2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
సెప్టెంబరు 6–12. సిద్ధాంతము మరియు నిబంధనలు 98–101: “ఊరకుండుడి, నేనే దేవుడనని తెలిసికొనుడి”


“సెప్టెంబరు 6–12. సిద్ధాంతము మరియు నిబంధనలు 98–101: ‘ఊరకుండుడి, నేనే దేవుడనని తెలిసికొనుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“సెప్టెంబరు 6–12. సిద్ధాంతము మరియు నిబంధనలు 98–101,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
అల్లరిమూక నుండి పారిపోతున్న పరిశుద్ధులు

సి.సి.ఎ. క్రిస్టెన్సన్ (1831–1912), Saints Driven from Jackson County Missouri (మిస్సోరిలోని జాక్సన్ కౌంటీ నుండి పరిశుద్ధులు తరుమబడ్డారు), c.1878, tempera on muslin, 77¼×113 inches (సుమారు 1878, 77¼×113 అంగుళాల బట్ట మీద శాశ్వతచిత్రం). బ్రిగం యంగ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, సి.సి.ఎ. క్రిస్టెన్సన్ యొక్క మనుమల బహుమానము, 1970

సెప్టెంబరు 6–12

సిద్ధాంతము మరియు నిబంధనలు 98–101

“ఊరకుండుడి, నేనే దేవుడనని తెలిసికొనుడి”

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 98–101 చదువుతున్నప్పుడు, మీకు వచ్చే ఆలోచనలు మరియు మనోభావాలపట్ల శ్రద్ధ వహించండి. వాటిపై పనిచేయడం మీరు ఎలాంటి వ్యక్తిగా కావాలని దేవుడు కోరుతున్నారో అలాంటి వ్యక్తిగా మారడంలో మీకెలా సహాయపడవచ్చు?

మీ మనోభావాలను నమోదు చేయండి

1830లలో పరిశుద్ధులకు మిస్సోరిలోని ఇండిపెండెన్స్ నిజంగా వాగ్దానదేశము. అది సీయోను యొక్క “కేంద్ర ప్రదేశము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 57:3 చూడండి)—భూమిపై దేవుని పట్టణము—దానిని నిర్మించడానికి వారు గొప్ప త్యాగాలు చేస్తున్నారు. వారి దృష్టిలో అక్కడ పరిశుద్ధులు సమకూడడం అనేది రెండవ రాకడ కొరకు ఉత్సాహభరితమైన, మహిమకరమైన ఆరంభము. కానీ ఆ ప్రాంతంలో వారి పొరుగువారు దానిని భిన్నంగా చూసారు. దేవుడు ఆ ప్రాంతాన్ని పరిశుద్ధులకు ఇచ్చారనే ఆరోపణను వారు అంగీకరించలేదు మరియు తెలియని మతానికి చెందిన అనేకమంది అంత త్వరగా ఆ ప్రాంతానికి తరలిరావడం వల్ల కలిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలతో వారు అసౌకర్యంగా భావించారు. త్వరలోనే వారి చింత బెదిరింపులుగా, బెదిరింపులు హింస మరియు దౌర్జన్యంగా మారాయి. 1833 జూలైలో, సంఘ ముద్రణ కార్యాలయము ధ్వంసం చేయబడింది మరియు నవంబరులో పరిశుద్ధులు మిస్సోరిలోని జాక్సన్ కౌంటీలో వారి గృహాలను విడిచిపెట్టడానికి బలవంతం చేయబడ్డారు.

జోసెఫ్ స్మిత్ 800 మైళ్ళ దూరంలో కర్ట్‌లాండ్‌లో ఉన్నారు మరియు ఈ వార్త ఆయనను చేరడానికి కొన్ని వారాలు పట్టింది. కానీ, ఏమి జరుగుతున్నదో ప్రభువుకు తెలుసు మరియు పరిశుద్ధులను ఓదార్చే శాంతి మరియు ప్రోత్సాహక సూత్రాలను —మనం హింసను ఎదుర్కొన్నప్పుడు, నీతివంతమైన మన కోరికలు నెరవేరనప్పుడు లేదా ఏదో ఒక రకంగా, చివరకు మన అనుదిన శ్రమలు “(మన) మేలు కొరకు పనిచేయునని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 98:3) మనకు గుర్తుచేయబడడం అవసరమైనప్పుడు కూడా మనకు సహాయపడగల సూత్రాలను ఆయన తన ప్రవక్తకు బయల్పరిచారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 98:1–3, 11–14; 101:1–16

నా శ్రమలు నా మేలు కొరకు పనిచేయగలవు.

