రండి, నన్ను అనుసరించండి
ఫిబ్రవరి 10–16. 2 నీఫై 6–10: “ఓహ్ మన దేవుని ప్రణాళిక ఎంత గొప్పది!”


“ఫిబ్రవరి 10–16. 2 నీఫై 6–10: ‘ఓహ్ మన దేవుని ప్రణాళిక ఎంత గొప్పది!’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“ఫిబ్రవరి 10–16. 2 నీఫై 6–10,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
యేసు గెత్సెేమనేలో ప్రార్థించుట

నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, హ్యారీ ఆండర్సన్ చేత

ఫిబ్రవరి 10–16

2 నీఫై 6–10

“ఓహ్ మన దేవుని ప్రణాళిక ఎంత గొప్పది!”

మీరు 2 నీఫై 6–10 చదువుచున్నప్పుడు, ప్రభువు మీకు ఏమి బోధించాలనుకుంటున్నది దీర్ఘాలోచన చెయ్యండి. మీరు ఈ సత్యాలను గుర్తించినప్పుడు, వాటిని నమోదు చేయండి మరియు మీరు నేర్చుకుంటున్న దానిని మీరు ఎలా కార్యాచరణలోకి తీసుకురావాలో ప్రార్థన పూర్వకముగా పరిగణించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

లీహై కుటుంబం యెరూషలేమును విడిచిపెట్టి కనీసం 40 సంవత్సరాలు అయ్యింది. వారు యెరూషలేము ప్రాంతము నుండి మరియు దేవుని నిబంధన జనులకు అర్థ ప్రపంచ దూరంలో ఒక వింత కొత్త దేశంలో ఉన్నారు. లీహై మరణించెను, ఆయన సంతానమైన “దేవుని యొక్క హెచ్చరికలు మరియు బయల్పాటులు నమ్ము” నీఫైయులు మరియు వాటిని నమ్మని లేమనీయుల మధ్య శతాబ్దాలు కొనసాగబోవు కలహము ప్రారంభమైంది(2 నీఫై 5:6). ఈ పరిస్థితులలో, నీఫై తమ్ముడు జేకబ్, అప్పుడు నీఫైయులకు ఒక బోధకునిగా నియమించబడియుండి, దేవుడు వారిని ఎప్పటికి మరిచిపోరని, వారు కూడా ఎప్పుడు ఆయనను మరిచిపోకూడదని నిబంధన జనులను కోరెను. నిబంధనలు తక్కువ చేయబడి, బయల్పాటులు తిరస్కరించబడే మన ప్రపంచంలో ఇది మనకు ఖచ్చితంగా అవసరమైన సందేశం. “మనము ఆయనను జ్ఞాపకము చేసుకొందుము, … ఏలయనగా మనము వదలివేయబడలేదు. … ప్రభువు యొక్క వాగ్దానములు గొప్పవి,” అని ఆయన ప్రకటించెను (2 నీఫై 10:20–21). ఆ వాగ్దానాలలో, మరణం మరియు నరకాన్ని అధిగమించడానికి “అనంతమైన ప్రాయశ్చిత్తం” వాగ్దానం కంటే గొప్పది ఏదీ లేదు (2 నీఫై 9:7). “కనుక,” జేకబ్ ఇలా ముగించెను, “మీ హృదయములను ఓదార్చుకొనుడి”! (2 నీఫై 10:23).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నం

వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు

2 నీఫై 6–8

ప్రభువు తన ప్రజల యెడల దయ కలిగి, అయన వాగ్దానాలను నెరవేర్చును.

వారు ఇశ్రాయేలు వంశంలో భాగమని, దేవునిని, ఆయన వాగ్దానాలను విశ్వసించగలరని అతని ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి జేకబ్ 2 నీఫై 6–8లో లిఖించబడిన యెషయా ప్రవచనాలను ఉదహరించెను. యెషయా ఇశ్రాయేలు ముక్కలు కావడం మరియు రక్షకుడు వాగ్దానం చేసిన తన ప్రజలు పోగుచెయ్యబడి, విమోచింపబడటం గురించి వివరించెను. మీరు చదువుతున్నప్పుడు, ఈ క్రింది ప్రశ్నలను దీర్ఘంగా ఆలోచించండి:

  • నాపైగల రక్షకుని విమోచన ప్రేమ గురించి నేను ఏమి నేర్చుకోవాలి?

  • తనను ప్రార్థించేవారి కోసం రక్షకుడు ఎలాంటి ఓదార్పునిచ్చును?

