2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జూన్ 21–27. సిద్ధాంతము మరియు నిబంధనలు 67–70: “ఈ భూలోకమంతటనున్న ఐశ్వర్యమంత విలువైనవి”


“జూన్ 21–27. సిద్ధాంతము మరియు నిబంధనలు 67–70: ‘ఈ భూలోకమంతటనున్న ఐశ్వర్యమంత విలువైనవి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జూన్ 21–27. సిద్ధాంతము మరియు నిబంధనలు 67–70,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

ప్రదర్శన పెట్టెలో బయల్పాటుల చేతివ్రాత ప్రతుల పుస్తకము

జూన్ 21–27

సిద్ధాంతము మరియు నిబంధనలు 67–70

“ఈ భూలోకమంతటనున్న ఐశ్వర్యమంత విలువైనవి”

సిద్ధాంతము మరియు నిబంధనలు లోని బయల్పాటులలో అనేకము ప్రత్యేక సందర్భాలలోనున్న నిర్దిష్టమైన జనులకు ఉద్దేశించబడినప్పటికీ, అవి “సర్వమానవాళి ప్రయోజనము కొరకైనవి” (“సిద్ధాంతము మరియు నిబంధనల గ్రంథము యొక్క సత్యము గురించి పన్నెండుమంది అపొస్తలుల సాక్ష్యము,” సిద్ధాంతము మరియు నిబంధనల పీఠిక). మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు, మీకు ప్రయోజనకరమైన సత్యాలు మరియు సూత్రాల కొరకు చూడండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

1828 నుండి 1831 వరకు ప్రవక్త జోసెఫ్ స్మిత్ ప్రభువు నుండి అనేక బయల్పాటులు పొందారు, అందులో వ్యక్తుల కొరకు దైవిక ఉపదేశము, సంఘమును నిర్వహించడంపై సూచనలు, కడవరి-దినముల యొక్క ప్రేరేపిత దర్శనములు ఉన్నాయి. కానీ పరిశుద్దులలో అనేకమంది వాటిని చదవలేదు. బయల్పాటులు ఇంకా ప్రచురించబడలేదు మరియు అందుబాటులో ఉన్న కొన్ని ప్రతులు విడి కాగితాల మీద చేతితో వ్రాసినవి, అవి సభ్యుల మధ్య వ్యాపించాయి మరియు సువార్తికుల చేత చూట్టూ తీసుకొనిపోబడ్డాయి.

తర్వాత, 1831 నవంబరులో, బయల్పాటుల ప్రచురణ గురించి చర్చించడానికి జోసెఫ్ సంఘ నాయకుల సభ ఏర్పాటు చేసారు. ప్రభువు యొక్క చిత్తమును వెదికిన తర్వాత, ఈ నాయకులు ఆజ్ఞల గ్రంథము—నేటి సిద్ధాంతము మరియు నిబంధనలకు పూర్వగ్రంథము యొక్క ప్రచురణ కొరకు ప్రణాళికలు చేసారు. ప్రతిఒక్కరు జీవించియున్న ప్రవక్త ద్వారా బయల్పరబడిన దేవుని వాక్యమును తమకైతాము త్వరలో చదవగలుగుతారు, అది “మన రక్షకుని రాజ్యపు మర్మముల తాళపుచెవులు మరలా మనుష్యునికి ఇవ్వబడెను“ అనడానికి స్పష్టమైన సాక్ష్యము. ఇవి మరియు ఇతర కారణాలనేకము మూలంగా, అప్పటి మరియు ఇప్పటి పరిశుద్ధులు ఈ బయల్పాటులను “ఈ భూలోకమంతటనున్న ఐశ్వర్యమంత విలువైనవి”గా యెంచుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 70, ప్రకరణ శీర్షిక).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 67:1–9; 68:3–6

దేవుడు తన సేవకులను మరియు ఆయన నామములో వారు మాట్లాడే మాటలను సమర్థిస్తారు.

