114వ ప్రకరణము
1838, ఏప్రిల్ 11న ఫార్ వెస్ట్, మిస్సోరిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు.
1–2, విశ్వాసముగా లేని వారు కలిగియున్న సంఘ స్థానములు ఇతరులకు ఇవ్వబడును.
1 నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: ఇది నా సేవకుడైన డేవిడ్ డబ్ల్యు. పేటన్ నందు జ్ఞానమైయున్నది, అదేమనగా అతనికి వీలైనంత త్వరగా అతని వ్యవహారమునంతా చక్కబెట్టుకొని, అతని సరుకులను అమ్మివేయవలెను, తద్వారా రాబోవు వసంతకాలములో నా నామమునకు సాక్ష్యము చెప్పుటకు సర్వలోకమునకు సువర్తమానమును వహించుటకు ఇతరులతో అనగా అతనితో కలిపి పన్నెండుమందితో కలిసి నా కొరకు అతడు సువార్తసేవ చేయవలెను.
2 ఏలయనగా నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా నామమును నిరాకరించువారు మీలోనున్న యెడల, వారి స్థానములో ఇతరులు నియమించబడి, వారి బిషప్రిక్కు స్థానములను పొందెదరు. ఆమేన్.