రండి, నన్ను అనుసరించండి
జనవరి 20–26. 1 నీఫై 11–15: “పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి”


“జనవరి 20–26. 1 నీఫై 11–15: ”పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“జనవరి 20–26. 1 నీఫై 11–15,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
జనులు జీవ వృక్ష ఫలమును తినుట

అన్ని తియ్యదనాల కంటే తియ్యనైనది, మిగ్వెల్ ఏంజెల్ గొంజాలెజ్ రొమెరొ చేత

జనవరి 20–26

1 నీఫై 11–15

“పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి”

మిమ్మల్ని మీరు 1 నీఫై 11–15లో చూసుకోగలరా? మీకు మరియు మీ కుటుంబానికి ఏ లేఖనభాగాలు చాలా విలువైనవిగా అనిపించాయి?

మీ మనోభావాలను నమోదు చేయండి

దేవుడు తన ప్రవక్త ద్వారా చేయించాల్సిన బృహత్తర కార్యం ఉన్నప్పుడు, ఆయన తరచూ ఆ ప్రవక్తకు బృహత్తరమైన దర్శనము ఇవ్వడం ద్వారా తన పిల్లల కోసం దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి అతనికి సహాయపడతాయి. మోషే “ఈ భూమిని, దాని నివాసులను, పరలోకాలను” కూడా దర్శనంలో చూసెను (మోషే 1:36). అపొస్తలుడైన యోహాను ప్రపంచ చరిత్రను, రక్షకుని రెండవ రాకడను చూసెను (ప్రకటన గ్రంథము చూడండి). తండ్రి కుమారులను జోసెఫ్ స్మిత్ చూసెను (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17–18 చూడండి). రక్షకుడు మరియు ఆయన ప్రేమ యొద్దకు మనం చేయవలసిన ప్రయాణాన్ని ప్రతిబింబించే దర్శనాన్ని లీహై చూసెను.

1 నీఫై 11–14లో నమోదు చేయబడినట్లుగా, రక్షకుని పరిచర్య, వాగ్దాన దేశంలో లీహై సంతతి భవిష్యత్తు, అలాగే దేవుని కార్యము యొక్క కడవరి దిన గమ్యాన్ని నీఫై చూసెను. ఈ దర్శనం నీఫైని తన ముందున్న పనికి సిద్ధం చేయడానికి సహాయపడింది, మరియు అది మిమ్మల్ని సిద్ధం చేయడంలో కూడా సహాయపడుతుంది—ఎందుకనగా దేవుడు తన రాజ్యంలో మీరు చేయాల్సిన ఒక పనిని కలిగియున్నారు. నీఫై చూసిన “గొఱ్ఱెపిల్ల సంఘము యొక్క పరిశుద్ధుల”లో మీరు ఉన్నారు, “వారు భూముఖమంతటిపైన చెదరియుండిరి; వారు గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి.” (1 నీఫై 14:14).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నం

వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు

1 నీఫై 11

దేవుడు తన ప్రేమకు వ్యక్తీకరణగా యేసు క్రీస్తును పంపెను.

తన తండ్రి చూసిన వృక్షం యొక్క అంతరార్థం గ్రహించడంలో నీఫైకి సహాయపడడానికి, ఒక దేవదూత అతనికి “నిత్యుడగు తండ్రి యొక్క కుమారుని” చూపించెను (1 నీఫై 11:21). వృక్షము దేవుని ప్రేమను సూచిస్తున్నదని నీఫై నిశ్చయించుకోవడానికి ఇది దారితీసింది. కానీ దర్శనము ఇంకా ముగియలేదు. మీరు 1 నీఫై 11 చదివి, ధ్యానించినప్పుడు, ఎందుకు యేసు క్రీస్తు దేవుని ప్రేమ యొక్క అంతిమ వ్యక్తీకరణ అని గ్రహించడానికి మీకు సహాయపడేలా మీరు దేనిని కనుగొన్నారు?

లీహై కలలో ఇతర చిహ్నాల గురించి తెలుసుకోవడానికి, 1 నీఫై 11:35–36; 12:16–18; మరియు 15:21–30 చూడండి.

యోహాను 3:16 కూడా చూడండి.

1 నీఫై 12–13

పునఃస్థాపన కొరకు ప్రభువు మార్గం సిద్ధం చేశారు.

