రండి, నన్ను అనుసరించండి
జూన్ 8–14. ఆల్మా 8–12: తన జనులను విమోచించుటకు యేసు క్రీస్తు వచ్చును


జూన్ 8–14. ఆల్మా 8–12: ”తన జనులను విమోచించుటకు యేసు క్రీస్తు వచ్చును,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“జూన్ 8–14. ఆల్మా 8–12,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

ఆల్మా ప్రవచించుట

నిజమైన సిద్ధాంతాన్ని బోధించుట, మైఖేల్ టి. మామ్ చేత

జూన్ 8–14

ఆల్మా 8–12

తన జనులను విమోచించుటకు యేసు క్రీస్తు వచ్చును

లేఖనములను అధ్యయనం చేయడం బయల్పాటును ఆహ్వానిస్తుంది. కాబట్టి ఆల్మా 8–12 ను మీరు చదివినప్పుడు, ఆల్మా మరియు అమ్యులెక్ ల సందేశాల నుండి ఆత్మ మీకు బోధించినప్పుడు ఆయన ప్రభావాలను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

దేవుని కార్యము విఫలము కాదు. కానీ ఆయన పనిలో సహాయపడేందుకు మన ప్రయత్నాలు కొన్నిసార్లు విఫలమైనట్లు కనిపిస్తాయి—కనీసం మనం ఆశించిన ఫలితాలు వెంటనే మనం చూడలేము. కొన్నిసార్లు మనం అమ్మోనైహాలో సువార్తను ప్రవచించినప్పుడు ఆల్మా భావించినట్లు—నిరాకరించబడి, ఉమ్మివేయబడి, మరియు గెంటి వేయబడినట్లు భావించవచ్చు. అయినప్పటికీ ఒక దూత అతడిని తిరిగివెళ్ళి, మరల ప్రయత్నించమని చెప్పినప్పుడు ఆల్మా ధైర్యంతో “వేగంగా తిరిగివెళ్ళాడు” (ఆల్మా 8:18), మరియు దేవుడు అతని ముందు మార్గము సిద్ధపరిచారు. ఆయన ఆల్మాకు తినడానికి తిండి మరియు ఉండేందుకు స్థలమును సిద్ధం చేయడమే కాకుండా, అమ్యులెక్ ను కూడా ఆయన సిద్ధపరిచారు, అతడు సహ శ్రామికుడయ్యాడు, సువార్త యొక్క భీకర సంరక్షకుడు మరియు విశ్వాసము గల స్నేహితుడయ్యాడు. మనం ప్రభువు యొక్క రాజ్యంలో సేవచేస్తున్నప్పుడు, ఎదురుదెబ్బలు మరియు నిరాశలు మనకు ఎదురైనప్పుడు, దేవుడు ఆల్మాకు ఏవిధంగా సహకారమిచ్చి, నడిపించాడో మనం గుర్తుచేసుకోవచ్చు, మరియు కష్ట సమయాల్లో మనకి కూడా దేవుడు సహకారమిచ్చి, నడిపిస్తారని మనం నమ్మవచ్చు.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆల్మా 8

సువార్తను పంచుకోవడానికి నా ప్రయత్నాలలో పట్టుదల మరియు సహనము అవసరం కావచ్చు.

సువార్త గురించి మీ సాక్ష్యాన్ని ఎవరైనా నిరాకరించవచ్చు, దానర్థం మీరు ఆశ వదులుకోవాలని కాదు—ప్రభువు ఆ వ్యక్తిని విడిచిపెట్టరు, మరియు ఏ విధంగా పనిచేయాలనే నడిపింపును ఆయన మీకిస్తారు. ఆల్మా విషయంలో, అమ్మోనైహాలోని జనులు అప్పటికే హింసాత్మకంగా అతడిని నిరాకరించినప్పటికీ, సువార్తను ప్రవచించడానికి తిరిగి అక్కడికి వెళ్ళమని దూత అతడిని ఆజ్ఞాపించెను (ఆల్మా 8:14–16 చూడండి). సవాళ్ళు మరియు వ్యతిరేకత ఉన్నప్పటికీ సువార్తను పంచుకోవడం గురించి ఆల్మా యొక్క మాదిరి నుండి మీరేమి నేర్చుకుంటారు? ఆల్మా 8 లోని ఏ వచనం సువార్తను పంచుకోవాలనే మీ కోరికను పెంచింది?

3 నీఫై 18:30–32; జెఫ్రీ ఆర్. హాలండ్, “The Cost—and Blessings—of Discipleship,” ఎన్ సైన్ లేక లియహోనా, మే 2014, 6–9 కూడా చూడండి.

