2024 రండి, నన్ను అనుసరించండి
ఆగష్టు 5-11: “సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక.” ఆల్మా 39–42


“ఆగష్టు 5–11: ‘సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక.’ ఆల్మా 39–42,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“ఆగష్టు 5–11. ఆల్మా 39–42,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

చిత్రం
సమాధిని విడిచి వెళ్తున్న యేసు

He Is Risen [ఆయన లేచియున్నాడు], డెల్ పార్సన్ చేత

ఆగష్టు 5-11: “సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక”

ఆల్మా 39–42

మనము ప్రేమించే వారు ఎవరైనా ఒక తీవ్రమైన తప్పు చేసినప్పుడు, ఎలా స్పందించాలో తెలుసుకోవడం కష్టం కావచ్చు. ఆల్మా 39–42 ను చాలా విలువైనదిగా చేసే దానిలో కొంతభాగము ఏమిటంటే, క్రీస్తు యొక్క శిష్యునిగా—ఒకప్పుడు ఆల్మా పశ్చాత్తాపపడుటకు తన స్వంత దుఃఖకరమైన పాపములను కలిగియుండి—అటువంటి స్థితిని ఎలా సంభాళించాడని ఇది బయల్పరుస్తుంది. ఆల్మా కుమారుడైన కొరియాంటన్ లైంగిక పాపము చేసాడు మరియు ఆల్మా తన పరిచర్యలో అతడు నేర్చుకొనిన విధంగా, తన కుమారునికి నిత్య దృక్పథాన్ని ఇవ్వడానికి మరియు పశ్చాత్తాపమును ప్రోత్సహించడానికి నిజమైన సిద్ధాంతము యొక్క శక్తిని నమ్మాడు (ఆల్మా 4:19; 31:5 చూడండి). ఈ అధ్యాయాలలో, పాపమును ఖండించుటలో ఆల్మా యొక్క ధైర్యమును మరియు కొరియాంటన్ పట్ల అతని దయను, ప్రేమను మనము గమనిస్తాము. మరియు చివరిగా, రక్షకుడు “లోకము యొక్క పాపములను తీసివేయుటకు [మరియు] రక్షణ యొక్క సువర్తమానములను ప్రకటించుటకు వచ్చుననే” ఆల్మా యొక్క విశ్వాసమును మనము గ్రహిస్తాము (ఆల్మా 39:15). చివరకు కొరియాంటన్ పశ్చాత్తాపపడ్డాడని మరియు పరిచర్య కార్యమునకు తిరిగి వెళ్ళాడనే వాస్తవము( ఆల్మా 49:30 చూడండి), మన స్వంత పాపములు లేదా మనము ప్రేమించే వారి యొక్క పాపములను గూర్చి మనము కలతచెందినప్పుడు (ఆల్మా 42:29 చూడండి) క్షమాపణ మరియు విమోచన కొరకు మనకు నిరీక్షణనివ్వగలదు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆల్మా 39

చిత్రం
seminary icon
నేను లైంగిక పాపమును నివారించగలను.

ఆల్మా 39 లో అతని కుమారుడైన కొరియాంటన్‌కు ఆల్మా చేసిన ఉపదేశము, అశ్లీలతతో కలిపి లైంగిక పాపము యొక్క విధ్వంసకర ప్రభావాల గురించి నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. బహుశా అతి ముఖ్యమైనది ఏమిటంటే, పశ్చాత్తాపపడిన వారికి రక్షకుడు అందించే క్షమాపణ మరియు స్వస్థతను అర్థం చేసుకోవడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది. ఈ ప్రశ్నలు మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు సహాయపడవచ్చు:

  • పవిత్రత యొక్క చట్టమును అతిక్రమించడానికి కొరియాంటన్‌ను నడిపించిన తప్పిదములేవి? (ఆల్మా 39:2–4, 8–9 చూడండి). అతని చర్యల యొక్క పర్యవసానాలేవి? (5-13 వ చనాలు చూడండి). కొరియాంటన్ పశ్చాత్తాపపడ్డాడు అనడానికి మనకు గల సాక్ష్యమేమిటి? (ఆల్మా 42:31; 49:30; 48:18 చూడండి). ఈ అనుభవం నుండి రక్షకుని గురించి మీరేమి నేర్చుకుంటారు?

  • అశ్లీలత అంటే ఏమిటి, అది ఎందుకు ప్రమాదకరమైనది మరియు దానిని ఎదుర్కొన్నప్పుడు మీరేమి చేస్తారో అనేదాని గురించి మీ స్వంత వివరణను వ్రాయండి. (మత్తయి 5:27-28 మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 63:16 కూడా చూడండి.)

