రండి, నన్ను అనుసరించండి
పరివర్తనే మన లక్ష్యం


“పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

తండ్రి మరియు పిల్లలు గొర్రె పిల్లను మేపుట

పరివర్తనే మన లక్ష్యం

సువార్త నేర్చుకోవడం మరియు బోధించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే మన పరివర్తనను అధికము చెయ్యడం మరియు యేసు క్రీస్తు వలె మనం మరింతగా అవ్వడానికి సహాయపడటం. ఈ కారణంగా సువార్తను అధ్యయనం చేసినప్పుడు, మనం కొత్త సమాచారం కోసం చూడటం లేదు; మనం “నూతన సృష్టిగా” మారాలి అని అనుకుంటున్నాము (2 కొరిథీయులకు 5:17). దీని అర్థము మన హృదయాలు, మన అభిప్రాయాలు, మన చర్యలు మరియు మన స్వభావాలు మార్చుకొనుటలో సహాయపడుటకు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై ఆధారపడటం.

కాని మన విశ్వాసాన్ని బలపరచి, పరివర్తన అనే అద్భుతానికి నడిపించే ఆ రకమైన సువార్త అభ్యాసమంతా ఒకేసారి జరగదు. ఇది తరగతి గదుల నుండి వ్యక్తిగత హృదయము మరియు గృహానికి వ్యాపిస్తుంది. దానికి సువార్తను అర్థం చేసుకొని, జీవించుటకు అనుదిన ప్రయత్నాలు అవసరము. నిజమైన పరివర్తనకు పరిశుద్ధాత్మ ప్రభావము అవసరము.

పరిశుద్ధాత్మ మనల్ని సత్యమునకు నడిపించి, ఆ సత్యం గురించి సాక్ష్యమిచ్చును (యోహాను 16:13 చూడండి). ఆయన మన మనస్సులను వెలుగుతో నింపును, మన అవగాహనను వేగవంతము చేయును, సమస్త సత్యమునకు మూలాధారమైన దేవుని బయల్పాటుతో మన హృదయాలను తాకును. పరిశుద్ధాత్మ మన హృదయాలను శుద్ధి చేయును. ఆయన మనల్ని సత్యముతో జీవించేలా చేయును మరియు దాని చేయుటకు గల మార్గాలను మనకు గుసగుసలాడును. నిజంగా, “పరిశుద్ధాత్మ … [మనకు] సమస్తమును బోధించును ” (యోహాను 14:26).

ఈ కారణాల వల్ల సువార్తను జీవించి, నేర్చుకొని, బోధించడానికి చేయు మన ప్రయత్నాలలో మనం మొదటిగా మరి ముఖ్యముగా ఆత్మ యొక్క సహచరత్వాన్ని కోరాలి. ఈ లక్ష్యం మన ఎంపికలను శాసించాలి మరియు మన ఆలోచనల్ని, చర్యల్ని నిర్దేశించాలి. ఏదైతే పరిశుద్ధాత్మ ప్రభావమును ఆహ్వానిస్తుందో దానిని మనం వెతకాలి మరియు ఏదైతే ఆ ప్రభావాన్ని పారద్రోలుతుందో దానిని తిరస్కరించాలి—ఎందుకంటే పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉండుటకు మనం యోగ్యులము కాగలిగితే పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు సన్నిధిలో జీవించుటకు కూడా మనం యోగ్యలము కాగలము.