2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జూలై 12–18. సిద్ధాంతము మరియు నిబంధనలు 77–80: “నేను మిమ్ములను నడిపించెదను”


“జూలై 12–18. సిద్ధాంతము మరియు నిబంధనలు 77–80: ‘నేను మిమ్ములను నడిపించెదను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జూలై 12–18. సిద్ధాంతము మరియు నిబంధనలు 77–80,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

యేసును వెంబడించుచున్న గొర్రెలు

ఇంటికి వెళ్ళుట, యాంగ్‌సుంగ్ కిమ్ చేత

జూలై 12–18

సిద్ధాంతము మరియు నిబంధనలు 77–80

“నేను మిమ్ములను నడిపించెదను”

“(అతని) చెవులలో జ్ఞానము గల వాక్యములను పలికెదనని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:2) ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు చెప్పారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 77–80 చదువుతున్నప్పుడు, మీరు పొందే జ్ఞానము గల వాక్యములేవి?

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు క్రీస్తు యొక్క సంఘము పునఃస్థాపించబడిన రెండు సంవత్సరాల లోపు దాని సభ్యత్వము 2,000 మందికి పైగా పెరిగింది మరియు త్వరితగతిన విస్తరిస్తున్నది. 1832 మార్చిలో “సంఘ కార్యకలాపాలు”: బయల్పాటులను ప్రచురించవలసిన అవసరము, సమకూడుటకు భూమి కొనుగోలు మరియు బీదల పట్ల శ్రద్ధ చూపడం గురించి చర్చించడానికి జోసెఫ్ స్మిత్ ఇతర సంఘ నాయకులను కలుసుకున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 78, ప్రకరణ శీర్షిక చూడండి). ఈ అవసరాలను తీర్చడానికి ఒక ఐక్య సంస్థను, అనగా ఈ అంశాలలో ప్రభువు యొక్క “హేతువును ముందుకు తీసుకొనిపోవుటకు” (4వ వచనము) వారి ప్రయత్నాలను జతచేయు సమూహమును ఏర్పాటు చేయడానికి ప్రభువు కొద్దిసంఖ్యలో సంఘ నాయకులను పిలిచారు. కానీ అటువంటి కార్యనిర్వాహక విషయాల్లో కూడా ప్రభువు నిత్య విషయాలపై కేంద్రీకరించారు. చివరకు, దేవుని రాజ్యములో ప్రతిదాని వలె—“సిలెస్టియల్ లోకములో ఒక స్థలమును” మరియు “నిత్యత్వపు ఐశ్వర్యములను” (7, 18 వచనాలు) పొందడానికి ఆయన పిల్లలను సిద్ధపరచడమే ఒక ముద్రణాలయము లేక గిడ్డంగి యొక్క ఉద్దేశము. అనుదిన జీవితపు పనుల మధ్య ఆ దీవెనలను గ్రహించడం ఇప్పుడు కష్టమైనట్లయితే, “సంతోషించుడి, నేను మిమ్ములను నడిపించెదను” (18వ వచనము ) అని ఆయన మనకు అభయమిస్తున్నారు.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 77

ఆయన మర్మములను తెలుసుకోవాలని కోరే వారికి దేవుడు వాటిని బయల్పరుస్తారు.

యాకోబు 1:5 లో ఉన్న “దేవుని అడుగవలెను” అనే ఆహ్వానము జోసెఫ్ స్మిత్‌కు జ్ఞానము కొదువగా ఉన్నప్పుడు, మొదటి దర్శనము జరిగిన పన్నెండేళ్ళ తర్వాత కూడా ఆయనను నడిపించసాగింది. వారు బైబిలు యొక్క ప్రేరేపిత అనువాదంపై పనిచేయుచుండగా ప్రకటనల గ్రంథము గురించి ఆయన మరియు సిడ్నీ రిగ్డన్ సందేహాలు కలిగియున్నప్పుడు, సహజంగానే జోసెఫ్ స్మిత్ దేవుని నుండి జ్ఞానమును కోరారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 77 చదువుతున్నప్పుడు, ప్రకటనల గ్రంథములోని సంబంధిత అధ్యాయాలలో మీకు కలిగిన అంతరార్థములను నమోదు చేయడాన్ని పరిగణించండి.

