2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
డిసెంబరు 20–26. క్రిస్మస్: దేవుని యొక్క దైవపుత్రుని అసమాన బహుమానము


“డిసెంబరు 20–26. క్రిస్మస్: దేవుని యొక్క దైవపుత్రుని అసమాన బహుమానము,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“డిసెంబరు 20–26. క్రిస్మస్,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

మరియ మరియు బాలుడైన యేసు యొక్క కళాఖండము

Nativity in Copper and Umber (రాగి మరియు పసుపు ఎరుపు వర్ణంలో జననస్థితి), జె. కిర్క్ రిచర్డ్స్ చేత

డిసెంబరు 20–26

క్రిస్మస్

దేవుని యొక్క దైవపుత్రుని అసమాన బహుమానము

ఈ క్రిస్మస్ సమయంలో మీ ఆలోచనలను రక్షకునిపై కేంద్రీకరించడానికి ఒక మార్గము, “జీవముతోనున్న క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యమును” అధ్యయనం చేయడం. ఈ ప్రవచనాత్మక సాక్ష్యాన్ని మీ వ్యక్తిగత మరియు కుటుంబ సువార్త అధ్యయనంలో భాగంగా చేసుకోవడానికి మార్గాలను ఈ సారాంశం సూచిస్తుంది.

మీ మనోభావాలను నమోదు చేయండి

1838లో ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా ప్రకటించారు, “మన మతం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏవనగా, యేసు క్రీస్తు మరణించారని, సమాధి చేయబడ్డారని, మూడవరోజు తిరిగి లేచారని మరియు పరలోకంలోకి ఆరోహణమయ్యారని ఆయనకు సంబంధించి అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క సాక్ష్యము; మన మతానికి సంబంధించిన మిగతావన్నీ దానికి అనుబంధములు మాత్రమే” (Teachings of Presidents of the Church: Joseph Smith,49). చాలా సంవత్సరాల తర్వాత, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గమనించారు, “ప్రవక్త యొక్క ఈ వ్యాఖ్యానమే ప్రభువు జననము యొక్క 2,000వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి తమ సాక్ష్యాలను వ్రాసి ఇవ్వడానికి 15 మంది ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులకు కావలసిన ప్రోత్సాహాన్ని అందించింది. ఆ చారిత్రాత్మక సాక్ష్యమే ‘జీవముతోనున్న క్రీస్తుగా’ పిలువబడింది. అనేకమంది సభ్యులు దాని సత్యాలను కంఠస్థం చేసారు. ఇతరులకు అది ఉన్నదనే సంగతే తెలియదు. మీరు యేసు క్రీస్తు గురించి ఎక్కువగా నేర్చుకోవాలని కోరినప్పుడు, ‘జీవముతోనున్న క్రీస్తు’ను అధ్యయనం చేయమని నేను కోరుతున్నాను” (“మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొందడం,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2017,40).

కడవరి-దిన పరిశుద్ధులుగా మనం, ఆధునిక ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా నిరంతర బయల్పాటు యొక్క దీవెనలో ఆనందిస్తాము. వారి ప్రేరేపిత సలహాలు, హెచ్చరిక మరియు ప్రోత్సాహము కొరకు మనము కృతజ్ఞులము. అన్నింటిని మించి, క్రిస్మస్ సమయంలో మరియు సంవత్సరమంతా యేసు క్రీస్తు గురించి వారి శక్తివంతమైన సాక్ష్యాలతో మనం దీవించబడ్డాము. ఇవి నైపుణ్యం గల రచయితలు లేదా బహిరంగ ప్రసంగీకుల ప్రేరేపిత పదాలు లేదా లేఖన నిష్ణాతుల నుండి అంతరార్థములను మించినవి. దేవుని చేత ఎంచుకోబడి, పిలువబడి, “ప్రపంచమంతటా క్రీస్తు నామమునకు ప్రత్యేక సాక్షులుగా” అధికారమివ్వబడిన వారి మాటలవి (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:23).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

“మరెవ్వరూ అంత అత్యధిక ప్రభావాన్ని కలిగియుండలేదు.”

