“సెప్టెంబరు 9-15: ‘మహా సంతోషకరమైన సువర్తమానము.’ హీలమన్ 13-16,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)
“సెప్టెంబరు 9-15. హీలమన్ 13-16,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)
సెప్టెంబరు 9-15: “మహా సంతోషకరమైన సువర్తమానము”
హీలమన్ 13–16
లేమనీయుడైన సమూయేలు మొదటిసారి జరహేమ్లలో “సువర్తమానములు” (హీలమన్ 13:7) పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, కఠిన హృదయముగల నీఫైయుల చేత అతడు తిరస్కరించబడ్డాడు మరియు త్రోసివేయబడ్డాడు. సమూయేలు సందేశమును స్వీకరించకుండా నిరోధించుటకు వారి హృదయాల చుట్టూ ఒక అభేధ్యమైన గోడను వారు కట్టుకున్నట్లుగా అది ఉన్నదని మీరు చెప్పవచ్చు. తాను చెప్పిన సందేశము యొక్క ప్రాముఖ్యతను సమూయేలు గ్రహించాడు మరియు “అతడు తిరిగి వెనుకకు వెళ్ళవలెనని మరియు ప్రవచించవలెనని” (హీలమన్ 13:3) చెప్పిన దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించుట ద్వారా విశ్వాసమును రుజువు చేసాడు. సమూయేలు వలె, మనము “ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు” (హీలమన్ 14:9) మరియు ఆయన ప్రవక్తలను అనుసరించుటకు ప్రయాసపడినప్పుడు మనమందరము అడ్డుగోడలను ఎదుర్కొంటాము. సమూయేలు వలే, “ఆయన నిశ్చయముగా వస్తారని” మనము కూడా యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యము వహిస్తాము మరియు “ఆయన నామమందు విశ్వసించమని” (హీలమన్ 13:6; 14:13) అందరిని ఆహ్వానిస్తాము. అందరూ వినరు మరియు కొందరు చురుకుగా మనల్ని వ్యతిరేకించవచ్చు. కానీ, క్రీస్తునందు విశ్వాసముతో ఈ సందేశమును విశ్వసించువారు అది “మహా సంతోషకరమైన సువర్తమానము” (హీలమన్ 16:14) అని కనుగొంటారు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
ప్రభువు తన ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేస్తారు.
లేఖనాలలో, కొన్నిసార్లు ప్రవక్తలు అపాయములను గూర్చి హెచ్చరించడానికి గోడ లేదా గోపురముపై కావలికాసే వారితో పోల్చబడ్డారు (యెషయా 62:6; యెహెజ్కేలు 33:1–7 చూడండి). హీలమన్ 13లో మీరు సమూయేలు మాటలను చదువుతున్నప్పుడు, మీ కొరకు అతడు కావలివానిగా ఎలా ఉన్నాడో ఆలోచించండి. మన కాలానికి తగినట్లు అనిపించేలా అతడు ఏమి చెప్పాడు? ( ప్రత్యేకించి, 8, 21– 22, 26– 29, 31 మరియు 38 వచనాలు చూడండి). ఉదాహరణకు, పశ్చాత్తాపము గురించి, వినయము మరియు సంపద గురించి, “దుర్నీతిని జరిగించుటలో” సంతోషమును వెదకడం గురించి అతడు ఏమి బోధించాడు?
ఆధునిక ప్రవక్తల ద్వారా ప్రభువు ఇచ్చిన అటువంటి హెచ్చరికల కొరకు ఇటీవలి సర్వసభ్య సమావేశ సందేశాలను కూడా మీరు పరిశోధించవచ్చు. ఈ హెచ్చరికల గురించి మీరు ఏమి చేయడానికి ప్రేరేపించబడ్డారు?
పశ్చాత్తాపపడమని దేవుడు నన్ను ఆహ్వానిస్తారు.
దేవుని తీర్పుల గురించి సమూయేలు హెచ్చరికలలో పశ్చాత్తాపపడమనే దయగల ఆహ్వానం స్థిరంగా చేర్చబడింది. హీలమన్ 13–15 అంతటా ఈ ఆహ్వానముల కొరకు చూడండి (ప్రత్యేకించి, హీలమన్ 13:6–11; 14:15–19; 15:7–8 చూడండి). పశ్చాత్తాపము గురించి ఈ వచనముల నుండి మీరేమి నేర్చుకుంటారు? కొంతమంది పశ్చాత్తాపాన్ని బాధాకరమైన శిక్షగా—తప్పించుకోవలసిన దానిగా చూస్తారు. మీ అభిప్రాయములో, నీఫైయులు పశ్చాత్తాపాన్ని ఎలా చూడాలని సమూయేలు కోరుకున్నాడు?
