2024 రండి, నన్ను అనుసరించండి
సెప్టెంబరు 16-22: “నీ తల పైకెత్తి ఆనందించుము.” 3 నీఫై 1–7


“సెప్టెంబరు 16-22: ‘నీ తల పైకెత్తి ఆనందించుము.’ 3 నీఫై 1-7,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“సెప్టెంబరు 16-22. 3 నీఫై 1–7,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

రాత్రి లేని ఒక దినమును చూస్తున్న నీఫైయులు

One Day, One Night, and One Day [ఒక పగలు, ఒక రాత్రి మరియు ఒక పగలు], జార్జ్ కొక్కో చేత

సెప్టెంబరు 16-22: “నీ తల పైకెత్తి ఆనందించుము”

3 నీఫై 1–7

కొన్ని విధాలుగా, యేసు క్రీస్తు నందు విశ్వసించు వారిగా ఉండేందుకు ఇది ఉత్తేజకరమైన సమయముగా ఉండెను. ప్రవచనాలు నెరవేరుతున్నాయి—జనుల మధ్య గొప్ప సూచకక్రియలు మరియు అద్భుతములు త్వరలో రక్షకుడు జన్మించబోతున్నాడని సూచిస్తున్నాయి. మరొక ప్రక్క విశ్వాసులకు ఇది ఆందోళనకరమైన సమయముగా ఉండెను, ఎందుకంటే ఎన్ని అద్భుతాలు జరిగినప్పటికీ, రక్షకుడు పుట్టే “సమయము గతించిపోయినదని“ అవిశ్వాసులు పట్టుబట్టారు (3 నీఫై 1:5). ఈ జనులు “దేశమంతటా గొప్ప అలజడి సృష్టించారు” (3 నీఫై 1:7) మరియు సమూయేలు ప్రవక్త ద్వారా ఇవ్వబడిన సూచన—చీకటిలేని ఒక రాత్రి—కనిపించని యెడల, విశ్వసించిన వారందరిని చంపడానికి ఒక దినమును నియమించారు.

ఈ క్లిష్ట పరిస్థితులలో, ప్రవక్త నీఫై ”అతని జనుల నిమిత్తము తన దేవునికి బలముగా మొరపెట్టెను” (3 నీఫై 1:11). హింసను లేదా సందేహమును ఎదుర్కొంటూ, వెలుగు చీకటిని పారద్రోలునని తెలుసుకోవలసిన వారికి ఎవరికైనా ప్రభువు యొక్క సమాధానము ప్రేరణనిస్తుంది: “నీ తల పైకెత్తి ఆనందించుము; … నేను నా పరిశుద్ధ ప్రవక్తల నోటి ద్వారా పలుకబడునట్లు చేసిన ఆ సమస్తమును నెరవేర్చెదను” (3 నీఫై 1:13).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

3 నీఫై 1–7

యేసు క్రీస్తు యొక్క సువార్తకు పరివర్తన చెందడానికి సహనము మరియు ప్రయత్నము అవసరం.

ప్రభువుకు పరివర్తన చెందిన జనులు మరియు చెందని ఇతరుల గురించి 3 నీఫై 1–7 వివరిస్తుంది. ఈ సమూహాల మధ్య ఉన్న తేడా ఏమిటి? క్రింది వంటి పట్టిక మీ ఆలోచనలను క్రమములో పెట్టుటకు మీకు సహాయపడవచ్చు:

పరివర్తనను బలహీనపరిచే విషయాలు

పరివర్తనను బలపరిచే విషయాలు

3 నీఫై 1:5-11

ప్రవక్త యొక్క మాటలు నమ్మకుండా, నీతిమంతులను హేళన చేయడం

ప్రవక్త యొక్క మాటలయందు విశ్వాసము కలిగియుండి, సహాయం కొరకు ప్రార్థించడం

3 నీఫై 1:29-30

3 నీఫై 2:1-3

3 నీఫై 3:12-16

3 నీఫై 4:8-10, 30–33

3 నీఫై 6:13-18

3 నీఫై 7:15-22

మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు వ్యక్తిగత ప్రశ్నలు అడగండి. ఉదాహరణకు, ఈ పట్టికను పూర్తిచేస్తున్నప్పుడు, “ఇక్కడ నా కొరకు ఉన్న పాఠమేమిటి?” వంటి ప్రశ్నలను మీరు అడగవచ్చు. ఇది పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపణలను తెస్తుంది.

