91వ ప్రకరణము
1833, మార్చి 9న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ సమయములో ప్రవక్త పాతనిబంధన అనువాదములో నిమగ్నమైయుండెను. అపొక్రిప అనబడు ప్రాచీన లిఖితము యొక్క ఆ భాగమునకు వచ్చినప్పుడు, అతడు ప్రభువుని విచారించి ఈ సూచనను పొందెను.
1–3, అపొక్రిప చాలావరకు సముచితముగానే అనువదించబడినది, కానీ మనుష్యుల చేతులద్వారా చేర్చబడిన అసత్యమైన కల్పిత పదాలనేకము కలిగియున్నది; 4–6, ఆత్మవలన వెలిగించబడిన వారికి అది మేలు చేకూర్చును.
1 అపొక్రిపను గూర్చి ప్రభువు నిశ్చయముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—సత్యమైన అనేక సంగతులు దానిలో కలవు, అది చాలావరకు సముచితముగా అనువదించబడినది;
2 సత్యముకానీ అనేక విషయములు దానిలో కలవు, అవి మనుష్యుల చేతులద్వారా చేర్చబడిన కల్పిత పదాలు.
3 అపోక్రిప అనువదించబడుట అవసరములేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
4 కాబట్టి, చదువువాడు గ్రహించును గాక, ఏలయనగా ఆత్మ సత్యమును ప్రత్యక్షపరచును;
5 ఆత్మవలన వెలిగించబడినవాడు దానినుండి మేలు పొందును;
6 ఆత్మద్వారా పొందని వారు మేలు పొందలేరు. కాబట్టి అది అనువదించబడుట అవసరముకాదు. ఆమేన్.