22వ ప్రకరణము
1830 ఏప్రిల్ 16న, న్యూయార్క్‌లోని మాంచెస్టర్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఇంతకు ముందు బాప్తిస్మము పొందిన కొందరు తిరిగి బాప్తిస్మము పొందకుండా సంఘముతో ఐక్యమగుటకు కోరిన ఫలితముగా ఈ బయల్పాటు సంఘమునకు ఇవ్వబడెను.
1, బాప్తిస్మము నూతన మరియు శాశ్వతమైన నిబంధనయైయున్నది; 2–4, అధికారిక బాప్తిస్మము అవసరము.
1 ఇదిగో, ఈ విషయములో పాత నిబంధనలన్నీ గతించునట్లు చేసియున్నానని నేను మీకు సెలవిచ్చుచున్నాను; ఇది నూతనమైన, శాశ్వతమైన నిబంధన అనగా ఆదినుండి యున్నది.
2 కాబట్టి, ఒక మనుష్యుడు నూరు మారులు బాప్తిస్మము పొందియున్నప్పటికీ అది అతనికి ఏ ప్రయోజనము చేకూర్చదు, ఏలయనగా మోషే ధర్మశాస్త్రము వలనైనను, మీ మరణక్రియల వలనైనను తిన్నని ద్వారములో మీరు ప్రవేశించలేరు.
3 ఏలయనగా మీ మరణక్రియల కారణముగా ప్రాచీన దినములలో వలే ఈ చివరి నిబంధనను, ఈ సంఘమును నా కొరకు నిర్మించులాగున నేను చేసియున్నాను.
4 కాబట్టి, నేనాజ్ఞాపించిన విధముగా మీరు ఈ ద్వారములో ప్రవేశించుడి, మీ దేవునికి సలహా ఇచ్చుటకు ప్రయత్నించవద్దు. ఆమేన్.