“సెప్టెంబరు 13–19. సిద్ధాంతము మరియు నిబంధనలు 102–105: ‘అనేక శ్రమల తరువాత దీవెనలు కలుగును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“సెప్టెంబరు 13–19. సిద్ధాంతము మరియు నిబంధనలు 102–105,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
సెప్టెంబరు 13–19
సిద్ధాంతము మరియు నిబంధనలు 102–105
“అనేక శ్రమల తరువాత దీవెనలు కలుగును”
సిద్ధాంతము మరియు నిబంధనలు 102–5 నుండి ఏ సూత్రాలు మీకు అర్థవంతమైనవి? ఈ సూత్రాల గురించి మీ ఆలోచనలు మరియు మనోభావాలను నమోదు చేయడాన్ని పరిగణించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
మిస్సోరిలోని జాక్సన్ కౌంటీలో తమ సహోదర సహోదరీలు వారి ఇళ్ళ నుండి తరిమివేయబడ్డారని విని కర్ట్‌లాండ్‌లోని పరిశుద్ధులు చాలా బాధపడ్డారు. అప్పుడు, “సీయోను విమోచన శక్తితో వస్తుందని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 103:15) ప్రభువు ప్రకటించినప్పుడు, అది ప్రోత్సాహకరంగా ఉండియుండవచ్చు. వారి హృదయాలలో ఆ వాగ్దనంతో 200 మందికి పైగా పురుషులు, సుమారు 25 మంది స్త్రీలు, పిల్లలు ఇశ్రాయేలు దళము అని పిలువబడిన దానిలో చేరారు, తరువాత అది సీయోను దళముగా పేరొందింది. వారి నియమిత కార్యము మిస్సోరికి వెళ్ళి, సీయోనును విమోచించడం.
దళములోని సభ్యులకు సీయోనును విమోచించడం అంటే పరిశుద్ధులను వారి స్థలాలకు పునఃస్థాపించడమని అర్థము. కానీ దళము జాక్సన్ కౌంటీకి చేరుకోవడానికి కొంచెం ముందు, ఆగమని మరియు సీయోను దళమును విచ్ఛినం చేయమని ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు చెప్పారు. దళంలో కొంతమంది సభ్యులు ఈ క్రొత్త ఉపదేశంతో గందరగోళంలో పడ్డారు మరియు కలవరపడ్డారు; వారి దృష్టిలో, ఈ ప్రయాణం విఫలమైనదని మరియు ప్రభువు యొక్క వాగ్దానాలు నెరవేరలేదని దానర్థము. అయినప్పటికీ, ఇతరులు దానిని భిన్నంగా చూసారు. వెళ్ళగొట్టబడిన పరిశుద్ధులు ఎన్నడూ జాక్సన్ కౌంటీకి తిరిగి రానప్పటికీ, ఆ అనుభవం కొంతవరకు సీయోనుకు “విమోచనను” తెచ్చింది మరియు అది “శక్తితో వచ్చింది”. సీయోను దళములో విశ్వాసులైన సభ్యులలో అనేకులు తరువాత సంఘ నాయకులయ్యారు, ఆ అనుభవము దేవుని శక్తియందు, జోసెఫ్ స్మిత్ యొక్క దైవిక పిలుపుయందు మరియు సీయోను—అనగా సీయోను ప్రదేశమందే కాక, దేవుని జనులైన సీయోను యందు వారి విశ్వాసాన్ని బలపరచిందని వారు సాక్ష్యమిచ్చారు. విఫలమైనదిగా కనిపించే ఈ కార్యము యొక్క విలువను ప్రశ్నించే బదులు, మనం అన్నిటిని అర్థం చేసుకోలేక పోయినప్పటికీ, రక్షకుడిని అనుసరించడమే అసలైన కార్యమని వారు నేర్చుకున్నారు. చివరకు, ఈవిధంగా సీయోను విమోచించబడుతుంది.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 102:12–23
ఈ వచనాలలోని సూచనల యొక్క ఉద్దేశ్యమేమి?
102వ ప్రకరణము ఒహైయోలోని కర్ట్‌లాండ్‌లో సమావేశము యొక్క ముఖ్యాంశాలను కలిగియుంది, అక్కడ సంఘము యొక్క మొదటి ఉన్నత సలహామండలి ఏర్పాటు చేయబడింది. గంభీరమైన తప్పులు చేసిన వారి కోసం సభ్యత్వ సలహాసభలు జరుపబడినప్పుడు, ఉన్నత సలహామండళ్ళు అనుసరించే విధానాలను 12–23 వచనాలు వివరిస్తాయి.
అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ ఇలా బోధించారు, “సంఘ (సభ్యత్వ) సలహాసభలు ఎందుకు జరుపబడతాయని కొన్నిసార్లు సభ్యులు అడుగుతారు. మూడు ముఖ్య ఉద్దేశాలున్నాయి: అతిక్రమకారుని ఆత్మను కాపాడుట, అమాయకులను రక్షించుట, సంఘము యొక్క స్వచ్ఛత, నిజాయితీ మరియు మంచి పేరును కాపాడుట” (“A Chance to Start Over: Church Disciplinary Councils and the Restoration of Blessings,” Ensign, Sept. 1990,15).
సిద్ధాంతము మరియు నిబంధనలు 103:1–12, 36; 105:1–19
సీయోను కేవలం నీతి సూత్రాలపై నిర్మించబడగలదు.
పరిశుద్ధులు మిస్సోరిలో తమ వాగ్దాన స్థలాన్ని ఎందుకు కోల్పోయారు? మరియు వారిని తమ స్థలాలకు పునఃస్థాపించడానికి ప్రభువు సీయోను దళమును ఎందుకు అనుమతించలేదు? నిశ్చయంగా మిస్సోరి అల్లరిమూకల హింసాత్మక చర్యలు ముఖ్యపాత్ర పోషించాయి మరియు మిస్సోరి గవర్నరు పరిశుద్ధులకు సహకారమిస్తానని ప్రతిజ్ఞ చేసినప్పటికీ, ఎన్నడూ సహకరించలేదు. కానీ, “నా జనులు అపరాధములు చేయకుండిన యెడల,” సీయోను “విమోచించబడియుండేది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 105:2) అని ప్రభువు చెప్పారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 103:1–12, 36; 105:1–19 చదువుతున్నప్పుడు, మిస్సోరిలో సీయోను స్థాపనను ఆటంకపరచిన విషయాలు మరియు దానికి సహాయపడగల విషయాలను మీరు గమనించవచ్చు. మీ హృదయములో మరియు ఇంటిలో సీయోనును స్థాపించడానికి మీకు సహాయపడగలిగేలా మీరేమి నేర్చుకుంటారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 103:12–13; 105:1–6, 13–19
బాధలు మరియు విశ్వాసపు పరీక్షల తరువాత దీవెనలు వస్తాయి.
అనేక విధాలుగా, సీయోను దళములో పాల్గొనడం ఒక విశ్వాసపు పరీక్ష. ప్రయాణము సుదీర్ఘమైనది, వాతావరణం వేడిగలది మరియు కొన్నిసార్లు అన్నపానీయాలు కరువయ్యేవి. వారు అన్నిటిని సహించిన తర్వాత, పరిశుద్ధులు ఇంకా తమ స్థలానికి తిరిగి వెళ్ళలేకపోయారు. వ్యవస్థీకరించబడమనే ఆజ్ఞ నిజంగా దేవుని నుండి వచ్చిందా అని ఆశ్చర్యపడిన సీయోను దళము యొక్క సభ్యులకు సిద్ధాంతము మరియు నిబంధనలు103:12–13 మరియు 105:1–6, 13–19లోని సూత్రాలు ఎలా సహాయపడియుండవచ్చో పరిగణించండి. మీ స్వంత విశ్వాసపు పరీక్షలో ఈ సూత్రాలు మీకెలా సహాయపడగలవు?
ఈ సారాంశము చివరన “పునఃస్థాపన స్వరములు”లో సీయోను దళము యొక్క సభ్యుల అనుభవాల గురించి కూడా మీరు చదువవచ్చు. వారి వైఖరుల గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది? వారి మాదిరుల నుండి మీరు ఏమి నేర్చుకోగలరు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 104:11–18, 78–83
నేను “భూలోక దీవెనలపై గృహనిర్వాహకుడిని.”
1834లో, మిస్సోరిలోని శ్రమలకు అదనంగా సంఘము అధికమొత్తంలో అప్పులు మరియు ఖర్చులతో ఆర్థికపరమైన కష్టాలను ఎదుర్కొంది. 104వ ప్రకరణములో సంఘము యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభువు ఉపదేశమిచ్చారు. మీ స్వంత ఆర్థిక నిర్ణయాలకు 11–18 మరియు 78–83 వచనాలలోని సూత్రాలను మీరెలా అన్వయించగలరు?
