2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జూన్ 28–జూలై 4. సిద్ధాంతము మరియు నిబంధనలు 71–75: “మీకు విరోధముగా ఏర్పడు ఏ ఆయుధమైనను వర్థిల్లదు”


“జూన్ 28–జూలై 4. సిద్ధాంతము మరియు నిబంధనలు 71–75: ‘మీకు విరోధముగా ఏర్పడు ఏ ఆయుధమైనను వర్థిల్లదు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జూన్ 28–జూలై 4. సిద్ధాంతము మరియు నిబంధనలు 71–75,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

గొర్రెలతో యేసు

గొర్రెలకాపరి హృదయానికి దగ్గరగా, సైమన్ డ్యుయి చేత

జూన్ 28–జూలై 4

సిద్ధాంతము మరియు నిబంధనలు 71–75

“మీకు విరోధముగా ఏర్పడు ఏ ఆయుధమైనను వర్థిల్లదు”

ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ ఇలా బోధించారు, “ఎక్కువ తరచుగా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము గృహములో ప్రార్థన మరియు వ్యక్తిగత లేఖన అధ్యయనముతో ఉండును” (“పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తుకు లోతుగా మరియు శాశ్వతంగా మార్పుచెందుట,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2018, 10).

మీ మనోభావాలను నమోదు చేయండి

చిన్నతనం నుండి జోసెఫ్ స్మిత్ విమర్శకులను, దేవుని కార్యము చేయడానికి అతడు ప్రయత్నించినప్పుడు శత్రువులను ఎదుర్కొన్నాడు. కానీ 1831 చివరలో ఎజ్రా బూత్ బహిరంగంగా సంఘాన్ని విమర్శించడం ప్రారంభించినప్పుడు ఇది మరింత బాధాకరంగా ఉండియుండవచ్చు, ఎందుకంటే ఈ సందర్భంలో విమర్శకుడు పూర్వ విశ్వాసి అయ్యున్నాడు. ఒక స్త్రీని స్వస్థపరచడానికి జోసెఫ్ దేవుని శక్తి ఉపయోగించడాన్ని ఎజ్రా చూసాడు. మిస్సోరిలో సీయోను ప్రదేశాన్ని మొదట చూడడానికి జోసెఫ్‌తో పాటు వెళ్ళడానికి అతడు ఆహ్వానించబడ్డాడు. కానీ ఆ తరువాత అతడు విశ్వాసాన్ని కోల్పోయాడు మరియు ప్రవక్తను కించపరిచే ప్రయత్నంలో ఒహైయో వార్తాపత్రికలో వరుస లేఖలు ప్రచురించాడు. అతని ప్రయత్నాలు పనిచేస్తున్నట్లు కనిపించాయి: ఆ ప్రాంతంలో “సంఘమునకు వ్యతిరేకముగా శత్రుభావములు వృద్ధి చెందాయి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 71, ప్రకరణ శీర్షిక). అటువంటి స్థితిలో విశ్వాసులు ఏమి చేయాలి? ప్రతి సందర్భానికి కేవలం ఒక్కటే సరియైన జవాబు లేనప్పటికీ—1831లో ఈ సందర్భంతో కలిపి—సత్యాన్ని కాపాడడం మరియు “సువార్తను ప్రకటించుట” (1వ వచనము) ద్వారా అపోహలను సరిదిద్దడమే చాలా తరచుగా ప్రభువు యొక్క సమాధానంలో భాగంగా కనిపిస్తుంది. అవును, ప్రభువు కార్యము ఎల్లప్పుడూ విమర్శకులను కలిగియుంటుంది, కానీ చివరకు “(దానికి) విరోధముగా ఏర్పడు ఏ ఆయుధమైనను వర్థిల్లదు” (9వ వచనము).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 71

తన కార్యమును విమర్శించేవారిని ప్రభువు తన స్వకాలములో కలవరపెట్టును.

