“నల్లవారైనా తెల్లవారైనా, బందీలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలైనా” అందరు దేవునికి ఒకేరీతిగా ఉన్నారని మోర్మన్ గ్రంథము బోధించుచున్నది (2 నీఫై 26:33). సంఘ చరిత్ర అంతటిలో, అనేక దేశాలలో ప్రతి జాతి మరియు స్వజాతీయతకు సంబంధించిన వారు బాప్తిస్మము పొంది, సంఘము యొక్క విశ్వాసులైన సభ్యులుగా జీవించారు. జోసెఫ్ స్మిత్ జీవితకాలములో, కొంతమంది నల్లజాతి పురుషులు యాజకత్వమునకు నియమించబడిరి. దాని చరిత్రలో, ఆఫ్రికా వారసత్వమునకు చెందిన నల్లజాతి పురుషులకు యాజకత్వము అనుగ్రహించుటను మానివేసిరి. ఈ ఆచారము యొక్క మూలములకు సంఘ చరిత్ర ఎటువంటి స్పష్టమైన పరిజ్ఞానమును ఇచ్చుటలేదు. ఈ ఆచారమును మార్చుటకు దేవునినుండి ఒక బయల్పాటు అవసరమని సంఘ నాయకులు నమ్మి, ప్రార్థనాపూర్వకముగా నడిపింపును కోరారు. ఆ బయల్పాటు సంఘ అధ్యక్షులైన స్పెన్సర్ డబ్ల్యూ. కింబల్కు వచ్చింది మరియు ఇతర సంఘ నాయకులకు 1978, జూన్ 1న సాల్ట్ లేక్ దేవాలయములో రూఢీపరచబడింది. జాతికి సంబంధించి ఒకప్పుడు విధించబడిన యాజకత్వపు నిర్భంధములన్నింటిని ఈ బయల్పాటు తొలగించింది.