“నవంబరు 1– 7. సిద్ధాంతము మరియు నిబంధనలు 125–128: ‘సజీవులు, మృతుల కొరకు సంతోషకరమైన స్వరము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“నవంబరు 1–7. సిద్ధాంతము మరియు నిబంధనలు 125–128,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
నవంబరు 1–7
సిద్ధాంతము మరియు నిబంధనలు 125–128
“సజీవులు, మృతుల కొరకు సంతోషకరమైన స్వరము”
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 125–128 చదువుతున్నప్పుడు మీ భావాలను నమోదు చేయడాన్ని జ్ఞాపకముంచుకోండి, తద్వారా మీరు వాటిపై ప్రతిబింబించవచ్చు మరియు వాటిని ఇతరులతో పంచుకోవచ్చు.
మీ మనోభావాలను నమోదు చేయండి
1840 ఆగష్టులో, బాధపడుతున్న జేన్ నేమన్ తన స్నేహితుడు సీమోర్ బ్రూన్సన్ అంత్యక్రియల వద్ద ప్రవక్త జోసెఫ్ మాట్లాడడం విన్నది. ఇటీవలే జేన్ యొక్క యౌవన కుమారుడు సైరస్ కూడా మరణించాడు. సైరస్ ఎన్నడూ బాప్తీస్మము పొందలేదనే వాస్తవం ఆమె బాధను పెంచింది మరియు అతని నిత్య ఆత్మకు ఏమవుతుందోనని జేన్ విచారించింది. ఆమె ఎలా భావించిందో జోసెఫ్‌కు తెలుసు; బాప్తీస్మము తీసుకోక ముందే మరణించిన తన ప్రియమైన అన్న ఆల్విన్ గురించి అదే విధంగా ఆయన విచారించారు. కాబట్టి, సువార్త యొక్క విధులను పొందకుండా మరణించిన వారి గురించి ప్రభువు ఆయనకు బయల్పరచిన దానిని మరియు వారికి సహాయపడేందుకు మనము చేయగల దాని గురించి జేన్‌తో, అలాగే అంత్యక్రియల వద్దనున్న ప్రతిఒక్కరితో పంచుకోవాలని ప్రవక్త నిర్ణయించుకున్నారు.
మృతుల కొరకు బాప్తీస్మము యొక్క సిద్ధాంతము పరిశుద్ధులను విస్మయానికి గురిచేసింది; వారి ఆలోచనలు వెంటనే మరణించిన తల్లిదండ్రులు, తాత మామ్మలు మరియు ఇతర కుటుంబ సభ్యులవైపు మళ్ళాయి. ఇప్పుడు వారికి నిరీక్షణ గలదు! జోసెఫ్ వారి ఆనందాన్ని పంచుకున్నారు, మరియు మృతుల రక్షణ గురించి ప్రభువు ఆయనకు బోధించిన దానిని వ్యక్తం చేయడానికి ఆనందకరమైన, ప్రోత్సాహకరమైన భాషను ఉపయోగించారు: “పర్వతములు సంతోషధ్వని చేయనియ్యుడి, లోయలారా మీరు గట్టిగా అరువుడి; సముద్రములారా, ఆరిన నేలలారా మీ నిత్యరాజు చేసిన అద్భుతములను తెలుపుడి! ” (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:23).
Saints, 1:415–27; “Letters on Baptism for the Dead,” Revelations in Context, 272–76 చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
నా కుటుంబముపట్ల నేను శ్రద్ధచూపాలని ప్రభువు కోరుకుంటున్నారు.
