2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
నవంబరు 8–14. సిద్ధాంతము మరియు నిబంధనలు 129–132: “మనము దేవుని నుండి ఏదైనా దీవెనను పొందిన యెడల, విధేయత చూపుట ద్వారా అది జరుగును”


“నవంబరు 8–14. సిద్ధాంతము మరియు నిబంధనలు 129–132: ‘మనము దేవుని నుండి ఏదైనా దీవెనను పొందిన యెడల, విధేయత చూపుట ద్వారా అది జరుగును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“నవంబరు 8–14. సిద్ధాంతము మరియు నిబంధనలు 129–132,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
నావూలో బోధిస్తున్న జోసెఫ్ స్మిత్

నావూలో జోసెఫ్ స్మిత్, 1840, థియోడోర్ గోర్కా చేత

నవంబరు 8–14

సిద్ధాంతము మరియు నిబంధనలు 129–132

“మనము దేవుని నుండి ఏదైనా దీవెనను పొందిన యెడల, విధేయత చూపుట ద్వారా అది జరుగును”

129–32 ప్రకరణములు అనేక అమూల్యమైన సూత్రాలను బోధిస్తాయి, వాటిలో కొన్ని మాత్రమే ఈ పాఠ్యాంశంలో ప్రముఖంగా పేర్కొనబడ్డాయి. ఏ ఇతర సత్యాలను మీరు కనుగొంటారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

“మానవులు వాటిని అర్థం చేసుకోగలిగేలా పరలోక సంగతులను ఆయన వివరించగలడని” ఒకసారి జోసెఫ్ స్మిత్ గురించి బ్రిగమ్ యంగ్ చెప్పారు (Teachings of Presidents of the Church: Joseph Smith, 499–500). 1840లలో నావూలో ప్రవక్త యొక్క బోధనల విషయంలో ఇది ప్రత్యేకంగా నిజమనిపించింది, వాటిలో కొన్ని సిద్ధాంతము మరియు నిబంధనలు 129–32 లో నమోదు చేయబడ్డాయి. రక్షకుడు ఎలా ఉంటారు? “ఆయన మన వలె మనుష్యుడు.” పరలోకము ఎలా ఉంటుంది? “ఇక్కడ మనమధ్య ఉన్న సమాజ వ్యవస్థయే అక్కడ మనమధ్య ఉండును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:1–2), మరియు సరైన అధికారము చేత ముద్రించబడినట్లయితే ఈ లోకములో మనము అత్యంత అభిమానించిన కుటుంబ సంబంధాలు తరువాతి లోకంలో “ప్రభావమును కలిగియుండును” (సిద్ధాంతము మరియు నిబంధనలు132:19). ఇటువంటి సత్యాలు పరలోకము ఎంతో దూరంలో లేనట్లుగా—మహికరమైనది, అయినను చేరుకోగలదిగా భావింపజేస్తాయి.

కానీ, కొన్నిసార్లు వాటిని చేరుకోలేనట్లుగా అనిపించేలా చాలా అసౌకర్యమైన విషయాలను చేయమని దేవుడు మనల్ని అడుగవచ్చు. అనేకమంది ప్రారంభ పరిశుద్ధులకు, బహు వివాహము అటువంటి ఒక ఆజ్ఞ. అదనపు భార్యలను వివాహమాడమనే ఆజ్ఞ జోసెఫ్ స్మిత్, ఆయన భార్య ఎమ్మా మరియు దాదాపు దానిని పొందిన ప్రతిఒక్కరి కొరకు వారి విశ్వాసానికి తీవ్ర పరీక్షగా ఉండెను. ఈ పరీక్షను ఎదుర్కోవడానికి వారికి పునఃస్థాపించబడిన సువార్త గురించి కేవలం మంచి భావాలకంటే ఎక్కువ అవసరమైంది; వ్యక్తిగత కోరికలు లేదా పక్షపాతముల కంటే దేవుని యందు అత్యంత లోతైన విశ్వాసము వారికి అవసరమైంది. నేడు ఆ ఆజ్ఞ అమలులో లేదు, కానీ దాని ప్రకారము జీవించిన వారి విశ్వాసపూరితమైన మాదిరి ఇంకా నిలిచియుంది. మరియు మనము “విధేయత చూపుటకు మన స్వంత త్యాగములను” (సిద్ధాంతము మరియు నిబంధనలు132:50) చేయమని అడుగబడినప్పుడు ఆ మాదిరి మనల్ని ప్రేరేపిస్తుంది.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 130–31

దైవత్వము మరియు “రాబోవు లోకము” గురించిన సత్యాలను జోసెఫ్ స్మిత్ బయల్పరిచారు.

