“నవంబరు 15–21. సిద్ధాంతము మరియు నిబంధనలు 133–134: ‘పెండ్లి కుమారుని రాక కొరకు మీరు సిద్ధపడుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“నవంబరు 15–21. సిద్ధాంతము మరియు నిబంధనలు 133–134,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
నవంబరు 15–21
సిద్ధాంతము మరియు నిబంధనలు 133–134
“పెండ్లి కుమారుని రాక కొరకు మీరు సిద్ధపడుడి”
అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ బోధించారు: “సువార్త యొక్క పునఃస్థాపన వినయము గల గృహములో పఠించబడిన వినయము గల ప్రశ్నతో ప్రారంభమయ్యెను మరియు అది మన గృహాలలో ప్రతి ఒక్కదానిలో కొనసాగగలదు ” (“ప్రభువు ఆత్మ నివసించే గృహము,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2019,25).
మీ మనోభావాలను నమోదు చేయండి
సంఘము కేవలం 19 నెలల వయస్సున్నప్పుడు, ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులు దేవుని యొక్క కడవరి-దిన బయల్పాటులను ఒక గ్రంథముగా సంగ్రహించి 10,000 కాపీలు—అనగా మోర్మన్ గ్రంథము యొక్క మొదటి ముద్రణకు రెండింతలు ముద్రించాలని ఆశగా ప్రణాళికలు రచించారు. దురదృష్టవశాత్తూ, అధిక ధరలు ఈ ప్రణాళికలను మార్చివేసాయి మరియు ముద్రణ జరుగుతున్నప్పుడు అల్లరిమూకలు సంఘ ముద్రణాలయంపై దాడిచేసాయి. వారు విడి కాగితాలను చెల్లాచెదురు చేసారు మరియు ధైర్యముగల పరిశుద్ధులు వాటిలో కొన్నింటిని కాపాడినప్పటికీ, ఆజ్ఞల గ్రంథము యొక్క పూర్తి ప్రతులు ఏవీ కాపాడబడినట్లు తెలియరాలేదు.
ఇప్పడు సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క 133వ ప్రకరణముగా మనకు తెలిసినది ఆజ్ఞల గ్రంథానికి అనుబంధము కావలసినది, ప్రభువు యొక్క ప్రచురించబడిన బయల్పాటుల అంతమున ఆశ్చర్యార్థకం వంటిది. ఇది రాబోయే తీర్పుదినము గురించి హెచ్చరించును మరియు ఆధునిక బయల్పాటు అంతటా కనుగొనబడు పిలుపును ప్రతిధ్వనించును: బబులోను చేత సంకేతమివ్వబడినట్లు ప్రాపంచికతత్వమా పారిపొమ్ము; సీయోనును నిర్మించుము; రెండవ రాకడ కొరకు సిద్ధపడుము; మరియు ఈ సందేశమును “ప్రతి జనమునకు, వంశమునకు, భాషకు, ప్రజలకు” (37వ వచనము) విస్తరింపజేయుము. ఆజ్ఞల గ్రంథము కొరకు వేసిన మొదటి ప్రణాళికలు నెరవేరనప్పటికీ, ఈ బయల్పాటు ప్రభువు యొక్క కార్యము ఆటంకపరచబడలేదు అనడానికి గుర్తుగా మరియు సాక్ష్యముగా ఉంది, “ఏలయనగా సమస్త జనముల కన్నుల యెదుట ఆయన తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు, భూదిగంత నివాసులందరు తమ దేవుని రక్షణను చూచెదరు” (3వ వచనము).
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
దేవుని కార్యము చేయడానికి సిద్ధాంతము మరియు నిబంధనలలోని సత్యాలు నన్ను సిద్ధం చేయగలవు.
పుస్తకాలు కొన్నిసార్లు ఆ పుస్తకంలోని ముఖ్యాంశాలను తిరిగి చెప్తూ లేదా సంక్షిప్తపరుస్తూ ముగించబడతాయి. 133వ ప్రకరణము ముందుగా ఆజ్ఞల గ్రంథానికి ముగింపుగా యెంచబడింది మరియు దానిని మనస్సులో ఉంచుకొని ఈ ప్రకరణమును చదవడం విలువైనది కాగలదు. ఆయన కార్యము గురించి ఏ అంశాలను ప్రభువు నొక్కిచెప్పారు? ఆయన కార్యములో మీరు పోషించాలని ప్రభువు కోరుకున్న పాత్ర గురించి 57–62 వచనాలు మీకేమి బోధిస్తాయి?
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:1–19
ఆయన రెండవ రాకడ కొరకు నేను సిద్ధపడాలని ప్రభువు కోరుతున్నారు.
1వ ప్రకరణము, సిద్ధాంతము మరియు నిబంధనలకు ప్రభువు యొక్క ముందుమాట మరియు 133వ ప్రకరణము, గ్రంథానికి మొదటి అనుబంధము రెండూ ప్రభువు నుండి ఒకే అభ్యర్థనతో మొదలవుతాయి: “నా సంఘ జనులైన మీరు ఆలకించుడి“ (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:1; 133:1). ఆలకించుడి అనగా అర్థమేమి? సిద్ధాంతము మరియు నిబంధనలు 133:1–19లో ఏ ఆహ్వానాలను లేదా ఆజ్ఞలను మీరు ఆలకించాలని ప్రభువు కోరుతున్నారు? ఆయన రాకడ కోసం బాగా సిద్ధపడేందుకు మీరేమి చేయాలని ప్రేరేపించబడ్డారు? మీ చుట్టూ ఉన్నవారు సిద్ధపడేందుకు మీరెలా సహాయపడతారు?