ఇంగ్లండులో అనేకమార్లు సువార్తసేవ చేసి, ఇటీవలి సేవ నుండి ఇంటికి వచ్చిన తర్వాత, ఆయన లేనప్పుడు బాధలు అనుభవించిన (ఆయన) కుటుంబముపై ప్రత్యేక శ్రద్ధ చూపమని” (3వ వచనము) ఇది మరియు 126 ప్రకరణములో ఉన్న మరొక సలహా మీకు ఎలా అన్వయిస్తుందో మీరు ధ్యానించినప్పుడు, యువతుల మాజీ ప్రధాన అధ్యక్షురాలైన బోన్నీ ఎల్. ఆస్కార్‌సన్ నుండి ఈ మాటలను పరిగణించండి:
“గొప్ప అవసరాలలో కొన్ని మీ ముందే ఉండవచ్చని గుర్తుంచుకొనుము. మీ సొంత గృహాలలో మరియు మీ సొంత కుటుంబాలలో సేవను ప్రారంభించుము. ఈ అనుబంధాలు శాశ్వతమైనవి కాగలవు. మీ కుటుంబ పరిస్థితులు పరిపూర్ణతకు తక్కువగా ఉన్నప్పటికీ, మీరు సేవ చేసి, బలపరచి మరియు వారిని పైకెత్తు మార్గములను వెదకవచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మొదలుపెట్టండి, వారు ఎలా ఉన్నారో అలానే ప్రేమించండి మరియు భవిష్యత్తులో మీరు కావాలనుకున్న కుటుంబము కొరకు సిద్ధపడుము” (“మన ముందున్న అవసరాలు,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2017,27).
సిద్ధాంతము మరియు నిబంధనలు 127:2–4
నా ఆనందాలు, బాధలు ప్రభువుకు తెలుసు.
తప్పుడు నేరారోపణలు మరియు ఖైదు చేస్తారనే బెదిరింపు 1842 ఆగష్టులో మరలా దాగుకొనేలా జోసెఫ్ స్మిత్‌ను బలవంతపెట్టాయి. అయినప్పటికీ ఈ సమయంలో (ఇప్పటి సిద్ధాంతము మరియు నిబంధనలు 127) ఆయన పరిశుద్ధులకు వ్రాసిన మాటలు పూర్తిగా సానుకూల దృక్పథంతో, ఆనందంతో నిండియున్నాయి. దేవుని గురించి, మీరు వ్యక్తిగత శ్రమలను ఎలా ఎదుర్కోగలరనే దాని గురించి 2–4 వచనాలు మీకేమి బోధిస్తాయి?
మీ జీవితపు “అగాధజలములలో” ప్రభువు మీకెలా సహాయపడుతున్నారో నమోదు చేయడాన్ని పరిగణించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 127:5–8; 128:1–8
“భూమిమీద మీరు దేనిని లిఖించెదరో, అది పరలోకమందును లిఖించబడును.”
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 127:5–8; 128:1–8 చదువుతున్నప్పుడు, మృతుల కొరకు బాప్తీస్మములను లిఖించడం గురించి ప్రభువు అటువంటి ప్రత్యేక సూచనలను జోసెఫ్ స్మిత్‌కు ఎందుకు ఇచ్చారనే కారణాల కొరకు వెదకండి. ఇది ప్రభువు గురించి మరియు ఆయన కార్యము గురించి మీకు ఏమి బోధిస్తుంది?
సిద్ధాంతము మరియు నిబంధనలు 128:5–25
నా పూర్వీకుల రక్షణ నా రక్షణ కొరకు ఆవశ్యకమైనది.
ఈ జీవితంలో బాప్తీస్మము తీసుకోని మన పూర్వీకులకు తమ రక్షణ నిమిత్తం మన సహాయం ఎందుకు అవసరమో జోసెఫ్ స్మిత్ ద్వారా దేవుడు బయల్పరచిన దాని నుండి స్పష్టమవుతుంది. మన పూర్వీకుల రక్షణ “మన రక్షణ కొరకు ఎందుకు అవసరమైనది మరియు ఆవశ్యకమైనది” అని మీరనుకుంటున్నారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:15–18 చూడండి; ఏటవాలు అక్షరాలు చేర్చబడ్డాయి).
మృతుల కొరకు బాప్తీస్మపు విధి “జగత్తు పునాది వేయబడక మునుపు సిద్ధపరచబడినదని” 5వ వచనము బోధిస్తుంది. దేవుడు మరియు ఆయన ప్రణాళిక గురించి ఈ సత్యము మీకు ఏమి బోధిస్తుంది? అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ యొక్క సందేశమైన “దేవుని యొక్క కుటుంబమును సమకూర్చుట” మీ గ్రహింపుకు ఏమి జతచేస్తుంది? (ఎన్‌సైన్ లేదా లియహోనా, నవ. 2017, 19–22).
