2024 రండి, నన్ను అనుసరించండి
ఆగష్టు 12-18: “క్రీస్తు యొక్క విశ్వాసమందు నిలకడగా నిలిచియుండుము.” ఆల్మా 43–52


“ఆగష్టు 12-18: ‘క్రీస్తు యొక్క విశ్వాసమందు నిలకడగా నిలిచియుండుము.’ ఆల్మా 43-52,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“ఆగష్టు 12-18. ఆల్మా 43-52,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

మొరోనై మరియు స్వేచ్ఛాపతాకము

For the Blessings of Liberty [స్వేచ్ఛ యొక్క దీవెనల కొరకు], స్కాట్ ఎమ్. స్నో చేత

ఆగష్టు 12-18: “క్రీస్తు యొక్క విశ్వాసమందు నిలకడగా నిలిచియుండుము”

ఆల్మా 43–52

ఆల్మా 43వ అధ్యాయము యొక్క ప్రారంభమందు—“ఇప్పుడు నేను నీఫైయులు, లేమనీయుల మధ్య యుద్ధముల యొక్క వృత్తాంతమునకు తిరిగి వెళ్ళెదను” అను మాటలను మనము చదివినప్పుడు—అతడు పలకలపై పరిమితమైన స్థలమును కలిగియున్నప్పుడు ఈ యుద్ధ వృత్తాంతములను మోర్మన్ ఎందుకు చేర్చాడా అని ఆశ్చర్యపడడం సహజమే (మోర్మన్ వాక్యములు 1:5 చూడండి). కడవరి దినములలో మనము మన వంతు యుద్ధములు కలిగియుండుట యధార్థము, కానీ యుద్ధ వ్యూహము మరియు విషాదము యొక్క వర్ణనలకు మించి అతని మాటలలో విలువ ఉన్నది. అతని మాటలు ప్రతీరోజు చెడు శక్తులకు వ్యతిరేకంగా మనము పోరాడుచున్న యుద్ధము, “మనమందరం పాల్గొనవలసిన” యుద్ధము కొరకు కూడా మనల్ని సిద్ధపరుస్తాయి. ఈ యుద్ధము చాలా వాస్తవమైనది మరియు దీని ఫలితం మన నిత్య జీవితాలను ప్రభావితం చేస్తుంది. నీఫైయుల వలే, మనము ఒక శ్రేష్ఠమైన హేతువు చేత ప్రేరేపించబడ్డాము— “మన దేవుడు, మన మతము, స్వేచ్ఛ, మన శాంతి, మన భార్యలు మరియు మన పిల్లలు—మొరోనై దానిని “క్రైస్తవుల యొక్క ఉద్దేశ్యము” (ఆల్మా 46:12, 16) అని పిలిచాడు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆల్మా 43–52

నా ఆధ్యాత్మిక యుద్ధములందు యేసు క్రీస్తు నాకు సహాయపడగలరు.

ఆల్మా 43–52 ను మీరు చదివినప్పుడు, నీఫైయులు చేసింది ఏది వారిని సఫలము (లేదా విఫలము) చేసిందో గమనించండి. తరువాత మీ ఆధ్యాత్మిక యుద్ధములు గెలవడానికి మీకు సహాయపడేందుకు మీరు నేర్చుకొన్న దానిని మీరెలా ఉపయోగించగలరో ధ్యానించండి. మీ ఆలోచనలను క్రింద నమోదు చేయండి:

  • ఆల్మా 43:19: నీఫైయులు కవచముతో సిద్ధపడ్డారు. (ఆత్మీయ కవచముతో నన్ను నేను సిద్ధపరచుకోవడానికి నేను ప్రయాసపడగలను.)

  • ఆల్మా 43:23–24: వారు ప్రవక్త యొక్క నడిపింపును వెదికారు.