ఆల్మా 9:18–25; 10:16–23

దేవుడు తన పిల్లలను వారు కలిగియున్న వెలుగు మరియు జ్ఞానము ప్రకారము తీర్పుతీరుస్తారు.

అమ్మోనైహాలో ఉన్న నీఫైయులు ప్రభువు యొక్క సేవకులపట్ల ప్రవర్తించిన తీరు గురించి చదివినప్పుడు, ఒకప్పుడు వారు సువార్తను జీవించు జనులని మరియు ”ప్రభువు చేత అధికముగా అనుగ్రహము పొందిన జనులైయుండెనని” మరచిపోవుట చాలా తేలిక (ఆల్మా 9:20). నిజానికి, అంత గొప్పగా దీవించబడినప్పటికీ వారు తమ హృదయాలను కఠినపరచుకోవడం వలన వారి పరిస్థితి ఎక్కువమట్టుకు అజ్ఞానంలో పాపం చేసిన లేమనీయుల కంటే దారుణంగా ఉందనేది అమ్మోనైహాలోని జనులకు ఆల్మా ఇచ్చిన సందేశంలో ఒక భాగమైయుండెను. దేవుడు తన పిల్లలను ఎలా తీర్పుతీరుస్తారనే దాని గురించి ఈ వ్యత్యాసం మనకేమి బోధిస్తుంది?

నీఫైయులకు దేవుడిచ్చిన గొప్ప దీవెనల గురించి మీరు చదివినప్పుడు (ప్రత్యేకించి ఆల్మా 9:19–23 చూడుము), ఆయన మీకిచ్చిన గొప్ప దీవెనల గురించి ధ్యానించండి. ఈ దీవెనలకు యదార్థంగా ఉండడానికి మీరేమి చేస్తున్నారు? ఏ మార్పులు చేయవలసిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 82:3 కూడా చూడండి.

ఆల్మా 11–12

దేవుని ప్రణాళిక, ఒక విమోచన ప్రణాళిక.

మోర్మన్ గ్రంథ ప్రవక్తలు దేవుని పిల్లల కొరకు ఆయన ప్రణాళికను వివరించడానికి, రక్షణ ప్రణాళిక లేక సంతోషము యొక్క ప్రణాళిక వంటి వివిధ రకాల పేర్లను ఉపయోగించారు. ఆల్మా 11–12 లో, ఆల్మా మరియు అమ్యులెక్ దానిని విమోచన ప్రణాళిక అని పేర్కొన్నారు. మీరు ఈ అధ్యాయాలను చదివినప్పుడు, ప్రణాళికను వివరించడానికి “విమోచన“ అనే పదం ఎందుకు ఉపయోగించబడిందో ధ్యానించండి. ప్రణాళిక యొక్క క్రింది అంశాల గురించి ఆల్మా మరియు అమ్యులెక్ బోధించిన దానిపై మీరు ఒక చిన్న సారాంశము కూడా వ్రాయవచ్చు.

పతనము:

విమోచకుడు:

పశ్చాత్తాపము:

మరణము:

పునరుత్థానము:

తీర్పు:

అమ్యులెక్ మాటలు జనులపై చూపిన ప్రభావాన్ని గమనించండి (ఆల్మా 11:46 చూడండి). ఈ సూత్రాలు అంత శక్తివంతమైన ప్రభావాన్ని కలిగియున్నాయని మీరెందుకు అనుకుంటున్నారు? అవి మీ జీవితాన్ని ఏవిధంగా ప్రభావితం చేసాయి?

డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “The Resurrection of Jesus Christ,” ఎన్ సైన్ లేక లియహోనా, మే 2014, 111–14 కూడా చూడండి.

ఆల్మా 12:8–18

నేను నా హృదయాన్ని కఠినపరచుకోనట్లయితే, నేను దేవుని వాక్యాన్ని ఎక్కువగా పొందగలను.

పరలోక తండ్రి అన్నింటిని మనకు ఎందుకు తెలియజేయరని కొంతమంది ఆశ్చర్యపోతుంటారు. ఆల్మా 12:9–14 లో, దేవుని మర్మములు కొన్నిసార్లు మన నుండి దాచబడడానికి సాధ్యమైన ఒక కారణాన్ని ఆల్మా వివరించాడు. అతడు బోధించిన దానిని ధ్యానించడానికి ఈ ప్రశ్నలు మీకు సహాయపడగలవు:

  • మన హృదయాలను కఠినపరచుకోవడం అంటే అర్థమేమిటి? మీలో ఎప్పుడైనా ఈ ధోరణిని మీరు గమనించారా?

