రండి, నన్ను అనుసరించండి
డిసెంబర్ 30–జనవరి 5. మోర్మన్ గ్రంథము: “యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన” పరిచయ పేజీలు


“డిసెంబర్ 30–జనవరి 5. మోర్మన్ గ్రంథము: ‘యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన,’” పరిచయ పేజీలు రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథం 2020 (2020)

“డిసెంబర్ 30–జనవరి 5. మోర్మన్ గ్రంథం పరిచయ పేజీలు: “యేసు క్రీస్తు మరొక నిబంధన,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

Mormon writes on the gold plates

డిసెంబర్ 30–జనవరి 5

మోర్మన్ గ్రంథము యొక్క పరిచయ పేజీలు

“యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన”

మీరు 1వ నీఫై ముందు ఉన్న పేజీలను చదవడంతో ప్రారంభిస్తే మోర్మన్ గ్రంథ అధ్యయనం మరింత ఉత్తమంగా అనిపించవచ్చు. మీ సాక్ష్యాన్ని బలపరిచేది ఏమిటి?

మీ మనోభావాలను నమోదు చేయండి

మీరు 1 నీఫై 1వ అధ్యాయంలోకి ప్రవేశించడానికి ముందే, మోర్మన్ గ్రంథము ఒక సాధారణ గ్రంథము కాదని స్పష్టంగా అర్థమవుతుంది. దేవదూతల సందర్శనలు, కొండప్రాంతంలో శతాబ్దాలుగా ఖననం చేయబడిన ఒక పురాతన గ్రంథము, దేవుని శక్తితో గ్రంథాన్ని అనువదించే ఒక సాధారణ రైతుతో సహా అందులోని పరిచయ పేజీలు మిగతా వాటికి భిన్నమైన ఒక నేపథ్య కథను వివరిస్తాయి. మోర్మన్ గ్రంథము కేవలం పురాతన అమెరికా నాగరికతల చరిత్ర మాత్రమే కాదు. ఇది “నిత్య సువార్త యొక్క సంపూర్ణతను” (మోర్మన్ గ్రంథపు పరిచయము), మరియు దేవుడు అది ఏవిధంగా బయటకు రావాలో నిర్దేశించెనో—అది ఎలా వ్రాయబడింది, ఎలా సంరక్షించబడింది మరియు మన కాలానికి ఎలా అందుబాటులోకి ఉంచబడినదో కలిగియుంది. ఈ సంవత్సరం, మీరు మోర్మన్ గ్రంథము చదువుతున్నప్పుడు, దాని గురించి ప్రార్థిస్తూ, అందులోని బోధనలను ఆచరణలో అనుసరిస్తే, మీరు దాని శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు మరియు ముగ్గురు సాక్షులు వారి సాక్ష్యములో చెప్పినట్లుగా “ఇది [నా] దృష్టిలో అద్భుతమైనది” అనే భావన మీకు కలుగుతుంది.

వ్యక్తిగత అధ్యయన చిహ్నం

వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు

మోర్మన్ గ్రంథము శీర్షిక పేజీ

మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు పట్ల నా విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

మోర్మన్ గ్రంథము శీర్షిక పేజీలో కేవలం శీర్షిక మాత్రమే కాకుండా, ఇంకెంతో సమాచారం అందిస్తుంది. ఇతర విషయాలతోపాటు, ఈ పవిత్రమైన గ్రంథము గురించిన అనేక ఉద్దేశాలను జాబితా చేస్తుంది. ఈ ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకుంటూ మీరు ఈ ఏడాది మోర్మన్ గ్రంథము అధ్యయనం చేస్తున్నప్పుడు, ఈ ప్రయోజనాలను సాధించవచ్చని మీకు అనిపించే భాగాలను గమనించండి. ఉదాహరణకు, “యేసే క్రీస్తని, నిత్యుడగు దేవుడని” మీలో నమ్మకం కలిగించడానికి ఏ భాగాలు సహాయపడ్డాయి?

మోర్మన్ గ్రంథము యొక్క పరిచయం

మోర్మన్ గ్రంథము “రక్షణకు సంబంధించిన ప్రణాళికను వివరిస్తుంది.”