జీవముతోనున్న క్రీస్తు” యొక్క మొదటి పేరాతో పాటు లూకా 2:10–11ను మీరు చదివినప్పుడు మీకు ఏ ఆలోచనలు వస్తాయి? “భూమిపై ఇంతకుముందు జీవించిన మరియు ఇకపై జీవించబోవు వారందరిపై (యేసు క్రీస్తు వలె) మరెవ్వరూ అంత అత్యధిక ప్రభావాన్ని కలిగియుండలేదు” అనే వ్యాఖ్యానానికి సహకారమిచ్చేలా మీరేమి చెప్తారు? “జీవముతోనున్న క్రీస్తు”లో రక్షకుని యొక్క అత్యధిక ప్రభావాన్ని వర్ణించే సత్యాల కొరకు చూడండి. ఆయన మిమ్మల్ని ఏవిధంగా ప్రభావితం చేసారు మరియు “మహాసంతోషమును” మీకెలా తెచ్చారు? లూకా 2:10.

“ఆయన సమాధి నుండి లేచారు.”

జీవముతోనున్న క్రీస్తులో,” పునరుత్థానుడైన ప్రభువు యొక్క మూడు ప్రత్యక్షతలను వివరిస్తూ అపొస్తలులు రక్షకుని యొక్క పునరుత్థానము గురించి సాక్ష్యమిచ్చారు (ఐదవ పేరా చూడండి). యోహాను 20–21; 3 నీఫై 11–26; మరియు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:14–20లో ఈ దర్శనాల గురించి చదవడాన్ని పరిగణించండి. ఈ ప్రత్యక్షతలలో ఆయన మాటలు మరియు క్రియల నుండి రక్షకుని గురించి మీరేమి నేర్చుకుంటారు?

“ఆయన యాజకత్వము మరియు ఆయన సంఘము పునఃస్థాపించబడ్డాయి.”

ఈ సంవత్సరం మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు చదువుతున్నప్పుడు, రక్షకుని “యాజకత్వము మరియు ఆయన సంఘము ఎలా పునఃస్థాపించబడ్డాయి” అనే దాని గురించి ఎక్కువగా నేర్చుకొనే అవకాశాన్ని మీరు కలిగియున్నారు. పునఃస్థాపించబడిన ఏ సత్యాలు లేదా సూత్రాలు మీకు ప్రత్యేకంగా అర్థవంతంగా ఉన్నాయి? పునఃస్థాపన గురించి బోధించే క్రింది లేఖనాలలో కొన్నింటిని పునర్వీక్షించడాన్ని పరిగణించండి: సిద్ధాంతము మరియు నిబంధనలు 1:17–23; 13; 20:1–12; 65; 110; 112:30–32; 124:39–42; 128:19–21. పునఃస్థాపించబడిన సువార్త యొక్క సత్యాలు యేసు క్రీస్తును తెలుసుకొని, ఆరాధించడానికి మీకెలా సహాయపడతాయో ధ్యానించండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:19).

“ఆయన ఒకనాడు భూమికి తిరిగివస్తారు.”

క్రిస్మస్ అనేది యేసు క్రీస్తు జన్మించిన రోజు వైపు తిరిగి చూడడానికి, ఆయన మరలా వచ్చే రోజు కోసం ఎదురు చూడడానికి సమయం. “జీవముతోనున్న క్రీస్తు” యొక్క చివరి నుండి రెండవ పేరాలో ఆయన తిరిగి రావడం గరించి మీరేమి నేర్చుకుంటారు? రెండవ రాకడ గురించి బోధించే కీర్తనలను చదవడం, పాడడం లేదా వినడం కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు.

“ఆయనే లోకమునకు వెలుగును, జీవమును, నిరీక్షణయైయున్నాడు.”