నీఫై తన దర్శనంలో చూసిన వాటి ప్రత్యక్షంగా చూడటానికి జీవించి యుండరు. ఈ విషయాలను తెలుసుకోవడం నీఫైకి విలువైనదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ విషయాలను మీరు తెలుసుకోవడం విలువైనదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నీఫై తన దర్శనంలో చూసిన దాని గురించి మీరు చదివే ప్రతిసారీ మీరు ఈ ప్రశ్న అడగవచ్చు.

నీఫై చూసిన కొన్ని సంఘటనలు ఇక్కడ ఉన్నాయి: తన ప్రజల భవిష్యత్తు (అధ్యాయం 12 చూడండి), అమెరికా వలస రాజ్యాలు, అమెరికన్ విప్లవం (అధ్యాయం 13:12–19 చూడండి), గొప్ప విశ్వాస భ్రష్టత్వం (అధ్యాయం 13:20–29 చూడండి), సువార్త యొక్క పునఃస్థాపన (అధ్యాయం 13:32–42 చూడండి).

1 నీఫై 13:1–9; 14:9–11

నీఫై చూసిన “గొప్ప హేయకరమైన సంఘము” అంటే ఏమిటి?

నీఫై వివరించిన “గొప్ప హేయకరమైన సంఘము”, “దేవునిపై నమ్మకాన్ని వ్యతిరేకించే ఏదైనా తత్వశాస్త్రం లేదా సంస్థను సూచిస్తుంది” అని ఎల్డర్ డాల్లిన్ హెచ్. ఓక్స్ వివరించారు. అలాగే, పరిశుద్ధులను తీసుకురావడానికి ఈ ‘సంఘము’ ప్రయత్నించే ‘చెర’, తప్పుడు ఆలోచనల చెరయే గానీ శారీరక నిర్బంధం కాదు” (“దేవునికి సాక్షిగా నిలబడండి,” ఎన్‌సైన్, మార్చి. 2015, 32).

1 నీఫై 13:12.

“అనేక జలములపై” వెళ్లడానికి ఆత్మ “చేత“ నడిపించబడిన ఏ వ్యక్తిని నీఫై చూసెను?

అమెరికాకు తన ప్రసిద్ధ సముద్రయానం చేసే విధంగా పరిశుద్ధాత్మ క్రిస్టాఫర్ కొలంబస్ ను ప్రేరేపిస్తుందని నీఫై చూసెను. మార్చి 14, 1493లో కొలంబస్ ఈ సముద్రయానం గురించి రాశాడు: “ఈ ఘనమైన, అద్భుతమైన ఫలితాలు నేను సాధించిన విజయాలుగా ఆపాదించకూడదు … ; దేవుని సాయం లేకుండా మనిషి తెలివితేటలతో సాధ్యమయ్యేది కాదు, ఇది మానవ ప్రయత్నానికి దేవుని ఆత్మ తోడుగా ప్రసాదించిన అద్భుత శక్తి వలన సాధ్యమైనది, దేవుడు తన ప్రియమైన సేవకుల ప్రార్థనలు వినడం మాత్రమే కాకుండా అసాధ్యమైనవి సాధించడంలో కూడా ఆయన తోడుండి ప్రబోధిస్తారు” (ది ఆనల్స్ ఆఫ్ అమెరికా [ఎన్‌సైక్లోపీడియా బ్రిటానియా, ఇంక్., 1976], 1:5).

1 నీఫై 13:20–42

కడవరి దిన లేఖనము “స్పష్టమైన, ప్రశస్థమైన వాక్యములను” పునఃస్థాపిస్తుంది.

అతను “యూదుల గ్రంథము”గా ప్రస్తావించిన—బైబిలు—“[దాని] నుండి అనేక స్పష్టమైన, ప్రశస్థమైన వాక్యములు తీసివేయబడతాయి” అని నీఫై దర్శనంలో చూసెను (1 నీఫై 13:23, 28). అయినప్పటికీ, దేవుడు ఈ వాక్యములను “ఇతర గ్రంథాలు”—మోర్మన్ గ్రంథము మరియు ఇతర కడవరి దిన లేఖనము ద్వారా పునఃస్థాపిస్తారని కూడా అతను చూసారు (1 నీఫై 13:39–40 చూడుము) మనం బాగా అర్థం చేసుకోవడానికి మోర్మన్ గ్రంథము సహాయపడే కొన్ని ప్రశస్థమైన సత్యాలు ఏవి? ఈ స్పష్టమైన, ప్రశస్థమైన వాక్యములు పునఃస్థాపించబడడం వలన మీ జీవితం ఎలా భిన్నంగా ఉంది?

