రండి, నన్ను అనుసరించండి
ఫిబ్రవరి 3–9. 2 నీఫై 1–5: “మేము సంతోషకరమైన విధముగా జీవించితిమి”


“ఫిబ్రవరి 3–9. 2 నీఫై 1–5: ‘మేము సంతోషకరమైన విధముగా జీవించితిమి” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“ఫిబ్రవరి 3–9. 2 నీఫై 1–5,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
ఆదాము మరియు హవ్వలు ఏదెను తోట వదిలి వెళ్ళుట

ఆదాము మరియు హవ్వలు, డగ్లస్ ఫ్రైయర్ చేత

ఫిబ్రవరి 3–9

2 నీఫై 1–5

“మేము సంతోషకరమైన విధముగా జీవించితిమి”

లేఖనాలు వ్యక్తిగత బయల్పాటుకు తలుపులు తెరుస్తాయి. మనం 2 నీఫై 1–5 చదువుతున్నప్పుడు, ప్రభువు మీకు బోధించదలిచిన ప్రత్యేకమైనదేదో ఉందని మీరు కనుగొనవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

మీ జీవితం ముగిసిపోతోందని మీకు తెలిస్తే, మీ ప్రేమకు అత్యంత ప్రీతిపాత్రులైన వారితో ఏ చివరి సందేశాలను పంచుకోవాలనుకుంటారు? ప్రవక్తయైన లీహై తన జీవితపు ముగింపునకు చేరుకున్నట్లు భావించినప్పుడు, అతను తన పిల్లలందరిని ఒక చోట సమవేశం చేసి, చివరిసారిగా ప్రవచించి, తాను ఎంతో ప్రేమించిన సువార్త సత్యాలను తాను ఎంతో ప్రేమించిన వ్యక్తులతో పంచుకొనెను. అతను స్వేచ్ఛ, విధేయత, ఆదాము హవ్వల పతనం, యేసు క్రీస్తు ద్వారా విమోచన మరియు ఆనందం గురించి బోధించెను. అతని పిల్లలందరూ అతని చివరి సాక్ష్యమును అంగీకరించలేదు, కాని—నేడు చదువు లక్షలాది మందితో పాటు—దానిని అంగీకరించిన వారు ఆయన సాక్ష్యంలో “సంతోషకరమైన విధముగా” జీవించుట కొరకు సూత్రాలను కనుగొన్నారు (2 నీఫై 5:27).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నం

వ్యక్తిగత లేఖన అధ్యయన కొరకు ఉపాయములు

2 నీఫై 2

నేను నిత్యజీవమును ఎన్నుకొనుటకు స్వతంత్రుడిని.

ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ ఇలా చెప్పారు: “తన పిల్లలు తాను ప్రసాదించిన నైతిక కర్తృత్వము ప్రకారం నడుచుకోవాలని దేవుడు భావించును. … మన స్వంత జీవిత నాటకంలో ప్రధాన నిర్ణయాత్మక పాత్ర మనకు ఉండాలనేది ఆయన ప్రణాళిక మరియు ఆయన సంకల్పం” (“వారి కోసం పని చేయడానికి, ఎప్పుడూ స్వతంత్రులే,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2014, 16). కర్తృత్వము గురించి లీహై బోధనలలో, కర్తృత్వాన్ని సాధ్యం చేసే అవసరమైన పరిస్థితులను ఆయన గుర్తించెను మరియు ఈ క్రింది వాటితో సహా మన దైవిక సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పించెను:

  1. మంచి మరియు చెడు జ్ఞానం (2 నీఫై 2:5)

  2. మానవులకు ఇవ్వబడిన చట్టం (2 నీఫై 2:5)

  3. వ్యతిరేక, మనోహరమైన ఎంపికలు (2 నీఫై 2:11)

  4. కార్య శక్తి (2 నీఫై 2:16)

మీరు 2 నీఫై 2 చదువుతున్నప్పుడు, ఈ కర్తృత్వపు షరతుల గురించి మరియు ఒకదానికొకటి అవి కలిగియున్న సంబంధం గురించి మీరు ఏమి నేర్చుకున్నారు? ఈ షరతులలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనుసరించకపోతే, మన కర్తృత్వానికి ఏమి జరుగుతుంది? లీహై మాటల నుండి కర్తృత్వము గురించి మీరు ఇంకా ఏమి నేర్చుకున్నారు?

