40వ ప్రకరణము
1831 జనవరి 6న, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, సిడ్నీ రిగ్డన్‌లకివ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటును నమోదు చేయకమునుపు ప్రవక్త యొక్క చరిత్ర ఇలా ప్రకటించుచున్నది: “జేమ్స్ కోవెల్ ప్రభువు వాక్యమును తిరస్కరించి, తన పాత నమ్మకాలు, స్నేహితుల యొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, ప్రభువు నాకు, సిడ్నీ రిగ్డన్‌కు ఈ బయల్పాటునిచ్చెను” (39వ ప్రకరణము చూడుము).
1–3, హింసను గూర్చిన భయము, ఐహిక విచారములు సువార్తను తిరస్కరించుటకు కారణమగును.
1 ఇదిగో, నా సేవకుడైన జేమ్స్ కోవెల్ హృదయము నా యెదుట యథార్థముగా నుండెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఏలయనగా నా మాటకు తాను విధేయుడైయుండెదనని అతడు నాతో నిబంధన చేసెను.
2 అతడు వాక్యమును సంతోషముగా స్వీకరించెను, కానీ వెంటనే సాతాను అతడిని శోధించెను; హింసను గూర్చిన భయము, ఐహిక విచారములు అతడు సువార్తను తిరస్కరించుటకు కారణమాయెను.
3 కాబట్టి అతడు నా నిబంధనను అతిక్రమించెను మరియు నాకు మంచిదనిపించిన విధముగా అతని పట్ల వ్యవహరించుట నా వశమైయున్నది. ఆమేన్.