3 నీఫై 1:1-23

seminary icon
యేసు క్రీస్తు మూలముగా నేను “ఆనందించగలను.”

మీ జీవితంలో కష్టమైన, అలాగే భయపెట్టే క్షణాలు ఉంటాయని మీ పరలోక తండ్రికి తెలుసు. కానీ మీరు ఆనందాన్ని అనుభవించాలని కూడా ఆయన కోరుతున్నారు. విశ్వాసులైన నీఫైయులు భయపడవలసి రావడానికి గల కారణాల గురించి నేర్చుకోవడానికి 3 నీఫై 1:1–23 చదవండి. “ఆనందించడానికి” ప్రభువు వారికి ఇచ్చిన కారణమేమిటి?

“ఆనందించుము” అనే వాక్యభాగాన్ని రక్షకుడు అనేక సందర్భాలలో ఉపయోగించారు—ఉదాహరణకు, మత్తయి 14:24–27; యోహాను 16:33; సిద్ధాంతము మరియు నిబంధనలు 61:36; 78:17–19లో. ఈ ఆహ్వానాల గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? రక్షకుడు ఏ పరిస్థితులలో ఈ మాటలు చెప్పారో అర్థం చేసుకోవడానికి మీరు చుట్టుప్రక్కల ఉన్న వచనాలను చదువవచ్చు. ప్రతీ సందర్భములో, వారి భయాలను ఎదుర్కోవడానికి జనులకు సహాయపడేందుకు ఆయన ఇచ్చిన కారణాలేవి? ఆయన మీ కోసం దీన్ని ఎలా చేశారు?

3 నీఫై 1:4–21; 5:1–3

ప్రభువు తన మాటలన్నిటిని ఆయన యుక్తకాలములో నెరవేరుస్తారు.

3 నీఫై 1:4–7 చదవండి మరియు మీరు విశ్వాసులలో ఒకరైన యెడల మీరెలా భావించియుండవచ్చో ఆలోచించండి. వారి విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి వారేమి చేసారు? (3 నీఫై 1:4–21 మరియు 5:1–3 చూడండి). సమూయేలు మాటలు ఎలా నెరవేర్చబడ్డాయి? (3 నీఫై 1:19–21 చూడండి). మీ జీవితంలో ప్రభువు తన మాటలను ఎలా నెరవేర్చారు?

3 నీఫై 1:4-15; 5:12–26; 6:10–15; 7:15–26

నేను యేసు క్రీస్తు యొక్క శిష్యుడను.

“ఇదిగో, నేను యేసు క్రీస్తు యొక్క శిష్యుడను” (3 నీఫై 5:13) అని మోర్మన్ ప్రకటించాడు. ఈ వాక్యభాగము మీకు ఏ అర్థాన్ని కలిగియున్నది? క్రీస్తు యొక్క శిష్యుల లక్షణాలు, నమ్మకాలు మరియు క్రియల కొరకు చూస్తూ 3 నీఫై 1:4–15; 5:12–26; 6:10–15 మరియు 7:15–26 వెదకడాన్ని పరిగణించండి.

3 నీఫై 2:11-12; 3:1-26

నేను యేసు క్రీస్తు యందు విశ్వాసాన్ని సాధన చేసినప్పుడు, నేను భయపడనవసరం లేదు.

దొంగల ముఠాలతో నీఫైయుల అనుభవం మీరు ఎదుర్కొనే ఆధ్యాత్మిక ప్రమాదాలలో మీకు సహాయపడగల పాఠాలను కలిగియుండవచ్చు. 3 నీఫై 2:11–12 మరియు 3:1–26 లో ఈ పాఠాల కొరకు చూడండి. ఉదాహరణకు, 3 నీఫై 3:2–10 లో మీరు గిద్దియాన్హి మాటలను పరిశోధించవచ్చు మరియు వాటిని సాతాను మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే విధానాలతో పోల్చవచ్చు. లకోనియస్ మాదిరి నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

3 నీఫై 1:4-15, 19-21

యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఒక క్రొత్త నక్షత్రము కనిపించింది.