  • తమ హృదయాలను కఠినపరచుకొనిన వారి నుండి ప్రభువు ఎందుకు తన వాక్యాన్ని నిలిపివేస్తారు?

  • “వాక్యము యొక్క అధిక భాగమును పొందే వాగ్దానమును మీరెలా అనుభవించారు”? (ఆల్మా 12:10). ఆ అనుభవం ఎలా ఉంది?

  • దేవుని వాక్యము “(మీలో) కనబడేలా” నిశ్చయపరచడానికి మీరేమి చేయగలరు? (ఆల్మా 12:13). దేవుని వాక్యము మీలో ఉన్నట్లయితే, అది మీ “మాటలు,” “పనులు,” మరియు “ఆలోచనల” మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగియుంటుంది? (ఆల్మా 12:14).

ఈ సూత్రాలకు ఒక ఉదాహరణగా, అమ్యులెక్ ను అమ్మోనైహా లోని ఇతర జనులతో పోల్చండి. ఈ వచనాలలో ఆల్మా బోధించిన దానిని అమ్యులెక్ అనుభవము (ప్రత్యేకించి ఆల్మా 10:1–11 చూడండి) ఏవిధంగా వివరిస్తుంది?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబ సభ్యులతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఆల్మా 8:10–18

కష్టమైనప్పటికీ, ప్రభువుకు “వేగంగా“ (వచనము 18) విధేయులవడం గురించి ఆల్మా నుండి మనమేమి నేర్చుకోగలము? చిన్నపిల్లలతో ఈ సూత్రాన్ని బలంగా చెప్పడానికి, మీరు ఒక ఆట ఆడవచ్చు, అందులో ఒక పని చేయడానికి మీరు సూచనలిచ్చి, కుటుంబ సభ్యులు దానిని ఎంత త్వరగా సాధిస్తారో చూడాలి. ఉదాహరణకు, ఒక వస్త్రాన్ని ఎవరు త్వరగా మడతపెడతారో మీరు చూడవచ్చు.

ఆల్మా 10:1–12

ఈ వచనాలలో అమ్యులెక్ అనుభవం నుండి మనమేమి నేర్చుకోగలము? వినేవారిపై అతని సాక్ష్యము ఎటువంటి ప్రభావాన్ని కలిగియుంది? అమ్యులెక్ మాదిరి నుండి వారు నేర్చుకొనిన దానిపై ఆధారపడి ఈ వారంలో ఏదైనా ఒకటి చేయడానికి ప్రణాళిక చేయమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

ఆల్మా 10:22–23

దుర్మార్గమైన ఒక పట్టణంలో నీతిమంతుల సమూహమొకటి ఎటువంటి ప్రభావాన్ని కలిగియుండగలదనే దాని గురించి ఈ వచనాల నుండి మనమేమి నేర్చుకుంటాము?

ఆల్మా 11:34–37

యేసు క్రీస్తు మనల్ని మన పాపముల లో మరియు మన పాపముల నుండి రక్షించడానికి మధ్య గల తేడా ఏమిటి? ( హీలమన్ 5:10 చూడండి 1 యోహాను 1:9–10 కూడా చూడండి). అమ్యులెక్ బోధించిన దానిని వివరించడానికి, ఎల్డర్ ఆల్లన్డి . హేనీ సందేశము యొక్క ఆరంభంలో మీరు కథను పంచుకోవచ్చు “Remembering in Whom We Have Trusted” (ఎన్ సైన్ లేక లియహోనా, నవం. 2015, 121–23). యేసు క్రీస్తు మనల్ని మన పాపముల నుండి ఏవిధంగా రక్షిస్తారు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లోని ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

కడవరి-దిన ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలు అధ్యయనం చేయండి. లేఖనములలో మీరు కనుగొన్న సత్యాల గురించి కడవరి-దిన ప్రవక్తలు మరియు అపొస్తలులు ఏమి బోధించారో చదవండి. ఉదాహరణకు, ఆల్మా 8–12 లో మీరు ఒక అంశాన్ని గుర్తించి, ఆ అంశము కొరకు ఇటీవలి సర్వ సభ్య సమావేశములో చూడవచ్చు (రక్షకుని విధానంలో బోధించుట, 21 చూడండి).

ఆల్మా, అమ్యులెక్ తో పాటు భుజించుట

ఆల్మా, అమ్యులెక్ తో పాటు భుజించుట యొక్క దృష్టాంతము, డాన్ బర్ర్ చేత