జోసెఫ్ స్మిత్ ద్వారా పొందబడిన బయల్పాటులను ప్రచురించాలనే నిర్ణయం చాలా సులువైనదిగా కనబడుతుంది, కానీ అది మంచి ఆలోచన అని కొందరు ప్రారంభ సంఘ నాయకులు నమ్మలేదు. ఒక ఆందోళన, బయల్పాటులను వ్రాయడానికి జోసెఫ్ స్మిత్ ఉపయోగించిన భాషలోని దోషములకు సంబంధించినది. ఆ ఆందోళనకు జవాబుగా 67వ ప్రకరణములోని బయల్పాటు వచ్చింది. ప్రవక్తలు మరియు బయల్పాటుల గురించి 1–9 వచనాల నుండి మీరేమి నేర్చుకుంటారు? 68:3–6 నుండి ఏ ఇతర అంతరార్థములను మీరు పొందుతారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 68:1–8

పరిశుద్ధాత్మ నుండి వచ్చు ప్రేరేపణ ప్రభువు యొక్క చిత్తాన్ని ప్రతిబింబిస్తుంది.

“సజీవుడగు దేవుని ఆత్మచేత ఒక జనము నుండి మరియొక జనమునకు, ఒక దేశము నుండి మరియొక దేశమునకు నిత్య సువార్తను ప్రకటించుటకు” (1వ వచనము) ఓర్సన్ హైడ్ మరియు ఇతరులు పిలువబడినప్పుడు ఈ వచనములలోని పదాలు మాట్లాడబడ్డాయి. సువార్తను ప్రకటించడానికి పంపబడిన వారికి 4వ వచనము లోని ప్రకటన ఏవిధంగా సహాయపడుతుంది? ఈ మాటలు మీకు ఎలా వర్తిస్తాయి? ఏదైనా చెప్పడానికి లేక చేయడానికి మీరు “పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినప్పటి” (3వ వచనము) సమయం గురించి ఆలోచించండి. ఆత్మీయ ప్రేరేపణలను అనుసరించడానికి మీకు నమ్మకాన్ని ఇవ్వగలిగేలా ఈ వచనాలలో మీరేమి కనుగొంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–28

తమ పిల్లలకు బోధించే బాధ్యత తల్లిదండ్రులదే.

ప్రాథమిక ప్రధాన అధ్యక్షత్వములో అధ్యక్షురాలైన జాయ్ డి. జోన్స్ ఇలా బోధించారు, “పాపము-నిరోధించు వారిగా అగుటకు పిల్లలకు సహాయపడుటకు ముఖ్యమైనదొకటి—లేఖనాలు, విశ్వాస ప్రమాణములు, యౌవనుల బలము కొరకు కరపత్రము, ప్రాథమిక పాటలు, కీర్తనలు మరియు మన స్వంత వ్యక్తిగత సాక్ష్యముల నుండి— ముఖ్యమైన సువార్త సిద్ధాంతాలను మరియు సూత్రాలను వారి చిన్నతనం నుండే ప్రేమతో వారికి బోధించడం, అది పిల్లలను రక్షకుని వైపు నడిపిస్తుంది” (“పాప-నిరోధక తరము,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2017, 88).

సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–28 ప్రకారం, తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించాలని అధ్యక్షురాలు జోన్స్ చెప్పిన కొన్ని “ముఖ్యమైన సువార్త సిద్ధాంతాలు” ఏవి? ఎందుకు ఇది తల్లిదండ్రులకు ఇవ్వబడిన ముఖ్యమైన బాధ్యత? అతని లేక ఆమె పిల్లలకు ఈ విషయాలను బోధించడానికి తాము అర్హులము కాదని భావించే తల్లి లేక తండ్రికి మీరేమి చెప్తారు?

అధ్యయనం చేస్తున్న కుటుంబము

సువార్త నేర్చుకోవడానికి పిల్లలకు ఇల్లే ఆదర్శవంతమైన ప్రదేశము.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 67:10–14.అసూయ, భయము మరియు గర్వము ప్రభువుకు దగ్గర కాకుండా మనల్ని ఎలా నిరోధిస్తాయి? “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు” ప్రభువు సన్నిధిలో ఎందుకు ఉండలేడు? (12వ వచనము; మోషైయ 3:19 కూడా చూడండి). “(మనము) పరిపూర్ణులగువరకు సహనముతో కొనసాగుటకు” మనల్ని ప్రేరేపించేలా ఈ వచనాలలో మనమేమి కనుగొంటాము? (13వ వచనము).

