రండి, నన్ను అనుసరించండి
జనవరి 6–12. 1 నీఫై 1–7: “నేను వెళ్ళి, చేయుదును”


“జనవరి 6–12. 1 నీఫై 1–7: ‘నేను వెళ్లి, చేస్తాను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ యొక్క గ్రంథము 2020 (2020)

“జనవరి 6–12. 1 నీఫై 1–7,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
లీహై కుటుంబం ఎడారిలో ప్రయాణించుట

లీహై ఎర్ర సముద్రం సమీపంలో ప్రయాణించుట, గ్యారీ స్మిత్ చేత

జనవరి 6–12

1 నీఫై 1–7

“నేను వెళ్ళి, చేయుదును”

నీఫై “దేవుని విషయాలు“ గ్రంథస్తం చేసెను (1 నీఫై 6:3). మీరు నీఫై గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, మీరు కనుగొన్న దేవుని విషయాలపై మరిముఖ్యముగా ఆత్మ నుండి వచ్చు మనోభావాలపై శ్రద్ధ వహించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మోర్మన్ గ్రంథము నిజమైన కుటుంబం ఎదుర్కొనే నిజమైన పోరాటాలతో ప్రారంభమవుతుంది. ఇది క్రీ.పూ 600లో జరిగినది, కాని ఈనాటి కుటుంబాలకు కూడా సుపరిచితంగా అనిపించే విషయాలు ఉంటాయి. ఈ కుటుంబం పెచ్చురిల్లుతున్న హింసాత్మక, దుర్మార్గపు ప్రపంచంలో జీవిస్తోంది, కానీ తనను అనుసరిస్తే, సురక్షిత మార్గం వైపు నడిపిస్తానని ప్రభువు వారికి వాగ్దానం చేసెను. ఈ మార్గంలో వారు మంచి, చెడు అనుభవాలు ఎదుర్కొన్నారు; వారు గొప్ప దీవెనలు, అద్భుతాలు పొందారు, అలాగే సరిసమానమైన పరిమాణంలో వ్యతిరేకతలు, వివాదాలు ఎదుర్కొన్నారు. లేఖనాలలో సువార్తను గడపడానికి ప్రయత్నిస్తున్న ఒక కుటుంబం గురించిన సుదీర్ఘ గాథ అరుదుగా ఉంటుంది: తన కుటుంబంలో విశ్వాసాన్ని ప్రేరేపించడానికి కష్టపడుతున్న ఒక తండ్రి, అతన్ని నమ్మాలో లేదో నిర్ణయించుకోలేక అయోమయంలో ఉన్న కొడుకులు, తన పిల్లల క్షేమం గురించి కలత చెందుతున్న తల్లి, అసూయలు, వివాదాలతో రగిలిపోతున్న సోదరులు—మరియు కొన్నిసార్లు ఒకరినొకరు క్షమించడం. మొత్తమ్మీద, ఈ కుటుంబంలో వారి లోపాలు చూపించబడినప్పటికి—వారు విశ్వాసంతో నడిచిన ఆదర్శనీయ మార్గాలను అనుసరించడంలో—నిజమైన శక్తి ఉంది.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నం

వ్యక్తిగత లేఖన అధ్యయనం కోసం ఉపాయములు

1 నీఫై 1–6

లేఖనాలు ఎంతో విలువైనవి.

మోర్మన్ గ్రంథములో మొదటి ఆరు అధ్యాయాలలో పవిత్ర పుస్తకాలు, పవిత్రమైన గ్రంథాలు, ప్రభువు యొక్క వాక్యము గురించి అనేక పరస్పరసంబందాలు ఉన్నాయి. మీరు 1 నీఫై 1–6 చదువుతున్నప్పుడు, ప్రభువు మాట “అత్యంత విలువైనది” అనే నానుడి గురించి మీరు ఏమి తెలుసుకున్నారు? (1 నీఫై 5:21). ఈ గద్య భాగాలు మీకు గ్రంథాల గురించి ఏమి బోధిస్తున్నాయి? గొప్ప నిబద్ధతతో లేఖనాలను వెతకడానికి మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి?

“లేఖనాల పరంపర” (వీడియో, ChurchofJesusChrist.org) కూడా చూడండి.

1 నీఫై 1:7–15

మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తుంది.

