125వ ప్రకరణము
1841 మార్చిలో నావూ, ఇల్లినాయ్‌లో ఐయోవా భూభాగములోనున్న పరిశుద్ధులను గూర్చి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు.
1–4, పరిశుద్ధులు పట్టణములను నిర్మించి, సీయోను స్టేకుల యొద్దకు చేరవలెను.
1 ఐయోవా భూభాగములోనున్న పరిశుద్ధులను గూర్చి ప్రభువు చిత్తము ఏమైయున్నది?
2 నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా నామముచేత తమనుతాము పిలుచుకొని, నా పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయత్నించువారు, నా చిత్తమును చేసి, వారిని గూర్చిన నా ఆజ్ఞలను గైకొనిన యెడల, నా సేవకుడైన జోసెఫ్ ద్వారా వారికి నేను నియమించు స్థలమునకు వారు చేరి, నా నామమున పట్టణములను నిర్మించవలెను, తద్వారా రాబోవు కాలములో దాచబడిన దానికొరకు వారు సిద్ధపడుదురు.
3 నావూ పట్టణమునకు ఎదురుగానున్న స్థలములో నా నామమున వారొక పట్టణమును నిర్మించవలెను, దానికి వారు జరహేమ్ల అను పేరు పెట్టవలెను.
4 తూర్పు నుండి, పశ్చిమము నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చు వారందరు, దానిలోను, నాష్విల్లె పట్టణములోను లేదా నావూ పట్టణములోను, నేను నియమించిన స్టేకులన్నింటిలోను తమ స్వాస్థములను పొందవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.