“నవంబరు 29–డిసెంబరు 5. సిద్ధాంతము మరియు నిబంధనలు 137–138: ‘మృతుల విమోచనను గూర్చి దర్శనము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“నవంబరు 29–డిసెంబరు 5. సిద్ధాంతము మరియు నిబంధనలు 137–138,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
నవంబరు 29–డిసెంబరు 5
సిద్ధాంతము మరియు నిబంధనలు 137–138
“మృతుల విమోచనను గూర్చి దర్శనము”
అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ బోధించారు: “సమగ్రంగా, ఆలోచనాపూర్వకంగా [సిద్ధాంతము మరియు నిబంధనలు 138] చదవమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఆవిధంగా చేసినప్పుడు, దేవుని ప్రేమను మరియు ఆయన పిల్లల కొరకు ఆయన రక్షణ మరియు సంతోష ప్రణాళికను పూర్తిగా అర్థం చేసుకొని, అభినందించేలా ప్రభువు మిమ్మల్ని దీవించును గాక” (“మృతుల విమోచనను గూర్చి దర్శనము,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవ. 2018,73).
మీ మనోభావాలను నమోదు చేయండి
సిద్ధాంతము మరియు నిబంధనలు 137 మరియు138లలో నమోదు చేయబడిన బయల్పాటులు 80 సంవత్సరాలు మరియు 1500 మైళ్ళు కంటే ఎక్కువ వాటిచేత వేరుచేయబడ్డాయి. పూర్తికాని కర్ట్‌లాండ్ దేవాలయంలో 1836లో ప్రవక్త జోసెఫ్ స్మిత్ చేత 137వ ప్రకరణము పొందబడింది మరియు 138వ ప్రకరణము 1918లో సాల్ట్ లేక్ సిటీలో సంఘము యొక్క ఆరవ అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ చేత పొందబడింది. కానీ సిద్ధాంతపరంగా ఈ రెండు దర్శనములు ఒకదానితో ఒకటి సంబంధం కలిగియున్నాయి. అవి రెండూ తరువాతి జీవితంలో దేవుని పిల్లల గమ్యము గురించిన ప్రశ్నలకు జవాబిస్తాయి. వాటిని పొందిన ప్రవక్తల జీవితానుభవాలను మనం పరిగణించినప్పుడు, అవి రెండూ అదనంగా అధిక అర్థాన్ని కలిగియున్నాయి.
జోసెఫ్ స్మిత్ యొక్క దర్శనము ఆయన ప్రియమైన అన్న ఆల్విన్ యొక్క నిత్య గమ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆయనకు సహాయపడింది, అతను బాప్తీస్మమిచ్చు అధికారము పునఃస్థాపించబడడానికి ఆరు సంవత్సరాల ముందు మరణించాడు. అప్పటినుండి ఆల్విన్ యొక్క నిత్య రక్షణ గురించిన ప్రశ్నలు జోసెఫ్‌తోపాటు నిలిచియున్నాయి. జోసెఫ్ ఎఫ్. స్మిత్ యొక్క దర్శనము ఆత్మ లోకం గురించి మహిమకరమైన సత్యాలను బయల్పరచింది—కుటుంబంలో అనేకమంది దగ్గరి బంధువుల మరణాల గురించి బాధపడిన వారికి నిశ్చయంగా ఓదార్పునిచ్చే బయల్పాటది. జోసెఫ్ ఎఫ్. స్మిత్ 5 ఏళ్ళ వయస్సులో తన తండ్రి హైరం స్మిత్‌ను, 13 ఏళ్ళ వయస్సులో తన తల్లి మేరీ ఫీల్డింగ్ స్మిత్‌ను కోల్పోయారు. 1918లో ఆయనకు దర్శనం కలిగేనాటికి ఆయన 13 మంది పిల్లల్ని కోల్పోయి బాధపడ్డారు.
మరణం తర్వాత జీవితం గురించి జనులు కలిగియున్న అనేక ప్రశ్నలు ఈ బయల్పాటులలో జవాబివ్వబడ్డాయి. 137వ ప్రకరణము అటువంటి ప్రశ్నలకు కొంత అంతరార్థమునిస్తుంది మరియు 138వ ప్రకరణము దానిని మించిన అంతరార్థమునిస్తుంది. అవి రెండూ కలిసి “తండ్రి మరియు కుమారుని చేత ప్రత్యక్షపరచబడిన గొప్ప మరియు అద్భుతమైన ప్రేమకు” సాక్ష్యమిస్తాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:3).
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
సిలెస్టియల్ మహిమను ఎంచుకొనే అవకాశం ప్రతి ఆత్మకు ఉంటుంది.
1836లో క్రైస్తవుల మధ్యనున్న సాధారణ గ్రహింపు ఏమనగా, బాప్తీస్మము పొందకుండా ఒక వ్యక్తి మరణించినట్లయితే—జోసెఫ్ స్మిత్ అన్న ఆల్విన్ మాదిరిగా—ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. అయినప్పటికీ, సిలెస్టియల్ రాజ్యము యొక్క దర్శనములో జోసెఫ్ ఆల్విన్‌ను చూసాడు. మీరు 137వ ప్రకరణము చదువుతున్నప్పుడు, పరలోక తండ్రి, ఆయన రక్షణ ప్రణాళిక మరియు సిలెస్టియల్ రాజ్యము గురించి మీరు నేర్చుకున్నదానిని ధ్యానించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 138:1–11, 25–30
లేఖనాలను చదివి, ధ్యానించడం బయల్పాటు పొందడానికి నన్ను సిద్ధం చేస్తుంది.
