2024 రండి, నన్ను అనుసరించండి
ఆగష్టు 19-25: “ఆయన ఆశ్చర్యకరమైన శక్తిచేత రక్షింపబడిరి.” ఆల్మా 53–63


“ఆగష్టు 19-25: ‘ఆయన ఆశ్చర్యకరమైన శక్తిచేత రక్షింపబడిరి.’ ఆల్మా 53-63,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“ఆగష్టు 19-25. ఆల్మా 53-63,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024

చిత్రం
రెండు వేలమంది యౌవన యోధులు

Two Thousand Young Warriors [రెండు వేలమంది యౌవన యోధులు], ఆర్నాల్డ్ ఫ్రీబర్గ్ చేత

ఆగష్టు 19-25: “ఆయన ఆశ్చర్యకరమైన శక్తిచేత రక్షింపబడిరి”

ఆల్మా 53–63

లేమనీయుల సైన్యములతో పోల్చినప్పుడు, యౌవనులతో కూడిన హీలమన్ యొక్క “చిన్న సైన్యము” (ఆల్మా 56:33) ఎదురు నిలిచే అవకాశమే లేదు. సంఖ్యలో కొద్దిగా ఉండడమే కాకుండా, హీలమన్ సైనికులు “అందరు మిక్కిలి యౌవనులు” మరియు “వారెన్నడును యుద్ధము చేయలేదు” (ఆల్మా 56:46–47). సాతానుకు మరియు లోకంలోని చెడు శక్తులకు వ్యతిరేకంగా మన కడవరి దిన యుద్ధంలో కొన్నిసార్లు మనలో పరిమితమైనవారిగా మరియు నిష్ఫలంగా భావించే వారికి కొన్ని విధాలుగా వారి పరిస్థితి పరిచయమైనదిగా అనిపించవచ్చు.

కానీ హీలమన్ సైన్యానికి లేమనీయుల కంటే కొన్ని ప్రయోజనాలున్నాయి, వాటికి, వారి సంఖ్యకు లేదా సైనిక నైపుణ్యాలకు సంబంధం లేదు. వారు తమను నడిపించేందుకు హీలమన్ అనే ప్రవక్తను ఎంచుకున్నారు (ఆల్మా 53:19 చూడండి); “వారు సందేహించని యెడల దేవుడు వారిని విడిపించునని వారి తల్లుల చేత వారు బోధింపబడిరి” (ఆల్మా 56:47); మరియు “వారికి బోధింపబడిన దానియందు వారు అధికమైన విశ్వాసము కలిగియుండిరి.” ఫలితంగా, వారు ”దేవుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తి” (ఆల్మా 57:26) చేత రక్షించబడిరి. కాబట్టి జీవితపు యుద్ధాలను ఎదుర్కొన్నప్పుడు, మనం ధైర్యం తెచ్చుకోగలము. “ఒక న్యాయవంతుడైన దేవుడున్నాడు మరియు సందేహించనివారు ఆయన ఆశ్చర్యకరమైన శక్తిచేత రక్షింపబడుదురు” (ఆల్మా 57:26) అని హీలమన్ సైన్యము మనకు బోధిస్తుంది.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆల్మా 53:10–22; 56:43–49, 55–56; 57:20–27; 58:39–40

చిత్రం
seminary icon
దేవుని యందు విశ్వాసం కలిగియుండడం భయాన్ని జయించడానికి నాకు సహాయపడుతుంది.

వారి విశ్వాసం వలన కాకపోయినట్లయితే, హీలమన్ యొక్క యువ సైనికులు భయపడేందుకు తగిన కారణం ఉండేది. కానీ వారి విశ్వాసం వలన, వారు ధైర్యంగా ఉండేందుకు మరి ఎక్కువ కారణం ఉంది. మీరు ఆల్మా 53–58 లో వారి గురించి చదివినప్పుడు, క్రీస్తునందు విశ్వాసముతో మీ భయాలను ఎదుర్కోవడానికి మీకు సహాయపడే విషయాల కొరకు చూడండి. క్రింది వచనాలపై దృష్టిసారించడాన్ని పరిగణించండి: ఆల్మా 53:10–22; 56:43–49, 55–56; 57:20–27; మరియు 58:39–40. మీరు కనుగొనిన దానిని నమోదు చేయడానికి ఈ పట్టిక సహాయపడగలదు.

హీలమన్ యొక్క యువ సైనికుల స్వభావాలు:

క్రీస్తు నందు వారి విశ్వాసం బలంగా ఉండడానికి సాధ్యమైన కారణాలు:

క్రీస్తు నందు విశ్వాసాన్ని సాధన చేయడానికి వారేమి చేసారు:

దేవుడు వారిని ఏవిధంగా దీవించారు:

మన ఆధ్యాత్మిక యుద్ధాలను గెలవడానికి మనకు కూడా యేసు క్రీస్తు యొక్క శక్తి అవసరము. ఆయన శక్తిని మీరు ఎలా పొందగలరు? అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశం “మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొ౦దుట” (లియహోనా, మే 2017, 39-42) లో జవాబుల కొరకు చూడండి. ఆయన సలహాను మీరు హీలమన్ సైనికులు చేసిన వాటితో పోల్చవచ్చు.

