2024 రండి, నన్ను అనుసరించండి
సెప్టెంబరు 2-8: “ప్రభువును జ్ఞాపకముంచుకొనుము.” హీలమన్ 7–12


“సెప్టెంబరు 2-8: ‘ప్రభువును జ్ఞాపకముంచుకొనుము.’ హీలమన్ 7–12,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“సెప్టెంబరు 2-8. హీలమన్ 7-12,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

చిత్రం
తోట గోపురముపై ప్రార్థిస్తున్న నీఫై

తోట గోపురముపై నీఫై యొక్క వివరణ, జెర్రీ థాంప్సన్ చేత

సెప్టెంబరు 2-8: “ప్రభువును జ్ఞాపకముంచుకొనుము”

హీలమన్ 7–12

నీఫై యొక్క తండ్రియైన హీలమన్, తన కుమారులను “జ్ఞాపకముంచుకొనుము, జ్ఞాపకముంచుకొనుము” అని పురికొల్పాడు. వారి పూర్వీకులను జ్ఞాపకముంచుకోవాలని, ప్రవక్తల మాటలను జ్ఞాపకముంచుకోవాలని మరియు అన్నిటికంటే ఎక్కువగా “మన విమోచకుడైన క్రీస్తును” (హీలమన్ 5: 5–14 చూడండి) జ్ఞాపకముంచుకోవాలని అతడు వారిని కోరాడు. నీఫై జ్ఞాపకముంచుకొన్నట్లు స్పష్టమైంది, ఎందుకనగా ఇదే సందేశాన్ని అతడు చాలా సంవత్సరాల తరువాత “అలసట లేకుండా” (హీలమన్ 10:4) జనులకు ప్రకటించాడు. “మీరెట్లు మీ దేవుడిని మరిచిపోతిరి?” అని అతడు అడిగాడు (హీలమన్ 7:20). ప్రకటించడం, ప్రార్థన చేయడం, అద్భుతములు చేయడం మరియు కరువు కొరకు దేవునికి మనవి చేయడం వంటి—నీఫై యొక్క ప్రయత్నాలన్నీ—జనులు దేవునివైపు తిరగడానికి మరియు ఆయనను జ్ఞాపకముంచుకోవడానికి సహాయపడేందుకు చేసినవి. అనేక విధాలుగా, దేవుడిని మరచిపోవడమనేది ఆయనను ఎరుగకపోవడం కంటే కూడా పెద్ద సమస్య. మన మనస్సులు “లోకము యొక్క వ్యర్థమైన వస్తువుల” చేత పరధ్యానపరచబడినప్పుడు, పాపముచేత కప్పబడినప్పుడు ఆయనను మరచిపోవడం సులభము (హీలమన్ 7:21; హీలమన్ 12:2 కూడా చూడండి). కానీ, నీఫై యొక్క పరిచర్య చూపినట్లుగా, జ్ఞాపకముంచుకొనుటకు మరియు “మీ దేవుడైన ప్రభువు వైపు … తిరుగుటకు” (హీలమన్ 7:17) ఎన్నడూ ఆలస్యము కాదు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

హీలమన్ 7–11

చిత్రం
seminary icon
ప్రవక్తలు దేవుని యొక్క చిత్తమును జనులకు బయల్పరుస్తారు.

ప్రవక్తలు ఏమి చేస్తారనే దాని గురించి నేర్చుకోవడానికి ప్రత్యేకించి హీలమన్ 7–11 మంచి ప్రదేశము. మీరు ఈ అధ్యాయములు చదివినప్పుడు, నీఫై యొక్క క్రియలు, ఆలోచనలు మరియు ప్రభువుతో అతని సంభాషణల పట్ల ఆసక్తి చూపండి. ప్రవక్తల పాత్రను మీరు గ్రహించడానికి నీఫై యొక్క పరిచర్య ఎలా సహాయపడుతుంది? ఇక్కడ కొన్ని మాదిరులున్నాయి. ఇంకా మీరు దేనిని కనుగొంటారు?