శీర్షిక పేజీలో ప్రకటించిన దానికి నిజాయితీగా కట్టుబడి ఉంటూ—యేసే క్రీస్తని అందరిని ఒప్పించడానికి— మోర్మన్ గ్రంథము రక్షకుని గురించి లీహైకి కలిగిన అద్భుతమైన దర్శనముతో ప్రారంభమవుతుంది. లీహై చూసిన దాని నుండి యేసు క్రీస్తు గురించి మీరు ఏమి నేర్చుకున్నారు? మీ జీవితంలో రక్షకుఢు నిర్వర్తించిన “ఘనమైన మరియు అద్భుతమైన” కార్యాలు ఏమిటి? (1 నీఫై 1:14).

1 నీఫై 2

నేను ప్రభువును ఆశ్రయించి, ఆయనను విశ్వసించినప్పుడు, నా హృదయాన్ని ఆయన మృదుపరచగలరు.

లేమన్, లెముయెల్, నీఫై అందరూ ఒకే కుటుంబంలో పెరిగినప్పటికీ, ఒకే రకమైన అనుభవాలను కలిగి ఉన్నప్పటికీ, ఈ అధ్యాయంలో వారి తండ్రి పొందిన దైవిక నడిపింపుకు వారు స్పందించిన విధానాలలో చాలా వ్యత్యాసం ఉంది. మీరు 1 నీఫై 2 చదువుతున్నప్పుడు, నీఫై సహోదరుల హృదయాలు ఖఠినపరచబడగా, అతని హృదయం ఎందుకు మృదువుగా మారిందో మీరు గుర్తించగలరేమో చూడండి. పరిశుద్ధాత్మ ద్వారా లేదా ఆయన ప్రవక్తల ద్వారా ప్రభువునుండి వచ్చు నడిపింపుకు మీ స్వంత ప్రతిస్పందనల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ప్రభువు మీ హృదయాన్ని ఎప్పుడు మృదువుగా మార్చడం వలన మీరు ఆయన నడిపింపును మరియు సలహాలను మరింత ఇష్టపూర్వకంగా అనుసరిస్తున్నట్లు గ్రహించారు?

1 నీఫై 3–4

దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన నాకు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తారు.

లేబన్ నుండి ఇత్తడి పలకలను పొందమని లీహై, అతని కుటుంబ సభ్యులను ప్రభువు ఆదేశించినప్పుడు, ఈ ఆజ్ఞను ఎలా నెరవేర్చాలో ఆయన నిర్దిష్ట సూచనలు ఇవ్వలేదు. దేవుని నుండి మనం అందుకునే ఇతర ఆజ్ఞలు లేదా వ్యక్తిగత బయల్పాటుల విషయంలో ఇది తరచుగా నిజమవుతుంది, దానివల్ల ఆయన “కష్టమైన కార్యం” కోరారు అనే భావన కూడా మనకు కలుగవచ్చు. (1 నీఫై 3:5). 1 నీఫై 3:7, 15–16లో కనుగొనబడిన ప్రభువు ఆజ్ఞ పట్ల నీఫై ప్రతిస్పందన గురించి మీకు ఏది ప్రేరణ ఇస్తున్నది? “వెళ్ళి, చేయుటకు” మిమ్మల్ని ఆకట్టుకున్న విషయం ఏదైనా ఉందా?

మీరు 1 నీఫై 1–7 అధ్యయనం చేస్తున్నప్పుడు, లీహై, అతని కుటుంబానికి దేవుడు సిద్ధం చేసిన మార్గాలను చూడండి. ఆయన మీ కోసం దీన్ని ఎలా చేశారు?

సామెతలు 3:5–6; 1 నీఫై 17:3; “విధేయత,” సువార్త అంశాలు, topics.ChurchofJesusChrist.org; మోర్మన్ గ్రంథము వీడియోల సేకరణ, ChurchofJesusChrist.org లేదా సువార్త గ్రంథాలయం యాప్‌ను కూడా చూడండి.

1 నీఫై 4:1–3; 5:1–8; 7:6–21

దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం వలన ఆయన ఆజ్ఞలను పాటించటానికి నాకు విశ్వాసాన్ని ఇవ్వగలదు.