2 నీఫై 2:22–29

పరలోకపు తండ్రి ప్రణాళికలో పతనం, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం అత్యంత ముఖ్యమైన భాగాలు.

చాలా మంది ప్రజలు ఆదాము, హవ్వల పతనాన్ని ఒక విషాద సంఘటనగా చూస్తారు. ఏదేమైనా, పతనం గురించి లీహై బోధనలు మన శాశ్వతమైన పురోగతి కోసం పరలోకపు తండ్రి ప్రణాళికలో ఇది ఎందుకు అవసరమైన భాగం అనేది తెలుపబడుతుంది. మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు, పరలోకపు తండ్రి పిల్లలమైన మన పురోగతి కోసం పతనం ఎందుకు ఆవశ్యకమో తెలుసుకోండి. రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగం పతనం నుండి మనల్ని ఎలా విమోచన కలిగించింది?

మోషె 5:9–12; 6:51–62; సువార్త అంశాలు, “ఆదాము, హవ్వల పతనం,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

2 నీఫై 3:6–24

సువార్తను పునఃస్థాపించడాని జోసెఫ్ స్మిత్ ముందే నియమించబడెను.

2 నీఫై 3 చివరి భాగంలో ఈజిప్టుకు చెందిన యోసేపు తన పేరును (వచనాలు 14–15 చూడండి) పంచుకునే భవిష్యత్తు దీర్ఘదర్శి—జోసెఫ్ స్మిత్ గురించి ఇచ్చిన ప్రవచనం ఉంది. జోసెఫ్ స్మిత్ యొక్క నియమితకార్యము గురించి ఎక్కువ చెప్పవలసింది కూడా అందులో ఉంది. ఈ వచనాలు 6–24 ప్రభువు ప్రజలను ఆశీర్వదించడానికి “ప్రీతికరమైన దీర్ఘదర్శి” అయిన జోసెఫ్ స్మిత్ ఏమి చేయునని చెప్తున్నాయి? జోసెఫ్ స్మిత్ చేసిన కార్యము మీకు “గొప్ప విలువైనది” ఎలా అయింది?

జోసెఫ్ స్మిత్ యొక్క నియమితకార్యములో ఒక ముఖ్యమైన భాగం, మోర్మన్ గ్రంథములో ఉన్న యోసేపు సంతానము వ్రాసిన రచనలను ముందుకు తీసుకురావడమే. మోర్మన్ గ్రంథము ప్రాముఖ్యత గురించి ఈ అధ్యాయం నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

జోసెఫ్ స్మిత్ అనువాదం, ఆదికాండము 50:24–38 (బైబిల్ అనుబంధంలో) కూడా చూడండి.

చిత్రం
ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్

ప్రభువు యొక్క ప్రవక్త, డేవిడ్ లింస్లె చేత

2 నీఫై 4:15–35

నా బలహీనతలో నేను దేవుని వైపు తిరగగలను.

నీఫై ఇటీవల తన తండ్రిని కోల్పోయెను. ఇప్పుడు తన కుటుంబాన్ని నడిపించే బాధ్యత అతనిపై ఉంది. అతను శోధనలతో చుట్టుముట్టబడ్డాడు మరియు అతని పాపాల కారణంగా నిరుత్సాహపడ్డాడు. మీ పరిస్థితులు నీఫై పరిస్థితులకు భిన్నంగా ఉన్నప్పటికీ, 2 నీఫై 4:15–35లో వ్రాయబడిన అతని కొన్ని ఆలోచనలు మరియు భావోద్వేగాలతో మీకు పోలిక ఉండవచ్చు. నీఫైకి తన కష్టాలలో ఏది సహాయపడింది? తన సవాళ్లకు నీఫై ప్రతిస్పందన మీ పోరాటాలను ఎదుర్కోవడంలో మీకు ఎలా సహాయపడుతుంది?