ఈ విషయాలను చదివిన తరువాత, మీ స్వంత ఆధ్యాత్మిక యుద్ధాల గురించి ఆలోచించండి. యేసు క్రీస్తు యందు మీ విశ్వాసాన్ని సాధన చేయడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారో వ్రాయండి.

నీల్ ఎల్. ఆండర్సెన్, “గాయపడినవారు,” లియహోనా, నవ. 2018, 83–86 కూడా చూడండి.

చిత్రం
వారి తల్లితో యువ సైనికులు

They Did Not Doubt [వారు సందేహించలేదు], జోసెఫ్ బ్రికీ చేత

ఆల్మా 58:1–12, 31–3761

యేసు క్రీస్తు యొక్క అనుచరులు సులభంగా మనస్తాపం చెందరు.

హీలమన్ మరియు పహోరన్‌లు మనస్తాపం చెందడానికి తగిన కారణాలున్నాయి. హీలమన్ తన సైన్యానికి తగినంత సహకారాన్ని అందుకోవడం లేదు మరియు ఆ సహకారాన్ని నిలిపివేసాడని మొరోనై చేత పహోరన్ తప్పుగా నిందించబడ్డాడు (ఆల్మా 58:4–9, 31–3260 చూడండి). ఆల్మా 58:1–12, 31–37 మరియు ఆల్మా 61 లో వారి స్పందనలలో మిమ్మల్ని ఆకట్టుకున్నదేమిటి? వారు ఈ విధంగా స్పందించారని మీరెందుకు అనుకుంటున్నారు?

పహోరన్‌ను సాత్వీకానికి ఒక మాదిరిగా చూపిస్తూ, “సాత్వీకము యొక్క మిక్కిలి అద్భుతమైన మరియు అర్థవంతమైన మాదిరులు రక్షకుని జీవితములో కనుగొనబడును” అని ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించారు (“సాత్వీకులు మరియు దీనులు,” లియహోనా, మే 2018, 32). రక్షకుడు సాత్వీకాన్ని ఎలా చూపించారో ధ్యానించండి. ఉదాహరణకు, మత్తయి 27:11–26; లూకా 22:41–42; యోహాను 13:4–17 చూడండి. ఆయన మాదిరిని మీరు ఎలా అనుసరించగలరు?

ఆల్మా 60:7-14

నా చుట్టూ ఉన్నవారిని ఉద్ధరించే బాధ్యత నాకు ఉంది.

నీఫైయుల సైన్యముల అవసరాలు తెలిసి అతడు నిర్లక్ష్యము చేసినట్లయితే, దేవుడు పహోరన్‌ను బాధ్యుడిని చేస్తారని మొరోనై వ్రాసాడు. అవసరంలో ఉన్నవారి పట్ల శ్రద్ధ చూపడం గురించి ఆల్మా 60:7–14 నుండి మీరేమి నేర్చుకుంటారు? ఇతరుల అవసరాలు బాగా తెలుసుకొని, వాటిని తీర్చడానికి మీరేమి చేయగలరు?

ఆల్మా 62:39-51

నేను వినయంగా ఉన్నట్లయితే, జీవితపు సవాళ్ళు నా హృదయాన్ని దేవుని వైపు మరల్చగలవు.

మీ శ్రమల చేత “మృదువుగా చేయబడడానికి” లేదా “కఠినంగా చేయబడడానికి” ఎలా ఎంచుకోగలరని మీరు ఆలోచించడానికి సహాయపడేందుకు ఒక పచ్చి గుడ్డును, ఒక బంగాళదుంపను మరుగుతున్న నీటిలో వేయండి. గుడ్డు మరియు బంగాళదుంప ఉడుకుతున్నప్పుడు, ఆల్మా 62:39–51 చదవండి మరియు లేమనీయులతో వారి సుదీర్ఘ యుద్ధము తర్వాత హీలమన్ యొక్క పరిచర్యకు జనులు ఎలా స్పందించారో గమనించండి. తర్వాత మీరు దీనిని 13 ఏళ్ళ క్రితం అతడు ప్రకటించిన దానికి వారు ఎలా స్పందించారనే దానితో పోల్చవచ్చు (ఆల్మా 45:20–24 చూడండి). నీఫైయులు అవే శ్రమల చేత భిన్నంగా ఎలా ప్రభావితం చేయబడ్డారు? గుడ్డు మరియు బంగాళదుంప పూర్తిగా ఉడికినప్పుడు, గుడ్డును పగులగొట్టండి మరియు బంగాళదుంపను కోయండి. మరుగుతున్న నీళ్ళు వాటిని వేర్వేరుగా ఎలా ప్రభావితం చేసాయి? శ్రమల పట్ల మన స్పందనను ఎలా ఎంచుకోగలము అనే దాని గురించి మీరేమి నేర్చుకుంటున్నారు? మీ శ్రమలలో మీరు దేవుని వైపు ఎలా తిరుగగలరు?

