92వ ప్రకరణము
1833, మార్చి 15న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కివ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటు అంతకుముందే జోసెఫ్ స్మిత్‌కు సలహాదారునిగా నియమించబడిన ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్‌కు ఐక్య సంస్థలో తన బాధ్యతల గురించి సూచనలిచ్చును. (78 మరియు 82వ ప్రకరణముల శీర్షికలు చూడండి).
1–2, ఐక్య క్రమములోనికి ప్రవేశించుటకు సంబంధించి ప్రభువు ఒక ఆజ్ఞనిచ్చుచున్నాడు.
1 నిశ్చయముగా, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఇంతకు ముందు ఇవ్వబడిన ఆజ్ఞకు అంగీకారముగా స్థాపించబడిన ఐక్య క్రమమునకు నా సేవకుడైన ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ ను గూర్చి ఒక బయల్పాటును, ఆజ్ఞను ఇచ్చుచున్నాను, అదేమనగా వారు ఈ క్రమములోనికి అతడిని చేర్చుకొనవలెను. నేను ఒకనితో చెప్పునది అందరితో చెప్పుచున్నాను.
2 మరలా, నా సేవకుడైన ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్, నేను నీతో చెప్పునదేమనగా, ఈ క్రమములో నీవు ఒక క్రియాశీల సభ్యునిగానుండవలెను; మునుపటి ఆజ్ఞలన్నిటికి విశ్వాసముగానుండిన యెడల, నీవు ఎప్పటికీ దీవించబడుదువు. ఆమేన్.