు గురించినది అనేది బహుశా అతి ముఖ్యమైనది. మీరు చదివినప్పుడు ఆయన కొరకు చూడండి. ఉదాహరణకు, 40– 41, 46–47 వచనాలలో ఆయన గురించి మీరేమి నేర్చుకుంటారు?

జేకబ్ 5 గురించి అదనపు అంతర్దృష్టుల కోసం, ఈ సారాంశము చివరనున్న రేఖాచిత్రాన్ని చూడండి.

చిత్రం
సెమినరీ చిహ్నము

జేకబ్ 5:61–75

ఆయన తోటలో ఆయనతో పాటు పని చేయమని ప్రభువు నన్ను ఆహ్వానిస్తున్నారు.

ప్రభువు తోటలోకి పిలువబడే “ఇతర సేవకులలో” (జేకబ్ 5:70) మీలాంటి వారు ఉన్నారు. ప్రభువు తోటలో పని చేయడం గురించి జేకబ్ 5లో, ముఖ్యంగా 61–62 మరియు 70–75 వచనాలలో మీరు ఏ సత్యాలను కనుగొంటారు? ఆయన పనిలో సహాయపడడం ద్వారా ఆయన గురించి మీరు ఏమి నేర్చుకున్నారు?

ప్రభువు తన తోటలో శ్రమించే “చివరిసారి” గురించి మీరు చదువుతున్నప్పుడు, “మీ శక్తితో” ప్రభువును సేవించడానికి ఏది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది? (జేకబ్ 5:71). ఉదాహరణకు, సువార్తను పంచుకోవడం, దేవాలయంలో సేవ చేయడం లేదా ఇతరులను బలోపేతం చేయడం వంటివాటి ద్వారా—తోట యొక్క యజమానిని సేవిస్తున్నప్పుడు మీరు ఆనందం పొందిన ఒక వ్యక్తిగత అనుభవం గురించి మీరు ఆలోచించవచ్చు. మీరు కలిసి “సరళముగా అందమైనది—అందంగా సరళమైనది” (లియహోనా, నవ. 2021, 47–50) అనే తన సందేశంలో ఎల్డర్ గ్యారీ ఈ. స్టీవెన్‌సన్ పంచుకున్న ఉదాహరణలను కూడా పరిశోధించవచ్చు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “ఏ సమయంలోనైనా మీరు చేసేది ఏదైనా అది తెరకు ఇరువైపుల ఎవరికైనా—దేవునితో నిబంధనలు చేయుట వైపు మరియు వారికి ఆవశ్యకమైన బాప్తిస్మపు నిబంధనలు, దేవాలయ నిబంధనలు పొందుట వైపు ఒక అడుగు వేయుటకు సహాయపడిన యెడల, ఇశ్రాయేలును సమకూర్చుటకు మీరు సహాయపడుతున్నట్లే. అది అంత సులువైనది” (“Hope of Israel” [worldwide youth devotional, June 3, 2018], ChurchofJesusChrist.org). ఇశ్రాయేలును సమకూర్చడంలో సహాయపడడానికి మీరు చేయగల ఉపాయాల జాబితాను ప్రారంభించడం గురించి ఆలోచించండి. మీ జాబితా నుండి, ఈ రోజు ఆయన తోటలో మీరు ఏమి చేయాలని ప్రభువు కోరుతున్నారని మీరు భావిస్తున్నారు? 75వ వచనము ప్రకారం, ఆయన తోటలో పనిచేసినందుకు ప్రభువు మనకెలా ప్రతిఫలమిస్తారు?

సిద్ధాంతాన్ని బోధించండి. మీ చర్చలు లేఖనాలలో ఉన్న ప్రాథమిక సిద్ధాంతంపై కేంద్రీకరించబడేలా నిశ్చయపరచండి. కలిసి లేఖనాలను చదవడం, ఆ తర్వాత మీరు కనుగొన్న సత్యాలను, అలాగే ఆ సత్యాలను జీవించడం వలన కలిగిన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా మీరు దీనిని చేయగలరు.

జేకబ్ 6:4-5

ప్రేమ మరియు దయతో ప్రభువు తన జనులను గుర్తుంచుకుంటారు.