జీవితంలో మన కష్టాలలో కొన్ని మన స్వంత ఎంపికల వలన కలుగుతాయి. మిగిలినవి ఇతరుల ఎంపికల వలన కలుగుతాయి. కొన్నిసార్లు ఎవరినీ నిందించలేము—చెడ్డ విషయాలు జరుగుతాయి, అంతే. కారణంతో సంబంధం లేకుండా, దైవిక ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి ప్రతికూలత సహాయపడగలదు. సిద్ధాంతము మరియు నిబంధనలు 98:1–3, 11–14 మరియు 101:1–16లో పరిశుద్ధుల కష్టాల గురించి ప్రభువు చెప్పిన దానిని మీరు చదువుతున్నప్పుడు, మీ శ్రమలలో మీకు సహాయపడగలిగేలా మీరేమి కనుగొంటారు? మీరు ఎదుర్కొనే సవాళ్ళను మీరు చూసే విధానాన్ని ఈ వచనాలు ఎలా ప్రభావితం చేయగలవు? మీ శ్రమలు ఏవిధంగా మీ మేలు కొరకు పనిచేసాయో మరియు మీ జీవితంలో దేవుని ఉద్దేశ్యాలను సాధించాయో ధ్యానించండి.

2 నీఫై 2:2; సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 98:23–48

ఆయన మార్గములో సమాధానాన్ని వెదకమని ప్రభువు నన్ను కోరుతున్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 98:23–48లో ఉన్న ప్రతిదీ ఇతరులతో మీ వ్యక్తిగత సంభాషణలకు అన్వయించబడనప్పటికీ, ఇతరులు మీకు అన్యాయం చేసినప్పుడు మిమ్మల్ని నడిపించేలా మీరు ఏ సూత్రాలను కనుగొంటారు? మిస్సోరిలోని వివాదాన్ని పరిశుద్ధులు ఎలా పరిష్కరించాలని ప్రభువు కోరుకున్నారో వివరించే పదాలు లేదా వాక్యభాగాలను గుర్తించడం సహాయకరంగా ఉండవచ్చు.

జెఫ్రీ ఆర్. హాలెండ్, “సమాధానపరచు పరిచర్య,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవ. 2018, 77–79 కూడా చూడండి.

చిత్రం
యేసు క్రీస్తు

క్రీస్తు మరియు ధనవంతుడైన యౌవన అధికారి నుండి వివరణ, హీన్రిచ్ హాఫ్‌మాన్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 100

తనను సేవించేవారి పట్ల ప్రభువు శ్రద్ధ వహిస్తారు.

మిస్సోరిలోని హింస గురించి జోసెఫ్ తెలుసుకున్న కొన్ని వారాల తర్వాత, తన కొడుకులతో సువార్త పంచుకోవడానికి కెనడాకు ప్రయాణించమని క్రొత్తగా పరివర్తన చెందిన ఒకరు ఆయనను అడిగారు. ప్రత్యేకించి తన కుటుంబానికి, సంఘానికి బెదిరింపులు వస్తూ, హింస కలుగుతున్నందున తన కుటుంబాన్ని విడిచిపెట్టడం గురించి ఆయన చింతించినప్పటికీ, జోసెఫ్ అంగీకరించారు. కెనడాకు వెళ్ళే దారిలో, జోసెఫ్ మరియు ఆయన సహచరుడు సిడ్నీ రిగ్డన్ ఓదార్పు కోసం ప్రార్థించారు మరియు వారికి ప్రభువు యొక్క జవాబుగా 100వ ప్రకరణము ఇవ్వబడింది. వారికి తిరిగి అభయమిచ్చి, సహాయపడునట్లు ప్రభువు యొక్క జవాబులో మీరేమి కనుగొంటారు?