మీరు చదివిన దానిపై ఆధారపడి, ప్రవక్త అంటే ఏమిటి మరియు ఆయన ఏమి చేస్తారనే దానిని మీరెలా వివరిస్తారు? ఒక క్లుప్త నిర్వచనము వ్రాయడాన్ని పరిగణించండి.

హీలమన్ 7:11–29 లో నీఫై ఎంత ధైర్యవంతుడో మీరు గమనించారా? నీఫై వలె ప్రవక్తలు కొన్నిసార్లు ధైర్యంగా మాట్లాడడం ఎందుకు అవసరమని మీరు భావిస్తున్నారు? ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ సందేశము “దేవుని యొక్క ప్రవక్త” (లియహోనా, మే 2018, 26) లో “ఆశ్చర్యపడకుము” అనే శీర్షిక గల విభాగంలో జవాబుల కొరకు చూడడాన్ని పరిగణించండి.

ఈ సత్యాలన్నిటిని మనస్సులో ఉంచుకొని, ఆయన ప్రవక్తల పరిచర్య ద్వారా ప్రభువు మిమ్మల్ని ఏ విధంగా దీవించియున్నారో ధ్యానించండి. జీవిస్తున్న మన ప్రవక్త ద్వారా ఇటీవల ఆయన మీకు ఏమి బోధించారు? ప్రభువు యొక్క నడిపింపును వినుటకు మరియు అనుసరించుటకు మీరేమి చేస్తున్నారు?

హీలమన్ 9; 10:1, 12–15

సూచకక్రియలు మరియు అద్భుతాలపై కంటే ఎక్కువగా యేసు క్రీస్తునందు నా విశ్వాసము నిర్మించబడాలి.

సూచకక్రియలు లేదా అద్భుతాలు ఒక వ్యక్తి హృదయాన్ని మార్చడానికి సరిపోయిన యెడల, నీఫైయులందరు హీలమన్ 9 లో నీఫై ఇచ్చిన గొప్ప సూచకక్రియల చేత మార్పుచెందియుండేవారు. కానీ అది జరుగలేదు. హీలమన్ 9–10 లోని అద్భుతానికి జనులు స్పందించిన భిన్నమైన విధానాలను గమనించండి. ఉదాహరణకు, హీలమన్ 9:1–20 లోని ఐదుగురు వ్యక్తులు మరియు ప్రధాన న్యాయాధిపతుల స్పందనలను మీరు పోల్చవచ్చు (హీలమన్ 9:39–41; 10:12–15 కూడా చూడండి). యేసు క్రీస్తు యందు మీ విశ్వాసమును బలముగా ఎలా నిలుపుకోవాలో అనేదాని గురించి ఈ అనుభవాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

3 నీఫై 1:22; 2:1–2 కూడా చూడండి.

హీలమన్ 10:1-12

ఆయన చిత్తమును వెదకి, ఆయన ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నించే వారికి ప్రభువు శక్తినిస్తారు.

మీరు హీలమన్ 10:1–12 చదివినప్పుడు, ప్రభువు యొక్క నమ్మకాన్ని పొందడానికి నీఫై ఏమి చేసాడో గమనించండి. తన స్వంత చిత్తము కంటె ప్రభువు యొక్క చిత్తమును తాను వెదికినట్లు అతడు ఎలా రుజువు చేసాడు? ఏమి చేయమని నీఫై యొక్క అనుభవము మిమ్మల్ని ప్రేరేపిస్తుంది?

హీలమన్ 10:2–4

దేవుని వాక్యమును ధ్యానించడం బయల్పాటును ఆహ్వానిస్తుంది.

