రండి, నన్ను అనుసరించండి
జనవరి 13–19. 1 నీఫై 8–10: “రండి, ఫలమును తినండి”


“జనవరి 13–19. 1 నీఫై 8–10: ‘రండి, ఫలమును తినండి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“జనవరి 13–19. 1 నీఫై 8–10,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
జీవవృక్షము గురించి లీహై యొక్క దర్శనము

లీహై స్వప్నము, స్టీవెన్ లాయిడ్ నీల్ చేత

జనవరి 13–19

1 నీఫై 8–10

“రండి, ఫలమును తినండి”

మీరు 1 నీఫై 8–10 చదువుతున్నప్పుడు, లీహై దర్శనంలోని ఏయే సందేశాలు మీకు వర్తిస్తాయో ఆలోచించండి. మీరు పొందిన ఆత్మీయ మనోభావాలను మీ లేఖనాలు, నోటు పుస్తకం లేదా ఈ వనరులో నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఇనుపదండం, అంధకారపు పొగమంచు, విశాల భవనం, “అత్యంత మధురమైన” ఫలంతో నున్న వృక్షం కలిగియున్న లీహై స్వప్నం—రక్షకుని ప్రేమ, ప్రాయశ్చిత్త త్యాగం యొక్క దీవెనలు పొందడానికి ఒక స్ఫూర్తిదాయకమైన ఆహ్వానం. అయినప్పటికీ లీహై దృష్టిలో మాత్రం ఈ దర్శనం అతని కుటుంబానికి సంబంధించినది కూడా: “నేను చూచిన దర్శనమును బట్టి, నీఫై, శామ్‌లను బట్టి కూడ ప్రభువునందు ఆనందించుటకు నాకు కారణము కలదు. … కానీ లేమన్‌, లెముయెల్ మిమ్ములను బట్టి నేను మిక్కిలి భీతి చెందుచున్నాను” (1 నీఫై 8:3–4). లీహై తన దర్శనం గురించి వివరించడం పూర్తి చేసినప్పుడు, “తన మాటలను ఆలకించవలెనని, అట్లయిన ప్రభువు వారికి కనికరముగా నుండునేమోయని” (1 నీఫై 8:37) లేమన్, లెముయెల్‌లను ప్రాధేయపడెను. మీరు లీహై దర్శనాన్ని చాలాసార్లు అధ్యయనం చేసినప్పటికీ, ఈసారి లీహై చేసిన విధంగా ఆలోచించండి—మీరు ఇష్టపడే వ్యక్తి గురించి ఆలోచించండి. ఆ విధంగా చేసినప్పుడు, ఇనుపదండము యొక్క భద్రత, విశాల భవనము యొక్క ప్రమాదాలు, ఫలము యొక్క తియ్యదనము క్రొత్త అర్ధాన్నిస్తాయి. అలాగే, ఈ అద్భుతమైన దర్శనం పొందిన “మృదువైన తండ్రి భావాలను” మీరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నం

వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు

1 నీఫై 8

దేవుని వాక్యము నన్ను రక్షకుని వైపుకు నడిపిస్తుంది మరియు ఆయన ప్రేమను అనుభవించడానికి నాకు సహాయపడుతుంది.

రక్షకుని గురించి తెలుసుకోవడానికి, ఆయన ప్రేమను అనుభూతి చెందడానికి మీ వ్యక్తిగత ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నారో మరియు ఎక్కడికి వెళుతున్నారో ప్రతిబింబించే ఆహ్వానాన్ని లీహై దర్శనం అందిస్తుంది. అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ ఇలా బోధించారు: “లీహై స్వప్నం లేదా దర్శనానికి మీ వరకు ప్రత్యేక అర్థం లేదని మీరు అనుకోవచ్చు, కానీ దానికి పరమార్థం ఉంది. మీరు దీనిలో భాగమే; మనందరం దీనిలో భాగమే ( 1 నీఫై 19:23 చూడండి). లీహై స్వప్నం లేదా దర్శనంలోని ఇనుపదండంలో అన్నీ ఉన్నాయి … కడవరి దిన పరిశుద్ధుడు జీవితపు పరీక్షను అర్థం చేసుకోవాలి” (“లీహై స్వప్నం మరియు మీరు,” న్యూ ఎరా, జనవరి 2015, 2).

