రండి, నన్ను అనుసరించండి
ప్రవక్తల వాగ్దానాలు


“ప్రవక్తల వాగ్దానాలు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“ప్రవక్తల వాగ్దానాలు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

ప్రవక్తల వాగ్దానాలు

మోర్మన్ గ్రంథ అధ్యయనం మిమ్మల్ని మారుస్తుంది. మీ కుటుంబాన్ని మారుస్తుంది. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము పునఃస్థాపించబడినప్పటి నుండి కడవరి దిన ప్రవక్తలు మోర్మన్ గ్రంథము యొక్క శక్తి గురించి వాగ్దానాలు చేసారు. క్రింది వ్యాఖ్యానాలను ధ్యానించి, వాటిని క్రమంగా సమీక్షించండి. ఈ దీవెనలలో వేటిని మీరు పొందాలనుకుంటున్నారు? మీరు మోర్మన్ గ్రంథము చదువుతున్నప్పుడు, ఈ వాగ్దానాలు మీ జీవితంలో ఎలా నెరవేర్చబడ్డాయో నమోదు చేయడం మరియు ఇతరులతో పంచుకోవడం గురించి ఆలోచించండి.

ప్రవక్త జోసెఫ్ స్మిత్: “నేను సహోదరులకు మోర్మన్‌ గ్రంథము భూమిపైయున్న మరేయితర గ్రంథము కన్నను మిక్కిలి ఖచ్చితమైనదని, మన మతము యొక్క ప్రధాన రాయి అని మరియు ఒక మనుష్యుడు ఏ ఇతర గ్రంథము కన్నను దీని యొక్క సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగునని చెప్పియున్నాను” (సంఘాధ్యక్షుల బోధనలు: జోసెఫ్ స్మిత్ [2007],64).

అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్: “మోర్మన్ గ్రంథము మనకు నిజంగా సత్యాన్ని బోధించినప్పటికి, అది కేవలం సత్యాన్ని మాత్రమే బోధించదు. మోర్మన్ గ్రంథము నిజంగా క్రీస్తు గురించి సాక్ష్యాన్ని ఇచ్చినప్పటికి, అది కేవలం సాక్ష్యాన్ని మాత్రమే ఇవ్వదు. కానీ ఇంకా చాలా ఉంది. ఆ గ్రంథములో ఒక శక్తి ఉంది, ఎప్పుడైతే మీరు ఆ గ్రంథాన్ని శ్రద్ధగా చదవడం మొదలుపెడతారో అప్పటినుంచి మీ జీవితంలోకి ఆ శక్తి ప్రవహిస్తుంది. శోధనను ఎదుర్కోవడానికి గొప్ప శక్తిని మీరు పొందుతారు. మోసాన్ని తప్పించుకునే శక్తిని మీరు పొందుతారు. తిన్నని మరియు ఇరుకైన మార్గంలో నిలిచియండే శక్తిని మీరు పొందుతారు. లేఖనాలు ‘జీవపు మాటలు’ అని పిలువబడ్డాయి (సి&ని 84:85), మరియు ఆ మాట మోర్మన్ గ్రంథములో కంటే మరెక్కడా అంత నిజం కాదు. ఆ మాటల కొరకు మీలో ఆకలి దప్పులు మొదలైతే, మీరు జీవితాన్ని ఎక్కువగా మరింత సమృద్ధిగా కనుగొంటారు” (సంఘాధ్యక్షుల బోధనలు: ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ [2014],141).

అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి: “సహోదర సహోదరీలారా, ఇంతకుముందు ఎన్నిసార్లు చదివినాసరే, మీరు ప్రార్థనాపూర్వకంగా మోర్మన్ గ్రంథాన్ని చదివితే, మీ మనసులోకి దేవుని ఆత్మ మరింత ఎక్కువగా వస్తుందని నేను ప్రమాణం చేస్తున్నాను. ఆయన ఆజ్ఞలకు విధేయతతో నడిచే బలమైన తీర్మానం వస్తుంది, మరియు దేవుని కుమారుడు జీవించి యున్నాడనే బలమైన సాక్ష్యం దొరుకుతుంది” (సంఘాధ్యక్షుల బోధనలు: గార్డన్ బి. హింక్లి [2016], 233).

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్: “ప్రియమైన సహోదర సహోదరీలారా, మీరు ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా మోర్మన్ గ్రంథాన్ని చదివితే, మీరు ప్రతిరోజు మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారని నేను వాగ్దానం చేస్తున్నాను. మీరు చదివిన వాటిని ధ్యానించినప్పుడు, ఆకాశపు వాకిండ్లు తెరుచుకుంటాయి, మీ స్వంత ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి మరియు మీ స్వంత జీవితానికి మార్గం లభిస్తుందని నేను వాగ్దానం చేస్తున్నాను. ప్రతిరోజు మోర్మన్ గ్రంథములో మీరు నిమగ్నమైతే, అశ్లీలత అనే పటుత్వముగల తెగులు మరియు మనసుకు స్తబ్ధత కలిగించు ఇతర వ్యసనాలతో పాటు నేటి చెడుకార్యములనుండి విముక్తి పొందగలుగుతారు అని నేను ప్రమాణం చేస్తున్నాను” (“మోర్మన్ గ్రంథము: అది లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది?ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2017, 62–63).

ముద్రించు