ఒక కుటుంబంగా మీరు ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ సందేశము, “చివరకు—మీరును పరిపూర్ణులుగా ఉండుము” (ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2017, 40–42) ను కూడా పునర్విమర్శనము చేయవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 68:3–4.ప్రభువు యొక్క సేవకుల మాటలు “ప్రభువు చిత్తమగును,” “ప్రభువు మనస్సు అగును,” మరియు “రక్షణను కలుగజేయు దేవుని శక్తియగును” (4వ వచనము) అని వారి విశ్వాసమును బలపరచిన అనుభవాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. లేక మీ కుటుంబము ఎదుర్కొంటున్న ఒక సమస్యకు అన్వయించబడగలిగే సందేశము కొరకు వారు ఇటీవలి సర్వసభ్య సమావేశాన్ని చూడవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–35.“సీయోను నివాసులకు” ముఖ్యమైన ఉపదేశాన్ని ఈ వచనాలు కలిగియున్నాయి (26వ వచనము). ఈ వచనాలు చదివిన తర్వాత, దేనిని మెరుగుపరచుకోవాలని మనము ప్రేరేపించబడ్డాము? ఈ వచనాలలోని సూత్రాలలో కొన్నింటిని వర్ణించే చిత్రాలను తయారుచేసి, వాటిని మీ ఇల్లంతా దాచిపెట్టడం సరదాగా ఉండవచ్చు. తర్వాత, రాబోయే రోజుల్లో ఎవరైనా ఒక చిత్రాన్ని కనుగొంటే, ఆ సూత్రం గురించి బోధించడానికి దానిని ఒక అవకాశంగా మీరు ఉపయోగించవచ్చు. పిల్లలు ఈ విషయాలు నేర్చుకోవడానికి ఎందుకు ఇల్లే మంచి ప్రదేశము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 69:1–2.అక్కడ సంఘమును నిర్మించడానికి సహాయపడేందుకు కావలసిన డబ్బుతోపాటు ఆలీవర్ కౌడరీ, ప్రవక్త బయల్పాటుల యొక్క చేతివ్రాత ప్రతులను ముద్రించడానికి మిస్సోరికి పంపబడ్డాడు. ఆలీవర్ ప్రయాణం గురించి 1వ వచనములో ప్రభువు ఇచ్చిన ఉపదేశమేమిటి? “నమ్మకముగా, యథార్థముగానుండు” వారితో ఉండుట ఎందుకు ముఖ్యము? (1వ వచనము). మంచి లేక చెడు నిర్ణయాలను చేయడానికి స్నేహితులు మనల్ని ఎప్పుడు ప్రభావితం చేసారు? మనమెలా ఇతరులపై మంచి ప్రభావాన్ని చూపగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 70:1–4.బయల్పాటుల ప్రచురణను చూసుకొనే బాధ్యతను ప్రభువు నిర్దిష్టమైన పెద్దలకు ఇచ్చారు. ఆ ప్రత్యేక బాధ్యత మనకు లేనప్పటికీ, ఏవిధంగా మనము “బయల్పాటులు, ఆజ్ఞలకు గృహనిర్వాహకులుగా” యెంచబడగలము? (3వ వచనము).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Home Can Be a Heaven on Earth,” Hymns, no. 298.

మన బోధనను మెరుగుపరచుట

లేఖనాలను మన జీవితాలకు అన్వయించండి. ఒక లేఖన భాగము చదివిన తర్వాత, దానిని వారి జీవితాలకు అన్వయించమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. ఉదాహరణకు, అవే సువార్త సూత్రాలను కలిపియుండి, వారు ఎదుర్కొన్న అదేవిధమైన సందర్భాల గురించి ఆలోచించమని మీరు వారిని ఆహ్వానించవచ్చు.

గ్రాండిన్ ముద్రణాలయము

సిద్ధాంతము మరియు నిబంధనలకు ముందుగా వచ్చిన ఆజ్ఞల గ్రంథము ఇటువంటి ముద్రణాలయములోనే ముద్రించబడింది.