అదనముగా, మీరు లేఖనాలను చదువుతున్నప్పుడు ప్రవక్త జోసెఫ్ మాదిరిని మీరెలా అనుసరించగలరో ధ్యానించండి. “నేనేమి గ్రహించాలి?” అని మీరు పరలోక తండ్రిని అడుగవచ్చు.

జోసెఫ్ స్మిత్, సిడ్నీ రిగ్డన్‌లు చదువుతున్నారు

బైబిలు యొక్క అనువాదము, లిజ్ లెమన్ స్విండిల్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 78

ఐక్య సంస్థ అంటే ఏమిటి?

ఒహైయో మరియు మిస్సోరిలో సంఘము యొక్క ప్రచురణ మరియు వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి ఐక్య సంస్థ స్థాపించబడింది. ఎదుగుతున్న సంఘము యొక్క భౌతిక అవసరాలను తీర్చడానికి వారి వనరులను ఏకం చేసిన జోసెఫ్ స్మిత్, న్యూయెల్ కే. విట్నీ మరియు ఇతర సంఘ నాయకులను అది కలిగియుంది. దురదృష్టవశాత్తూ, ఐక్య సంస్థ అప్పుల్లో మునిగిపోయింది మరియు అప్పులు సంభాళింప సాధ్యము కానప్పుడు 1834లో రద్దుచేయబడింది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 78:1–7

సంఘము యొక్క “హేతువును ముందుకు తీసుకొనిపోవుటకు” నేను సహాయపడగలను.

ఒక గిడ్డంగిని, ఒక ముద్రణాలయమును నిర్వహించుట “మీరు అవలంబించుచున్న హేతువును ముందుకు తీసుకొనిపోవుటకు సహాయపడుతుందని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:4) ప్రభువు జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులకు చెప్పారు. సంఘము యొక్క “హేతువు” ఏమిటని మీరంటారు? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 78:1–7 చదువుతున్నప్పుడు, దీనిని ధ్యానించండి. ఈ వచనాల గురించి ఆలోచించడం బహుశా మీ సంఘ పిలుపును మీరు నెరవేర్చే విధానాన్ని లేక మీ కుటుంబానికి మీరు సేవ చేసే విధానాన్ని ప్రభావితం చేయగలదు. మీ సేవ ప్రభువు యొక్క “హేతువును ఎలా ముందుకు తీసుకొనిపోగలదు”? “సిలెస్టియల్ లోకములో ఒక స్థలము” కొరకు ఇది మిమ్మల్ని ఎలా సిద్ధం చేస్తోంది? (7వ వచనము).

సిద్ధాంతము మరియు నిబంధనలు 78:17–22

ప్రభువు నన్ను నడిపించును.

బహుశా దేనినైనా “మీరింకా అర్థం చేసుకోలేకపోయినందు వలన” లేక “సహించలేనందువలన” మీరెప్పుడైనా చిన్నపిల్లల వలె భావించారా? (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:17–18). అటువంటి సమయాల్లో మీరు “సంతోషించునట్లు” (18వ వచనము) మీకు సహాయపడగలిగే ఉపదేశము కొరకు ఈ వచనాలలో చూడండి. ప్రభువు కొన్నిసార్లు తన అనుచరులను “చిన్నపిల్లలు” అని ఎందుకు పిలుస్తారని మీరనుకుంటున్నారు? (17వ వచనము). ప్రభువు “మిమ్ములను ఎలా నడిపించెదరని” (18వ వచనము) కూడా మీరు ధ్యానించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 79–80

నేను ఎక్కడ సేవ చేస్తున్నాను అనే దానికంటే దేవునికి సేవ చేయడానికి పిలువబడ్డాను అనేది ముఖ్యమైనది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 80 కు సంబంధించి ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు, “ఒక ప్రత్యేక స్థానములో పనిచేయడానికి నియమించబడడం ఆవశ్యకమైనది మరియు ముఖ్యమైనదే, కానీ పనిచేయడానికి పిలువబడడం కంటే ముఖ్యమైనది కాదు అనేది బహుశా ఈ బయల్పాటులో రక్షకుడు మనకు బోధిస్తున్న పాఠాలలో ఒకటి కావచ్చు” (“Called to the Work,” Ensign or Liahona, May 2017, 68). మీ ప్రస్తుత లేక గత సంఘ పిలుపుల గురించి ఆలోచించండి. ఎల్డర్ బెడ్నార్ మాటలు నిజమని మీరు తెలుసుకొనేలా మీకు సహాయపడిన అనుభవాలేవి? ఇప్పుడే క్రొత్తగా పిలుపును అందుకున్న వారికి సహాయపడగలిగేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 79–80లో ఏ అదనపు పాఠాలను మీరు కనుగొనగలరు?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 77:2.ఈ వచనము చదివిన తర్వాత, కుటుంబ సభ్యులు వారికిష్టమైనవి, దేవుని చేత సృష్టించబడిన జంతువులు, … ప్రాకెడు జీవులు, … (లేక) ఆకాశ పక్షుల చిత్రాలు గీయవచ్చు. ఈ వచనము నుండి దేవుని సృష్టి గురించి మనమేమి నేర్చుకుంటాము? (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:16–20 కూడా చూడండి). ఈ సారాంశముతో పాటు ఉన్న వర్ణచిత్రాన్ని కూడా మీరు ప్రదర్శించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 77:14.యోహాను ఒక పుస్తకమును తినివేసెనని, అది ఇశ్రాయేలును సమకూర్చవలెనను అతని పరిచర్యను సూచించెనని ఈ వచనము వివరిస్తున్నది. ఇశ్రాయేలును సమకూర్చుటలో లేక ప్రభువు మనల్ని చేయమని కోరిన ఇతర విషయాల్లో మన పాత్రను మనమెలా నిర్వర్తించాలనే దాని గురించి తినడమనే సంకేతము దేనిని సూచిస్తుంది? ఒక ఆత్మీయ సత్యాన్ని బోధించడానికి తినడాన్ని ఉపయోగించిన ఇతర లేఖనాలు కొన్ని ఇక్కడున్నాయి: యోహాను 6:48–51; 2 నీఫై 32:3; మొరోనై 4. ఈ చర్చ సమయంలో కలిసి తినడానికి బహుశా మీరు ఒక ప్రియమైన కుటుంబ వంటకాన్ని తయారు చేయవచ్చ

సిద్ధాంతము మరియు నిబంధనలు 78:17–19.వారు కృతజ్ఞత కలిగియున్న దేవుని దీవెనల యొక్క చిత్రాలను కుటుంబ సభ్యులు గీయవచ్చు. ఈ దీవెనల కొరకు మన కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి మనమేమి చేస్తున్నాము? “అన్ని విషయములను కృతజ్ఞతాభావముతో స్వీకరించాలి” (19వ వచనము) అనే ఉపదేశాన్ని మీ కుటుంబము ఎలా అనుసరిస్తున్నదో కూడా మీరు చర్చించవచ్చు. అలా చేసే వారికి ప్రభువు వాగ్దానము చేసినదేమిటి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 79:1.సంఘములో పిలుపులకు మీరు నియమించబడినప్పుడు లేక ప్రత్యేకపరచబడినప్పుడు మీరు పొందిన “శక్తి” గురించి మీ సాక్ష్యమును పంచుకోండి. మీరు సేవ చేస్తున్నప్పుడు ప్రభువు మిమ్మల్ని ఏ ప్రత్యేక బహుమానాలు మరియు ప్రేరేపణతో దీవించారు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Count Your Blessings,” Hymns, no. 241.

మన బోధనను మెరుగుపరచుట

ఒక బొమ్మను గీయండి. ఒక కుటుంబముగా కొన్ని వచనములను మీరు చదువవచ్చు మరియు వారు చదివిన దానికి సంబంధించిన దానిని గీయుటకు కుటుంబ సభ్యులకు సమయాన్నివ్వండి. మీరు నేర్చుకున్న సూత్రాలను మీ కుటుంబానికి గుర్తు చేయడానికి మీ ఇంటిలో చిత్రపటాలను ప్రదర్శించండి.

జంతువులున్న తోట

దేవుని తోట, శామ్ లాలర్ చేత