రండి, నన్ను అనుసరించండి
అదనపు వనరులు


“అదనపు వనరులు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“అదనపు వనరులు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

కుటుంబం ఒక ఆట ఆడుతున్నారు

అదనపు వనరులు

ఈ వనరులన్నీ సువార్త లైబ్రరీ యాప్‌లో మరియు ChurchofJesusChrist.org లో దొరుకుతాయి.

కీర్తనలు మరియు పిల్లల పాటల పుస్తకము

పవిత్ర సంగీతం ఆత్మని ఆహ్వానిస్తుంది మరియు గుర్తు పెట్టుకునే విధంగా సిద్ధాంతాలను భోధిస్తుంది. ముద్రించబడిన కీర్తనలు మరియు పిల్లల పాటల పుస్తకము తో పాటు మీకు ఇంకా ఎన్నో కీర్తనలు మరియు పిల్లల పాటల ఆడియోలు మరియు వీడియో రికార్డింగులు music.ChurchofJesusChrist.org లో మరియు పవిత్ర సంగీత యాప్‌లో లభిస్తాయి.

సంఘ పత్రికలు

అందువలన ఫ్రెండ్, న్యూ యెరా, ఎన్‌సైన్ మరియు లియహోనా పత్రికలు రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు నుండి బోధించే సూత్రాలకు అదనపు సహాయాన్ని అందించే కథలు మరియు కార్యక్రమాలను అందిస్తాయి.

మోర్మన్ గ్రంథ కథలు

మోర్మన్ గ్రంథ కథలు మోర్మన్ గ్రంథములో కనుగొనబడు సిద్ధాంతం మరియు కథలను నేర్చుకోవడానికి పిల్లలకు సహాయపడుతుంది. ఈ కథల యొక్క వీడియోలను మరియు కథలను సువార్త లైబ్రరీ యాప్‌లో medialibrary.ChurchofJesusChrist.org లో పొందగలరు.

సెమినరీ మరియు ఇన్‌స్టిట్యూట్ కరదీపికలు

సేమినరి మరియు ఇన్‌స్టిట్యూట్ కరదీపికలు లేఖనాలలో కనిపించే సూత్రాలు మరియు వృత్తాంతాలకు చారిత్రక నేపథ్యం మరియు సిద్ధాంత వ్యాఖ్యానాన్ని అందిస్తాయి.

మీడియా లైబ్రరీ

మోర్మన్ గ్రంథములో కనుగొనబడు సిద్ధాంతములు మరియు కథలను ఊహించుకోవడానికి మీకు మరియు మీ కుటుంబానికి సహాయపడటానికి చిత్రకళ, వీడియోలు, మరియు మిగిలిన మీడియా ఉపయోగపడతాయి. మోర్మన్ గ్రంథ వీడియోలతో కలిపి మోర్మన్ గ్రంథములో సంఘటనలను వర్ణించు సంఘము యొక్క మీడియా వనరుల సముదాయము కొరకు medialibrary.ChurchofJesusChrist.org దర్శించండి. మొబైల్ యాప్ లో కూడా మీడియా లైబ్రరీ అందుబాటులో ఉంటుంది.

సువార్త అంశాలు

topics.ChurchofJesusChrist.org లో సర్వసభ్య సమావేశపు ప్రసంగాలు, వ్యాసాలు, లేఖనాలు మరియు వీడియోల వంటి సహాయక వనరులతో పాటు రకరకాల సువార్త అంశముల గురించి ప్రాథమిక సమాచారాన్ని మీరు కనుగొనవచ్చు. సువార్త ప్రశ్నలకు లోతైన సమాధానాన్ని ఇచ్చు సువార్త అంశాల వ్యాసాలు కూడా మీరు కనుగొనవచ్చు.

విశ్వాసానికి యధార్థముగా నుండుట

సువార్త సూత్రాలను అర్థం చేసుకోవడానికి ఏదైనా సహాయం కావల్సి వస్తే విశ్వాసానికి యధార్థముగా నుండుట చూడండి. ఈ వనరులో సువార్త అంశాలు సులువైన పదాలతో వివరించబడిన ఒక అక్షరక్రమ జాబితాను కలిగియున్నది.