రండి, నన్ను అనుసరించండి
మీ కుటుంబ లేఖన అధ్యయనం మెరుగుపరచుకొనడానికి ఉపాయాలు


“మీ కుటుంబ లేఖన అధ్యయనం మెరుగుపరచుకొనడానికి ఉపాయాలు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“కుటుంబ లేఖన అధ్యయనం మెరుగుపరచుకొనడానికి ఉపాయాలు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
కుటుంబాలు లేఖనాలను అధ్యయనం చెయ్యడం

మీ కుటుంబ లేఖన అధ్యయనం మెరుగుపరచుకొనడానికి ఉపాయాలు

క్రమబద్ధమైన కుటుంబ లేఖన అధ్యయనం మీ కుటుంబం సువార్తను నేర్చుకోడానికి సహాయపడుటకు ఒక శక్తివంతమైన మార్గం. మీ ప్రయత్నాలలో స్థిరముగా ఉండటంతో పోల్చుకున్నప్పుడు కుటుంబంగా మీరు ఎంతసేపు, ఎంతవరకు చదవడం అనేది అంత ముఖ్యం కాదు. మీ కుటుంబ జీవితంలో లేఖన అధ్యయనాన్ని ఒక ముఖ్యమైన భాగంగా చేసుకొన్నప్పుడు, మీ కుటుంబ సభ్యులు యేసు క్రీస్తుకు దగ్గరగా వచ్చుటకు మరియు ఆయన వాక్యముపైన తమ సాక్ష్యాలను నిర్మించుకొనుటకు సహాయం చేస్తారు.

క్రింది ప్రశ్నలను పరిగణించండి:

  • కుటుంబ సభ్యులు తమంతట తాముగా లేఖనాలను అధ్యయనం చెయ్యడానికి మీరేవిధంగా ప్రోత్సహించగలరు?

  • కుటుంబ సభ్యులు వారు నేర్చుకున్న వాటిని పంచుకొనేలా ప్రోత్సహించడానికి మీరేమి చెయ్యగలరు?

  • ప్రతిరోజూ బోధన సమయంలో మోర్మన్ గ్రంథములో మీరు నేర్చుకొంటున్న సూత్రాలను మీరేవిధంగా నొక్కిచెప్పగలరు?

సువార్త నేర్చుకొనుటకు గృహము ఆదర్శవంతమైన స్థలం అని గుర్తుంచుకోండి. సంఘ తరగతిలో సాధ్యం కాని మార్గాలలో మీరు గృహములో సువార్తను నేర్చుకోవచ్చు మరియు బోధించచ్చు. మీ కుటుంబము లేఖనాలనుండి నేర్చుకొనుటలో సహాయపడుటకు మార్గాలు ఆలోచించినప్పుడు సృజనాత్మకంగా ఉండండి. మీ కుటుంబ లేఖన అధ్యయనాన్ని పెంపొందించడానికి క్రింది ఉపాయాలను అనుసరించండి.

సంగీతాన్ని ఉపయోగించండి

లేఖనాలలో బోధించబడిన సూత్రాలను బలోపేతం చేయడానికి పాటలను పాడండి. ఈ మూలాధారములో అనుబంధం డి లో ప్రతి వారపు సారాంశములో ఇవ్వబడిన సిద్ధాంతములకు సంబంధించి సంగీతాన్ని కలిగియుంది.

చిత్రం
పురుషుడు మరియు బాలిక లేఖనాలు చదువుట

అర్థవంతమైన లేఖనాలను పంచుకోండి

వారి వ్యక్తిగత అధ్యయనంలో వారు అర్థవంతమైనవిగా కనుగొన్న లేఖన పదసముదాయాలను పంచుకొనుటకు కుటుంబ సభ్యులకు సమయాన్ని ఇవ్వండి.

మీ సొంత పదాలను ఉపయోగించండి

మీరు అధ్యయనం చేసే లేఖనాలనుండి వారు నేర్చుకున్న విషయాలను వారి సొంత మాటలతో వివరించమని కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి.

లేఖనాలను మీ జీవితానికి అన్వయించుకోండి

ఒక లేఖన పదసముదాయాన్ని చదివిన తరువాత, ఆ పదసముదాయము వారి జీవితాలలో అన్వయించుకొను మార్గాలను పంచుకోమని కుటుంబ సభ్యులను అడగండి.