మీ అధ్యయనాన్ని లోతుగా చేయడానికి, మీరు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశము “మనం ఉత్తమముగా చెయ్యగలము మరియు ఉత్తమముగా ఉండగలము” ( లియహోనా, మే 2019, 67) చదువవచ్చు. పశ్చాత్తాపాన్ని ఆయన ఎలా నిర్వచిస్తారు? మనఃపూర్వకమైన పశ్చాత్తాపము యొక్క ఏ దీవెనలను ఆయన సందేశంలో మీరు కనుగొంటారు? మనం మార్పు చేయాలని ప్రవక్త ఆహ్వానించిన నిర్దిష్టమైన విషయాల కొరకు కూడా మీరు చూడవచ్చు. మీరు ఏమి మార్పు చేయాలని పరిశుద్ధాత్మ మీకు చెప్తున్నారు? మీరు పొందే వ్యక్తిగత బయల్పాటును వ్రాసియుంచడం గురించి ఆలోచించండి.
కేవలం మీ ప్రవర్తనను మార్చుకోవడం నుండి పశ్చాత్తాపము ఏవిధంగా భిన్నంగా ఉంది? పశ్చాత్తాపపడమనే దేవుని ఆహ్వానాన్ని అంగీకరించడం ఎందుకు ముఖ్యమైనది?
రక్షకుని జననము మరియు మరణము గురించి సాక్ష్యమివ్వడానికి దేవుడు సూచకక్రియలను, అద్భుతాలను పంపారు.
హీలమన్ 14లో, జనులు “ఆయన నామమందు విశ్వసించు ఉద్దేశ్యము నిమిత్తము ఆయన రాక … గూర్చి తెలుసుకొందురని” (హీలమన్ 14:12) ప్రభువు రక్షకుని జననము మరియు మరణము యొక్క సూచకక్రియలను ఇచ్చారని సమూయేలు వివరించాడు. మీరు హీలమన్ 14 అధ్యయనము చేసినప్పుడు, 1–8 వచనములలో రక్షకుని జననము గూర్చిన సూచకక్రియలను మరియు 20–28 వచనములలో ఆయన మరణము గూర్చిన సూచకక్రియలను గమనించండి. ఈ సూచకక్రియలు యేసు క్రీస్తు యొక్క జననము మరియు మరణమును సూచించుటకు ప్రభావవంతమైన విధానములుగా ఎందుకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు?
మరింత వ్యక్తిగతమైన మరియు తక్కువ నాటకీయమైన ఇతర సూచకక్రియలు “[రక్షకుని] నామమందు విశ్వసించుటకు” మీకు సహాయపడగలవు. ఆయన యందు మీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన చేసినదేమిటి?
హీలమన్ 16:13–23 లోని సూచకక్రియలను గూర్చి ఏ హెచ్చరిక ఇవ్వబడింది? ఈ వచనములలో వివరించబడిన జనుల యొక్క వైఖరిని మీరు ఎలా మానగలరు?
ఆల్మా 30:43–52; రోనాల్డ్ ఎ. రాస్బాండ్, “దైవ ప్రణాళిక ద్వారా,” లియహోనా, నవ. 2017, 55–57 కూడా చూడండి.
ప్రభువు నుండి గద్దింపు ఆయన ప్రేమకు చిహ్నము.
సమూయేలు మాటలు అనేక దృఢమైన గద్దింపులను కలిగియున్నాయి, కానీ హీలమన్ 15:3 ప్రభువు నుండి గద్దింపు యొక్క విధానాన్ని మనకు ఇస్తుంది. ప్రభువు నుండి గద్దింపు ఏవిధంగా ఆయన ప్రేమకు చిహ్నముగా ఉన్నది? సమూయేలు యొక్క ప్రవచనాలు మరియు హెచ్చరికలలో ప్రభువు ప్రేమ మరియు దయ యొక్క ఏ సాక్ష్యాలను మీరు చూస్తారు?
