“జనవరి 27–ఫిబ్రవరి 2. 1 నీఫై 16–22: ‘’నేను మీ యెదుట మార్గమును సిద్ధపరచెదను” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“జనవరి 27–ఫిబ్రవరి 2. 1 నీఫై 16–22,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020
జనవరి 27–ఫిబ్రవరి 2
1 నీఫై 16–22
“మీ ముందు నేను మార్గాన్ని సిద్ధం చేస్తాను”
మీరు 1 నీఫై 16–22 చదువుతున్నప్పుడు, మిమ్మల్ని ఆకట్టుకునే వచనాలను చూడండి. కొంతమంది తమ లేఖనాలలో ఇటువంటి వచనాలను గుర్తించడానికి ఇష్టపడతారు; ఇతరులు ప్రక్కన గమనికలు వ్రాస్తారు. మీరు పొందే మనోభావాలను మీరు ఎలా నమోదు చేస్తారో ఆలోచించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
లీహై కుటుంబం వాగ్దానదేశం వైపు ప్రయాణిస్తున్నప్పుడు, ప్రభువు వారికి ఈ వాగ్దానం చేసారు: “మీరు నా ఆజ్ఞలను పాటించిన యెడల, నేను మీ యెదుట మార్గమును సిద్ధపరచెదను” (1 నీఫై 17:13). స్పష్టంగా, ఆ వాగ్దానానికి అర్థం ప్రయాణం అంత సులభమని కాదు—కుటుంబ సభ్యులు ఇంకను విభేదించారు, విల్లంబులు విరిగిపోయాయి, జనులు శ్రమపడి, చనిపోయారు, మరియు వారు ముడి పదార్థాల నుండి ఓడను నిర్మించాల్సి వచ్చింది. ఏదేమైనా, కుటుంబం ప్రతికూలతను లేదా అసాధ్యమైన కార్యాలను ఎదుర్కొన్నప్పుడు, ప్రభువు ఎప్పుడూ దూరంగా లేరని నీఫై గుర్తించెను. దేవుడు “[విశ్వాసులను] పోషించును, వారిని బలపరుచును మరియు ఆయన వారికి ఆజ్ఞాపించిన కార్యమును వారు నెరవేర్చగలుగునట్లు సాధనమును దయచేయును” అని ఆయనకు తెలుసు. (1 నీఫై 17:3). నీఫై మరియు అతని కుటుంబం వంటి మంచి వ్యక్తులకు ఎందుకు చెడు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే, మీరు ఈ అధ్యాయాలలో అంతర్దృష్టులను కనుగొనవచ్చు. కానీ అంతకంటే ముఖ్యంగా, చెడు జరిగినప్పుడు మంచి వ్యక్తులు ఏమి చేస్తారో మీరు చూస్తారు.
వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు
నేను ఆజ్ఞలను పాటించినప్పుడు, సవాళ్లను ఎదుర్కొనేందుకు దేవుడు నాకు సహాయం చేస్తారు.
1 నీఫైలోని 16–18 అధ్యాయాలు నీఫై కుటుంబం విరిగిన విల్లంబుతో పాటుగా ఎదుర్కొన్న అనేక సవాళ్ల గురించి (1 నీఫై 16:17–32 చూడండి), ఇష్మాయేలు మరణం (1 నీఫై 16:34–39 చూడండి), ఓడ నిర్మాణం (1 నీఫై 17:7–16; 18:1–4 చూడండి), కుటుంబంలో అసమ్మతి (1 నీఫై 18:9–22 చూడండి) గురించి వివరిస్తాయి. ఈ సవాళ్లపట్ల నీఫై ప్రతిస్పందనలు అతని కుటుంబ సభ్యులలో కొందరి ప్రతిస్పందనల నుండి భిన్నంగా ఎలా ఉన్నాయి? ఈ ప్రతిస్పందనల యొక్క పర్యవసానాలు ఏమిటి?