జనులు సంఘాన్ని లేక దాని నాయకులను విమర్శించడాన్ని లేక ఎగతాళి చేయడాన్ని మనం వినినప్పుడు, ప్రత్యేకించి మనకు తెలిసినవారు మరియు మనం ప్రేమించేవారు ఆ విమర్శ చేత ప్రభావితం చేయబడతారని భయపడినప్పుడు మనం చింతించవచ్చు. 1831లో ఒహైయోలో ఇటువంటిదే జరిగినప్పుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 71వ ప్రకరణ శీర్షిక చూడండి), జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లకు ప్రభువు ఇచ్చిన సందేశము విశ్వాసముతో కూడుకున్నదే కానీ భయముతో కాదు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 71 చదువుతున్నప్పుడు, ప్రభువు మరియు ఆయన కార్యమందు మీ విశ్వాసాన్ని వృద్ధిచేసేలా మీరేమి కనుగొంటారు? ఈ సందర్భంలో ప్రభువు తన సేవకులకు ఇచ్చిన ఉపదేశము గురించి ఏది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 72

బిషప్పులు ప్రభువు రాజ్యము యొక్క ఆత్మీయ మరియు భౌతిక వ్యవహారాల పర్యవేక్షకులు.

న్యూయెల్ కె. విట్నీ సంఘము యొక్క రెండవ బిషప్పుగా సేవచేయడానికి పిలువబడినప్పుడు, ఆయన విధులు నేటి బిషప్పుల విధుల కంటే కొంచెం భిన్నంగా ఉండేవి. ఉదాహరణకు, ఆస్థుల సమర్పణను మరియు మిస్సోరిలో సీయోను ప్రదేశంలో స్థిరపడేందుకు అనుమతులను బిషప్పు విట్నీ పర్యవేక్షించేవారు. కానీ ఆయన పిలుపు మరియు విధుల గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 72లో మీరు చదువుతున్నప్పుడు, వారి విధుల గురించిన వివరాలు కాకపోయినా నేడు బిషప్పులు చేసే పనులతో కొన్ని సంబంధాలను మీరు గమనించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ బిషప్పుకు ఏ విధాలుగా “లెక్క అప్పగిస్తారు”? (5వ వచనము). ఏ విధంగా మీ బిషప్పు “ప్రభువు గిడ్డంగిని నిర్వహిస్తారు” మరియు వార్డు సభ్యుల సమర్పణలను నిర్వహిస్తారు? (verses 10, 12 వచనాలు చూడండి). ఒక బిషప్పు మీకెలా సహాయపడ్డారు?

సువార్త అంశాలు, “Bishop,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

పీపాలు మరియు గోనెసంచులలో ఆహారము

బిషప్పు గిడ్డంగిని నిర్వహిస్తున్న న్యూయెల్ కె. విట్నీ.

సిద్ధాంతము మరియు నిబంధనలు 73

సువార్తను పంచుకోవడానికి నేను అవకాశాలను వెదకగలను.

ఎజ్రా బూత్ చేసిన నష్టాన్ని సరిచేసి (సిద్ధాంతము మరియు నిబంధనలు 71 చూడండి) జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్ తమ సంక్షిప్త బోధనా నియామకం నుండి తిరిగి వచ్చిన తర్వాత, తిరిగి బైబిలు అనువాదపు కార్యమును చేయమని ప్రభువు వారికి చెప్పారు (బైబిలు నిఘంటువు, “జోసెఫ్ స్మిత్ అనువాదం” చూడండి). కానీ వారు సువార్తను బోధించడాన్ని కొనసాగించాలని కూడా ఆయన కోరుకున్నారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 73 చదువుతున్నప్పుడు, మీ జీవితంలో మీ ఇతర బాధ్యతల మధ్య సువార్త బోధనను “సాధ్యమైనంతమట్టుకు” (4వ వచనము) నిరంతర లేక వాస్తవిక భాగంగా మీరెలా చేయగలరో పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 75:1–12

విశ్వాసంతో ఆయన సువార్తను ప్రకటించే వారిని ప్రభువు దీవిస్తారు.

