2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జూన్ 7–13. సిద్ధాంతము మరియు నిబంధనలు 63: “పైనుండి వచ్చునది పవిత్రమైనది”


“జూన్ 7–13. సిద్ధాంతము మరియు నిబంధనలు 63: ‘పైనుండి వచ్చునది పవిత్రమైనది,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జూన్ 7–13. సిద్ధాంతము మరియు నిబంధనలు 63,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
మిస్సోరి ప్రదేశము

మిస్సోరిలోని డేవిస్ కౌంటీలోనున్న స్ప్రింగ్ హిల్, గార్త్ రాబిన్‌సన్ ఓబోర్న్ చేత

జూన్ 7–13

సిద్ధాంతము మరియు నిబంధనలు 63

“పైనుండి వచ్చునది పవిత్రమైనది”

“ప్రార్థన వలన మీరు ఆత్మను పొందుదురు” అని ప్రభువు చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 63:64). మీ అధ్యయనాన్ని నడిపించడానికి ఆత్మ కోసం ప్రార్థించడాన్ని పరిగణించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

సీయోను పట్టణము కొరకు స్థలము ఎంపిక చేయబడింది. సంఘ నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు మరియు పరిశుద్ధులు సమకూడు ప్రదేశంగా దానిని ప్రతిష్ఠించారు. జోసెఫ్ స్మిత్ చరిత్ర ప్రకారము, “ఇప్పుడు సీయోను ప్రదేశము అతి ముఖ్యమైన లౌకిక విషయము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 63, ప్రకరణ శీర్షిక). కానీ సీయోనుపై మిశ్రమ అభిప్రాయాలున్నాయి. అనేకమంది పరిశుద్ధులు మిస్సోరిలో సమకూడడాన్ని ప్రారంభించడానికి ఆతృతగా ఉన్నారు. మరొకప్రక్క, ఎజ్రా బూత్ వంటివారు సీయోను ప్రదేశముతో నిరాశచెంది, వారి అభిప్రాయాలను తెలిపారు. వాస్తవానికి, జోసెఫ్ మిస్సోరి నుండి కర్ట్‌లాండ్‌కు తిరిగి వచ్చినప్పుడు, ఆయన దూరంగా ఉండగా వివాదము మరియు విశ్వాసభ్రష్టత్వము సంఘములోనికి చొరబడ్డాయని ఆయన కనుగొన్నారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 63 లోనున్న బయల్పాటు ఈ పరిస్థితులలో పొందబడింది. ఈ ప్రకరణములో, భూముల కొనుగోలు మరియు పరిశుద్ధులు మిస్సోరికి వెళ్ళడం గురించి ప్రభువు చెప్పారు. కానీ అటువంటి ఆచరణాత్మక విషయాల మధ్య సమయోచితమైన జ్ఞాపకమొకటి ఉన్నది: “ప్రభువైన నేను మాటలాడుచున్నాను మరియు అది గైకొనబడవలెను” (5వ వచనము). ఆయన స్వరము, ఆయన చిత్తము, ఆయన ఆజ్ఞ—అన్నీ “పైనుండి (వస్తాయి)”—వాటిని అశ్రద్ధ చేయరాదు లేక తేలికగా తీసుకోరాదు. అది “పవిత్రమైనది మరియు జాగ్రత్తగా మాట్లాడబడవలెను” (64వ వచనము).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 63:1–6, 32–37

దుష్టులు మరియు తిరుగుబాటుదారులపై ప్రభువు యొక్క కోపము రగులుకున్నది.

ఈ బయల్పాటు పొందబడినప్పుడు, ఆయనను వ్యతిరేకించిన అనేకమంది సంఘసభ్యుల నుండి జోసెఫ్ స్మిత్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు (“Ezra Booth and Isaac Morley,” Revelations in Context, 130–36 చూడండి). “దుష్టులు మరియు తిరుగుబాటుదారులకు” సంబంధించి, సిద్ధాంతము మరియు నిబంధనలు 63:1–6, 32–37లో ప్రభువు ఇచ్చిన హెచ్చరికలేవి? అటువంటి హెచ్చరికలు ఏవిధంగా దేవుని ప్రేమకు సాక్ష్యాలు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 63:7–12

సూచకక్రియలు విశ్వాసం మరియు దేవుని చిత్తం ద్వారా వస్తాయి.