“సవాలు,” “నీఫై ప్రతిస్పందన,” “ఇతరుల ప్రతిస్పందనలు” మరియు “ఫలితాలు” లాంటి శీర్షికలతోనున్న పట్టికలో మీరు కనుగొన్న వాటిని నమోదు చేయడం మీకు సహాయపడవచ్చు. ఇతరులు విశ్వసించలేకుండా ఉండగా నీఫై మాత్రం ఎందుకంత నమ్మకంగా ఉండగలిగాడని మీరు అనుకుంటున్నారు? నీఫై మరియు అతని కుటుంబం యొక్క మాదిరి మీ సవాళ్లను ఎదుర్కోవడంలో మీకు ఎలా సహాయపడగలదో ఆలోచించండి.
ChurchofJesusChrist.org లేదా గాస్పెల్ లైబ్రరీ యాప్‌లో మోర్మన్ గ్రంథ వీడియోల సేకరణలోని సంబంధిత వీడియోలను కూడా చూడండి.
1 నీఫై 16:10–16, 23–31; 18:11–22
ప్రభువు చిన్న మరియు సరళమైన మార్గాల ద్వారా నాకు నడిపింపునిస్తారు.
దేవుడు లీహై కుటుంబాన్ని అరణ్యంలోకి నడిపించినప్పుడు, వాగ్దాన దేశానికి సవివరమైన ప్రయాణ ప్రణాళికను ఆయన వారికి అందించలేదు. కానీ తన కుటుంబాన్ని రోజూ వారి గమ్యస్థానం వైపు నడిపించడానికి లీహైకి ఆయన లియాహోనాను ఇచ్చారు. నడిపింపు మరియు దిశను అందించడానికి పరలోకపు తండ్రి మీకు ఏమి ప్రసాదించారు? “ప్రభువు చిన్న సాధనము ద్వారా గొప్ప క్రియలను చేయగలరు” అనగా అర్థం ఏమిటని మీరనుకుంటున్నారు? (1 నీఫై 16:29).
మీరు 1 నీఫై 16:10–16, 23–31 మరియు 18:11–22 చదువుతున్నప్పుడు, దేవుడు తన పిల్లలకు ఎలా నడిపింపునిస్తారో వివరించే సూత్రాల జాబితాను రూపొందించేందుకు ఆలోచించండి (ఉదాహరణకు, దేవుడు కొన్నిసార్లు ఊహించని మార్గాల్లో మనల్ని నడిపిస్తారని 1 నీఫై 16:10 బోధించగలదు). ఈ సూత్రాలతో మీకు ఏ అనుభవాలు కలవు?
ఆల్మా 37:7, 38–47; సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33–34 కూడా చూడండి.
నేను “అన్ని లేఖనాలను నాతో పోల్చగలను”.
యెషయా ఇశ్రాయేలీయులు సంతానమంతటికి వ్రాసెను, మరియు అందులో నిర్ధిష్టంగా తన సొంత కుటుంబం ఉందని నీఫై గమనించెను—మరియు మీరు కూడా అందులో ఉన్నారు (1 నీఫై 19:23–24 చూడండి). యెషయా గురించి నీఫై వ్యాఖ్యాాానాలకు సంబంధించి అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా అన్నారు, “నేను యెషయా మాటలను చదివాను …నీఫై యెషయా యొక్క భాగాలను ఎంచుకున్నాడని అనుకుంటూ, ఊహాచిత్రాల గురించి చింతించకుండా, ప్రభువు నాతో మాట్లాడుతున్నట్లుగా నేరుగా నేను నా హృదయంలోకి తీసుకోగలను” (“మోర్మన్ గ్రంథము మీ జీవితాన్ని మార్చివేస్తుంది,” ఎన్‌సైన్, ఫిబ్ర. 2004, 10).
మీరు అధ్యాయాలు 20–22 చదువుతున్నప్పుడు, అధ్యక్షులు ఐరింగ్ మాటలను దృష్టిలో పెట్టుకుని, ఈ క్రింది ప్రశ్నలను పరిగణించండి:
-
1 నీఫై 20:1–9.ఈ వచనాలలోని ఏ పదాలు ఇశ్రాయేలు సంతానము గురించి వివరిస్తాయి? ఇవి లేమన్ మరియు లెముయెల్‌లను ఎలా వర్ణిస్తాయి? మీ కోసం మీరు ఏ హెచ్చరికలు మరియు ఆచరణ మార్గాన్ని కనుగొన్నారు?