  • ఆల్మా 44:1-4:

  • ఆల్మా 45:1:

  • ఆల్మా 46:11-20:

  • ఆల్మా 48:7-9:

  • ఆల్మా 49:3, 12-14:

నీఫైయుల శత్రువుల ప్రయత్నాల నుండి మీరు ఏమి నేర్చుకోగలరో కూడా చూడండి. అదేవిధాలుగా సాతాను మిమ్మల్ని ఎలా ముట్టడి చేయవచ్చో ధ్యానించండి:

  • ఆల్మా 43:8: జారహెమ్న తన జనులకు కోపము రేకెత్తించుటకు ప్రయత్నించాడు, ఆవిధంగా అతడు వారిపై అధికారము కలిగియుండగలడు. (కోపములో పనిచేయుటకు సాతాను నన్ను శోధించవచ్చు.)

  • ఆల్మా 43:29:

  • ఆల్మా 46:10:

  • ఆల్మా 47:10-19:

రస్సెల్ ఎమ్. నెల్సన్, “విశ్వాసముతో భవిష్యత్తును హత్తుకోండి,” లియహోనా, నవ. 2020, 73–76 కూడా చూడండి.

లేమనీయులతో పోరాడుతున్న నీఫైయులు

మినర్వా టైఛర్ట్ (1888–1976), Defense of a Nephite City [నీఫైయుల పట్టణమును రక్షించుట], 1949–1951, కృత్రిమ చెక్కపై తైలవర్ణ చిత్రము, 36 x 48 అంగుళాలు. బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, 1969.

ఆల్మా 46:11–28; 48:7–17

సెమినరీ చిహ్నము
“క్రీస్తు యొక్క విశ్వాసమందు నిలకడగా నిలిచియుండుము.”

మీ జీవితంలో అపవాది శక్తిని మీరు తగ్గించాలనుకుంటున్నారా? “మొరోనై వలే” అగుటకు ఒక విధానం ఏమిటంటే ఆల్మా 48:17 లో ఉన్న ఉపదేశాన్ని అనుసరించడం. మీరు ఆల్మా 46:11–28; 48:7–17 చదివినప్పుడు, మొరోనైను వర్ణించే పదాల జాబితా చేయడం గురించి ఆలోచించండి. “క్రీస్తు యొక్క విశ్వాసమందు నిలకడగా నిలిచియుండడం” గురించి మొరోనై నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? (ఆల్మా 46:27).

“క్రైస్తవుల యొక్క ఉద్దేశ్యము”లో (ఆల్మా 46:11–22) ఇతరులను మొరోనై ఎలా ప్రేరేపించాడో కూడా మీరు అధ్యయనం చేయవచ్చు. ఆ ఉద్దేశ్యాన్ని మీరు ఎలా వర్ణిస్తారు? అందులో పాల్గొనడానికి మీరు ఏమి చేయగలరు? పాల్గొనడానికి మీరు ఇతరులను ఎలా ప్రేరేపించగలరు?

ఇతరులను ప్రేరేపించడానికి మొరోనై చేసిన ఒక పని స్వేచ్ఛ యొక్క పతాకాన్ని తయారుచేయడం, అది నీఫైయులను ప్రేరేపించడానికి సూత్రాలను నొక్కిచెప్పింది (12వ వచనము చూడండి). మన కాలములో మన సంఘ నాయకులు ఏ సూత్రాలను నొక్కి చెప్తున్నారు? మీరు వాటి కొరకు “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” యువతులు మరియు అహరోను యాజకత్వ సమూహము ఇతివృత్తాలు లేదా ఇటీవలి సర్వసభ్య సమావేశ సందేశాలలో చూడవచ్చు. అవి బోధించే వాటిని సరళమైన వ్యాఖ్యానాలుగా సంక్షిప్తపరచుకొని మీ స్వంత స్వేచ్ఛా పతాకాన్ని—రక్షకుడు మరియు ఆయన సువార్తకు యధార్థముగా నిలవడాన్ని మీకు గుర్తుచేసే దానిని మీరు తయారు చేసుకోవచ్చు.