యాజకత్వ విధులు మరియు మృతుల కొరకు బాప్తీస్మము గురించి బోధిస్తున్నప్పుడు, “బంధించు అధికారము,” “సంబంధము,” “పరిపూర్ణముగా ఐక్యమై” వంటి వాక్యభాగాలను జోసెఫ్ స్మిత్ ఉపయోగించారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 128:5–25 చదువుతున్నప్పుడు, వీటికొరకు మరియు ఇటువంటి వాక్యభాగాల కొరకు చూడండి. మృతుల కొరకు యాజకత్వ విధుల కారణంగా యేసు క్రీస్తు ద్వారా బంధింపబడగల కొన్ని విషయాలేవి? మృతుల కొరకు రక్షణ సిద్ధాంతాన్ని వివరించడానికి “నిర్భయమైన” అనేది ఎందుకు మంచి పదము? (9–11 వచనాలు చూడండి).
19–25 వచనాలలో జోసెఫ్ స్మిత్ మాటలను గూర్చి మిమ్మల్ని ప్రభావితపరచినదేది? మీ పూర్వీకుల కొరకు దేవాలయ సేవ గురించి, యేసు క్రీస్తు గురించి మీరు భావించే విధానాన్ని ఈ వచనాలు ఎలా ప్రభావితం చేస్తాయి? ఏమి చేయాలని ప్రేరేపించబడినట్లు మీరు భావిస్తారు?
1 కొరింథీయులకు 15:29; డేల్ జి. రెన్లండ్, “కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము: బంధింపబడుట మరియు స్వస్థత,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2018, 46–49 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 126.బ్రిగం యంగ్‌కు ఇవ్వబడిన ఈ సలహాను చదవడం, మీరు ఒకరిపట్ల ఒకరు “ప్రత్యేక శ్రద్ధ” (3వ వచనము) చూపడంలో మరింత సమయాన్ని ఎలా గడపగలరనే దాని గురించి మాట్లాడుకోవడానికి మీ కుటుంబాన్ని ప్రేరేపించవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 128:15–18.కుటుంబ చరిత్ర కార్యము యొక్క రక్షించు మరియు పరిపూర్ణం చేయు దీవెనలలో కొన్ని ఏవి?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 128:18.మనల్ని మన పూర్వీకులతో కలుపుతూ కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము ఏవిధంగా ఒక “సంబంధమును” ఏర్పరుస్తుందో చూపడానికి ప్రతి కొక్కెం పైన కుటుంబ సభ్యులు మరియు పూర్వీకుల పేర్లతో ఒక కాగితపు గొలుసును తయారు చేయడాన్ని పరిగణించండి. అదనపు కుటుంబ సభ్యులను కనుగొని, మీ గొలుసు ఎంత పొడవుగా పెరుగుతుందో చూడడానికి ఈ వారం మీరు కొంత పరిశోధన చేయవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 128:19–23.యేసు క్రీస్తు సువార్త మరియు మృతుల రక్షణ గురించి జోసెఫ్ స్మిత్ ఉత్సాహాన్ని చూపే పదాల కొరకు బహుశా కుటుంబ సభ్యులు ఈ వచనాలను వెదకవచ్చు. ఈ కార్యము గురించి వారిని ఉత్సాహపరచిన అనుభవాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
కుటుంబ చరిత్ర లేక నిత్య కుటుంబాలు అనే విషయానికి సంబంధించిన ఒక పాట పాడండి.