1 నీఫై 8 అధ్యయనం చేయడానికి ఒక మార్గంగా ఇక్కడ చూపిన విధంగా ఒక పటాన్ని నింపాల్సి రావచ్చు. సంకేతాల అర్థం తెలుసుకోవడానికి, తన తండ్రి దర్శనాన్ని అర్థం చేసుకోవాలని నీఫై ప్రార్థించినప్పుడు నీఫైకి కలిగిన దర్శనాన్ని సూచించడం సహాయపడుతుంది—ప్రత్యేకించి 1 నీఫై 11:4–25, 32–36; 12:16–18; మరియు 15:21–33, 36 చూడండి. మీరు లీహై దర్శనాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, మీరు ఏమి నేర్చుకోవాలని ప్రభువు కోరుకుంటున్నారో ఆలోచించండి.

లీహై దర్శనంలోని సంకేతం

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

లీహై దర్శనంలోని సంకేతం

వృక్షము మరియు దాని ఫలము (1 నీఫై 8:10–12)

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

దేవుని ప్రేమలో పాలుపంచుకోవడానికి ఇతరులను ఆహ్వానించడానికి నేనేమి చేస్తున్నాను?

లీహై దర్శనంలోని సంకేతం

నది (1 నీఫై 8:13)

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

లీహై దర్శనంలోని సంకేతం

ఇనుపదండము (1 నీఫై 8:19–20, 30)

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

లీహై దర్శనంలోని సంకేతం

అంధకారపు పొగమంచు (1 నీఫై 8:23)

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

లీహై దర్శనంలోని సంకేతం

గొప్ప విశాల భవనం (1 నీఫై 8:26–27, 33)

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

లీహై దర్శనంలోని సంకేతం

అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

డేవిడ్ఎ . బెడ్నార్, “లీహై స్వప్నం: ఇనుపదండమును గట్టిగా పట్టుకోవడం,” ఎన్‌సైన్ లేదా లియహోనా, అక్టో. 2011, 33–37.

చిత్రం
జీవవృక్షము యొక్క ఫలమును ఆరగిస్తున్న లీహై

జీవవృక్షము యొక్క ఫలమును ఆరగిస్తున్న లీహై. జీవవృక్షము, మార్కస్ ఆలాన్ విన్సెంట్ చేత

1 నీఫై 9

నీఫై ఎందుకు రెండు రకాల పలకలు సిద్ధం చేసెను?

నీఫై రెండు గ్రంథాలను సృష్టించేలా చేయడంలో ప్రభువు యొక్క “తెలివైన ఉద్దేశం” శతాబ్దాల తరువాత స్పష్టమైంది. మోర్మన్ గ్రంథము యొక్క మొదటి 116 చేతివ్రాత పేజీలను అనువదించిన తరువాత జోసెఫ్ స్మిత్ ఆ పేజీలను మార్టిన్ హ్యారిస్‌కు ఇచ్చెను, ఆయన వాటిని పోగొట్టుకొనెను (సి&ని 10:1–23 చూడండి). కానీ నీఫై యొక్క రెండవ పలకలలో అదే సమయంలో జరిగిన సంగతులను పొందుపరచెను, ఆ తర్వాత కోల్పోయిన వాటిని తిరిగి అనువదించకుండా ఈ పలకలను అనువదించమని జోసెఫ్ స్మిత్‌ను ప్రభువు ఆదేశించెను. (సి&ని 10:38–45 చూడండి).

1 నీఫై 9లో పేర్కొన్న పలకల గురించి మరింత తెలుసుకోవడానికి, “మోర్మన్ గ్రంథము గురించి సంక్షిప్త వివరణ”; 1 నీఫై 19:1–5; 2 నీఫై 5:29–32; మరియు మోర్మన్ యొక్క వాక్యములు 1:3–9 చూడండి.

1 నీఫై 10:2–16

ప్రాచీన ప్రవక్తలు యేసు క్రీస్తు పరిచర్య గురించి యెరిగియున్నారు మరియు ఆయన గురించి సాక్ష్యమిచ్చారు.

లీహై దర్శనపు వృత్తాంతము అతని కుటుంబంపై ఖచ్చితంగా ముద్ర వేసింది, కాని రక్షకుని పరిచర్య గురించి వారికి బోధించడానికి ఆయన వద్ద ఇంకను ఇతర నిత్య సత్యాలు ఉన్నాయి. మీరు 1 నీఫై 10:2–16 చదువుతున్నప్పుడు లీహై కుటుంబము, మనమందరం ఈ సత్యాలను తెలుసుకోవాలని ప్రభువు ఎందుకు కోరుతున్నారో ఆలోచించండి. మీ ప్రియమైన వారిని రక్షకుని వైపు మరల్చే విధంగా ఆహ్వానించడానికి మీరు ఏమి చెప్పగలరో ఆలోచించండి. లీహై దర్శనము, బోధనలను అధ్యయనం చేసిన తరువాత, “పరిశుద్ధాత్మ శక్తి ద్వారా” నీఫై వలె మీరు ఏమి నేర్చుకోవడానికి ప్రేరణ పొందారు? (1 నీఫై 10:17).