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 103:12, 36; 105:9–13.మీరు ఆశించిన విధంగా జరుగని ఒకదానిని చేయమని మీ కుటుంబము (లేదా మీ పూర్వీకులలో ఒకరు) ఎప్పుడైనా అడుగబడ్డారా? వారి ప్రయాణము వారు ఆశించిన విధంగా జరుగనప్పుడు సీయోను దళము యొక్క సభ్యుల ప్రతిస్పందనల నుండి మీరేమి నేర్చుకోగలరు? (ఈ సారాంశం చివరనున్న “పునఃస్థాపన స్వరములు” చూడండి).
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 104:13–18.ప్రభువు మనకేమి ఇచ్చారు? వాటితో మనము ఏమి చేయాలని ఆయన ఆశిస్తున్నారు?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 104:23–46.విశ్వాసులకు “విస్తారముగా దీవెనలిచ్చెదనని” (23వ వచనము) ఎన్నిసార్లు ప్రభువు వాగ్దానమిచ్చారో కనుగొనడానికి మీ కుటుంబము ఈ వచనాలను వెదకవచ్చు. “మీ దీవెనలను లెక్కించడానికి” (“Count Your Blessings,” Hymns, no.241) మరియు ఆవిధంగా చేయడం కష్టసమయాల్లో మనకేవిధంగా సహాయపడగలదో చర్చించడానికి బహుశా ఇది మంచి సమయం కావచ్చు. చిన్నపిల్లలు ప్రత్యేకించి వారు కృతజ్ఞత కలిగియున్న దీవెనల చిత్రాలను గీయడాన్ని ఆనందించవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 105:38–41.ఇతరులు మనపట్ల నిర్దయగా లేదా అన్యాయంగా వ్యవహరించినప్పుడు, మనం “శాంతి ఒప్పందములను” (40వ వచనము) ఎలా చేయగలము? మన ఇంటిలో మనం “శాంతి ధ్వజముగా” (39వ వచనము) ఉండేందుకు ఏమి చేయగలము?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
పునఃస్థాపన స్వరములు
సీయోను దళము
సీయోను దళము జాక్సన్ కౌంటీలో పరిశుద్ధులకు వారి స్థలాలను ఎన్నడూ పునఃస్థాపించనందున, అనేకమంది తమ ప్రయత్నం విఫలమైనదని భావించారు. అయినప్పటికీ, సీయోను దళములో పాల్గొన్నవారిలో అనేకులు వారి అనుభవాన్ని తలచుకుని, ప్రభువు వారి జీవితాల్లో మరియు ఆయన రాజ్యంలో ఉన్నతమైన ఉద్దేశ్యాలను ఎలా నెరవేర్చారో చూసారు. వారి సాక్ష్యాలలో కొన్ని ఇక్కడున్నాయి:
జోసెఫ్ స్మిత్
సీయోను దళము ఏర్పడిన 40 ఏళ్ళ తర్వాత, ఆ దళ సభ్యుడైన జోసెఫ్ యంగ్, జోసెఫ్ స్మిత్ క్రింది విధంగా చెప్పారని నివేదించాడు:
“సహోదరులారా, మీరు మిస్సోరిలో యుద్ధం చేయనందున మీలో కొంతమంది నాపై కోపంగా ఉన్నారు; కానీ, మీరు యుద్ధం చేయాలని దేవుడు కోరలేదని నేను మీతో చెప్తున్నాను. తమ జీవితాలను అర్పించి, అబ్రాహాము చేసినట్లుగా గొప్ప త్యాగాన్ని చేసిన పురుషుల సమూహము నుండి ఆయన వారిని ఎంచుకుంటే తప్ప, భూమిపై నున్న దేశాలకు సువార్త ద్వారాలను తెరవడానికి పన్నెండుమంది మరియు వారి అడుగుజాడలను అనుసరించడానికి వారి మార్గనిర్దేశంలో డెబ్బదిమందితో ఆయన తన రాజ్యాన్ని వ్యవస్థీకరించలేకపోయారు.