ఒక ప్రశ్న అడగండి

కుటుంబ సభ్యుల్ని సువార్త గురించి ఒక ప్రశ్న అడగమని చెప్పండి, తరువాత ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చుటకు సహాయపడే వచనాలను వెతుకుటలో సమయాన్ని గడపండి.

ఒక వాక్యాన్ని ప్రదర్శించండి

మీకు అర్థవంతంగా అనిపించే ఒక వాక్యాన్ని ఎంచుకోండి, కుటుంబ సభ్యులందరు తరచు చూసే ప్రదేశంలో దానిని ఉంచండి. ప్రదర్శించవలసిన వాక్యాన్ని ఎంపిక చెయ్యడానికి మిగిలిన కుటుంబ సభ్యులలో ఒకరి తరువాత మరొకరిని ఆహ్వానించండి.

వాక్యాల జాబితాను తయారు చెయ్యండి

ఒక కుటుంబంగా, రాబోయే వారంలో చర్చించుటకు అనేక వచనాలను ఎంచుకోండి.

వాక్యాలను కంఠస్థం చెయ్యండి

మీ కుటుంబానికి తగిన వాక్యాన్ని ఎంచుకొని, రోజూ దానిని పునరావృతం చెయ్యడం ద్వారా లేదా గుర్తుపెట్టుకునే ఆటను ఆడించడం ద్వారా దానిని కంఠస్థం చెయ్యమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

వస్తు పాఠాలను పంచుకోండి

కుటుంబ సమేతంగా మీరు చదువుతున్న అధ్యాయాలకు, వచనాలకు సంబంధమున్న వస్తువులను కనుక్కోండి. ప్రతి వస్తువు లేఖనాలలో ఉన్న బోధనలకు ఏవిధంగా సంబంధం కలిగి ఉంటుందో మాట్లాడమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

ఒక అంశాన్ని ఎంచుకోండి

కుటుంబ సమేతంగా అధ్యయనము చేసే ఒక అంశాన్ని ఎంపిక చెయ్యడానికి వంతుల వారీగా కుటుంబ సభ్యులను అనుమతించండి. ఆ అంశానికి సంబంధించిన వాక్యాలను కనుగొనుటకు విషయ దీపిక, బైబిల్ నిఘంటువు, లేదా లేఖన దీపిక (scriptures.ChurchofJesusChrist.org) ఉపయోగించండి.

ఒక చిత్రాన్ని గీయండి

కుటుంబ సమేతంగా కొన్ని వచనాలను చదవండి, మరియు మీరు చదివిన దానికి సంబంధించిన చిత్రాన్ని గీయడానికి కుటుంబ సభ్యులకు కొంత సమయం ఇవ్వండి. ప్రతివారు గీసిన చిత్రం గురించి మాట్లాడటానికి సమయం గడపండి.

ఒక కథను నటించండి

ఒక కథ చదివిన తరువాత, దానిని నటించడానికి కుటుంబ సభ్యులను పిలవండి. తరువాత, ఒక వ్యక్తిగా మరియు కుటుంబంగా మీరు అనుభవిస్తున్న పరిస్థితులకు ఆ కథ ఎలా సంబంధాన్ని కలిగి ఉందో తెలపండి.

ఎల్డర్ డేవిడ్ ఏ. బెడ్నార్ ఇలా బోధించారు: “ప్రతి కుటుంబ ప్రార్థన, కుటుంబ లేఖన అధ్యయనము యొక్క ప్రతి భాగము, మరియు ప్రతి కుటుంబ గృహ సాయంత్రము మన ఆత్మ అనే బొమ్మలువేసే వస్త్రముపైన కుంచెతో గీసే ఒక గీత. ఏ ఒక్క సంఘటన కూడా అంత ఆకర్షణీయంగా లేదా జ్ఞాపకార్థంగా కనిపించకపోవచ్చు. కానీ ఏవిధంగా పసుపు, బంగారు మరియు గోధుమ రంగుల గీతలు ఒకదానికి ఒకటి చక్కగా ఇమిడిపోయి ఒక గొప్ప ఆకర్షణీయమైన కళాఖండాన్ని ఉత్పత్తిచేస్తాయో, అదేవిధంగా మన యొక్క స్థిరత్వమైన చిన్న చిన్న పనుల వల్ల ప్రాముఖ్యమైన ఆత్మీయ ఫలితాలకు దారి తీస్తాయి“ (“గృహములో మరింత అక్కరగా, జాగ్రత్తగా ఉండుట,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2009, 19–20).

ముద్రించు