లేమన్, లెముయెల్‌లకు సణగాలి అనిపించినప్పుడు, వారిని ప్రోత్సహించడానికి, ఉపదేశించడానికి వారికి సమీపంలో నీఫై, లీహైలు ఉన్నారు. మీకు సణగాలి అనిపించినప్పుడు, నీఫై లీహై మాటలను చదవితే విలువైన సలహాలను పొందవచ్చు, ఆ విధమైన దృక్పథం అలవడవచ్చు. నీఫై, లీహైలు తమ కుటుంబ సభ్యులకు దేవునిపై విశ్వాసం పెంపొందించడానికి ఎలా ప్రయత్నించారు? ( 1 నీఫై 4:1–3; 5:1–8; 7:6–21చూడండి). మరుసటి సారి మీరు సణగాలి లేదా తిరుగుబాటు చెయ్యాలని శోధించబడినప్పుడు మీకు సహాయపడగల వారి ఉదాహరణల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నం

కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలం కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

1 నీఫై 1–7

1 నీఫై 1–7 అంతటా, లీహై, శారయ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనుబంధాలను గమనించడానికి మీరు కుటుంబ సభ్యులను ప్రోత్సహించవచ్చు. మా కుటుంబానికి సహాయపడే ఈ సంబంధాల నుండి మేము ఏమి నేర్చుకోవచ్చు?

చిత్రం
నీఫై, అతని కుటుంబము పలకలను అధ్యయనము చేయుట

నీఫై, అతని కుటుంబం కూడా ప్రవక్త మాటలకు విలువిచ్చారు.

1 నీఫై 2:20

1 నీఫై 2:20 సిద్ధాంతం మోర్మన్ గ్రంథమంతా తరచు పువరావృతమవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు కలిసి మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు దానిని మీ కుటుంబ సభ్యులు వారి జీవితాలకు ఎలా వర్తింపజేయగలరు? బహుశా మీరు ఈ వచనములోని ప్రభువు వాగ్దానాన్ని కలిగి ఉన్న పోస్టర్‌ను తయారు చేసి మీ ఇంటిలో ప్రదర్శించవచ్చు. ప్రభువు ఆజ్ఞలను మీరు పాటించినప్పుడు ఆయన మీ కుటుంబాన్ని వర్ధిల్లునట్లు చెయ్యడాన్ని మీరు ఏవిధంగా చూసారో ఎప్పటికప్పుడు చర్చించడానికి ఇది ఒక జ్ఞాపికగా ఉపయోగపడుతుంది. ఈ అనుభవాలను పోస్టర్‌లో వ్రాయడం పరిగణనలోకి తీసుకోండి.

1 నీఫై 2:11–13; 3:5–7

ప్రభువు ఆజ్ఞల పట్ల లేమన్, లెముయెల్ ప్రతిస్పందన మరియు నీఫై ప్రతిస్పందన మధ్య వ్యత్యాసాన్ని గమనించడం ద్వారా మీ కుటుంబానికి కూడా ప్రయోజనం కలగవచ్చు. ఈ 1 నీఫై 2:11–13; 3:5–7లో సణుగుకొనుట గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం విశ్వాసం కోసం పాటుపడినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

1 నీఫై 3:19–20; 5:10–22; 6

మీ జీవితాలలోని ముఖ్యమైన సంఘటనలు, అనుభవాలకు ఒక గ్రంథాన్ని మొదలుపెట్టుటకు ఈ వచనాలు మీ కుటుంబాన్ని ప్రేరేపించగలవు. నీఫై, లీహైలు వారి కుటుంబ అనుభవాల గురించి ఉంచిన గ్రంథాల మాదిరిగానే మీరు కుటుంబ దినచర్య పుస్తకాన్ని ప్రారంభించవచ్చు. మీ కుటుంబ గ్రంథములో మీరు ఏమి జోడించవచ్చు?

1 నీఫై 7:19–21

ఈ వచనాలలో నీఫై ఉదాహరణ గురించి మనల్ని ఆకట్టుకున్నది ఏమిటి? మనం ఒకరినొకరు “యధార్థముగా క్షమించుకున్నప్పుడు” మన కుటుంబం ఎలా దీవించబడుతుంది ?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచడం

లేఖనాలను స్థిరముగా అధ్యయనం చెయ్యండి. ఇంట్లో అర్ధవంతమైన బోధన కోసం మీ కుటుంబానికి స్థిరమైన అభ్యాస అవకాశాలను సృష్టించడం ఒక కీలకమైన మార్గం. అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా చెప్పారు, “మన జీవితంలో లేఖనాల రోజువారీ పఠనం, ఆచరణతో పోల్చినట్లైతే క్రాష్ కోర్సులు అంత ప్రభావవంతమైనవి కావు” (“మీరు వ్యక్తిగతంగా అత్యుత్తమంగా ఉండండి,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2009, 68).

చిత్రం
తాగియున్న లాబన్‌కు పక్కనే నీఫై నిలబడి యుండుట

నేను ఆత్మ స్వరమును గైకొన్నాను, వాల్టర్ రేన్ చేత

ముద్రించు