2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
నవంబరు 22–28. సిద్ధాంతము మరియు నిబంధనలు 135–136: “ఆయన ‘తన పరిచర్యను, తన కార్యములను తన రక్తముతో ముద్రించెను’”


“నవంబరు 22–28. సిద్ధాంతము మరియు నిబంధనలు 135–136: ‘ఆయన “తన పరిచర్యను, తన కార్యములను తన రక్తముతో ముద్రించెను,”’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“నవంబరు 22–28. సిద్ధాంతము మరియు నిబంధనలు 135–136,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

కార్తేజ్ చెరసాల యొక్క వెలుపలిభాగం

కార్తేజ్ చెరసాల

నవంబరు 22–28

సిద్ధాంతము మరియు నిబంధనలు 135–136

ఆయన “తన పరిచర్యను, తన కార్యములను తన రక్తముతో ముద్రించెను”

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 135–36 చదువుతున్నప్పుడు, మీరు చదివే దానిని అన్వయించడంలో సహాయపడేందుకు అంతరార్థములతో ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. అలా జరిగినప్పుడు, ఆయన మీకు బోధించేదానిని వ్రాయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

1844, జూన్ 27న జోసెఫ్ స్మిత్ మరియు హైరం స్మిత్‌లు మరోసారి చెరసాలలో ఉంచబడ్డారు, వారితోపాటు జాన్ టేలర్ మరియు విల్లార్డ్ రిఛర్డ్స్ ఉన్నారు. వారు ఏ నేరము చేయలేదని వారు నమ్మారు, కానీ నావూలోని పరిశుద్ధులకు వ్యతిరేకంగా హింసను నిరోధించాలని ఆశిస్తూ వారు ఖైదు చేయబడేందుకు ఒప్పుకున్నారు. సంఘము యొక్క శత్రువులు ప్రవక్త జోసెఫ్‌ను చెరసాలలో వేయడం ఇది మొదటిసారి కాదు, కానీ ఈసారి తాను తిరిగిరాడని ఆయనకు తెలిసినట్లు అనిపించింది. మోర్మన్ గ్రంథాన్ని చదువుతూ, కీర్తనలు పాడుతూ ఆయన మరియు ఆయన స్నేహితులు ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు కాల్పులు వినిపించాయి మరియు కొద్ది నిముషాలలో జోసెఫ్ స్మిత్ మరియు అతని అన్న హైరం యొక్క మర్త్య జీవితాలు ముగిసిపోయాయి.

అయినప్పటికీ, వారు హత్తుకున్న దైవిక కార్యము యొక్క అంతము కాదది. అది యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క అంతము కాదు. ఇంకా చేయవలసిన పని చాలా ఉంది మరియు సంఘాన్ని ముందుకు నడిపించే అధిక బయల్పాటు ఉంది. ప్రవక్తను చంపడం దేవుని కార్యాన్ని చంపలేదు.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 135; 136:37–39

జోసెఫ్ మరియు హైరం స్మిత్‌లు వారి సాక్ష్యాలను తమ రక్తంతో ముద్రించారు.

జోసెఫ్ మరియు హైరం స్మిత్‌లు చంపబడినప్పుడు మీరు నావూలో నివసిస్తున్నట్లయితే, మీరెలా భావించియుండేవారో ఊహించండి. ఈ దుర్ఘటన యొక్క అర్థాన్ని కనుగొనడానికి మీరెలా ప్రయత్నించియుంటారు? మతం కోసం చంపబడిన మూడు నెలల లోపు సిద్ధాంతము మరియు నిబంధనలు 135 మొదటిసారి ప్రచురించబడడం సహాయపడియుండవచ్చు. మీకు అర్థాన్ని, అభయాన్ని ఇచ్చిన పదాలు మరియు వాక్యభాగాలను మీరు గుర్తించవచ్చు. “తన ప్రవక్త చంపబడేందుకు దేవుడు ఎందుకు అనుమతించాడు,” అని అడిగిన వారికి మీరేమి జవాబిస్తారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 5:21–22; 6:29–30; Teachings of Presidents of the Church: Joseph Smith, 522–23, 529–40; ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్, “ఇంత గొప్ప హేతువులో మనం ముందుకు సాగక ఉందుమా?ఎన్‌సైన్ లేదా లియహోనా, నవ. 2020, 8–11 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 135:3

జోసెఫ్ స్మిత్, మన రక్షణ కొరకు యేసు క్రీస్తు తప్ప ఏ మనుష్యుడు చేయనంత చేసెను.

యేసు క్రీస్తు యొక్క సంఘ సభ్యునిగా మీరు పొందిన దీవెనల గురించి ఆలోచించండి. అందులో ఎన్ని ప్రవక్త జోసెఫ్ స్మిత్ చేత సాధించబడిన కార్యానికి ఫలితంగా వచ్చాయి? మొదటి దర్శనము తరువాత 24 ఏళ్ళలో జోసెఫ్ స్మిత్ సాధించిన గొప్ప విషయాలలో కొన్నింటిని సిద్ధాంతము మరియు నిబంధనలు 135:3 పేర్కొంటుంది. మిమ్మల్ని, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మీ సంబంధాన్ని ఈ విషయాలు ఎలా ప్రభావితం చేసాయి? ప్రవక్త జోసెఫ్ స్మిత్ గురించి మీ సాక్ష్యాన్ని నమోదు చేయడాన్ని పరిగణించండి. మీ సాక్ష్యాన్ని ఎవరు వినవలసిన అవసరముంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 136

జీవితంలో నా “ప్రయాణాల” కొరకు ప్రభువు నాకు సలహా ఇస్తారు.

