“ఆగష్టు 30–సెప్టెంబరు 5. సిద్ధాంతము మరియు నిబంధనలు 94–97: ‘సీయోను రక్షణ కొరకు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“ఆగష్టు 30–సెప్టెంబరు 5. సిద్ధాంతము మరియు నిబంధనలు 94–97,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
ఆగష్టు 30–సెప్టెంబరు 5
సిద్ధాంతము మరియు నిబంధనలు 94–97
“సీయోను రక్షణ కొరకు”
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 94–97 చదువుతున్నప్పుడు, ఏ సూత్రాలు మరియు సిద్ధాంతము మీకు ప్రత్యేకంగా అనిపిస్తాయి? నిశ్చయంగా మీ మనోభావాలను నమోదు చేయండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
ఒక గుడారమును నిర్మించమని ప్రభువు మోషేను ఆజ్ఞాపించినప్పుడు, “కొండమీద (అతనికి) చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయమని” (హెబ్రీయులకు 8:5; నిర్గమకాండము 25:8–9 కూడా చూడండి) ఆయన మోషేకు చెప్పెను. ఇశ్రాయేలీయుల అరణ్య శిబిరము మధ్యలో గుడారము ఉండవలెను (సంఖ్యాకాండము 2:1–2 చూడండి). తరువాత, దేవుడు తాను బయల్పరచిన మాదిరిచొప్పున ఒక దేవాలయమును నిర్మించమని సొలోమోను మరియు అతని జనులను ఆజ్ఞాపించెను (1 దినవృత్తాంతములు 28:12,19 చూడండి).
సువార్త యొక్క సంపూర్ణతను ప్రభువు పునఃస్థాపించినప్పుడు, బయల్పరచబడిన మాదిరిచొప్పున దేవాలయాలను నిర్మించమని ఆయన జోసెఫ్ స్మిత్‌ను ఆజ్ఞాపించారు. “లోకరీతిగా కాకుండా ఈ మందిరము నిర్మించబడవలెను,” అని ప్రభువు ప్రకటించారు. “నేను చూపించు విధానములో అది నిర్మించబడవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 95:13–14; 97:10 కూడా చూడండి). అరణ్యములోని గుడారము వలె, దేవాలయము కర్ట్‌లాండ్‌కు కేంద్రబిందువుగా ఉండాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 94:1 చూడండి).
నేడు ప్రభువు మందిరాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అవి మన పట్టణాలకు కేంద్రబిందువుగా ఉండనప్పటికీ, మన జీవితాల్లో అవి కేంద్రబిందువుగా ఉండగలవు. చూడడానికి ప్రతి దేవాలయము భిన్నంగా ఉన్నప్పటికీ, వాటిలో మనము ఒకే దైవిక నమూనాను—దేవుని సన్నిధిలోనికి మనల్ని తిరిగి తీసుకువచ్చే పరలోక ప్రణాళికను నేర్చుకుంటాము. “లోకరీతిగా కాకుండా” ఆయన మనకు చూపించు విధానములో మన జీవితాలను నిర్మించుకోవడానికి మరియు మన కుటుంబాలను బలపరచుకోవడానికి పవిత్రమైన నిత్య విధులు మనకు సహాయపడతాయి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 94; 97:15–17
నా అనుదిన జీవితంలో ప్రభువు నాతో ఉండగలరు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 94 మరియు 97 లోని సూచనలు ఒకేరోజున—1833, ఆగష్టు 2న ఇవ్వబడ్డాయి. 97వ ప్రకరణము కొంతవరకు మిస్సోరిలోని జాక్సన్ కౌంటీ కొరకు ప్రణాళిక చేయబడిన దేవాలయంతో వ్యవహరిస్తుండగా, 94వ ప్రకరణము ఒహైయోలోని కర్ట్‌లాండ్‌లో కార్యనిర్వాహక భవనాలతో వ్యవహరిస్తుంది. ఈ వివిధ రకాల భవనాల గురించి ప్రభువు చెప్పేదానిలో కొన్ని పోలికలను మీరు గమనించవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 94:2–12; 97:10–17 చూడండి). ఈ సూచనలను మీరు ధ్యానిస్తున్నప్పుడు, సంఘ భవనాల లోపల మరియు మీ అనుదిన జీవితాలలో మరింత తరచుగా ప్రభువు యొక్క మహిమను, సన్నిధిని అనుభవించడానికి మీరు ఏమి చేయగలరో పరిగణించండి.
ప్రభువు తాను ప్రేమించిన వారిని గద్దించును.
1833 జనవరిలో, దేవుని మందిరాన్ని నిర్మించి, వ్రతదినమును ఏర్పాటుచేయమని ప్రభువు కర్ట్‌లాండ్‌లోని పరిశుద్ధులను ఆజ్ఞాపించినప్పటి నుండి సుమారు ఐదు నెలలు గడిచిపోయాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:117–19 చూడండి). 1833 జూన్‌లో 95వ ప్రకరణములో నమోదు చేయబడిన బయల్పాటు పొందబడినప్పుడు, వారింకను ఆ ఆజ్ఞపై పనిచేయలేదు. ఈ బయల్పాటులో ప్రభువు పరిశుద్ధులను గద్దించిన విధానము నుండి మీరేమి నేర్చుకుంటారు? మీరిప్పటికీ పాటించని ఆజ్ఞలు లేదా సలహాలు ఉన్నాయా? ఏమి చేయడానికి ప్రేరేపించబడినట్లు మీరు భావించారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 95:8, 11–17; 97:10–17
దేవాలయంలో దేవుడు తన జనులను దీవించును.