ఆల్మా 47

సాతాను మనల్ని కొంచెం కొంచెంగా శోధిస్తాడు మరియు మోసగిస్తాడు.

మీరు పెద్ద పాపాలు చేయడానికి లేదా పెద్ద అబద్ధాలను నమ్మడానికి సమ్మతించరని సాతానుకు తెలుసు. కాబట్టి, నీతిగా జీవించడం యొక్క రక్షణ నుండి మిమ్మల్ని దూరంగా నడిపించివేయడానికి—మీరు అంగీకరిస్తారని అతడు అనుకున్నన్ని—సూక్ష్మమైన అబద్ధాలను మరియు చిన్న శోధనలను అతడు ఉపయోగిస్తాడు.

ఆల్మా 47 లో ఈ నమూనా కొరకు చూడండి మరియు సాతాను మిమ్మల్ని మోసగించడానికి ఎలా ప్రయత్నిస్తుండవచ్చో ధ్యానించండి. ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ నుండి ఈ అంతరార్థములను పరిగణించండి:

“మోసగాడైన అమలిక్యా లెహోంటిని ‘క్రిందికి రమ్మని‘ మరియు తనని కలుసుకోమని కోరాడు. కానీ లెహోంటి ఎత్తైన స్థలమును వదిలి వచ్చినప్పుడు, అతడు చనిపోయేంతవరకు ‘కొంచెము కొంచెము’ విషమివ్వబడ్డాడు మరియు అతడి సైన్యము అమలిక్యా స్వాధీనమైంది (ఆల్మా 47 చూడండి). వాదనలు మరియు నిందల ద్వారా, కొందరు జనులు ఉన్నతమైన స్థలమును వదిలివేయుటకు మనల్ని ఒప్పిస్తారు. ఉన్నతమైన స్థలమున్న చోట వెలుగు ఉంటుంది. … అది సురక్షితమైన స్థలము” (“Christian Courage: The Price of Discipleship,” Liahona, Nov. 2008, 74).

నెహెమ్యా 6:3; 2 నీఫై 26:22; 28:21–22 కూడా చూడండి.

ఆల్మా 50–51

ఐకమత్యము రక్షణను తెస్తుంది.

నీఫైయుల కవచం మరియు కోటలు ఉన్నప్పటికీ, త్వరలోనే లేమనీయులు వారి పట్టణాలలో అనేకమును స్వాధీనపరచుకొన్నారు (ఆల్మా 51:26–27 చూడండి). అది ఎలా జరిగింది? ఈ అధ్యాయాలను మీరు చదివినప్పుడు జవాబుల కొరకు చూడండి (ప్రత్యేకించి ఆల్మా 51:1–12 చూడండి). మీ కొరకు, మీ కుటుంబము కొరకు ఈ వృత్తాంతము ఏ హెచ్చరికలు కలిగియున్నదో ధ్యానించండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 43:17-21; 48:7-8; 49:1-5; 50:1–6

యేసు క్రీస్తు యొక్క సువార్తలో నేను ఆధ్యాత్మిక రక్షణను కనుగొనగలను.

  • ఆల్మా 43:19 లో నీఫైయుల కవచం గురించి మీరు చదివినప్పుడు, మన శరీరాలను రక్షించే కవచాన్ని మన ఆత్మలను రక్షించడానికి దేవుడు మనకిచ్చిన వాటితో మీరు పోల్చవచ్చు. మీరు, మీ పిల్లలు ఒక బిడ్డ యొక్క చిత్రాన్ని గీయవచ్చు మరియు మనల్ని ఆధ్యాత్మికంగా రక్షించేవి అని మీ పిల్లలు చెప్పగలిగిన ప్రతీదాని కొరకు కవచంలో ఒక ముక్కను ఆ చిత్రానికి జతచేయవచ్చు.