కేవలం సూచకక్రియలు లేక అద్భుతాలు స్థిరమైన విశ్వాసాన్ని పుట్టించవు. 1831 ప్రారంభంలో, బూత్ స్నేహితుడైన ఎల్సా జాన్సన్ చేతిని జోసెఫ్ స్మిత్ అద్భుతరీతిలో స్వస్థపరచడం చూసిన తర్వాత, కర్ట్‌లాండ్‌లో మెథడిస్టు పరిచర్యకుడైన ఎజ్రా బూత్ బాప్తీస్మము పొందాలని నిర్ణయించుకున్నాడు.

అయినప్పటికీ, కేవలం కొద్ది నెలల్లోనే బూత్ తన విశ్వాసాన్ని కోల్పోయి, ప్రవక్తను విమర్శించేవాడిగా మారాడు. అతడు చూసిన అద్భుతాన్ని బట్టి ఇది ఎలా సాధ్యము? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 63:7–12 చదువుతున్నప్పుడు, దీనిని ధ్యానించండి. కొద్దిమంది సూచకక్రియలను “(దేవుని) మహిమకు, మనుష్యుల మేలు కొరకు” (12వ వచనము) ఎందుకు పొందుతారు మరియు ఇతరులు “నాశనము కొరకు” (11వ వచనము) వాటిని ఎందుకు పొందుతారని కూడా మీరు ఆలోచించవచ్చు. మీరు చదివిన దానిని బట్టి, సూచకక్రియల గురించి మీరు ఎలా ఆలోచించాలి మరియు ఎలా భావించాలని ప్రభువు కోరుతున్నారు?

మత్తయి 16:1–4; యోహాను 12:37; మోర్మన్ 9:10–21; ఈథర్ 12:12, 18 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 63:13–23

పవిత్రత అంటే అర్థము, నా ఆలోచనలను మరియు క్రియలను శుద్ధముగా ఉంచుకోవడం.

వ్యభిచారము తప్పు అని చాలామంది ఒప్పుకుంటారు. కానీ, కామపూరితమైన ఆలోచనలు కూడా ఆత్మీయ పర్యవసానాలను సమాధి చేస్తాయని సిద్ధాంతము మరియు నిబంధనలు 63:13–19లో రక్షకుడు స్పష్టం చేసారు. “కామాతురత ఎందుకంత తీవ్రమైన పాపము?” అని ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ అడిగారు. “ఆత్మను పూర్తిగా నాశనం చేసే ప్రభావాన్ని అది మన ఆత్మలపై కలిగియుండడానికి అదనంగా అది ఒక పాపమని నేననుకుంటున్నాను, ఎందుకంటే మర్త్యత్వములో దేవుడు మనకిచ్చే ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన సంబంధాన్ని—స్త్రీ పురుషులు ఒకరిపట్ల ఒకరు కలిగియున్న ప్రేమను, శాశ్వతంగా ఉండేందుకు ఉద్దేశించబడిన కుటుంబంలోనికి పిల్లలను తీసుకురావాలనే దంపతుల కోరికను అది అపవిత్రం చేస్తుంది” (“Place No More for the Enemy of My Soul,” Ensign or Liahona, May 2010, 44).

అపవిత్రమైన ఆలోచనలు మరియు క్రియలను బట్టి పశ్చాత్తాపపడని వారికి కలుగుతాయని సిద్ధాంతము మరియు నిబంధనలు 63:13–19లో ప్రభువు చెప్పిన పర్యవసానాలేవి? విశ్వాసులకు 20 మరియు 23 వచనాలలో రక్షకుడు వాగ్దానం చేస్తున్న దీవెనలను గమనించండి. పవిత్రత యొక్క చట్టానికి లోబడుట వలన మీ జీవితంలో వచ్చిన దీవెనలేవి? శుద్ధముగా ఉండడానికి లేక కావడానికి రక్షకుడు మీకేవిధంగా సహాయపడ్డారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:45; లిండా ఎస్. రీవ్స్, “Worthy of Our Promised Blessings,” Ensign or Liahona, Nov. 2015, 9–11 కూడా చూడండి.

చిత్రం
దేవాలయం వద్ద స్త్రీ పురుషులు

మన ఆలోచనలు, క్రియలు శుద్ధముగా ఉంచుకున్నప్పుడు మనము దీవించబడతాము.

సిద్ధాంతము మరియు నిబంధనలు 63:24–46

ప్రభువు తన పరిశుద్ధుల యొక్క ఆత్మీయ మరియు లౌకిక వ్యవహారాలను నిర్దేశిస్తారు.