రక్షణ ప్రణాళిక అన్నది తన పిల్లలు మహోన్నతస్థితిని పొందాలని, తాను పొందే ఆనందానుభూతి పొందాలని ఆ పరలోకపు తండ్రి రచించిన ప్రణాళిక (2 నీఫై 2:25–26 చూడండి). యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ఈ ప్రణాళికను సాధ్యం చేస్తుంది, మరియు దేవుడు ప్రసాదించిన ప్రతి సిద్ధాంతం, విధి, నిబంధన, ఆజ్ఞ ఈ ప్రణాళికను నెరవేర్చడంలో సహాయపడతాయి.

మీరు రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోవాలనుకుంటే చదవడానికి మోర్మన్ గ్రంథము కంటే మంచి గ్రంథము మరొకటి లేదు. ఇది—వివిధ రకాల పేర్లను ఉపయోగించి—20 కన్నా ఎక్కువ సార్లు దేవుని ప్రణాళికను సూచిస్తుంది. ఈ సంవత్సరం మీ అధ్యయనం సమయంలో, దేవుని ప్రణాళిక ఎప్పుడు ప్రస్తావించబడినది లేదా సూచించబడినది, మోర్మన్ గ్రంథం దాని గురించి ఏమి చెబుతున్నది గమనించండి.

మీరు ప్రారంభించడానికి ఇక్కడ ఒక ప్రోత్సాహకార్యక్రమము ఇవ్వబడింది. కింది భాగాలను చదవండి మరియు దేవుని ప్రణాళిక పిలువబడే విభిన్న పేర్లను జాబితా చేయండి: 2 నీఫై 9:13; 11:5; మరియు ఆల్మా 12:32–34; 24:14; 41:2; 42:15–16. ఈ పేర్లలో ఒక్కొక్కటి తండ్రి ప్రణాళిక గురించి మీకు ఏమి సూచిస్తున్నాయి?

ముగ్గురు సాక్షుల యొక్క సాక్ష్యము”; “ఎనిమిదిమంది సాక్షుల యొక్క సాక్ష్యము

నేను మోర్మన్ గ్రంథానికి సాక్షిని కావచ్చు.

ముగ్గురు సాక్షులు మరియు ఎనిమిది మంది సాక్షులు చూసినట్లుగా మీరు బంగారు పలకలను చూడకపోయినా, మోర్మన్ గ్రంథము నిజమేని పరిశుద్ధాత్మ మీకు సాక్ష్యమిస్తుంది. వారి సాక్ష్యాలు మీ విశ్వాసాన్ని ఎలా బలోపేతం చేస్తాయి? మోర్మన్ గ్రంథము గురించి మీకు తెలిసిన వాటిని “ప్రపంచానికి సాక్ష్యమివ్వడానికి [మీ పేరు] ప్రపంచానికి” ఎలా ఇవ్వగలరు? (“ఎనిమిది మంది సాక్షుల సాక్ష్యం”).

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ సాక్ష్యము

మోర్మన్ గ్రంథము రావడం నిజంగా ఒక అద్భుతం.

మోర్మన్ గ్రంథము ఎక్కడ నుండి వచ్చిందని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీరు ఏమి చెబుతారు? మోర్మన్ గ్రంథాన్ని ప్రపంచంలోకి తీసుకురావడంలో ప్రభువు పాత్రను మీరు ఎలా వివరిస్తారు? మోర్మన్ గ్రంథము రాబోతున్నట్లు జోసెఫ్ స్మిత్ ముందుగానే ఎలా వివరించెను?

ప్రవక్త జోసెఫ్ స్మిత్ సాక్ష్యము

మోర్మన్ గ్రంథము ఎలా అనువదించబడింది?

మోర్మన్ గ్రంథము “దేవుని వరము మరియు శక్తి ద్వారా” అనువదించబడింది. అద్భుత అనువాద ప్రక్రియ గురించి మనకు చాలా వివరాలు తెలియవు, కాని దేవుడు తయారు చేసిన పరికరాలతో సహాయం చేయబడి జోసెఫ్ స్మిత్ ఒక దీర్ఘదర్శి అని మనకు తెలుసు: రెండు నిర్మలమైన రాళ్లు ఊరీము మరియు తుమ్మీము, మరొక రాయిని దీర్ఘదర్శిరాయి అని పిలుస్తారు. జోసెఫ్ ఈ రాళ్ళలో పలకలపై అక్షరాల యొక్క ఆంగ్ల వ్యాఖ్యానం చూసి, తర్వాత అతను అనువాదాన్ని బిగ్గరగా చదివి చెబుతుంటే, పక్కన లేఖకుడు అదంతా గ్రంథస్థం చేశాడు. ఈ పవిత్రమైన రచన అనువాదంలో దేవుని శక్తి స్పష్టంగా ఉందని జోసెఫ్ లేఖకులు ప్రతి ఒక్కరూ సాక్ష్యమిచ్చారు.