నావూ నుండి తరిమివేయబడిన తర్వాత, పరిశుద్ధులు సాల్ట్ లేక్ లోయకు సుదీర్ఘ ప్రయాణం చేసారు, మొదట కొన్ని వందల మైళ్ళ ప్రయాణం నెమ్మదిగా, దుఃఖపూరితంగా సాగింది. పన్నెండుమంది అపొస్తలులు సమూహము యొక్క అధ్యక్షునిగా సంఘాన్ని నడిపిస్తున్న బ్రిగం యంగ్, పరిశుద్ధులు మిగిలిన ప్రయాణాన్ని ఎలా తట్టుకుంటారోనని చింతించారు. వింటర్ క్వార్టర్స్ అని పిలువబడే తాత్కాలిక బందోబస్తు చేసి, ఆయన నడిపింపు కొరకు ప్రార్థించారు. దానికి జవాబుగా ప్రభువు ఆయనకు నేటి 136వ ప్రకరణమును బయల్పాటుగా ఇచ్చారు. మిగతా విషయాల మధ్య ఈ బయల్పాటు పరిశుద్ధులకు వారి గమ్యము ఎంత ముఖ్యమో ప్రయాణంలో వారి ప్రవర్తన అంతే ముఖ్యమని గుర్తుచేసింది మరియు పశ్చిమమువైపు వలసపోవడాన్ని దురదృష్టకరమైన అవసరం నుండి ముఖ్యమైన పంచుకోదగిన ఆత్మీయ అనుభవంగా మార్చుకోవడానికి సహాయపడింది.

మీరు 136వ ప్రకరణము చదువుతున్నప్పుడు ఈ సందర్భం గుర్తుంచుకోండి. మీ జీవితంలో కష్టమైన శ్రమను “ముఖ్యమైన … ఆత్మీయ అనుభవంగా” మార్చుకోవడానికి సహాయపడేలా ఏ సలహాను మీరు కనుగొంటారు? ప్రారంభ పరిశుద్ధులు పశ్చిమమువైపు కష్టమైన ప్రయాణం చేయడానికి సహాయపడినట్లే, మీ స్వంత జీవితంలో ప్రభువు చిత్తాన్ని సాధించడానికి ఈ సలహా మీకెలా సహాయపడగలదో కూడా మీరు ధ్యానించవచ్చు.

వింటర్ క్వార్టర్స్

వింటర్ క్వార్టర్స్, గ్రెగ్ కె. చేత ఓల్సన్

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 135:1,3. ఈ వచనాల గురించి ఏది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది? మన సాక్ష్యాల కొరకు మన ప్రాణాలు ఇవ్వమని మనల్ని అడగకపోయినా, వాటిపట్ల మనం మరింత విశ్వాసంగా ఎలా ఉండగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 135:3.జోసెఫ్ స్మిత్ “మనుష్యుల రక్షణ కొరకు యేసు క్రీస్తు తప్ప ఈ లోకములో జీవించిన ఏ మనుష్యుడు చేయనంత చేసెను,” అనే వ్యాఖ్యానము యొక్క అర్థాన్ని చర్చించడానికి, ఈ సంవత్సరం జోసెఫ్ స్మిత్ గురించి మీ కుటుంబం నేర్చుకున్నదానిని పునర్వీక్షించడాన్ని పరిగణించండి. వారు నేర్చుకున్న దానిని గుర్తుంచుకొనేలా వారికి సహాయపడేందుకు ఈ వనరు నుండి చిత్రాలను మీరు ఉపయోగించవచ్చు మరియు వారికిష్టమైన కథలు లేదా బోధనలను పంచుకోమని ఆహ్వానించవచ్చు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ కొరకు మరియు ఆయన ద్వారా ప్రభువు సాధించినదాని కొరకు మనమెందుకు కృతజ్ఞత కలిగియున్నాము? “జోసెఫ్ స్మిత్: పునఃస్థాపన యొక్క ప్రవక్త” (ChurchofJesusChrist.org) వీడియోను కూడా మీరు చూడవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 136.136వ ప్రకరణమును ప్రభువు బయల్పరచినప్పుడు, బ్రిగం యంగ్ నిర్దేశకత్వంలో పరిశుద్ధులు కష్టమైన సుదీర్ఘ ప్రయాణం చేయవలసియుండెను. మీరు కలిసి 136వ ప్రకరణమును చదువుతున్నప్పుడు, మీ కుటుంబం ఎదుర్కోవలసిన కష్టమైన విషయాల గురించి ఆలోచించండి. ప్రభువు యొక్క సహాయాన్ని, శక్తిని పొందడానికి మనకు సహాయపడగలిగేలా ఈ బయల్పాటులో ఏ సలహాను మనం కనుగొంటాము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 136:4.“దేవుని విధులన్నింటిని బట్టి నడుచుకొందుము” అనగా అర్థమేమిటి? మనం పొందిన విధులు మన అనుదిన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

దేవుని ప్రేమను కనుగొనండి. అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ ఇలా బోధించారు, “సువార్త అంటే ప్రేమ యొక్క సువార్త—దేవుని పట్ల ప్రేమ మరియు ఒకరిపట్ల ఒకరి ప్రేమ” (“God’s Love for His Children,” Ensign, May 1988,59, 59). మీరు లేఖనాలను చదువుతున్నప్పుడు, దేవుని ప్రేమకు సాక్ష్యాలను వ్రాయడాన్ని లేదా గుర్తించడాన్ని పరిగణించండి.

కార్తేజ్ చెరసాలలో జోసెఫ్ స్మిత్ మరియు ఇతరులపై దాడిచేస్తున్న అల్లరిమూక

ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు, కేసి చైల్డ్స్ చేత