సువార్తను ప్రకటించుటకు “మీరు సర్వలోకమునకు వెళ్ళుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:8) అనే ఆజ్ఞకు స్పందించి, విశ్వాసులైన సువార్తికులు అనేకమంది ఈ ఆజ్ఞను వారెలా నెరవేర్చాలని ప్రభువు కోరుతున్నారనే దాని గురించి అదనపు సమాచారాన్ని వెదికారు. సువార్తను ప్రభావవంతంగా ఎలా బోధించాలో గ్రహించడానికి మీకు సహాయపడేలా ఏ పదాలను, వాక్యభాగాలను మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 75:1–12 లో కనుగొంటారు? విశ్వాసులైన సువార్తికులకు ప్రభువు ఏ దీవెనలను వాగ్దానం చేస్తారు? మీరు సువార్తను పంచుకుంటున్నప్పుడు, ఈ ఉపదేశాలు మరియు దీవెనలు మీకెలా అన్వయిస్తాయో పరిగణించండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 71.సంఘాన్ని, దాని నాయకులను ఇతరులు విమర్శిస్తున్నప్పుడు, ఏమి చేయాలని జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లు అడుగబడ్డారు? దేవుని బయల్పాటులు పొందడానికి జనుల కొరకు మనం ఏవిధంగా “మార్గం సిద్ధపరుస్తాము”? (సిద్ధాంతము మరియు నిబంధనలు 71:4).

సిద్ధాంతము మరియు నిబంధనలు 72:2.బిషప్పులు మన కుటుంబాన్ని ఏవిధంగా దీవించారు? మనం ఏమి చేయాలని మన బిషప్పు అడిగారు మరియు ఆయనను మనం ఏవిధంగా ఆమోదించగలము? బహుశా మీ కుటుంబము ఆయన సేవ కొరకు మీ బిషప్పుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పత్రాన్ని తయారు చేయవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 73:3–4.బైబిలు యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదం గురించి నేర్చుకోవడం వలన మీ కుటుంబము లాభం పొందుతుందా? (బైబిలు నిఘంటువు, “జోసెఫ్ స్మిత్ అనువాదం” చూడండి). జోసెఫ్ స్మిత్ అనువాదంలో సవరించబడిన కొన్ని గ్రంథభాగాలను మీరు పరిశోధించవచ్చు మరియు ప్రవక్త ద్వారా ప్రభువు బయల్పరచిన అమూల్యమైన సత్యాలను చర్చించవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 74:7.యేసు క్రీస్తు మరియు చిన్న పిల్లల గురించి ఈ వచనము మనకేమి బోధిస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 75:3–5, 13, 16.“సోమరిగా ఉండడానికి”, “(మన) శక్తితో పనిచేయడానికి” మధ్య గల తేడా గురించి మాట్లాడడం ద్వారా ఆయనను ఎలా సేవించాలని ప్రభువు మనల్ని కోరుతున్నారో గ్రహించేలా మీ కుటుంబానికి మీరు సహాయపడగలరు. బహుశా మీరు కొన్ని ఇంటి పనులను ఎంపిక చేసి, వాటిని సోమరితనంతో, ఆ తర్వాత వారి పూర్ణ బలముతో చేసి చూపమని కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు. మన పూర్ణ బలముతో మనం ఏవిధంగా ప్రభువుకు సేవ చేయగలము? సిద్ధాంతము మరియు నిబంధనలు 75:3–5, 13, 16 ప్రకారం, విశ్వాసులైన తన సేవకులకు ఆయన ఏమి వాగ్దానం చేసారు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Let Us All Press On,” Hymns, no. 243.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ప్రేరేపించు పదాలు మరియు వాక్యభాగాల కోసం చూడండి. మీరు చదువుతున్నప్పుడు, నిర్దిష్టమైన పదాలు లేక వాక్యభాగాలను ఆత్మ మీ దృష్టికి తీసుకురావచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 71–75 నుండి మిమ్మల్ని ప్రేరేపించు పదాలు లేక వాక్యభాగాలను వ్రాసియుంచడాన్ని పరిగణించండి.

యాజకత్వ నాయకునితో యువకుడు

యాజకత్వ నాయకునితో యువకుడు యొక్క వివరణ, డి. కీత్ లార్సన్ చేత