మీరు కృంగినట్లుగా, ఆందోళన చెందినట్లుగా లేదా కలవరపడినట్లుగా భావించినప్పుడు, హీలమన్ 10:2–4 లో నీఫై యొక్క మాదిరి నుండి ఒక ముఖ్యమైన పాఠమును మీరు నేర్చుకోవచ్చు. అతడు “కృంగినట్లు” భావించినప్పుడు అతడు ఏమి చేసాడు? (3వ వచనము).

అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా బోధించారు, “మనము ధ్యానించినప్పుడు, మనము ఆత్మ చేత బయల్పాటును ఆహ్వానిస్తున్నాము” (“Serve with the Spirit,” Liahona, Nov. 2010, 60). మీరు ఏవిధంగా ధ్యానించడాన్ని అలవాటు చేసుకోవచ్చు?

హీలమన్ 12

ఆయనను జ్ఞాపకముంచుకోవాలని ప్రభువు నన్ను కోరుతున్నారు.

ముఖ్యమైన సమాచారము—కుటుంబ సభ్యుని పుట్టినరోజు లేదా ఒక పరీక్ష కొరకు సమాచారము వంటి వాటిని మీరెలా జ్ఞాపకముంచుకుంటారు? “ప్రభువును జ్ఞాపకముంచుకోవడానికి” అవసరమైన ప్రయత్నాన్ని ఇది ఏవిధంగా పోలియున్నది? (హీలమన్ 12:5). ఇది ఎలా భిన్నమైనది?

జనులు ప్రభువును మరచిపోవునట్లు చేసే అనేక విషయాలను హీలమన్ 12 వివరిస్తుంది. బహుశా మీరు వాటిని జాబితా చేసి, అవి మిమ్మల్ని ఆయన నుండి మీ దృష్టిని మరల్చేలా చేస్తున్నాయో లేదో ధ్యానించవచ్చు. యేసు క్రీస్తును జ్ఞాపకముంచుకోవడానికి మీకేది సహాయపడుతుంది? మీరు నేర్చుకొన్న దానిపై ఆధారపడి ఏమి చేయడానికి మీరు ప్రేరేపించబడ్డారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 కూడా చూడండి.

వస్తు పాఠములను ఉపయోగించండి. జనులకు బాగా తెలిసిన రోజువారీ విషయాలతో రక్షకుడు తరచు సువార్త సూత్రాలను సంబంధింపజేసారు. హీలమన్ 12:1–6 గురించి నేర్చుకుంటున్నప్పుడు లేదా బోధిస్తున్నప్పుడు, “నరుల సంతానము యొక్క అస్థిరతను” ఒంటి కాలిపై నిలబడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం భావించే దానితో మీరు పోల్చవచ్చు. మనము ఆత్మీయంగా స్థిరముగా ఎలా నిలిచియుండగలము?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

హీలమన్ 7:20-21

ఆయనను జ్ఞాపకముంచుకోవాలని ప్రభువు నన్ను కోరుతున్నారు.

  • ప్రభువును జ్ఞాపకముంచుకోవడం గురించి ఒక సంభాషణను ప్రారంభించడానికి, మీరు ఏదైనా మరచిపోయిన సమయం గురించి మీ పిల్లలకు చెప్పవచ్చు. వారిని అటువంటి స్వంత అనుభవాలను పంచుకోనివ్వండి. అప్పుడు మీరు కలిసి హీలమన్ 7:20–21 చదువవచ్చు మరియు దేవుడిని మరచిపోవడమంటే అర్థమేమిటని వారనుకుంటున్నారో చెప్పమని మీ పిల్లలను అడగండి. ప్రభువును మనం మరచిపోయేలా చేసే విషయాల చిత్రాలను మీ పిల్లలు గీయవచ్చు మరియు యేసు యొక్క చిత్రాన్ని మూసివుంచడానికి వారి చిత్రాలను ఉపయోగించవచ్చు. తర్వాత, ఆయనను జ్ఞాపకముంచుకోవడానికి వారు చేయగల విషయాల గురించి వారు ఆలోచించవచ్చు. వారు తమ ఆలోచనలను పంచుకుంటున్నప్పుడు, రక్షకుని చిత్రము పూర్తిగా కనిపించేవరకు వారు ఒకదాని తర్వాత ఒకటిగా చిత్రాలను తీసివేయవచ్చు.