130–31 ప్రకరణములు సిద్ధాంతము మరియు నిబంధనలు లోని ఇతర ప్రకరణముల కంటే కొంత భిన్నంగా ఉన్నట్లు మీరు గమనించవచ్చు. ఇది ఎందుకనగా, జోసెఫ్ స్మిత్ గుమాస్తాలలో ఒకరైన విలియం క్లేటన్ ప్రవక్త బోధించగా తాను విని వ్రాసిన విషయాలపై 130–31 ప్రకరణములు ఆధారపడియున్నాయి. ఫలితముగా, ఈ ప్రకరణములు వాటికి అంటుకొనియున్న, చెప్పి వ్రాయించిన బయల్పాటుల కంటే ఎక్కువగా సత్యాల సేకరణలుగా ఉన్నాయి. అయినప్పటికీ, ఈ సత్యాలలో అనేకము మధ్య కొన్ని ఉమ్మడి ఆలోచనలున్నాయి. ఉదాహరణకు, ఇటువంటి ప్రశ్నలను మనస్సులో ఉంచుకొని మీరు 130–31 ప్రకరణములు చదువవచ్చు: దేవుని గురించి నేనేమి నేర్చుకుంటాను? మర్త్యత్వము తరువాతి జీవితం గురించి నేనేమి నేర్చుకుంటాను? ఈ జ్ఞానము నా జీవితాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4; 132:7, 13–25

నిత్యము ఉండేందుకు పరలోక తండ్రి కుటుంబాలకు సాధ్యం చేసారు.

వివాహము మరియు కుటుంబ సంబంధాలు శాశ్వతముగా ఉండగలవు అనేది ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించబడిన అత్యంత ఓదార్పునిచ్చు సత్యాలలో ఒకటి. ఈ సంబంధాలను నిత్యమైనవిగా చేయడానికి అవసరమైన విధులు మరియు అధికారాన్ని జోసెఫ్ స్మిత్ ద్వారా ప్రభువు పునఃస్థాపించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు132:7, 18–19 చూడండి). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4; 132:7, 13–25 చదువుతున్నప్పుడు, మీరు కలిగియున్న లేదా భవిష్యత్తులో కలిగియుండాలని ఆశిస్తున్న కుటుంబ సంబంధాల గురించి ఆలోచించండి. ఈ సంబంధాల గురించి మీరు ఆలోచించే విధానాన్ని ఈ వచనాలు ఎలా ప్రభావితం చేస్తాయి?

ఏమైనప్పటికీ, కొన్నిసార్లు నిత్య కుటుంబాల సూత్రము అంత ఓదార్పునివ్వదు—మన ప్రస్తుత కుటుంబ పరిస్థితి ఆదర్శవంతమైన సిలిస్టియల్‌ దానితో సరిపోలనప్పుడు అది ఆందోళనను, విచారాన్ని కూడా కలిగించవచ్చు. అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ తన స్వంత కుటుంబములో అటువంటి పరిస్థితి గురించి విచారించినప్పుడు, పన్నెండుమంది అపొస్తలుల సమూహములోని ఒక సభ్యుని నుండి ఆయన ఈ తెలివైన సలహా పొందారు: “నీవు సిలెస్టియల్ రాజ్యమునకు యోగ్యత కలిగి జీవించు, తరువాత కుటుంబ ఏర్పాట్లు నీవు ఊహించుకొనే దానికంటే మరింత అద్భుతముగా ఉంటాయి” (“ప్రభువు ఆత్మ నివసించే గృహము,” లో ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2019,25). మీ ప్రస్తుత కుటుంబ పరిస్థితిలో ఈ సలహాను అనుసరించడం మిమ్మల్ని ఏవిధంగా దీవించవచ్చు?