ఇంటిలోని అనుభవాలను వినియోగించండి. మీరు సంఘ తరగతికి బోధిస్తున్నట్లయితే, ఇంటిలో వారు నేర్చుకున్న వాటిని తరగతి సభ్యులతో పంచుకోమని అడగండి. ఉదాహరణకు, ఉడుకుతున్న గుడ్లు మరియు బంగాళదుంపల నుండి శ్రమలు మరియు వినయము గురించి వారు ఏమి నేర్చుకున్నారో కనుక్కోండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 53:20-21; 56:47-48

హీలమన్ యొక్క యువ సైనికుల వలె నేను దేవుని పట్ల విశ్వాసంగా ఉండగలను.

  • వారు హీలమన్ యొక్క సైన్యము వలె ఉండగల విధానాలను ఆలోచించడానికి ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ మీ పిల్లలకు సహాయపడగలదు. వారు ప్రారంభించడానికి ఆల్మా 53:20–21 నుండి యువ సైనికుల లక్షణాలలో కొన్నింటిని పంచుకోవడం గురించి ఆలోచించండి.

ఆల్మా 56:45–48; 57:21

నా తల్లిదండ్రులు నీతియందు బోధించిన దానిపట్ల నేను విశ్వాసంగా ఉండగలను.

  • హీలమన్ యొక్క యువ సైనికులు ఒక గొప్ప సవాలును ఎదుర్కొన్నప్పుడు, వారు తమ తల్లుల విశ్వాసం వైపు చూసారు. బహుశా మీరు పిల్లలతో కలిసి ఆల్మా 56:46–48 చదువవచ్చు మరియు విశ్వాసం గురించి ఈ యువకుల తల్లులు వారికి బోధించిన దాని కొరకు వినమని వారిని ఆహ్వానించవచ్చు. రక్షకుని గురించి—వారి తల్లిదండ్రులు—లేదా ఇతర విశ్వాసులైన పెద్దల నుండి వారు ఏమి నేర్చుకున్నారని మీరు వారిని అడగవచ్చు. “ఖచ్చితముగా” లోబడియుండడం ఎందుకు ముఖ్యము? (ఆల్మా 57:21).

  • మీరు—యువ సైనికుల తల్లుల వలె—దేవుని యందు మీ విశ్వాసాన్ని మీ పిల్లలు ఎరుగుదురని ఎలా నిశ్చయపరచగలరు? ఒక విధానము, మీ విశ్వాసం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పంచుకోవడం. ఉదాహరణకు, మీరు “సందేహించనప్పుడు” ఆయన మిమ్మల్ని ఎలా “విడిపించారు”?

చిత్రం
తన కుమారునికి బోధిస్తున్న తల్లి

Seed of Faith [విశ్వాసపు విత్తనము], జే వార్డ్ చేత

ఆల్మా 53:10-18

పరలోక తండ్రితో నా నిబంధనలను నేను పాటించగలను.

  • ఒకరు వారితో ఒక వాగ్దానం చేసి, దానిని నిలబెట్టుకున్న సమయం గురించి మీ పిల్లలు మాట్లాడగలుగవచ్చు. వాగ్దానం నిలబెట్టుకోబడినప్పుడు వారెలా భావించారు? మీరు ఆల్మా 53:10–18 చదువవచ్చు మరియు హీలమన్, అమ్మోన్ యొక్క జనులు మరియు అమ్మోన్ జనుల యొక్క కుమారులు ఎలా వాగ్దానాలు లేదా నిబంధనలు చేసి, పాటించారో అనేదాని కొరకు చూడమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. మీ నిబంధనలను మీరు పాటించినప్పుడు పరలోక తండ్రి మిమ్మల్ని ఏవిధంగా దీవిస్తారో పంచుకోవచ్చు.

ఆల్మా 61:3-14

నేను కోపంగా ఉండకూడదని ఎంచుకోగలను.

వారు చేయని దానికి వారు నిందించబడిన సమయం గురించి ఆలోచించమని మీ పిల్లలను ఆహ్వానించడాన్ని పరిగణించండి. పహోరన్‌కు ఇలా ఎలా జరిగిందో వారికి చెప్పండి (ఆల్మా 60–61 చూడండి). పహోరన్ ఎలా స్పందించాడో తెలుసుకోవడానికి, వంతులవారీగా ఆల్మా 61:3–14 నుండి వచనాలను చదవండి. మొరోనై అతడిని నిందించినప్పుడు పహోరన్ ఏమి చేసాడు? (మోషైయ 61:2–3, 8–9 చూడండి). రక్షకుని మాదిరి నుండి క్షమాపణ గురించి మనము ఏమి నేర్చుకుంటాము? (లూకా 23:34 చూడండి).

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
రెండు వేలమంది యౌవన యోధులు

It’s True, Sir, All Present and Accounted For [అయ్యా, ఇది నిజము, అందరు హాజరయ్యారు మరియు లెక్కించబడ్డారు], క్లార్క్ కెల్లీ ప్రైస్ చేత

ముద్రించు