1 నీఫై 10:17–19

నేను శ్రద్ధగా ప్రయత్నిస్తే దేవుడు నాకు సత్యాన్ని బయలుపరుచును.

మీకు అర్థంకాని సువార్త సూత్రాన్ని ఎదుర్కొన్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? లీహై దర్శనానికి నీఫై స్పందించిన విధానం (1 నీఫై 10:17–19; 11:1 చూడండి) మరియు లేమన్, లెముయెల్ స్పందించిన విధానం (1 నీఫై 15:1–10 చూడండి) మధ్య తేడాలను గమనించండి. వారు ఈ విధంగా ఎందుకు స్పందించారు మరియు వారి ప్రతిస్పందనల ఫలితాలేవి?

ఒక సువార్త బోధన నిజమేనా అని మీరు తెలుసుకోవాలనుకున్న సమయం గురించి వ్రాయడానికి ఆలోచించండి. నీఫై అనుసరించిన విధానంతో పోల్చితే మీరు అనుసరించిన విధానం ఎలా ఉంది?

1 నీఫై 2:11–19; సిద్ధాంతము మరియు నిబంధనలు 8:1–3 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నం

కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలం కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

1 నీఫై 8

లీహై దర్శనం గురించి చెప్పడానికి దానిని తిరిగి నటించడం లేదా చిత్రాలు గీయడం, వారి చిత్రాలను ఉపయోగించడం వలన మీ కుటుంబ సభ్యులు ఆనందించవచ్చు. లేదా మీరు ఈ పాఠంతో పాటు ఉన్న లీహై దర్శనం గురించిన కళాకారుడి వర్ణనను చూపించవచ్చు మరియు వివరాలను చర్చించడానికి, ఈ అంశాలు దేనిని సూచిస్తాయో వివరించే లేఖనాల కొరకు చూడడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు. “ది ఐరన్ రాడ్” అనే కీర్తన (కీర్తనలు, సంఖ్య 274) ఈ అధ్యాయానికి చక్కగా సరిపోతుంది. మీరు లీహై దర్శనాన్ని (ChurchofJesusChrist.org లేదా గాస్పెల్ లైబ్రరీ యాప్‌ నందు మోర్మన్ గ్రంథ వీడియోల సేకరణ చూడండి) వివరించే వీడియోను కూడా చూడవచ్చు.

1 నీఫై 8:10–16

యేసు క్రీస్తుకు దగ్గరగా వచ్చి, ఆయన ప్రేమ యొక్క మధురానుభూతి చెందడానికి మనము ఎవరిని ఆహ్వానించగలము? “వారిని [పిలవడానికి]” మనం ఏమి చేయగలం?

1 నీఫై 9:5–6

ఒక ఆజ్ఞకు తగిన కారణాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా మనము దానిని ఎప్పుడు అనుసరించాము? మనం ఎలా ఆశీర్వదించబడ్డాము?

1 నీఫై 10:20–22

భౌతికంగా అపరిశుభ్రంగా ఉండడం, ఆత్మీయంగా అపవిత్రంగా ఉండడాన్ని ఏవిధంగా పోలియుంది? మనం ఆత్మీయంగా పవిత్రంగా ఉన్నామని నిర్ధారించుకోవడానికి మనం ఏమి చేయవచ్చు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచడం

మన జీవితాలకు లేఖనాలు ఎలా వర్తిస్తాయి? లేఖనాలలో ఒక భాగాన్ని చదివిన తరువాత, ఈ భాగం వారికి ఎలా వర్తిస్తుందో పంచుకోవడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. ఉదాహరణకు, మీ కుటుంబ సభ్యులు 1 నీఫై 8:33 చదువుతున్నప్పుడు, “ఎగతాళిగా వేలు చూపించేవారి“ పట్ల ఎలా శ్రద్ధ వహించకూడదో వారు మాట్లాడవచ్చు.

చిత్రం
లీహై దర్శనము

జీవవృ‌క్షము, ఏవన్ ఓక్సన్ చేత

ముద్రించు