హత్తుకొనియుండు అనే పదానికి గల ఒక అర్థము, ఏదైనా ఒకదానికి స్థిరంగా, దగ్గరగా మరియు కదలకుండా కట్టుబడియుండడం లేదా అంటుకొనియుండడం. ఆ నిర్వచనము మీరు జేకబ్ 6:4–5ను అర్థం చేసుకొనే విధానమును ఎలా ప్రభావితం చేస్తుంది? ఒలీవ చెట్టు కథలో, తోట యొక్క యజమాని “కనికరముగల తన బాహువును” ఎలా చాపారు? (ఉదాహరణకు, జేకబ్ 5:47, 51, 60–61, 71–72 చూడండి). ఆయన మీ కోసం దాన్ని ఎలా చేశారు?

జేకబ్ 7:1–23

యేసు క్రీస్తుపై నా విశ్వాసాన్ని ఇతరులు సవాలు చేసినప్పుడు నేను విశ్వాసంగా నిలిచియుండగలను.

షేర్రమ్‌తో నీఫైయుల అనుభవం ఈ రోజు తరచుగా పునరావృతమవుతుంది: క్రీస్తుపై విశ్వాసాన్ని నాశనం చేయడానికి జనులు ప్రయత్నిస్తున్నారు. అతని విశ్వాసంపై దాడి జరిగినప్పుడు జేకబ్ ఎలా స్పందించాడు? అతని ప్రతిస్పందనల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? రక్షకునిపై మీ విశ్వాసం సవాలు చేయబడే సమయాల కొరకు సంసిద్ధంగా ఉండడానికి మీరు ఇప్పుడు ఏమి చేయగలరు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

జేకబ్ 5

ప్రభువు తన జనుల పట్ల శ్రద్ధ కలిగియున్నారు.

  • మీ పిల్లలు అర్థం చేసుకోగలిగే విధానంలో ఒలీవ చెట్ల కథను మీరెలా పంచుకోగలరు? ఒక విధానము ఏమనగా, బయటకు నడిచివెళ్ళి ఒక చెట్టును చూసి, కథలోని ముఖ్యాంశాలను క్లుప్తంగా సమీక్షించడం. తోట యజమాని తన చెట్ల కోసం ఏమి చేసాడు? మనము కథలోని పనివారి వలె ఉండి, రక్షకుని ప్రేమను అనుభవించడంలో ఇతరులకు ఏవిధంగా సహాయపడగలము?

  • అతని జనులను క్రీస్తు యొద్దకు రమ్మని ఆహ్వానించడానికి జేకబ్ ఒలీవ చెట్ల కథను పంచుకున్నాడు. మీ పిల్లల కొరకు అది అలాగే చేయగలదు. బహుశా జేకబ్ 5:3–4, 28–29, 47 మరియు 70–72 వంటి వచనాలతో మీరు కథను సంక్షిప్తపరచవచ్చు. తర్వాత మీరు లేదా మీ పిల్లలు, చెట్లపై తోట యజమాని ఎంత శ్రద్ధ కలిగియున్నాడో చూపే విషయాల కొరకు చూస్తూ జేకబ్ 5:11, 41, 47 మరియు 72 చదువవచ్చు. ఆయన మనపట్ల శ్రద్ధ కలిగియున్నారని చూపడానికి రక్షకుడు ఏమి చేస్తారు?

జేకబ్ 6:4-5

పరలోక తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు మరియు నేను పశ్చాత్తాపపడినప్పుడు నన్ను క్షమిస్తారు.

  • మనం తప్పు ఎంపికలు చేసినప్పుడు మన కొరకు జేకబ్ 6:4–5 ఒక ముఖ్య సందేశాన్ని కలిగియుంది. మీ పిల్లలు దానిని కనుగొనడానికి మీరు సహాయపడవచ్చు. ఈ వచనాలలో ఉన్న ఏ పదాలు దేవుని విమోచన ప్రేమయందు మనకు నిరీక్షణనిస్తాయి? దేవుని రాజ్యములో రక్షింపబడడానికి మనమేమి చేయాలనే దాని గురించి జేకబ్ 6:4–5 మనకేమి బోధిస్తుంది?

జేకబ్ 7:1–23

సత్యమని నాకు తెలిసిన దాని కొరకు నేను పోరాడగలను.

  • జేకబ్ చేసినట్లుగా సత్యము కొరకు పోరాడడానికి మీ పిల్లలను మీరెలా ప్రేరేపించగలరు? సత్యమని అతనికి తెలిసిన దాని కొరకు జేకబ్ ఎలా పోరాడాడు? సత్యము కొరకు వారు పోరాడిన అనుభవాలను పంచుకోమని మీ పిల్లలను ఆహ్వానించండి లేదా మీ స్వంతవి పంచుకోండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ముద్రించు