2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
సెప్టెంబరు 20–26. సిద్ధాంతము మరియు నిబంధనలు 106–108: “పరలోకములు తెరువబడుట కొరకు”


“సెప్టెంబరు 20–26. సిద్ధాంతము మరియు నిబంధనలు 106–108: ‘పరలోకములు తెరువబడుట కొరకు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“సెప్టెంబరు 20–26. సిద్ధాంతము మరియు నిబంధనలు 106–108,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
మబ్బుల గుండా ప్రకాశిస్తున్న సూర్యుడు

సెప్టెంబరు 20–26

సిద్ధాంతము మరియు నిబంధనలు 106–108

“పరలోకములు తెరువబడుట కొరకు”

“(రక్షకుని) యందు మనం నిలిచియుండి, లేఖనాలలో మనల్ని మనం నిమగ్నము చేసుకొని, వాటియందు ఆనందించి, ఆయన సిద్ధాంతమును నేర్చుకొని, ఆయన జీవించిన విధముగా జీవించుటకు శ్రమపడాలి” అని ఎల్డర్ యులిసెస్ సోవారెస్ బోధించారు (“నేనేలాగు గ్రహించగలను?ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2019,7). సిద్ధాంతము మరియు నిబంధనలు 106–8లో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకున్నప్పుడు, మీరు కనుగొన్న సత్యాలను జీవించడానికి మీరు శ్రమించగల విధానాలను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మొదటిసారి చూసినప్పుడు, సిద్ధాంతము మరియు నిబంధనలు 107 ప్రభువు యొక్క సంఘం కొరకు యాజకత్వ స్థానాలను నాయకత్వ నిర్మాణంలోకి ఏర్పాటు చేయడానికి సంబంధించినదని అనిపిస్తుంది. వాస్తవానికి, ఈ బయల్పాటు ప్రచురించబడే సమయానికి, కొద్దిమంది నాయకులతో అప్పటికే సంఘ సభ్యత్వము దాని సామర్థ్యాన్ని మించిపోయింది. కాబట్టి ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది సమూహము, డెబ్బది, బిషప్పులు మరియు సమూహ అధ్యక్షత్వాల పాత్రలు మరియు బాధ్యతలను సంక్షేపముగా వర్ణించడం నిశ్చయంగా అవసరము మరియు సహాయకరము. కానీ, యాజకత్వ స్థానాలు మరియు సమూహాలు ఏర్పాటు చేయడానికి మించి 107వ ప్రకరణములో దైవిక ఉపదేశానికి సంబంధించినది ఎంతో ఉంది. “ఆదాము దినములలో స్థాపించబడిన” (41వ వచనము) ప్రాచీన యాజకత్వ క్రమము గురించి ఇందులో ప్రభువు మనకు బోధిస్తారు. మీతోపాటు దేవుని పిల్లలందరి కొరకు—సువార్త యొక్క రక్షణ విధులను పొంది, “సంఘము యొక్క ఆత్మీయ దీవెనలన్నిటిని ఆనందించుటకు—పరలోకరాజ్య మర్మములను పొందు విశేషాధికారమును కలిగియుండుటకు, వారికి పరలోకములు తెరువబడుటను” (18–19 వచనాలు) సాధ్యపరచడమే ఆదినుండి దాని ఉద్దేశ్యమైయున్నది.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 106;108

సేవ చేయమని ఆయన పిలిచేవారికి ప్రభువు ఉపదేశమిచ్చి, ప్రోత్సహించి, సహకారమిస్తారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 106 మరియు108 లో, సంఘములో సేవ చేయడానికి పిలువబడిన ఇద్దరు సభ్యులకు ప్రభువు సలహా మరియు వాగ్దానములిచ్చారు. ఈ బయల్పాటులలో ఏ వాక్యభాగాలు దేవుని రాజ్యములో మీ స్వయం సేవ గురించి ప్రోత్సాహాన్ని, అంతరార్థములను అందిస్తాయి? పరిగణించదగినవి రెండు ఇక్కడున్నాయి:

ప్రకరణములు 106 మరియు108 నుండి ఏ ఇతర వాక్యభాగాలు మీకు అర్థవంతంగా ఉన్నాయి?

రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవుని యొక్క శక్తి మరియు అధికారముతో పరిచర్య చేయుట,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2018, 68–75 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 107

యాజకత్వ అధికారము చేత ప్రభువు తన సంఘాన్ని నడిపిస్తారు.

ప్రభువు సాధారణంగా ఒక బయల్పాటులో ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా వివరించరని సువార్త యొక్క పునఃస్థాపన గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు బహుశా మీరు గమనించి ఉంటారు. బదులుగా, పరిస్థితులకు అనుగుణంగా ఆయన విషయాలను “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞగా” (సిద్ధాంతము మరియు నిబంధనలు 98:12) బయల్పరుస్తారు. 1829లోనే యాజకత్వం గురించి ఇంతకుముందు ప్రభువు ఉపదేశమిచ్చినప్పటికీ (ఉదాహరణకు, ప్రకరణములు 20 మరియు84 చూడండి), పెరుగుతున్న ఆయన మందను పరిపాలించి, నడిపించడానికి అవసరమైన ప్రత్యేక యాజకత్వ స్థానాల గురించి 1835లో ఆయన పరిశుద్ధులకు అదనపు ఉపదేశమిచ్చారు.

మీరు క్రింది యాజకత్వ స్థానాల గురించి చదువుతున్నప్పుడు, ఈ పిలుపులలో సేవచేస్తున్న వారిని మీరు మీ “నమ్మకము, విశ్వాసము, ప్రార్థనలచేత” (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:22) ఎలా బలపరచగలరో పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 107:1–20

యాజకత్వ విధులు పరలోక తండ్రి పిల్లలందరికి ఆత్మీయ మరియు భౌతిక దీవెలను అందిస్తాయి.

ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సన్ బోధించారు: “యాజకత్వము అనేది దేవుని శక్తి మరియు అధికారము, అది పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు—అందరి రక్షణ మరియు దీవెన కొరకు ఇవ్వబడినది. … మనము యోగ్యులుగా ఉన్నప్పుడు, యాజకత్వ విధులు భూమిపై మన జీవితాలను సుసంపన్నం చేస్తాయి మరియు రాబోయే లోకం యొక్క దివ్యమైన వాగ్దానాల కొరకు మనల్ని సిద్ధం చేస్తాయి” (“Power in the Priesthood,” Ensign or Liahona, Nov. 2013,92). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 107:1–20 (ప్రత్యేకించి 18–20 వచనాలు చూడండి) మరియు ఎల్డర్ ఆండర్సన్ సందేశాన్ని చదువుతున్నప్పుడు, దేవుని శక్తి ఏవిధంగా భూమిపై మీ జీవితాన్ని సుసంపన్నం చేసి, నిత్యత్వం కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది అనేదాని గురించి మీరు పొందే మనోభావాలను నమోదు చేయడాన్ని పరిగణించండి. ఆ దీవెనలను మరింత సంపూర్ణంగా పొందడానికి—ఇతరులు పొందేలా సహాయపడడానికి మీరేమి చేస్తున్నారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19–27; డాల్లిన్ హెచ్. ఓక్స్, “మెల్కీసెదెకు యాజకత్వము మరియు తాళపుచేతులు,” ఎల్‌సైన్ లేక లియహోనా, మే 2020, 69–72 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 107:41–57

యాజకత్వము కుటుంబాలను దీవిస్తుంది.

యాజకత్వము చేత తన సంతతి దీవించబడాలని ఆదాము కోరుకున్నాడు. అతడు పొందిన వాగ్దానాలేవి? (వచనాలు 42,55 చూడండి). ఆదాము చేసిన దాని గురించి మీరు చదువుతున్నప్పుడు, యాజకత్వ దీవెనలను ఆనందించడానికి మీ కుటుంబం కొరకు మీ స్వంత కోరికలను పరిగణించండి. ఈ దీవెనలను పొందడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?

చిత్రం
తన సంతతిని దీవిస్తున్న ఆదాము

తన సంతతిని దీవిస్తున్న ఆదాము, క్లార్క్ కెల్లీ ప్రైస్ చేత

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 106:6.“పరలోకములో సంతోషము” కలిగేలా చేయడానికి మన కుటుంబము ఏమి చేయగలదు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 107:22.“నమ్మకము, విశ్వాసము, ప్రార్థనలచేత” మన నాయకులను బలపరచడానికి మనమేమి చేస్తున్నాము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 107:27–31,85.సంఘ సలహాసభలను నడిపించే సూత్రాలు ఒక కుటుంబంగా కలిసి చర్చించుకోవడానికి మనకు కూడా సహాయపడగలవు. ఈ వచనాలలోని ఏ సూత్రాలను మన కుటుంబ సలహాసభలకు మనం అన్వయించగలము? (ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్, “Family Councils,” Ensign or Liahona, May 2016, 63–65 చూడండి.)

సిద్ధాంతము మరియు నిబంధనలు 107:99–100.ఒక ఇంటిపనికి సంబంధించి వ్రాతపూర్వక సూచనలను ఒక కుటుంబ సభ్యునికి ఇవ్వండి మరియు ఆ పనిని – శ్రద్ధగా, సోమరితనంతో లేదా సూచనలను చదవకుండా – ఎలా చేయాలో ఎంచుకోమని అతడిని లేదా ఆమెను ఆహ్వానించండి. అతడు లేదా ఆమె ఆ పని చేస్తుండగా మిగతా కుటుంబ సభ్యులు గమనించి, ఆ కుటుంబ సభ్యుడు ఎంచుకున్న విధానాన్ని ఊహించేలా చేయండి. తరువాత ఇతర కుటుంబ సభ్యులు వంతులు తీసుకొనేలా చేయండి. మనం మన పనులను నేర్చుకొని, సమస్త శ్రద్ధతో వాటిని చేయాలని ప్రభువు ఎందుకు కోరుతున్నారు? (బెక్కీ క్రేవన్, “జాగ్రత్తకు ప్రతిగా తేలికగా తీసుకొనుట,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2019, 9–11చూడండి.)

సిద్ధాంతము మరియు నిబంధనలు 108:7.మన సంభాషణలలో, మన ప్రార్థనలలో, మన ఉద్బోధనలలో లేదా ప్రోత్సాహములో, మన పనులన్నిటిలో మనం ఒకరిని ఒకరం ఎలా బలపరచుకోగలము? ఒక కుటుంబముగా పనిచేయడానికి వీటిలో ఒకదానిని మీరు ఎంచుకోవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మనోభావాలను నమోదు చేయండి. మనోభావాలు లేక అంతరార్థములు మీకు కలిగినప్పుడు, వాటిని వ్రాయండి. మీరలా చేసినప్పుడు, మీరు ఆయన మార్గనిర్దేశకత్వానికి విలువిస్తున్నారని మీరు ప్రభువుకు చూపుతారు. (Teaching in the Savior’s Way, 12, 30 చూడండి.)

చిత్రం
అబ్రామును దీవిస్తున్న మెల్కీసెదెకు

అబ్రామును దీవిస్తున్న మెల్కీసెదెకు, వాల్టర్ రానే చేత

ముద్రించు