  • రక్షకుడు, ఆయన వాగ్దానం చేసిన ఆశీర్వాదాల కోసం, మరింత నమ్మకంగా “వేచి” ఉండటానికి నేనేమి చేయగలను?

2 నీఫై 9:1–26

తన ప్రాయశ్చిత్తం ద్వారా, యేసు క్రీస్తు ప్రజలందరినీ భౌతిక, ఆత్మీయ మరణాల నుండి విడిపించును.

మరణం మరియు పాపం నుండి మనల్ని రక్షించడానికి ఒక విమోచకుని కోసం మనకున్న తీరని అవసరం ఎవరితోనైనా మాట్లాడటానికి మీరు ఏ పదాలు లేదా చిత్రాలను ఉపయోగిస్తారు? జేకబ్ “భయంకరం”, “రాక్షసుడు” అనే పదాలను ఉపయోగించెను. “ఆ రాక్షసుడు, మరణం, నరకం” మరియు దేవుడు మన కోసం సిద్ధం చేసిన “విమోచన” గురించి జేకబ్ ఏమి బోధించెను? (2 నీఫై 9:10). మీరు 2 నీఫై 9:1–26 చదువుతున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం లేకుండా మనకు ఏమి జరుగుతుందో ఒకే రంగులో గుర్తించడం పరిగణించండి. అప్పుడు, మరొక రంగులో రక్షకుని ప్రాయశ్చిత్తం ద్వారా మనం ఏమి పొందగలమో మీరు గుర్తించవచ్చు. “దేవుని జ్ఞానం, ఆయన దయ మరియు కరుణ”ను స్తుతించడానికి కారణమయ్యే యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం గురించి మీరు కనుగొన్న సత్యాలు ఏమిటి? (2 నీఫై 9:8).

“యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం,” సువార్త అంశాలు, topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

2 నీఫై 9:27–54

నేను క్రీస్తు దగ్గరకు వచ్చి, ఆయన ప్రాయశ్చిత్తము యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలను పొందగలను.

“వారు అతని స్వరమును ఆలకించిన యెడల మనుష్యులందరిని రక్షించునట్లు లోకములోనికి” యేసు క్రీస్తు వచ్చెను (2 నీఫై 9:21; ఏటవాలు అక్షరాలు జోడించబడ్డాయి). మరో మాటలో చెప్పాలంటే, ఆయన అందించే రక్షణ ఆశీర్వాదాలను అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. విమోచన ప్రణాళికను వివరించిన తరువాత, జేకబ్ ముఖ్యమైన హెచ్చరికలు మరియు ఆహ్వానాలు ఇచ్చెను, వీటిని 2 నీఫై 9:27–54లో కనుగొనవచ్చు, ఇవి ప్రాయశ్చిత్త ఆశీర్వాదాలు పొందటానికి మనకు సహాయపడగలవు. ఇలాంటి చార్ట్‌లో వాటిని నమోదు చేయడానికి పరిగణించండి:

హెచ్చరికలు

ఆహ్వానాలు

హెచ్చరికలు

ఆహ్వానాలు

హెచ్చరికలు

ఆహ్వానాలు

ఈ హెచ్చరికలు మరియు ఆహ్వానాలకు ప్రతిస్పందనగా పరిశుద్ధాత్మ మీకు ఏమి ప్రేరేపించిందని భావిస్తున్నారు?

2 నీఫై 10:20, 23–25

యేసు క్రీస్తు త్యాగం కారణంగా, నేను నా హృదయాన్ని “ఉత్సాహపరుస్తాను”.

జేకబ్ సందేశం సంతోషకరమైనది. “మీరు ఆనందించునట్లు మరియు నిరంతరము మీ తలలను పైకెత్తుదురని” “ఈ వాక్యాలను మీతో చెప్పుచున్నాను“ అని ఆయన చెప్పారు (2 నీఫై 9:3). మీరు 2 నీఫై 10:20, 23–25 చదువుతున్నప్పుడు, మీకు నిరీక్షణ కలిగించే దేనిని మీరు కనుగొన్నారు? మీకు నిరీక్షించే కలిగించే దేనిని 2 నీఫై 9–10లో కనుగొన్నారు? మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవడానికి మీరు ఏమి చేస్తారు?