కొన్నిసార్లు మనం దానిని కోరుకోకపోయినా బయల్పాటు వస్తుంది. కానీ చాలా తరచుగా, మనం దానికోసం శ్రద్ధగా వెదికి, సిద్ధపడినందున అది వస్తుంది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 138:1–11, 25–30 చదువుతున్నప్పుడు, అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్, రక్షకుని విమోచన కార్యాన్ని బాగా అర్థంచేసుకోవడానికి “(ఆయన) జ్ఞాన నేత్రములు తెరువబడినప్పుడు” చేస్తున్న దానిని గమనించండి. తరువాత, అధ్యక్షులు స్మిత్ మాదిరిని మీరెలా అనుసరించగలరో పరిగణించండి. ఉదాహరణకు, మరింతగా “లేఖనములను ధ్యానించుటకు” మరియు మరింతగా “(రక్షకుని) గొప్ప ప్రాయశ్చిత్తపు త్యాగముపై ప్రతిబింబించుటకు” అనుమతించేలా మీ లేఖన అధ్యయనమునకు మీరు ఏ మార్పులు చేయగలరు? (1–2 వచనాలు).
ఆయన సందేశమైన “మృతుల విమోచనను గూర్చి దర్శనము” (ఎన్‌సైన్ లేదా లియహోనా, నవ. 2018, 71–74)లో, ఈ బయల్పాటును పొందడానికి అధ్యక్షులు స్మిత్ సిద్ధపరచబడిన ఇతర విధానాలను అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ సూచించారు. మీరు పొందుతున్న అనుభవాలు లేదా భవిష్యత్తులో పొందబోవు అనుభవాల కొరకు మీరెలా సిద్ధపరచబడుతున్నారో పరిగణించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 138:25–60
రక్షణ కార్యము తెరకు ఇరువైపులా జరుగుతున్నది.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు, “ప్రపంచమునకు మన సందేశము సాధారణమైనది మరియు నిజాయితీగలది: వారి రక్షకుని వద్దకు వచ్చి పరిశుద్ధ దేవాలయము యొక్క దీవెనలు పొందాలని, శాశ్వతమైన ఆనందమును కలిగియుండాలని మరియు నిత్య జీవము కొరకు అర్హులు కావాలని తెరకు రెండువైపులా గల దేవుని పిల్లలందరిని మేము ఆహ్వానిస్తున్నాము” (“మనమందరము ముందుకు త్రోసుకొని వెళదాము,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2018, 118–19). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 138:25–60 చదువుతున్నప్పుడు, ఈ వ్యాఖ్యానమును ధ్యానించండి. మీరు ఈ ప్రశ్నలను కూడా పరిగణించవచ్చు:
-
ఆత్మ లోకంలో రక్షణ కార్యము ఏవిధంగా సాధించబడుతుంది అనేదాని గురించి ఈ వచనాల నుండి మీరేమి నేర్చుకుంటారు? ఈ కార్యము జరుగుతుందని తెలుసుకోవడం మీకెందుకు ముఖ్యమైనది? రక్షకుని ప్రాయశ్చిత్తమందు మీ విశ్వాసాన్ని ఈ వచనాలు ఎలా బలపరుస్తాయి?
-
ఆత్మ లోకంలో రక్షణ కార్యములో పాల్గొనేవారి గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయి? తెరకు రెండువైపులా రక్షణ కార్యము జరుగుతున్నదని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమైనది?
డాల్లిన్ హెచ్. ఓక్స్, “ప్రభువునందు నమ్మకముంచుము,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవ. 2019, 26–29 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 137:1–5.ఈ వచనాలపై ఆధారపడి, సిలెస్టియల్ రాజ్యము ఎలా ఉంటుందని వారనుకుంటున్నారో చిత్రించమని మీ కుటుంబమును ఆహ్వానించండి. అక్కడ నివసించడానికి ఎదురు చూడడంలో మీకు సహాయపడేలా ఈ వచనాలలో మీరు ఏమి కనుగొంటారు? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో సిలెస్టియల్ రాజ్యములో నివసించడానికి సిద్ధపడేందుకు ఇప్పుడు మనమేమి చేస్తున్నాము?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 137:5–10. బహుశా, మీకు తెలిసి బాప్తీస్మము పొందే అవకాశం లేకుండా మరణించిన ఒకరి గురించి మీరు మాట్లాడవచ్చు. ఆ వ్యక్తి గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 137:5–10 మనకేమి బోధిస్తుంది?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 138:12–24.ఆత్మ లోకంలో రక్షకుడు సందర్శించిన జనుల గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 138:12–24 ఏమి బోధిస్తుంది? వారు పొందిన దీవెనలేవి? వారి ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకుంటాము?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 138:38–55.ఈ వచనాలు అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఆత్మ లోకంలో చూసిన వారిని వర్ణిస్తాయి మరియు వారి గురించి క్లుప్త వివరాలను అందిస్తాయి. వారి జీవితాలకు సంబంధించిన వివరాలతో పాటు ఆత్మ లోకంలో ఉన్న మీ పూర్వీకుల జాబితాను మీ కుటుంబము తయారు చేయవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.