“ఇప్పుడు, తన పన్నెండుమందిని మరియు తన డెబ్బదిమందిని ప్రభువు దక్కించుకున్నారు, డెబ్బదుల యొక్క ఇతర సమూహాలు పిలువబడతాయి, వారు త్యాగము చేస్తారు మరియు ఇప్పుడు త్యాగాలు చేయనివారు, అర్పణలు చేయనివారు ఇకముందు వాటిని చేస్తారు.”1
బ్రిగం యంగ్
“మేము మిస్సోరి చేరుకున్నప్పుడు ప్రభువు తన సేవకుడు జోసెఫ్‌తో మాట్లాడి, ‘నేను నీ అర్పణను అంగీకరించానని’ చెప్పారు మరియు మేము మరలా తిరిగివచ్చే అవకాశాన్ని కలిగియున్నాము. మిస్సోరికి వెళ్ళి, ఏమీ సాధించకుండానే తిరిగిరావడానికి తమ పనుల్లో ఉన్నవారిని పిలవడంలో లాభమేమి ఉందని నేను తిరిగివచ్చినప్పుడు అనేకమంది స్నేహితులు నన్ను అడిగారు. ‘అది ఎవరికి లాభం చేకూర్చింది?’ అని వారడిగారు. ‘అది చేయబడాలని ప్రభువు ఆజ్ఞాపించియుంటే, ఈ విధంగా చేయడంలో ఆయన ఉద్దేశ్యమేమిటి?’ … నాకు బాగానే చెల్లించబడింది—అధిక వడ్డీతో సహా చెల్లించబడింది—అవును, ప్రవక్తతోపాటు ప్రయాణించడం ద్వారా నేను పొందిన జ్ఞానంతో దిగ జారునట్లు నిండుకొలతతో నేను కొలవబడ్డానని నేను ఆ సహోదరులకు చెప్పాను.”2
విల్ఫర్డ్ ఉడ్రఫ్
“దేవుని ప్రవక్తతోపాటు నేను సీయోను దళంలో ఉన్నాను. ఆయనతో దేవుని వ్యవహారాలను నేను చూసాను. దేవుని శక్తి ఆయనతో ఉండడం నేను చూసాను. ఆయన ఒక ప్రవక్తయని నేను చూసాను. ఆ నియమితకార్యంలో దేవుని శక్తి చేత ఆయనకు ప్రత్యక్షపరచబడినది నా దృష్టిలో మరియు ఆయన సూచనలను అందుకున్న వారందరి దృష్టిలో చాలా విలువైనది.”3
“సీయోను దళం యొక్క సభ్యులు పిలువబడినప్పుడు, మాలో అనేకమంది ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేదు; మేము అపరిచితులము మరియు అనేకమంది ఎన్నడూ ప్రవక్తను చూడలేదు. జొన్నలు జల్లెడలో జల్లించబడినట్లు, దేశమంతటా మేము చెల్లాచెదురు చేయబడ్డాము. మేము యువకులము మరియు ఆనాడు వెళ్ళి, సీయోనును విమోచించడానికి పిలువబడ్డాము, మేము చేయవలసినదంతా విశ్వాసంతో చేయాలి. వివిధ రాష్ట్రాల నుండి మేము కర్ట్‌లాండ్‌లో సమకూడాము మరియు మాకు దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి సీయోనును విమోచించేందుకు వెళ్ళాము. అబ్రాహాము పనులను అంగీకరించినట్లే, ప్రభువు మా పనులను అంగీకరించారు. ‘మీరు ఏమి చేసారు?’ అని అనేకసార్లు విశ్వాసభ్రష్టులు మరియు అవిశ్వాసులు ప్రశ్నించినప్పటికీ, మేము గొప్ప పనిని సాధించాము. మరేవిధంగాను మేము ఎన్నడూ సంపాదించలేని అనుభవాన్ని మేము సంపాదించాము. ప్రవక్త ముఖాన్ని చూసే అవకాశం మాకు కలిగింది మరియు ఆయనతో వెయ్యి మైళ్ళు ప్రయాణించడానికి, ఆయనతో దేవుని ఆత్మ పనిచేయడాన్ని, యేసు క్రీస్తు యొక్క బయల్పాటులు ఆయనకు రావడాన్ని మరియు ఆ బయల్పాటుల యొక్క నెరవేర్పును చూడడానికి మాకు అవకాశం కలిగింది. ఆనాడు దేశమంతటి నుండి రెండు వందలమంది పెద్దలను సమకూర్చి, ఆయన యేసు క్రీస్తు సువార్తను బోధించడానికి మమ్మల్ని ప్రపంచంలోనికి పంపారు. నేను సీయోను దళంతో వెళ్ళకపోయినట్లయితే, నేడు నేనిక్కడ ఉండేవాడిని కాదు (పన్నెండుమంది సమూహములో సేవచేస్తూ సాల్ట్లేక్ సిటీలో). … అక్కడికి వెళ్ళడం ద్వారా మేము సువార్తను బోధించడానికి వెంటనే అవకాశమివ్వబడ్డాము మరియు ప్రభువు మా పనులను అంగీకరించారు. మా శ్రమలు, హింసలన్నిటిలో తరచు మా జీవితాలను పణంగా పెట్టి మేము పనిచేయవలసి వచ్చింది మరియు విశ్వాసంతో జీవించవలసి వచ్చింది.”4
“సీయోను దళంలో ప్రయాణించడం వలన (మేము) పొందిన అనుభవం బంగారం కంటే ఎంతో విలువైనది.”5