“రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020
రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు ఉపయోగించుట
ఈ వనరు ఎవరి కొరకు?
ఈ వనరు సంఘంలో ఉండే ప్రతి వ్యక్తి మరియు కుటుంబము కొరకు. మీ స్వంతంగా లేదా మీ కుటుంబంతో పాటు—మీరు సువార్తను నేర్చుకోవడానికి ఇది రూపొందించబడింది. మీరు ఇంతకుముందు సువార్తను క్రమం తప్పకుండా చదవనట్లయితే, ఈ వనరు మీరు ప్రారంభించేందుకు సహాయపడగలదు. మీకు ఇదివరకే సువార్తను చదివే మంచి అలవాటు ఉంటే, ఇంకా ఎక్కువ అర్థవంతమైన అనుభవాలను కలిగియుండేందుకు ఈ వనరు సహాయపడగలదు.
ఈ వనరుని నేనెలా ఉపయోగించాలి?
మీకు సహాయపడే రీతిలో ఈ వనరుని ఏ విధంగానైనా ఉపయోగించండి. వ్యక్తిగత మరియు కుటుంబ లేఖన అధ్యయనానికి మార్గదర్శిగా లేక సహాయకారిగా దీనిని మీరు కనుగొంటారు. కుటుంబ గృహ సాయంకాలము కొరకు కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలోనున్న వివరణలు మోర్మన్ గ్రంథములోని ముఖ్య సూత్రాలను నొక్కి చెప్పును, వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు అధ్యయన ఆలోచనలను, కార్యకలాపాలను సూచిస్తాయి మరియు మీ భావాలు నమోదు చేయడానికి స్థలాలను అందిస్తాయి.
మీరు మరియు మీ కుటుంబం ఇప్పటికే సువార్తను క్రమంతప్పక చదువుతూ ఉండవచ్చు. ఉదాహరణకు, ఇన్‌స్టిట్యూట్ తరగతి లేదా సెమినరీ కోసం మీరు మోర్మన్ గ్రంథము కాకుండా వేరే లేఖనాలను చదువుతూ ఉండవచ్చు. రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు, మీరు చేస్తున్న మంచి పనులకు బదులుగా లేక వాటితో పోటీపడేందుకు ఉద్దేశించబడినది కాదు. క్రమం తప్పక మోర్మన్ గ్రంథము నుండి నేర్చుకుంటూనే మీ ఇతర లేఖన అధ్యయన లక్ష్యాలను మీరు పూర్తి చేయగల మార్గాలుండవచ్చు. ఉదాహరణకు, మీ వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు మీరు ఒక లేఖన గ్రంథాన్ని చదువవచ్చు మరియు మీ కుటుంబంతో మోర్మన్ గ్రంథాన్ని చదువవచ్చు (లేదా ఎలాగైనా). దేవుని వాక్యాన్ని మీరు సొంతంగా ఎలా చదవాలో నిర్థారించడానికి ఆత్మ నడిపింపును అనుసరించండి.
సంఘంలో జరిగే దానితో ఈ వనరు ఏ విధమైన సంబంధం కలిగియుంటుంది?
ఈ వనరులోని వివరణలు ఒక వారపు పఠన పట్టిక ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు మరియు రండి, నన్ను అనుసరించండి—సబ్బాతుబడి కొరకు అదే పట్టికను అనుసరిస్తాయి. సువార్తను నేర్చుకొని, జీవించడానికి ఇంటివద్ద మీ ప్రయత్నాలలో సహకరించేందుకు, ఇంటివద్ద మీరు చదువుతున్న లేఖన భాగాల గురించి మీ అనుభవాలను, ఆలోచనలను మరియు ప్రశ్నలను పంచుకోవడానికి సంఘములో మీ బోధకులు అవకాశాన్ని ఇస్తారు.
సబ్బాతుబడి నెలకు రెండు సార్లు మాత్రమే బోధించబడుతుంది, కావున సబ్బాతుబడి బోధకులు వారపు పట్టికను కొనసాగించడానికి వివరణలను వదిలివేయడానికి లేదా కలపడానికి ఎంచుకోవచ్చు. స్టేకు సమావేశం లేదా ఇతర కారణాల వల్ల నియమిత సంఘ సమావేశాలు జరగని వారాలలో కూడా ఇది అవసరం కావచ్చు. ఈ వారాలలో ఇంటివద్ద మోర్మన్ గ్రంథ అధ్యయనాన్ని కొనసాగించడానికి మీరు ఆహ్వానింపబడ్డారు.
నేను పట్టికను అనుసరించాల్సిన అవసరం ఉందా?
ఈ పట్టిక సంవత్సరాంతం లోపు మోర్మన్ గ్రంథము చదవడాన్ని పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది. అంతేకాకుండా మీ వార్డులో మిగిలిన వారితోపాటు అదే పట్టికను అనుసరించడం సంఘంలో అర్థవంతమైన అనుభవాలకు దారితీయగలదు. కానీ పట్టికకు కట్టుబడి ఉండాలనుకోవద్దు; అది మిమ్మల్ని మీరు వేగవంతం చేసుకోవడానికి సహాయపడే మార్గదర్శి మాత్రమే. ముఖ్యమైన విషయం ఏమనగా, మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబంగా సువార్త నేర్చుకుంటున్నారు.