2 నీఫై 5

సువార్తను జీవించడంలో ఆనందం కనుగొనబడుతుంది.

మీరు ఆనందాన్ని ఎలా నిర్వచిస్తారు? తన ప్రజలు “సంతోషకరమైన విధముగా” జీవించారని నీఫై వ్రాసెను (2 నీఫై 5:27). సంతోషానికి నడిపించిన నీఫై మరియు అతని ప్రజలు ఎన్నుకున్న మార్గాలు—ఏ విధంగా ఒకరికొకరు మరియు వారి కుటుంబాలు సహాయం చేసుకున్నారు, వారి సమాజంలో దేనికి వారు విలువ ఇచ్చారు మొదలైన వాటి కొరకు మీరు వెతకవచ్చును. నీఫై ప్రజలు అనుసరించిన విధంగా, సంతోషకరమైన జీవితాన్ని నిర్మించడంలో మీకు సహాయపడే ఏ అంశాలను మీరు నేర్చుకున్నారు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నం

కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలం కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడును. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

2 నీఫై 1:13–25

నీతిమంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కలలుగనే గొప్ప కోరికల గురించి ఈ వచనాలు మనకు ఏమి బోధిస్తాయి?

2 నీఫై 3:6

బైబిల్ నిఘంటువులో “దీర్ఘదర్శి” చదవండి. జోసెఫ్ స్మిత్ ఏవిధంగా ఒక దీర్ఘదర్శి? జోసెఫ్ స్మిత్ సాధించిన కార్యానికి మనం ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? (2 నీఫై 3:6–24 చూడండి).

2 నీఫై 4:20–25

మీరు కలసికట్టుగా 2 నీఫై 4:20–25 చదువుతున్నప్పుడు, ప్రతి వచనం తర్వాత విరామం ఇవ్వండి మరియు కుటుంబ సభ్యులు నీఫై వివరించిన వాటికి వారు ఎలాంటి అనుభూతి చెందినది పంచుకోమని ఆహ్వానించండి. దేవుడు మన కుటుంబం కోసం ఏమి చేసారు?

2 నీఫై 5

మీ కుటుంబం “సంతోషకరమైన విధముగా” జీవిస్తున్న కొన్ని మార్గాలు ఏమిటి? మీ కుటుంబం 2 నీఫై 5 గురించి చదువుతున్నప్పుడు, నీఫైయులు శ్రద్ధ వహించే అంశాల గురించి మీరు చర్చించగలరు: కుటుంబం (వచనం 6), ఆజ్ఞలు (వచనం 10), గ్రంథాలు (వచనం 12), విద్య (వచనం 15), దేవాలయాలు (వచనం 16), పని (వచనం 17), సంఘ పిలుపులు (వచనం 26) చూడండి. దీన్ని చేయటానికి ఒక మార్గం ఏమిటంటే, వీటిలో కొన్నింటిని సూచించే అంశాలను కనుగొనడం మరియు నీఫైయుల మాదిరిగానే మనం కూడా ఇదే విషయాలను విలువైనదిగా ఎలా గ్రహిస్తామో మాట్లాడటం.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారపు సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

పరిశీలకులుగా ఉండండి. మీ పిల్లల జీవితంలో ఏమి జరుగుతుందో మీరు శ్రద్ధ వహిస్తే, మీకు అద్భుతమైన బోధన అవకాశాలు లభిస్తాయి. మీ పిల్లలు చేసే వ్యాఖ్యలు లేదా వారు అడిగే ప్రశ్నలు కూడా బోధించే సందర్భాలకు అవకాశాలు కావచ్చు. (రక్షకుని మార్గంలో బోధించడం, 16 చూడండి.)

చిత్రం
లీహై కుటుంబం సముద్ర తీరంలో మోకరిల్లుట

లీహై మరియు అతని ప్రజలు కొత్త ప్రపంచానికి చేరుకొనుట, క్లార్క్ కెల్లి ప్రైస్ చేత

ముద్రించు