హీలమన్ 8:13-23

ప్రవక్తలు యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తారు.

  • యేసు క్రీస్తు గురించి బోధించిన ప్రవక్తల పేర్లు కనుగొనడానికి హీలమన్ 8:13–23 ను వెదకడానికి మీ పిల్లలకు సహాయపడండి. వారు ఒక పేరును కనుగొన్న ప్రతీసారి యేసు యొక్క చిత్రాన్ని వారు ఒకరికొకరు అందించుకోవచ్చు. రక్షకుని గురించి మన సజీవ ప్రవక్త ఏమి బోధించారు?

  • ఒక పాట నుండి మీరు మరియు మీ పిల్లలు ఒక ముఖ్య వాక్యాన్ని ఎంచుకొని, అనేక కాగితపు పాదముద్రలలో ప్రతీదానిపై ఆ వాక్యభాగం నుండి ఒక పదాన్ని వ్రాయవచ్చు. తర్వాత మీరు ఆ పాదముద్రలను రక్షకుని చిత్రం వైపు నడిపించేలా నేలపై పరచవచ్చు మరియు చిత్రం వైపు పాదముద్రలను మీ పిల్లలు అనుసరించవచ్చు. ప్రవక్తను అనుసరించడం మనల్ని యేసు క్రీస్తు వైపుకు ఏవిధంగా నడిపిస్తుంది?

హీలమన్ 10:1-4

దేవుని మాటలను ధ్యానించడం బయల్పాటును ఆహ్వానిస్తుంది.

  • ధ్యానించుటను పోలియున్న కొన్ని ఇతర పదాలేవి? బహుశా మీరు కలిసి హీలమన్ 10:1–3 చదివి, ధ్యానించుట అనే పదాన్ని ఆ ఇతర పదాలతో భర్తీ చేయవచ్చు. ధ్యానించడాన్ని వారి లేఖన అధ్యయనములో భాగంగా చేసుకోగల విధానాల గురించి మీ పిల్లలతో మాట్లాడండి.

హీలమన్ 10:11-12

నేను పరలోక తండ్రికి విధేయుడనైయుంటాను.

  • దానర్థము ఏదో కష్టమైనది చేయడమని తెలిసినా నీఫై పరలోక తండ్రికి విధేయుడైయున్నాడు. దీనికి ఒక ఉదాహరణ కొరకు, మీరు మరియు మీ పిల్లలు హీలమన్ 10: 2, 11–12 చదువవచ్చు. మీ పిల్లలు నీఫై చేసిన దానిని నటించి చూపవచ్చు—గదిలో ఒకవైపునకు నడవడం (వారు ఇంటికి వెళ్తున్నట్లుగా), ఆగడం, చుట్టూ తిరగడం మరియు గదిలో మరొక వైపునకు నడవడం (వారు జనులకు బోధించడానికి తిరిగి వెళ్తున్నట్లుగా) చేయవచ్చు. మనం చేయాలని పరలోక తండ్రి కోరుతున్న కొన్ని విషయాలేవి?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
సియాంటమ్ హంతకునిగా కనుగొనబడ్డాడు

ప్రవచనము యొక్క బహుమానము ద్వారా, నీఫై ప్రధాన న్యాయాధిపతి యొక్క హత్యను పరిష్కరించాడు.

© The Book of Mormon for Young Readers, Seantum—The Murderer Is Discovered [సియాంటమ్—హంతకుడు కనుగొనబడ్డాడు], బ్రయానా షాక్రాఫ్ట్ చేత; అనుకరించబడదు

ముద్రించు