కర్ట్‌లాండ్‌లో ప్రభువు మందిరాన్ని నిర్మించనందుకు గద్దించబడిన తర్వాత, వారు నిర్మించగలుగునట్లు ఒక గోధుమ పొలంలో సంఘ నాయకులు స్థలాన్ని ఎన్నుకున్నారు. ప్రవక్త యొక్క అన్న హైరం స్మిత్ వెంటనే పరుగెత్తుకు వెళ్ళి, కొడవలి తెచ్చి పొలాన్ని శుభ్రం చేయసాగాడు. “ప్రభువు మందిరాన్ని నిర్మించడానికి మేము సిద్ధపడుతున్నాము మరియు నేను ఆ పని చేయడంలో అందరికంటే ముందు ఉండాలని నిశ్చయించుకున్నాను” అని అతడు చెప్పాడు (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 271,273). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 95:8, 11–17; 97:10–17 చదువుతున్నప్పుడు, హైరం ఆతృత గురించి ధ్యానించండి. దేవాలయ దీవెనలు పొందడానికి మీలో అదే నిశ్చయతను ప్రేరేపించేలా మీరేమి కనుగొంటారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 97:18–28
సీయోను అనగా “హృదయశుద్ధి గలవారు.”
“సీయోనును నిర్మించడమే మన అతి ముఖ్య లక్ష్యంగా మనం కలిగియుండాలి“ (Teachings: Joseph Smith,186) అని ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ బోధించారు. 1830లో పరిశుద్ధులకు సీయోను అనేది ఒక ప్రదేశం, అక్షరాలా “మన దేవుని పట్టణం” (సిద్ధాంతము మరియు నిబంధనలు 97:19). కానీ, 97వ ప్రకరణములో నమోదు చేయబడిన బయల్పాటులో, ప్రభువు ఆ దృక్పథాన్ని విస్తరించారు. సీయోను “హృదయశుద్ధి గల” జనులను కూడా వర్ణిస్తుంది (21వ వచనము). మీరు 18–28 వచనాలు చదువుతున్నప్పుడు, “సీయోను” అనే పదాన్ని చదివినప్పుడు ఈ నిర్వచనం గురించి ఆలోచించండి. “హృదయశుద్ధి గలవారిగా” ఉండుట అనగా మీకు గల అర్థమేమిటి? “సీయోను రక్షణను” సాధించడంలో దేవాలయం ఎలా సహాయపడుతుంది? (12వ వచనము).
మోషే 7:18 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 95:8.దేవాలయ నిబంధనలు చేసి, పాటించడం మీ జీవితాలలోనికి “మహోన్నత స్థలమునుండి శక్తిని” ఎలా తెచ్చింది? బహుశా కుటుంబ సభ్యులు తాము దేవాలయం గురించి భావించేదానిని పంచుకోవచ్చు లేదా దేవాలయ ఆరాధన ద్వారా “మహోన్నత స్థలమునుండి శక్తి”తో దీవించబడినట్లు వారు భావించిన అనుభవాలను పంచుకోవచ్చు.
దేవాలయానికి వెళ్ళేందుకు సిద్ధపడుతున్న వారికి సహాయపడేందుకు మీరు temples.ChurchofJesusChrist.org వద్ద కనుగొనబడు వీడియోలు, ఫోటోలు మరియు సూచనలను సమీక్షించవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 95:1–11.ఈ వచనాల నుండి గద్దింపు గురించి మనం ఏమి నేర్చుకుంటాము? ప్రభువు గురించి మనం ఏమి నేర్చుకుంటాము? మనం గద్దింపును పొందే విధానం లేదా ఇతరులను గద్దించే విధానాన్ని ఈ అంతరార్థములు ఏవిధంగా ప్రభావితం చేస్తాయి?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 97:8.ఈ వచనము ప్రకారము, మనము ప్రభువు చేత ఏవిధంగా “అంగీకరింపబడగలము”? అది లోకము చేత అంగీకరింపబడడం నుండి ఏవిధంగా భిన్నంగా ఉంది? “త్యాగము వలన (మన) నిబంధనలను పాటించుట” అనగా అర్థమేమిటి? మనము దీనిని ఎలా చేసాము?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 97:10–21.“పరిశుద్ధులు సమకూడు ఏ ప్రదేశమైనా సీయోనే, దానిని నీతిమంతుడైన ప్రతి పురుషుడు (లేదా స్త్రీ) అతని (లేదా ఆమె) పిల్లల కొరకు సురక్షిత ప్రదేశంగా నిర్మిస్తాడు” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు (Teachings: Joseph Smith,186). మన ఇంటిలో మనం సీయోనును ఏవిధంగా నిర్మించగలము? సిద్ధాంతము మరియు నిబంధనలు 97:10–21 లో మనము ఏ సూత్రాలను కనుగొంటాము? ఒక కుటుంబంగా ఈ వారం దృష్టిపెట్టేందుకు ఒక సూత్రాన్ని ఎంచుకోండి.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
దేవాలయం లేదా సీయోను గురించి ఒక పాట పాడండి.