సీయోను నిర్మించబడవలసిన ప్రదేశాన్ని ప్రభువు గుర్తించిన తర్వాత, వెళ్ళడం ఎప్పుడు ప్రారంభించాలి మరియు భూమి కొనడానికి డబ్బులు ఎక్కడనుండి తీసుకురావాలనే దానిపై ఒహైయోలోని పరిశుద్ధులకు ఇంకా నడిపింపు అవసరమైంది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 63:24–46 చదువుతున్నప్పుడు, సీయోను గురించి ప్రభువు ఇచ్చిన ఆత్మీయ మరియు లౌకిక నిర్దేశం కొరకు చూడండి. ప్రభువు మీకిచ్చిన ఆత్మీయ మరియు లౌకిక నిర్దేశం ఏమిటి?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 63:7–12.ఎల్సా జాన్సన్ స్వస్థపరచబడడాన్ని చూసినప్పటికీ ఎజ్రా బూత్ సంఘాన్ని విడిచివెళ్ళే కథ (“వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు” మరియు ఈ సారాంశముతో పాటు ఉన్న కళాకృతిలో సంక్షిప్త వివరణలు చూడండి), అద్భుతాల గురించి చర్చను ప్రేరేపించవచ్చు. మీ కుటుంబము లేక మీ కుటుంబ చరిత్ర నుండి అనుభవాలతో కలిపి, వారి విశ్వాసాన్ని బలపరచిన అద్భుతాల గురించి మీ కుటుంబ సభ్యులు మాట్లాడవచ్చు. ఈ అద్భుతాలను పొందడానికి కావలసిన విశ్వాసాన్ని వారెలా సాధన చేసారు? విశ్వాసము మరియు అద్భుతాల మధ్య సంబంధం గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 63:7–12 ఏమి బోధిస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 63:13–19.అశ్లీలసాహిత్యంతో పాటు అయోగ్యమైన ప్రభావాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోగలము? (AddressingPornography.ChurchofJesusChrist.org వద్ద మీరు కుటుంబాల కొరకు అనేక సహాయకారిక వనరులను కనుగొనగలరు.) పవిత్రత యొక్క చట్టాన్ని జీవించడం వలన వచ్చే దీవెనలేవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 63:23.“రాజ్యపు మర్మములు” లేక సువార్త సత్యాలు ఏవిధంగా “జీవజలపు ఊట” వంటివో గ్రహించడానికి మీ కుటుంబానికి మీరెలా సహాయపడగలరు? ఉదాహరణకు, మీరు దగ్గరలోని నీటిచెలమ లేక నది వద్దకు ప్రయాణించవచ్చు (లేక అటువంటి ఒక వీడియో లేక చిత్రాన్ని చూపవచ్చు). సువార్త సత్యాలు నీటివలె ఎట్లున్నాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 63:58.63వ ప్రకరణములో మనం కనుగొనే హెచ్చరికలేవి? నేడు మన సంఘ నాయకుల నుండి మనం వింటున్న హెచ్చరికలలో కొన్ని ఏవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 63:58–64.అమూల్యమైన కుటుంబ నిధినొకదానిని మీ కుటుంబానికి చూపండి. ఇంత విలువైనవి కాని ఇతర వస్తువుల కంటే భిన్నంగా ఈ వస్తువును మనమెలా చూసుకుంటాము? పవిత్రమైన వాటిపట్ల భక్తి చూపడానికి మనం ఏమి చేయగలమనే దాని గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 63:58–64 మనకు ఏమి బోధిస్తుంది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Reverence Is Love,” Children’s Songbook, 31.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీరు నేర్చుకొనే దాని ప్రకారం జీవించండి. సువార్తను గ్రహించడం నుండి వచ్చే ఆనందాన్ని మీరు అనుభవించినప్పుడు, మీరు నేర్చుకొన్న దానిని అన్వయించాలని మీరు కోరుకుంటారు. మీ గ్రహింపుకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించండి. ఆవిధంగా చేయడం మీ విశ్వాసము, జ్ఞానము మరియు సాక్ష్యాన్ని బలపరుస్తుంది” (Preach My Gospel, 19).

చిత్రం
స్త్రీ చేతిని పట్టుకున్న జోసెఫ్ స్మిత్

ఎల్సా జాన్సన్ భుజాన్ని స్వస్థపరచుట, శామ్ లాలర్ చేత

ముద్రించు