  • అశ్లీలతను నివారించడానికి మరియు పవిత్రత యొక్క చట్టాన్ని జీవించడానికి మీరెందుకు ఎంచుకున్నారో ఒక స్నేహితునికి మీరెలా వివరిస్తారు?

బ్రాడ్లీ ఆర్. విల్కాక్స్, “యోగ్యత అంటే లోపాలు లేకపోవడం కాదు,” లియహోనా, నవ. 2021, 61–67 కూడా చూడండి.

ఆల్మా 40–41

నేను మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది?

మరణించిన తర్వాత ఏమి జరుగుతుందనే దాని గురించి కొరియాంటన్‌ను కొన్ని ప్రశ్నలున్నాయి. అతని ఆందోళనలు ఆల్మా 40–41 లో కనుగొనబడు సూత్రాలను బోధించడానికి ఆల్మాను నడిపించాయి. మీరు చదివినప్పుడు, ఆత్మ లోకము, పునరుత్థానము మరియు తీర్పు గురించి మీరు కనుగొన్న సత్యముల యొక్క జాబితా చేయండి. కొరియాంటన్ వలె పశ్చాత్తాపపడవలసిన అవసరమున్న ఒకరి దృష్టికోణం నుండి ఈ అధ్యాయాలను చదవడాన్ని పరిగణించండి—ఎంతైనా, మనందరి విషయంలో అది నిజము.

ఆల్మా 40

యేసు క్రీస్తు నందు విశ్వాసముతో నా ప్రశ్నలకు నేను జవాబులను వెదకగలను.

ప్రవక్తలకు ప్రతీ సువార్త ప్రశ్నకు జవాబులు తెలుసని కొన్నిసార్లు మనము అనుకోవచ్చు. కానీ 40వ అధ్యాయము లో ఆల్మా జవాబివ్వబడని ప్రశ్నలు కలిగియున్నాడని గమనించండి. జవాబులు కనుగొనడానికి అతడు ఏమి చేసాడు? అతనికి జవాబులు తెలియనప్పుడు అతడు ఏమి చేసాడు? ఆల్మా యొక్క మాదిరి మీకెలా సహాయపడగలదు?

చిత్రం
ప్రార్థిస్తున్న స్త్రీ

సువార్త ప్రశ్నలకు మనము జవాబులు కనుగొనగల ఒక విధానము ప్రార్థన

ఆల్మా 42

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము విమోచనను సాధ్యము చేస్తుంది.

పాపముల కొరకు శిక్ష న్యాయమైనది కాదని కొరియాంటన్ నమ్మాడు (ఆల్మా 42:1 చూడండి). ఆల్మా 42 లో, అతని ఆందోళనకు ఆల్మా ఎలా స్పందించాడు? ఈ అధ్యాయములోని గద్యభాగాలను మీరు రెండు సముదాయాలుగా ఏర్పాటు చేయవచ్చు: “దేవుడు న్యాయవంతుడు” మరియు “దేవుడు దయామయుడు.” రక్షకుని ప్రాయశ్చిత్తము న్యాయము మరియు కనికరము రెండింటిని ఎలా సాధ్యపరుస్తుంది?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 39:1, 10-11

నా మంచి మాదిరి ఇతరులను క్రీస్తు యొద్ద నడిపించగలదు.

  • మంచి మాదిరిగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను మీ పిల్లలు గ్రహించడానికి కొరియాంటన్‌కు ఆల్మా ఇచ్చిన ఉపదేశము సహాయపడగలదు. ఆల్మా 39:1 ను కలిసి చదవడాన్ని పరిగణించండి. కొరియాంటన్ సహోదరుడు షిబ్లోన్ ఏవిధంగా ఒక మంచి మాదిరిగా ఉన్నాడు? ఆల్మా 38:2– 4 లో ఈ ప్రశ్నకు అదనపు జవాబులను మీ పిల్లలు కనుగొనవచ్చు.

  • మీరు ఒక ఆట కూడా ఆడవచ్చు, దానిలో మీరు, మీ పిల్లలు వంతులవారీగా ఒకరినొకరు అనుసరించవచ్చు లేదా అనుకరించవచ్చు. మన చర్యలు మంచి ఎంపికలు చేయడానికి ఇతరులకు ఎలా సహాయపడవచ్చో వివరించడానికి ఈ ఆటను ఉపయోగించండి. వారు ఒక మంచి మాదిరిగా ఉండగల విధానాలను ఆలోచించడానికి మీ పిల్లలకు సహాయపడండి.

  • ఒక ఫ్లాష్‌లైటు లేదా సూర్యుని చిత్రముతో వెలుగును మీరు ఒక మంచి మాదిరి యొక్క శక్తితో పోల్చవచ్చు. మీరు, మీ పిల్లలు మంచి పనులు చేస్తున్న యేసు యొక్క చిత్రాలను కూడా చూడవచ్చు మరియు ఆయన మనకోసం ఏర్పరచిన మాదిరి గురించి మాట్లాడవచ్చు.