3 నీఫై 1:4-21

ప్రవక్తల మాటలు ఎల్లప్పుడూ నెరవేర్చబడతాయి.

  • మీరు, మీ పిల్లలు 3 నీఫై 1:4-10 చదివినప్పుడు, ఆ కాలములో జీవిస్తున్న విశ్వాసులలో ఒకరైయుండడం ఎలా అనిపించియుండవచ్చు అనేదాని గురించి మాట్లాడడానికి వారిని ఆహ్వానించండి. తర్వాత, 11-15 వచనాలలో మిగతా వృత్తాంతాన్ని వారు చదివినప్పుడు, వారు ఈ వాక్యాన్ని పూరించే విధానాలను సూచించవచ్చు: “నా కొరకు ఈ కథలోని పాఠమేదనగా …”

  • దేవుడు తన ప్రవక్త ద్వారా ఇచ్చిన తన వాగ్దానాలను నెరవేర్చిన ఇతర సమయాల గురించి ఆలోచించడానికి మీ పిల్లలు మీకు సహాయపడవచ్చు. దేవుని వాగ్దానాలు ఎలా నెరవేర్చబడ్డాయనే దానితో కలిపి, ఈ కథల గురించి వారికి తెలిసిన దానిని వారిని పంచుకోనివ్వండి. కలిసి 3 నీఫై 1:20 చదవండి మరియు ఈ సత్యాల గురించి మీ స్వంత సాక్ష్యాన్ని పంచుకోండి.

3 నీఫై 2:11-12; 3:13–14, 24–26

మనం కలిసి సమకూడినప్పుడు మనం బలంగా ఉంటాము.

  • నీఫైయులు ఎందుకు కలిసి సమకూడారు మరియు వారికి వచ్చిన దీవెనలేవి అనేదాని గురించి 3 నీఫై 2:11–12 మరియు 3:13–14, 24–26 లో కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. మన కుటుంబాలలో మరియు సంఘములో నేడు సమకూడడం మనకు ఎందుకు ముఖ్యమైనది?

  • ఐకమత్యము యొక్క బలము గురించి బోధించే ఒక వస్తుపాఠము మీకు తెలుసా? మీ పిల్లలు ఒక కట్టెను విరవడానికి, తర్వాత ఒక కట్టెల మోపును విరవడానికి లేదా ఒక కాగితపు ముక్కను చింపడానికి, తర్వాత కాగితాల కట్టను చింపడానికి ప్రయత్నించవచ్చు. మనము కట్టెలు లేదా కాగితాల వలె ఎట్లున్నాము?

3 నీఫై 5:12–26; 6:14; 7:15–26

నేను యేసు క్రీస్తు యొక్క శిష్యుడను.

  • కలిసి 3 నీఫై 5:13 చదివిన తర్వాత, “నేను యేసు క్రీస్తు యొక్క శిష్యుడను” అనే వాక్యభాగాన్ని పునరావృతం చేయడానికి మీ పిల్లలను ఆహ్వానించండి. యేసు క్రీస్తు యొక్క శిష్యుడు కావడమంటే అర్థమేమిటో నేర్చుకోవడానికి, ఈ మాదిరులలో కొన్నింటిని కలిసి చదవండి: పరివర్తన చెందిన లేమనీయులు (3 నీఫై 6:14 చూడండి), మోర్మన్ (3 నీఫై 5:12–26 చూడండి) మరియు నీఫై (3 నీఫై 7:15–26 చూడండి).

  • ఒక కాగితంపై మీ పిల్లలు వారి చేయి గుర్తును వేసి, దాని వెంట కత్తిరించేలా వారికి సహాయపడండి. “నేను యేసు క్రీస్తు యొక్క శిష్యుడను” అని ఒకవైపు వ్రాయండి మరియు శిష్యునిగా ఉండడానికి వారు చేయగల దానిని మరొకవైపు గీయమని వారిని ఆహ్వానించండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

రాత్రి లేని ఒక దినమును చూస్తున్న నీఫైయులు

A Day, a Night, and a Day [ఒక పగలు, ఒక రాత్రి మరియు ఒక పగలు], వాల్టర్ రానె చేత