“మోర్మన్ గ్రంథ అనువాదం,” సువార్త అంశాలు, topics.ChurchofJesusChrist.org చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నం

కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలం కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

మోర్మన్ గ్రంథము శీర్షిక పేజీ

“యేసే క్రీస్తు అని” మీలో విశ్వాసాన్ని పెంపొందించిన మోర్మన్ గ్రంథములోని వచనాల జాబితాతో మీ కుటుంబం ప్రారంభించవచ్చు మరియు సంవత్సరమంతా దీనికి జోడించుకోవచ్చు. మోర్మన్ గ్రంథాన్ని చదవడం కోసం కుటుంబ ప్రణాళికను రూపొందించడానికి ఇది మంచి సమయం కావచ్చు: మీరు ఎప్పుడు, ఎక్కడ కలిసి చదువుతారు? ప్రతి కుటుంబ సభ్యుడు ఎలా పాల్గొంటారు? అదనపు సహాయం కోసం, ఈ వనరు ప్రారంభంలో “మీ కుటుంబ లేఖన అధ్యయనాన్ని మెరుగుపరచడానికి ఉపాయములు” చూడండి.

మోర్మన్ గ్రంథము యొక్క పరిచయం

కీలకమైన నడిమధ్య రాయి ఏదంటే వంపు పైభాగంలోని చీలిక ఆకారపు రాయి, ఇది ఇతర రాళ్లను కలిపి బిగిస్తుంది. మోర్మన్ గ్రంథము ఏ విధంగా “మన మతానికి అత్యంత కీలకమో” అర్థం చేసుకోవడంలో మీ కుటుంబ సభ్యులకు సహాయపడటానికి, మీరు పైభాగంలోని చీలిక ఆకరాపు రాయితో ఒక వంపును నిర్మించవచ్చు లేదా గీయవచ్చు. కీలకమైన రాయి తొలగించబడితే ఏమి జరుగుతుంది? మనకు మోర్మన్ గ్రంథము లేకపోతే ఏమి జరుగుతుంది? యేసు క్రీస్తుపై మన విశ్వాసానికి మోర్మన్ గ్రంథము అత్యంత కీలకమైన రాయిగా ఎలా చేయగలము?

కీలకమైన రాయిని తగిన స్థానంలో ఉంచుతూ రాతితో నిర్మించిన వంపు కట్టడం

మోర్మన్ గ్రంథము మన మతంలో అత్యంత కీలకమైనది.

ముగ్గురు సాక్షుల యొక్క సాక్ష్యము”; “ఎనిమిదిమంది సాక్షుల యొక్క సాక్ష్యము

మీ కుటుంబ సభ్యులు మోర్మన్ గ్రంథము గురించి వారి స్వంత సాక్ష్యములను వ్రాసి, వాటిపై వారి పేర్లతో సంతకం పెట్టవచ్చు, అదే విధంగా వారి సాక్ష్యములను ఇతరులతో పంచుకునే మార్గాల గురించి ఆలోచించవచ్చు.

ప్రవక్త యైన జోసెఫ్ స్మిత్ సాక్ష్యము

జోసెఫ్ స్మిత్ వృత్తాంతంలో, మోర్మన్ గ్రంథము తీసుకురావడంలో దైవకృప ఉందని మనకు ఏ ఆధారాలు ఉన్నాయి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనం మెరుగుపరచడం

ఒక ప్రవక్త వాగ్దానం. అధ్యక్షులు రసెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు, “మీరు [మోర్మన్ గ్రంథములో] చదివిన విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మీ స్వంత ప్రశ్నలకు మరియు మీ స్వంత జీవితంలో మార్గదర్శకానికి పరలోక ద్వారాలు తెరుచుకుని, అక్కడి నుండి సమాధానాలు అందుతాయని నేను వాగ్దానం చేస్తున్నాను” (“మోర్మన్ గ్రంథము: ఇది లేకుండా మీ జీవితం ఎలా ఉంటుంది?ఎన్‌సైన్లేదా లియహోనా,నవం. 2017, 62–63).

మొరోనై నుండి బంగారు పలకలను అందుకుంటున్న జోసెఫ్

బంగారు పలకలను అందిస్తున్న మొరోనై, రచన గ్యారీ ఎల్. కప్ప్