మత్తయి 25:1–13; డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “ప్రభువు రాకడకు సిద్ధపడుట,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2019, 81–84 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:19–56
నీతిమంతుల కొరకు రెండవ రాకడ ఆనందకరంగా ఉంటుంది.
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 133:19–32లో రక్షకుని రెండవ రాకడతో పాటు జరిగే సంఘటనల గురించి చదువుతున్నప్పుడు, రక్షకుడు మరియు ఆయన కార్యము గురించి ఈ సంఘటనల వర్ణనలు మీకు ఏమి సూచిస్తున్నాయో మీరు ధ్యానించవచ్చు. ఈ వర్ణనలలో సాధ్యమయ్యే ఆత్మీయ అన్వయాలు వేటిని మీరు కనుగొనగలరు?
32–56 వచనాలలో రక్షకుని రాకడ యొక్క వర్ణనను మీరు చదువుతున్నప్పుడు, ఏది మిమ్మల్ని ఆ గొప్ప దినము కొరకు ఎదురుచూసేలా చేస్తుంది? ఆయన జనుల కొరకు ప్రభువు యొక్క ప్రేమను వివరించే పదాలు లేదా వాక్యభాగాలేవి? “(మీ) ప్రభువు యొక్క ప్రేమాకనికరము, ఆయన వాత్సల్యమును బట్టి (మీ) మీద ఆయన క్రుమ్మరించిన యావత్తుతో” (52వ వచనము) పాటు మీ వ్యక్తిగత అనుభవాలను నమోదు చేయడాన్ని పరిగణించండి.
“మానవ ప్రయోజనము కొరకు ప్రభుత్వములు దేవునిచేత స్థాపించబడినవి.”
ప్రభుత్వంతో ప్రారంభ పరిశుద్దుల సంబంధము సంక్లిష్టంగా ఉండేది. 1833లో, మిస్సోరిలోని జాక్సన్ కౌంటీ నుండి పరిశుద్ధులు తరిమివేయబడినప్పుడు, వారు సహాయం కొరకు అర్జీలు పెట్టుకున్నప్పటికీ స్థానిక లేదా కేంద్ర ప్రభుత్వం నుండి వారికి ఎటువంటి సహాయం లేదా నష్టపరిహారం అందలేదు. అదే సమయంలో, సంఘ సభ్యులు కాని కొందరు సీయోను గురించిన బోధనలకు అర్థం పరిశుద్ధులు భూలోక ప్రభుత్వాల అధికారాన్ని నిరాకరించడమని చెప్పారు. కొంతవరకు ప్రభుత్వంలో సంఘము యొక్క స్థానాన్ని స్పష్టం చేయడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 134 వ్రాయబడింది.
ప్రభుత్వాల గురించి సంఘ సభ్యులు ఎలా భావించాలి? మీరు 134వ ప్రకరణమును చదివినప్పుడు, రెండు జాబితాలు చేయడాన్ని పరిగణించండి: ఒకటి, మీరు ప్రభుత్వం గురించి నేర్చుకొనే సూత్రాల జాబితా మరియు రెండవది, పౌరుల బాధ్యతలకు సంబంధించినది. ప్రారంభ పరిశుద్ధులకు ఈ ఉపాయాలు ఎలా సహాయకరంగా ఉండియుండవచ్చు? మీరు నివసించే చోట అవి ఎలా అన్వయించబడతాయి?
విశ్వాస ప్రమాణాలు 1:11–12 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:4–14.సీయోనుకు ఆత్మీయంగా వ్యతిరేకమైనది బబులోను—లేఖనములంతటా దుష్టత్వానికి, ఆత్మీయ దాస్యానికి సంకేతంగా నిలిచిన ప్రాచీన పట్టణము (డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “Come to Zion,” Ensign or Liahona, Nov. 2008,37 చూడండి). ఆత్మీయ దృష్టిలో, “బబులోను నుండి బయలు వెళ్ళుటకు” (5వ వచనము) మరియు “సీయోను ప్రదేశమునకు … వెళ్ళుటకు” (9వ వచనము) కుటుంబంగా మీరు చేయవలసినది ఏదైనా ఉందా?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:20–33.కలిసి ఈ వచనాలను మీరు చదువుతున్నప్పుడు, రెండవ రాకడ ఎలా ఉంటుందని వారనుకుంటున్నారో తెలిపే చిత్రాలను మీ కుటుంబము గీయవచ్చు. రక్షకుని రాకడ కొరకు సిద్ధపడేందుకు మీ కుటుంబం ఏమి చేయగలదో కూడా చర్చించవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 133:37–39.ఈ వచనాలను “బిగ్గరగా” చదవడాన్ని మీ కుటుంబం ఆనందిస్తుందా? (38వ వచనము). బిగ్గరగా సువార్తను పంచుకోవడం అనగా అర్థమేమిటి? ఏ సత్యాలను మనం పంచుకోగలము?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 134:1–2.ప్రభుత్వము యొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు, మీరు ఇటువంటి ప్రశ్నలను చర్చించవచ్చు: నియమాలు ఉండడం వల్ల మన కుటుంబం ఎలా దీవించబడింది? చట్టాలు ఉండడం వల్ల మన దేశము ఎలా దీవించబడింది? మీరు మీ జాతీయ జెండాను తయారుచేయవచ్చు లేదా జెండా చిత్రానికి రంగులు వేయవచ్చు లేదా పదకొండవ మరియు పన్నెండవ విశ్వాస ప్రమాణాలను కంఠస్థం చేయవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.