లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 16


16వ ప్రకరణము

1829 జూన్, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా పీటర్ విట్మర్ జూ. కివ్వబడిన బయల్పాటు (14వ ప్రకరణ శీర్షిక చూడుము). తరువాత పీటర్ విట్మర్ జూ. ఎనిమిదిమంది సాక్షులలో ఒకరిగా మారెను.

1–2, ప్రభువు బాహువు భూమియంతటిపై యున్నది; 3–6, సువార్తను ప్రకటించుట, ఆత్మలను రక్షించుట అనునది అత్యంత విలువైనది.

1 నా సేవకుడైన పీటర్, ఆలకించుము, నీ రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు మాటలను వినుము.

2 ఏలయనగా ఇదిగో, నేను నీతో కాఠిన్యముతోను అధికారముతోను మాట్లాడుచున్నాను, ఏలయనగా నా బాహువు భూమియంతటిపై యున్నది.

3 నీవు, నేను తప్ప మరెవరు ఎరుగని దానిని నేను నీకు చెప్పెదను—

4 నీకు ఏది అత్యంత విలువైనదో తెలుసుకోవాలని నీవు అనేకమార్లు నా నుండి కోరితివి.

5 ఇదిగో, ఈ విషయము నిమిత్తము నా ఆజ్ఞలను బట్టి, నేను నీకిచ్చిన నా మాటలను పలికినందుకు నీవు ధన్యుడవు.

6 ఇదిగో, నీకు అత్యంత విలువైనదేమనగా నా యొద్దకు ఆత్మలను తెచ్చి, తద్వారా నా తండ్రి రాజ్యములో వారితోపాటు విశ్రాంతి పొందునట్లు ఈ జనులకు పశ్చాత్తాపమును ప్రకటించుటయని నేను నీకు చెప్పుచున్నాను. ఆమేన్.