  • ఈ వచనాలు నీఫైయులు కట్టిన కోటలను వర్ణిస్తాయి: ఆల్మా 48:7-9; 49:1-9; 50:1–6. కలిసి ఈ వచనాలను చదివిన తర్వాత, మీ పిల్లలు కుర్చీలు మరియు దుప్పట్లు వంటివాటితో ఒక కోట కట్టడాన్ని ఆనందించవచ్చు.

ఆల్మా 46:11-16; 48:11–13, 16–17

మొరోనై వలె నేను “క్రీస్తు యొక్క విశ్వాసమందు స్థిరంగా” ఉండగలను.

  • స్వేచ్ఛ యొక్క పతాకం గురించిన కథను చెప్పడానికి ఈ సారాంశంలోని చిత్రాలను మీ పిల్లలు చూడవచ్చు (ఆల్మా 46:11–16 చూడండి). జనులు జ్ఞాపకముంచుకోవాలని మొరోనై కోరినది ఏమిటి (12వ వచనము చూడండి)? పరలోక తండ్రి మనమేమి జ్ఞాపకముంచుకోవాలని కోరుతున్నారు? ఈ విషయాలను గుర్తుంచుకోవడానికి వారికి సహాయపడే వాక్యభాగాలు లేదా చిత్రాలతో వారి స్వంత “స్వేచ్ఛ యొక్క పతాకాలను” బహుశా మీ పిల్లలు రూపొందించవచ్చు.

  • మొరోనై వలె “క్రీస్తు యొక్క విశ్వాసమందు స్థిరంగా” (ఆల్మా 48:13 చూడండి) ఉండడం గురించి మీ పిల్లలకు బోధించడానికి, ఏదైనా స్థిరమైన దానిని కనుగొని, ముట్టుకోవడానికి మీరు వారికి సహాయపడవచ్చు. విశ్వాసము “స్థిరంగా” ఉండడం అంటే అర్థమేమిటి? క్రీస్తు యందు తన విశ్వాసంలో మొరోనైని స్థిరంగా ఉంచినదేమిటో కనుగొనడానికి, కలిసి ఆల్మా 48:11– 12 ను చదవండి. “క్రీస్తు యొక్క విశ్వాసమందు స్థిరంగా” ఉండడానికి మనము ఏమి చేయగలము?

ఆల్మా 47:4-19

సాతాను మనల్ని కొంచెం కొంచెంగా శోధిస్తాడు మరియు మోసగిస్తాడు.

ఆల్మా 47:4–19 నుండి ఎంపిక చేసిన వచనాలను కలిసి చదవండి. మొదటి నుండి అతడు ప్రణాళిక చేసిన దానిని అమలిక్యా లెహోంటికి చెప్పినట్లయితే, ఏమి జరిగియుండేది? సాతాను మనల్ని మోసగించడానికి ఎలా ప్రయత్నిస్తాడనే దాని గురించి ఈ వచనాలు మనకేమి బోధిస్తాయి?

నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి మీ పిల్లలకు సహాయపడండి. తమ స్వంతంగా సువార్తను నేర్చుకోవడానికి సమర్థులుగా కొంతమంది పిల్లలు భావించకపోవచ్చు. వారి నమ్మకాన్ని పెంపొందించడానికి ఒక మార్గం వారు నేర్చుకోవడంలో పాల్గొన్నప్పుడు వారిని ప్రశంసించడం. ఈ సారాంశంలోని ప్రోత్సాహ కార్యక్రమాల్లో ఎక్కడ మీరు ఈ సలహాను అన్వయించగలరు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

స్వేచ్ఛ యొక్క పతాకమును పట్టుకున్న మొరోనై

Title of Liberty [స్వేచ్ఛ యొక్క పతాకము], లారీ కాన్రాడ్ విన్‌బర్గ్ చేత

© 2018 లారీ కాన్రాడ్ విన్‌బర్గ్ చేత