చిత్రం
ఆక్రా ఘానా దేవాలయము వెలుపల ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు

దేవాలయ విధుల ద్వారా కుటుంబ సంబంధాలు నిత్యమైనవిగా చేయబడగలవు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 132:1–2, 29–40

ఆయన ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే బహు వివాహములు దేవునికి అంగీకారమగును.

పాత నిబంధనను చదివిన వారెవరైనా అబ్రాహాము, యాకోబు, మోషే మరియు ఇతరులు అనేకమంది భార్యలను వివాహమాడడం గురించి ఆశ్చర్యపడియుండవచ్చు. ఈ మంచి వ్యక్తులు వ్యభిచారము చేస్తున్నారా? లేదా వారి చర్యలను దేవుడు అనుమతించాడా? జవాబుల కొరకు సిద్ధాంతము మరియు నిబంధనలు 132:1–2, 29–40 చూడండి.

ఒక స్త్రీ మరియు ఒక పురుషుని మధ్య వివాహము అనేది దేవుని యొక్క వివాహ నియమము (అధికారిక ప్రకటన1 ప్రకరణ శీర్షిక చూడండి; జేకబ్ 2:27,30 కూడా చూడండి). అయినప్పటికీ, తన పిల్లలు బహు వివాహమును ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి.

పునఃస్థాపించబడిన సంఘము యొక్క ప్రారంభ సంవత్సరాలు యొక్క ఆ సందర్భాలలో ఒకటి. ఈ ఆజ్ఞను పొందిన తరువాత, జోసెఫ్ స్మిత్ మరియు ఇతర కడవరి-దిన పరిశుద్ధులు బహు వివాహమును ఆచరించారు. కడవరి-దిన పరిశుద్ధుల మధ్య బహు వివాహం గురించి మీరు మరింతగా తెలుసుకోవాలనుకుంటే, ఈ పాఠ్యాంశము చివరన ఉన్న “పునఃస్థాపన స్వరములు” చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 130:2, 18–19; 132:13,19. నిత్యము నిలిచియుండే విషయాలకు మీ కుటుంబము ప్రాధాన్యతనిచ్చేలా సహాయపడేందుకు ఈ వచనాలను మీరెలా ఉపయోగించగలరు? సిద్ధాంతము మరియు నిబంధనలు 130:2, 18–19; 132:19 ప్రకారము మనము మనతోపాటు తరువాతి జీవితంలోకి తీసుకువెళ్ళగలిగేవి, అనగా కుటుంబ చిత్రాలు లేక లేఖనాలు వంటివాటిని సూచించే వస్తువులతో మీ పెట్టెను లేదా సంచిని మీరు సర్దుకోవచ్చు. లోక విషయాల గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 132:13 మనకేమి బోధిస్తుంది? నిత్య ప్రాముఖ్యత గల విషయాలపై కేంద్రీకరించడం గురించి చర్చకు ఇది దారితీయవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 130:20–21.మీరు కృతజ్ఞత గురించి ఒక పాట పాడవచ్చు మరియు దేవుని చట్టాలకు విధేయులవడం వలన మీ కుటుంబము పొందిన దీవెనల జాబితా చేయవచ్చు. ఏ దీవెనలు పొందాలని మనము ఆశిస్తున్నాము? ఆ దీవెనలను మనమెలా పొందగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4; 132:15–19. వివాహం గురించి ప్రభువు ఎలా భావిస్తారు? మనము వివాహితులమైనా లేదా ఒంటరియైనా—మనము నిత్య వివాహము కొరకు ఎలా సిద్ధపడతాము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

సువార్త సత్యముల కొరకు వెదకండి. కొన్నిసార్లు సువార్త సత్యాలు తిన్నగా చెప్పబడతాయి; మరికొన్నిసార్లు అవి ఒక ఉదాహరణ లేదా కథ ద్వారా సూచించబడతాయి. మీరు చదువుతున్నప్పుడు, “ఏ నిత్య సత్యము ఈ వచనములలో బోధించబడినది?” అని మీకై మీరు ప్రశ్నించుకోండి.

చిత్రం
పారిస్ ఫ్రాన్స్ దేవాలయములో ముద్రణ గది

పారిస్ ఫ్రాన్స్ దేవాలయములో ఒక ముద్రణ గది.

ముద్రించు