మీ జీవితంలో ఈ విధాలలో దేవుడు పనిచేయడాన్ని మీరు ఎప్పుడు చూసియున్నారు?
ప్రవక్తలు మనకు యేసు క్రీస్తు వైపు దారిచూపుతారు.
హీలమన్ 16లో సమూయేలు బోధనలను అంగీకరించిన వారి నుండి మీరేమి నేర్చుకుంటారు? అతడిని తిరస్కరించిన వారి నుండి మీరేమి నేర్చుకుంటారు? సజీవ ప్రవక్తలను అనుసరించడం యేసు క్రీస్తుకు దగ్గరవడానికి మీకెలా సహాయపడిందో ఆలోచించండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
దేవుడు నాతో నా హృదయములో మాట్లాడగలరు.
-
ఆయన సమూయేలు కొరకు చేసినట్లు, దేవుడు మన హృదయాలలో మాట్లాడగలరని మీ పిల్లలకు మీరెలా బోధించగలరు? బహుశా మాటలు లేకుండా రకరకాల విధానాల్లో సంభాషించడాన్ని మీకు చూపమని మీరు వారిని అడగవచ్చు (సంజ్ఞలు లేదా ముఖ వ్యక్తీకరణలు వంటివి). ఇది పరలోక తండ్రి మనతో సంభాషించే రకరకాల విధానాల గురించి ఒక చర్చకు దారితీయవచ్చు. ఈ చర్చలో భాగంగా, మీరు మరియు మీ పిల్లలు లేమనీయుడైన సమూయేలు (ఈ సారాంశంలో రెండు ఉన్నాయి) చిత్రాన్ని చూడవచ్చు మరియు పలుకవలసిన దానిని దేవుడు సమూయేలుకు ఎలా చెప్పారనే దాని కొరకు మీ పిల్లలు వింటుండగా హీలమన్ 13:2–5 చదువవచ్చు.
-
మనలో అనేకమందికి—ప్రత్యేకించి పిల్లలకు—దేవుడు మనతో ఎలా మరియు ఎప్పుడు మాట్లాడుతున్నారో గుర్తించడాన్ని నేర్చుకోవడానికి సహాయం అవసరం. మీరు చేయాలని లేదా చెప్పాలని దేవుడు కోరుతున్న దానిని మీ హృదయంలో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయపడిన సమయం గురించి మీరు మీ పిల్లలకు చెప్పవచ్చు. దేవుడు మీతో సంభాషిస్తున్నారని మీకెలా తెలుసో వివరించండి. బహుశా మీ పిల్లలు వారు కలిగియున్న అటువంటి అనుభవాలను కూడా పంచుకోవచ్చు.
ప్రవక్తలు యేసు క్రీస్తు గురించి బోధిస్తారు.
-
రక్షకుని గురించి సమూయేలు ఏమి బోధించాడు? ఆయన గురించి ఆధునిక ప్రవక్తలు బోధించే దానిని బహుశా మీరు కూడా పంచుకోవచ్చు. వారి మాటలు ఆయనయందు మన విశ్వాసాన్ని ఎలా పెంపొందిస్తాయి?
నేను ప్రవక్తను అనుసరించినప్పుడు, నేను దీవించబడతాను.
-
విశ్వాసులైన జనుల మాదిరులను వారికి చూపించడం ద్వారా ప్రవక్త యందు మీ పిల్లల నమ్మకాన్ని మీరు పెంపొందించగలరు. వీటిలో కొన్ని హీలమన్ 16:1, 5లో కనుగొనబడతాయి. మీరు చదువుతుండగా, జనులు సమూయేలు మాటలు నమ్మినప్పుడు వారు చేసిన దేని గురించైనా మీ పిల్లలు వినినప్పుడు వారు లేచి నిలబడవచ్చు. తర్వాత, మీరు 2 మరియు 6 వచనాలు చదువుతుండగా, జనులు నమ్మనప్పుడు వారు చేసిన దేని గురించైనా మీ పిల్లలు వినినప్పుడు వారు లేచి నిలబడవచ్చు. మనం సజీవ ప్రవక్త యొక్క మాటలను నమ్ముతున్నామని మనమెలా చూపగలము? ఆయన ప్రవక్తల ద్వారా ప్రభువు ఇచ్చిన ఉపదేశాన్ని మీరు అనుసరించినప్పుడు మీరెలా దీవించబడ్డారో మీ పిల్లలకు చెప్పండి.