పునఃస్థాపన స్వరములు
మృతుల కొరకు బాప్తీస్మము, “ఒక క్రొత్త మరియు మహిమకరమైన విషయం”
ఫీబి మరియు విల్ఫర్డ్ వుడ్రఫ్
మృతుల కొరకు బాప్తీస్మము గురించి జోసెఫ్ స్మిత్ బోధించడం ప్రారంభించినప్పుడు, ఫీబి వుడ్రఫ్ నావూ దగ్గరలో నివసించేది. ఇంగ్లండులో సువార్త సేవ చేస్తున్న తన భర్త విల్ఫర్డ్‌కు ఆమె దాని గురించి ఇలా వ్రాసింది:
“మరణించిన మరియు ఈ సువార్తను వినే అవకాశం కలిగియుండని తమ బంధువులలో ఎవరి కొరకైనా మరియు తమ పిల్లలు, తల్లిదండ్రులు, సహోదర సహోదరీలు, తాత మామ్మలు, బాబాయిలు, మామయ్యలు, పిన్నిలు, అత్తల కొరకు కూడా ఈ సంఘములోని వారు బాప్తీస్మము తీసుకోవచ్చని బయల్పాటు ద్వారా సహోదరుడు జోసెఫ్ తెలుసుకున్నారు. … వారి స్నేహితుల కొరకు వారు బాప్తీస్మము పొందిన వెంటనే వారు చెరసాల నుండి విడుదల చేయబడతారు మరియు వారు వారిని పునరుత్థానములో హక్కుగా పొంది, వారిని సిలెస్టియల్ రాజ్యములోనికి తీసుకురాగలరు—ఈ సిద్ధాంతము సంఘము చేత మనఃపూర్వకముగా స్వీకరించబడింది మరియు వారు గుంపులు గుంపులుగా ముందుకు వెళ్ళి, కొందరు ఒక్క రోజులో 16 సార్లు కూడా బాప్తీస్మము పొందుతున్నారు.” 1
ఈ సూత్రము గురించి తరువాత విల్ఫర్డ్ వుడ్రఫ్ ఇలా అన్నారు: “దాని గురించి నేను విన్న క్షణం నా ఆత్మ ఆనందంతో గంతులు వేసింది. … నేను ముందుకు వెళ్ళి, మరణించిన నా బంధువులలో నాకు తెలిసిన వారందరి కొరకు బాప్తీస్మము తీసుకున్నాను. … మృతుల కొరకు బాప్తీస్మము గురించి మాకు బయల్పరుస్తూ ఈ బయల్పాటు వచ్చినప్పుడు నాకు హల్లెలూయా అని అరవాలనిపించింది. పరలోకపు దీవెనలలో ఆనందించే హక్కును మనం కలిగియున్నామని నేను భావించాను.”2
వైలేట్ కింబల్
సహోదరి వుడ్రఫ్ వలె వైలేట్ కింబల్ కూడా ఆమె భర్త హిబర్ సువార్తను ప్రకటిస్తూ దూరంగా ఉన్నప్పుడు మృతుల కొరకు బాప్తీస్మము గురించి విన్నది. ఆమె ఆయనకు ఇలా వ్రాసింది:
“అధ్యక్షులు స్మిత్ ఒక క్రొత్త మరియు మహిమకరమైన విషయాన్ని తెలిపారు … అది సంఘములో గొప్ప పునరుద్ధరణకు కారణమయ్యింది. అదేమనగా, మృతుల కొరకు బాప్తీస్మము పొందడం. దీని గురించి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, 29వ వచనంలో పౌలు మాట్లాడాడు. బయల్పాటు ద్వారా దీని గురించి మరింత పూర్తి వివరణను జోసెఫ్ పొందారు. … ఈ సువార్త వెలుగులోనికి రాకముందు మరణించిన తమ బంధువులందరి కొరకు, తమ ముత్తాత, ముత్తమ్మల కొరకు కూడా బాప్తీస్మము పొందే విశేషావకాశాన్ని ఈ సంఘము కలిగియుంది. … ఆ విధంగా చేయడం ద్వారా మనము వారి కొరకు ప్రతినిధులుగా పనిచేస్తాము; మరియు మొదటి పునరుత్థానంలో ముందుకు వచ్చే విశేషాధికారాన్ని వారికి ఇస్తాము. వారికి సువార్త బోధించబడుతుందని ఆయన చెప్తున్నారు … కానీ ఆత్మలు బాప్తీస్మము పొందడమనేది లేదు. … ఈ క్రమము ఇక్కడ బోధించబడినందున, జలములు నిరంతరం తీరిక లేకుండా ఉన్నాయి. సమావేశ సమయంలో ఒక్కొక్కసారి ఎనిమిది నుండి పదిమంది ఎల్డర్లు నదిలో ఒకేసారి బాప్తీస్మము ఇచ్చారు. … మా అమ్మ కోసం నేను బాప్తీస్మము తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఇంటికి వచ్చేవరకు వేచియుందామని నేను లెక్కించాను, కానీ క్రిందటిసారి ఈ విషయంపై జోసెఫ్ మాట్లాడినప్పుడు, ముందుకు వెళ్ళి వీలైనంత త్వరగా తమ స్నేహితులను ఈ చెరనుండి విడిపించమని ప్రతిఒక్కరికి ఆయన సలహా ఇచ్చారు. కాబట్టి నేను ఈ వారంలో వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది పొరుగువారు వెళ్తున్నారు. కొంతమంది ఇప్పటికే చాలాసార్లు బాప్తీస్మము పొందారు. … ఆవిధంగా ప్రతి ఒక్కరికీ అవకాశం ఉందని నువ్వు చూడవచ్చు. ఇది మహిమకరమైన సిద్ధాంతము.”3
ఫీబి చేస్
నావూ దేవాలయంలో బాప్తీస్మము తొట్టె పూర్తయినప్పుడు, నదికి బదులు అందులో మృతుల కొరకు బాప్తీస్మములు నిర్వహించబడ్డాయి. నావూ నివాసియైన ఫీబి చేస్, “మరణించిన మన వారి కోసం మనం బాప్తీస్మము పొందగలిగి, సీయోను కొండమీద రక్షకులుగా మారే స్థలముగా” బాప్తీస్మపు తొట్టెను వర్ణిస్తూ దేవాలయం గురించి తన తల్లికి వ్రాసింది. ఆమె ఇలా వివరించడం కొనసాగించింది, ఈ తొట్టెలో “నేను ప్రియమైన నా తండ్రి కోసం మరియు నా స్నేహితులందరి కోసం బాప్తీస్మము తీసుకున్నాను. … ఇప్పుడు మీ అమ్మ, నాన్నలను విడుదల చేయగలిగేలా వారి పేర్లు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మరణించిన వారిని విడుదల చేయాలని నేను కోరుతున్నాను. … ప్రభువు మరలా మాట్లాడి, ప్రాచీన క్రమమును పునరుద్ధరించారు.”4
శాల్లీ రాండల్
మృతుల కొరకు బాప్తీస్మము గురించి తన స్నేహితులకు మరియు కుటుంబానికి వ్రాస్తున్నప్పుడు శాల్లీ రాండల్ తన కొడుకు జార్జ్ చనిపోవడాన్ని గుర్తుచేసుకుంది:
“అది నాకెంతో కష్టకాలము, ఇప్పటికీ నన్ను నేను సమాధానపరచుకోలేక పోతున్నాను, కానీ … అతని తండ్రి అతని కోసం బాప్తీస్మము తీసుకున్నారు మరియు సువార్త యొక్క సంపూర్ణత్వాన్ని అది ఇప్పుడు బోధించబడినట్లుగా మేము నమ్మడం, స్వీకరించడం మరియు మా ప్రియమైన స్నేహితులందరి కొరకు బాప్తీస్మము తీసుకోగలగడం మరియు వారి గురించి ఏ మాత్రం సమాచారమున్నా వీలైనంతవరకు వారిని రక్షించగలగడం ఎంత మహిమకరమైన విషయం.
“వీలైనంతవరకు మన తాత మామ్మల వరకు మరణించిన మన సంబంధీకులందరి పేర్లు మీరు వ్రాయాలని నేను కోరుతున్నాను. నా స్నేహితులను రక్షించడానికి నేను చేయగలిగినది చేయాలని నేను అనుకుంటున్నాను మరియు ఈ గొప్ప పనిని ఒంటరిగా చేయలేనందున మీలో కొందరు నాకు సహాయపడడానికి వస్తే నేను చాలా సంతోషిస్తాను. … ఇది విచిత్రమైన సిద్ధాంతమని మీరనుకుంటారని నేను ఆశిస్తున్నాను, కానీ ఇది నిజమని మీరు కనుగొంటారు.”5