యోహాను 16:33 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నం

కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలం కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

2 నీఫై 8:3–7

మీరు 2 నీఫై 8:3 చదివినప్పుడు ఒక ఎడారి మరియు ఒక తోట చిత్రాలను మీరు చూపవచ్చు. ప్రభువు మన జీవిత ఎడారులను తోటలుగా ఎలా మారుస్తారు? వచనాలు 4–7లో, వచనం 3లో వివరించిన విధంగా ఆనందాన్ని పొందడానికి మనం ఏమి చేయాలని ప్రభువు ఉపదేశించును?

2 నీఫై 8:24–25

యేసు క్రీస్తుకు మరింత నమ్మకమైన శిష్యులుగా మారడానికి మన ప్రయత్నాలలో సీయోను ప్రజలకు యెషయా ప్రోత్సహించే మాటలు మనల్ని ఎలా బలపరుస్తాయి? మేల్కొనడం, దుస్తులు వేసుకుని తయారవ్వడం ఏవిధంగా ప్రభువు మనల్ని ఆత్మియంగా ఏమి చెయ్యాలని కోరుకుంటున్న దానికి సారూప్యమైనది?

2 నీఫై 9:1–26

యేసు క్రీస్తు “అనంతమైన ప్రాయశ్చిత్తం” యొక్క పరిమాణాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మీ కుటుంబం ఏమి చేయగలదు? (వచనం 7). బహుశా వారు అనంతంగా అనిపించే విషయాల గురించి చూడవచ్చు లేదా ఆలోచించవచ్చు—అంటే, పొలంలో గడ్డి పరకలు, సముద్రతీరంలోని ఇసుక రేణువులు లేదా ఆకాశంలో నక్షత్రాలు లాంటివి. రక్షకుని ప్రాయశ్చిత్తం ఎలా అనంతమైనది? ఈ 2 నీఫై 9లోని ఏ పదాలు, రక్షకుడు మన కోసం చేసిన దానికి మన కృతజ్ఞతను లోతుగా తెలుపుతాయి?

2 నీఫై 9:27–44

బహుశా ఈ వారంలో ఒక రోజు మీ కుటుంబం 2 నీఫై 9:27–38లో, హెచ్చరికలు (ముందు “ఓ” అని ఉన్నవాటి) కోసం వెతకవచ్చు. వీటిలో మరిముఖ్యముగా ఏది మీ కుటుంబ సభ్యులు చర్చించాల్సిన అవసరం ఉంది? మరొక రోజున, మీరు 2 నీఫై 9:39–44 కోసం శోధించవచ్చు, జేకబ్ తన ప్రజలు వేటిని గుర్తుంచుకోవాలని ఆహ్వానించెనో వెతకవచ్చు.

2 నీఫై 9:28–29, 50–51

“మనుష్యుల యొక్క అహంకారము, దౌర్భల్యములు మరియు బుద్ధిహీనత” యొక్క కొన్ని ఉదాహరణలు ఏమిటి? (వచనం 28). ప్రభువు విషయాలపై ఎక్కువ విలువను మరియు ప్రపంచ విషయాలపై తక్కువ విలువను ఇవ్వడానికి మనం ఏమి చేయగలం?

2 నీఫై 9:45

మీ కుటుంబం కాగితపు గొలుసును తయారు చేసి, ఒకరి తరువాత ఒకరు దానిని ధరించి, దానిని విదల్చడాన్ని ఆనందించవచ్చు. పాపాలు గొలుసులు లాగా ఎలా ఉంటాయి? వాటిని విదల్చడానికి రక్షకుడు మనకు ఎలా సహాయం చేస్తారు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచడం

అందుబాటులో, సమీపించగలిగే విధంగా ఉంచండి. “కొన్ని ఉత్తమ బోధనా క్షణాలు [కుటుంబ] సభ్యుని హృదయంలో ప్రశ్న లేదా ఆందోళనగా ప్రారంభమవుతాయి. … మీరు వాటిని వినడానికి ఆసక్తిగా ఉన్నట్లుగా మీ మాటలు మరియు చర్యల ద్వారా వారికి తెలియజేయండి” (రక్షకుని మార్గంలో బోధించడం, 16).

చిత్రం
యేసు ప్రజలను స్వస్థపరచుట

“వారు ఆయన స్వరాన్ని ఆలకిస్తే” రక్షకుడు దేవుని పిల్లలందరినీ రక్షించును (2 నీఫై 9:21). ఆయన అనేక రకాల వ్యాధులను నయం చేశారు, పేర్కొన్నది జె. కిర్క్ రిచార్డ్స్

ముద్రించు