-
1 నీఫై 20:17–22.ప్రభువు ఇశ్రాయేలు సంతానమును ఎలా నడిపించారు? లీహై కుటుంబాన్ని ఆయన ఎలా నడిపించారు? ఆయన మిమ్మల్ని ఎలా నడిపిస్తారు?
ప్రభువు మీతో మాట్లాడుతున్నట్లు అనిపించేలా ఇంకా వేటిని మీరు 1 నీఫై 20–22లో కనుగొన్నారు? యెషయా ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి అధ్యాయం 22 లోని నీఫై వ్యాఖ్యానం మీకు ఎలా సహాయపడింది?
ఇశ్రాయేలు వంశస్థులు మరియు అన్యులు ఎవరు?
ఇశ్రాయేలు వంశం పాత నిబంధన ప్రవక్తయైన యాకోబు వంశస్థులు, ఆయనకు ఇశ్రాయేలు అనే పేరును ప్రభువు ఇచ్చారు (ఆదికాండము 32:28; 35:10 చూడండి; బైబిల్ నిఘంటువులో “ఇశ్రాయేలు” కూడా చూడండి). ప్రభువు ఇశ్రాయేలుతో కొన్ని నిబంధనలు చేసారు మరియు అతని వారసులు ప్రభువు యొక్క నిబంధన జనులుగా భావించబడ్డారు. ఏదేమైనా, తరాల తరువాత, వారిలో చాలామంది ప్రభువు నుండి దూరమయ్యారు మరియు చివరికి భూమి అంతటా చెల్లాచెదురయ్యారు.
ఈ భాగాలలో అన్యులు అనే పదం ఇంకా సువార్త తెలియని వ్యక్తులను సూచిస్తుంది (బైబిల్ నిఘంటువులో “అన్యుడు” చూడండి. కడవరి దినాలలో అన్యులకు సువార్త ఇవ్వబడుతుందని మరియు ఇశ్రాయేలు వంశస్థులను సమకూర్చడానికి, వారికి బోధించడానికి వారు సాధనముగా ఉంటారని యెషయా బోధించెను (1 నీఫై 21:22; 22:8–12 చూడండి; యెషయా 60; 66:18–20 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.
1 నీఫై 17:1–6, 17–22
బహుశా మీ కుటుంబం, అరణ్యంలో ప్రయాణించిన నీఫై వృత్తాంతానికి (1 నీఫై 17:1–6 చూడండి), అతని సహోదరుని వృత్తాంతానికి మధ్య భేదాలు చూపవచ్చు (1 నీఫై 17:17–22 చూడండి). ఒకే సంఘటనలను వారు చాలా భిన్నంగా చూశారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? విశ్వాసపూరిత దృక్పథాన్ని కలిగి ఉండటం గురించి నీఫై నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
1 నీఫై 17:17–22; 18:9–16
ఒక కుటుంబంలో అసూయ, వివాదం మరియు అసంతృప్తి యొక్క పర్యవసానాలు ఏమిటి? ఈ సమస్యలను మనం ఎలా అధిగమించగలము?
1 నీఫై 19:22–24
”[వారికి] ప్రయోజనకరముగాను మరియు నేర్చుకొనుటకు ఉండునట్లు” నీఫై లేఖనములను తన కుటుంబంతో పోల్చుకున్నాడు (1 నీఫై 19:23). మీ కుటుంబాన్ని మీతో పోల్చదగిన అనేక కథలు 1 నీఫై 16–18లో ఉన్నాయి. బహుశా మీరు ఈ కథలలో ఒకదాన్ని నటించి చూపించవచ్చు మరియు అది మీ కుటుంబానికి ఎలా వర్తిస్తుందో చర్చించవచ్చు.
1 నీఫై 21:14–16
మరచిపోబడినట్లు భావించేవారికి ఈ వచనాలలోని సందేశం ఎలా సహాయపడుతుంది?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.