ఆల్మా 39:9-13

యేసు క్రీస్తు మూలంగా, నేను తప్పులు చేసినప్పుడు నేను పశ్చాత్తాపపడగలను.

  • అతని పాపముల స్వభావం గురించిన వివరాలలోకి వెళ్ళకుండా, కొరియాంటన్ తప్పు ఎంపిక చేసాడని వివరించండి. అతనికి సహాయపడేందుకు మనమేమి చెప్పగలము? ఆల్మా 39 ను మీ పిల్లల కొరకు చదవడాన్ని పరిగణించండి మరియు పశ్చాత్తాపపడడం, విడిచిపెట్టడం అంటే అర్థమేమిటో గ్రహించడానికి వారికి సహాయపడండి. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా పశ్చాత్తాపము సాధ్యమని సాక్ష్యమివ్వండి.

  • పశ్చాత్తాపము యొక్క ఆనందాన్ని వివరించడానికి ఇక్కడ ఒక వస్తుపాఠము ఉంది: ఒక తప్పు చేసి, బాధపడుతున్న ఒకరి గురించి మీరు ఒక కథ చెప్తుండగా పట్టుకోమని ఏదైనా బరువైన వస్తువును ఒక బిడ్డకు ఇవ్వండి. ఆ వస్తువు మనం తప్పు చేసినప్పుడు మనం పడే బాధ వలె ఉందని మీ పిల్లలకు చెప్పండి. మనం పశ్చాత్తాపపడినప్పుడు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు ఆ బరువును, బాధను తీసివేసి, మంచిగా ఉండేందుకు మనకు సహాయపడగలరని మీరు సాక్ష్యమిచ్చినప్పుడు బిడ్డ దగ్గర నుండి ఆ బరువైన వస్తువును తీసుకోండి.

ఆల్మా 40:6–7, 11–14, 21–23

మనం మరణించిన తర్వాత, పునరుత్థానము మరియు తీర్పు వరకు మన ఆత్మలు ఆత్మ లోకానికి వెళ్తాయి.

  • మరణించిన తర్వాత మనకు ఏమి జరుగుతుందని ఆశ్చర్యపోవడం సహజం. ప్రేరణనిచ్చు జవాబులను కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు మీరేమి చేయగలరు? విడివిడి కాగితపు ముక్కల మీద మీరు మరణము, ఆత్మ లోకము (పరదైసు మరియు ఆత్మ చెరసాల), పునరుత్థానము మరియు తీర్పు అని వ్రాయవచ్చు. ఈ పదాలకు అర్థాలను గ్రహించడానికి మీ పిల్లలకు సహాయపడండి. మీరు ఆల్మా 40:6–7, 11–14, 21–23 ను కలిసి చదివినప్పుడు, ఈ వచనాలలో ఆ పదాలు వచ్చిన క్రమంలో వాటిని మీ పిల్లలు పెట్టవచ్చు.

  • ఆల్మా 40:6–7, 11–14, 21–23 ను పరిశోధించడం ద్వారా ప్రశ్నలకు జవాబులు కనుగొనడం నుండి పెద్ద పిల్లలు లాభం పొందగలరు. ఈ వచనాలలో జవాబివ్వబడగల ప్రశ్నలు, “నేను పునరుత్థానం చెందినప్పుడు నా శరీరం ఎలా ఉంటుంది?” వంటివి మీ పిల్లలను అడగడం గురించి ఆలోచించండి. తగిన వచనాలలో జవాబుల కొరకు వెదకడానికి వారిని ఆహ్వానించండి.

    చిత్రం
    మరియ మరియు యేసు

    Mary and the Resurrected Lord [మరియ మరియు పునరుత్థానుడైన ప్రభువు], హ్యారీ ఆండర్సన్ చేత

  • మరణించిన వారెవరినైనా మీ పిల్లలు ఎరుగుదురా? ఆ వ్యక్తి గురించి సంక్షిప్తంగా మీరు మాట్లాడవచ్చు. ఏదో ఒకరోజు ఆమె లేదా అతడు—మరియు ప్రతీఒక్కరు—యేసు క్రీస్తు మూలంగా పునరుత్థానం చెందుతారని మీ సాక్ష్యము చెప్పండి. అవసరమైతే, పునరుత్థానం చెందడమంటే ఏమిటో వివరించడానికి ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీని ఉపయోగించండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
ఆల్మా మరియు కొరియాంటన్

This My Son [ఈయన నా కుమారుడు], ఎల్స్‌పెత్ కెయిట్లిన్ చేత

ముద్రించు