చిత్రం
వివిధ భాషలలో మోర్మన్ గ్రంథ ప్రతులు

విశ్వాస భ్రష్టత్వ సమయంలో కోల్పోబడిన సువార్త సత్యాలను మోర్మన్ గ్రంథము పునఃస్థాపిస్తుంది.

స్పష్టమైన, ప్రశస్థమైన సత్యాలు,” ఎన్‌సైన్, మార్చి 2008, 68–73; రస్సెల్ ఎమ్. నెల్సన్, “మోర్మన్ గ్రంథము: ఇది లేకుండా మీ జీవితం ఎలా ఉంటుంది?” కూడా చూడుము. ఎన్‌సైన్ లేదా లియహోనా, నవ. 2017, 60–63.

1 నీఫై 15:1–11

నేను మృదువైన హృదయంతో విశ్వాసంతో అడిగితే ప్రభువు నాకు సమాధానం ఇస్తారు.

దేవుడు మీతో మాట్లాడటం లేదని—మీరు వ్యక్తిగత బయల్పాటు అందుకోవడం లేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? తన సోదరులకు ఈ విధంగా అనిపించినప్పుడు నీఫై వారికి ఏమని సలహా ఇచ్చెను? మీరు నీఫై సలహాను మీ జీవితంలో ఎలా అన్వయించగలరు మరియు ఇతరులకు సహాయం చేయడానికి అతని సలహాను ఎలా ఉపయోగించగలరు?

జేకబ్ 4:8; ఆల్మా 5:46; 26:21–22 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నం

కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

1 నీఫై 11–14

మీ కుటుంబం ఈ అధ్యాయాలను చదువుతున్నప్పుడు, అప్పుడప్పుడు ఆగి ఇలాంటి ప్రశ్నలు అడగండి: నీఫై తన దర్శనంలో చూసినది ఏది అతనికి సంతోషాన్ని కలిగించి ఉండవచ్చు? అతనికి విచారం కలిగించినది ఏది? ఎందుకు?

1 నీఫై 13:20–42

మోర్మన్ గ్రంథములోని “స్పష్టమైన, ప్రశస్థమైన” సత్యాల విలువను కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడంలో సహాయపడడానికి, స్పష్టంగా వ్రాయబడిన ఒక సందేశాన్ని గజిబిజిగా వ్రాయబడిన సందేశంతో పోల్చండి. తన సత్యాలు స్పష్టంగా బోధించబడాలని పరలోక తండ్రి ఎందుకు కోరుకుని ఉండవచ్చు? కుటుంబ సభ్యులు మోర్మన్ గ్రంథము నుండి తెలుసుకున్న కొన్ని “స్పష్టమైన, ప్రశస్థమైన” సత్యాల గురించి సాక్ష్యం చెప్పవచ్చు.

1 నీఫై 14:12–15

దేవునితో మన నిబంధనలకు యదార్థముగా జీవించినప్పుడు, ఎందుకు మనం “పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుంటాము?

1 నీఫై 15:8–11

వారు “ప్రభువును విచారించిన” వాటినిబట్టి మీ కుటుంబం ఏ అనుభవాలను పంచుకోగలరు? నీఫై ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకుంటాము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనాన్ని మెరుగుపరచడం

అధ్యయన సహాయాలను ఉపయోగించండి. పాదవివరణలు, విషయదర్శిని మరియు ఇతర అధ్యయన సహాయాలు లేఖనాలకు అంతర్దృష్టిని అందిస్తాయి. ఉదాహరణకు 1 నీఫై 14:20–21 గురించి దేనిని మీరు అర్థము చేసుకొనుటకు పాదవివరణలు సహాయపడతాయి ?

చిత్రం
మరియ, శిశువు యేసు గురించి నీఫై దర్శనం

మరియ గురించి నీఫై దర్శనం, జేమ్ జాన్సన్ చేత

ముద్రించు