మీ సంఘ బాధ్యతల కొరకు చింత మరియు మీ కుటుంబం కొరకు చింతను సమన్వయపరచవలసిన అవసరమున్న అనుభవాలను మీరు కూడా కలిగియుండి ఉండవచ్చు. అటువంటి సందర్భాలలో 100వ ప్రకరణములోని ప్రభువు మాటలు మీకెలా సహాయపడియుండవచ్చు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 101:43–65

దేవుని సలహాను అనుసరించడం నన్ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

పరిశుద్ధులు సీయోను నుండి తరిమి వేయబడుటకు ప్రభువు ఎందుకు అనుమతించారో వివరించడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 101:43–62లోని ఉపమానము ఇవ్వబడింది. మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు, ఉపమానములోని సేవకులకు, మీకు మధ్య మీ ఏవైనా పోలికలను చూస్తున్నారా? మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించవచ్చు: నేను ఎప్పుడైనా దేవుని ఆజ్ఞలను ప్రశ్నించానా? విశ్వాసము లేదా నిబద్ధత లేకపోవడం ఏవిధంగా నా జీవితంలో ప్రభావం చూపడానికి “శత్రువును” అనుమతిస్తుంది? “(నా) రక్షణ కొరకు సరియైన, మంచి మార్గంలో నడిపించబడుటకు నేను సమ్మతిస్తున్నానని” (63–65 వచనాలు చూడండి) దేవునికి నేనెలా చూపగలను?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 98:16, 39–40.మన కుటుంబంలో మరింత సమాధానము కలిగియుండడానికి ఈ వచనాలలో ఉన్నదేది మనకు సహాయపడగలదు? సమాధానము లేదా క్షమాపణ గురించి మీరు ఒక పాట పాడవచ్చు. చిన్నపిల్లలు ఒకరినొకరు క్షమించుకుంటున్నట్లు అభినయించి చూపడాన్ని ఇష్టపడవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 99.“నిత్య సువార్తను ప్రకటించుటకు” (1వ వచనము) అతని ఇంటిని వదిలివెళ్ళమని జాన్ మర్డాక్ పిలువబడినప్పుడు, ఆయన అంతకుముందే మిస్సోరిలో సంవత్సర కాలం సువార్తసేవ చేసి తిరిగివచ్చారు. సహోదరుడు మర్డాక్‌ను ప్రోత్సహించేలా లేదా ఆయనకు సహాయపడేలా 99వ ప్రకరణములో మనమేమి కనుగొంటాము? ఈ బయల్పాటులో ప్రభువు మన కొరకు కలిగియున్న సందేశమేది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 100:16; 101:3–5,18.ఈ వచనాలను చదివిన తర్వాత, లోహాన్ని శుద్ధిచేయడానికి కమ్మరివాడు ఏ విధంగా దానిని బాగా వేడిచేస్తాడో, ఆ తరువాత సుత్తితో మళ్ళీ మళ్ళీ కొట్టడం ద్వారా దానికి ఆకారాన్నిస్తాడో మీరు చర్చించవచ్చు. నీరు లేదా ఉప్పు వంటివి ఎలా శుద్ధిచేయబడతాయోనని కూడా మీరు కలిసి నేర్చుకోవచ్చు. ఒక కుటుంబంగా మీరు దేనినైనా శుద్ధిచేయవచ్చు లేదా శుభ్రపరచవచ్చు. మీరు శుద్ధముగా కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? మనం “శుద్ధమైన జనులుగా” కావడానికి మన శ్రమలు మనకెలా సహాయపడగలవనే దాని గురించి ఈ ఉదాహరణలు మనకేమి బోధిస్తాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 101:22–36.హింసను ఎదుర్కొంటున్న పరిశుద్ధులకు ఈ వచనాలు ఏవిధంగా సహాయపడియుండవచ్చు? నేటి మన ప్రపంచ పరిస్థితుల గురించి భయపడేవారికి అవి ఎలా సహాయపడవచ్చు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

సూత్రాల కోసం చూడండి. ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ బోధించారు: “మీరు ఆత్మీయ జ్ఞానాన్ని వెదికినప్పుడు, సూత్రాల కోసం వెదకండి. … సూత్రాలు గాఢమైన సత్యాలు, విభిన్న రకాల పరిస్థితులకు అన్వయించడానికి ఒక్కటిగా కూర్చబడ్డాయి” (“Acquiring Spiritual Knowledge,” Ensign, Nov. 1993,86).

చిత్రం
పరిశుద్ధులను హింసిస్తున్న అల్లరిమూక

దహనమవుతున్న మిస్సోరి, గ్లెన్ ఎస్. హాప్కిన్సన్ చేత

ముద్రించు