జీవముతోనున్న క్రీస్తు” యొక్క చివరి పేరాలో రక్షకుని లక్షణాలను, ఆయనకివ్వబడిన నామాలను గమనించండి. యేసు ఎలా “లోకమునకు వెలుగును, జీవమును, నిరీక్షణయైయున్నాడో” ధ్యానించడానికి క్రింది లేఖనాలు మీకు సహాయపడగలవు: లూకా 2:25–32; 1 కొరింథీయులకు 15:19–23; మొరోనై 7:41; సిద్ధాంతము మరియు నిబంధనలు 50:24; 84:44–46; 93:7–10. ఏవిధంగా ఆయన మీకు వెలుగును, జీవమును, నిరీక్షణయైయున్నాడు? రక్షకుని యొక్క ఏ ఇతర లక్షణాలు లేదా నామాలు మీకు అత్యంత అర్థవంతంగా ఉన్నాయి?

జీవముతోనున్న క్రీస్తు” చదవడం రక్షకుని యందు మీ విశ్వాసాన్ని, ఆయన కొరకు మీ ప్రేమను ఎలా ప్రభావితం చేసింది?

యేసు క్రీస్తు

లోకమునకు వెలుగు, హావర్డ్ లియోన్ చేత

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

జీవముతోనున్న క్రీస్తు.”జీవముతోనున్న క్రీస్తు” లో రక్షకుని గురించి బోధించబడిన సత్యాలను గ్రహించడంలో మీ కుటుంబానికి సహాయపడేందుకు మీరు కొన్ని ముఖ్యమైన వాక్యభాగాలను ఎంచుకొని, వాటిని వివరించే చిత్రాలను కనుగొనడానికి లేదా గీయడానికి కలిసి పనిచేయవచ్చు. అప్పుడు ఆ చిత్రపటాలు మరియు వాక్యభాగాలను ఒక పుస్తకంగా మీరు సంగ్రహించవచ్చు.

“మనం మన సాక్ష్యాన్నిస్తాము.”జీవముతోనున్న క్రీస్తు” నుండి సాక్ష్యాన్నివ్వడం గురించి మనం ఏమి నేర్చుకుంటాము? రక్షకుని జననమును గుర్తుంచుకోవడానికి క్రీస్తు గురించి మీ సాక్ష్యాలను మీరు నమోదు చేయాలని కోరవచ్చు.

“ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను.”ఈ క్రిస్మస్ సమయంలో సేవకు సంబంధించి రక్షకుని మాదిరిని మీ కుటుంబము ఎలా అనుసరించగలదు? మీ కుటుంబము మరియు సమాజములో “సమాధానమును, సమ్మతిని” మీరేవిధంగా విస్తరింపజేస్తారు? “రోగుల(కు) స్వస్థతను” చేకూర్చడంలో మీరెలా సహాయపడగలరు?

“ఆయన దైవపుత్రుని అసమాన బహుమానము కొరకు దేవునికి కృతజ్ఞతలు.”యేసు క్రీస్తు మూలంగా మనం పొందిన బహుమానాలేవి? బహుశా కుటుంబ సభ్యులు “The Living Christ”లో జవాబులు కనుగొని, రక్షకుని నుండి ఆ బహుమానాలను సూచించే వస్తువులను అలంకరించవచ్చు. మీ కుటుంబము బహుమానాలను క్రిస్మస్ రోజు లేదా వారమంతటా తెరచి చూచి, ప్రతిదానికి సంబంధించిన లేఖనాలను చదువవచ్చు. మీ కుటుంబము వేరే వాటిని కనుగొన్నప్పటికీ, ఇక్కడ సాధ్యమైన కొన్ని లేఖనాలున్నాయి: లూకా 2:10–14; 1 పేతురు 2:21; మోషైయ 3:8; ఆల్మా 11:42–43; సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–12. ఆయన నుండి వచ్చే ఇతర బహుమానాలను కనుగొనడానికి మీరు రక్షకుని గురించి ఒక పాట కూడా పాడవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Hark! The Herald Angels Sing,” Hymns, no.209.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

రక్షకునిపై కేంద్రీకరించండి. “ప్రార్థనాపూర్వకంగా ‘జీవముతోనున్న క్రీస్తు’ చదవడం మత్తయి, మార్కు, లూకా, యోహాను మరియు మోర్మన్ గ్రంథ ప్రవక్తల సాక్ష్యాలను చదవడం వంటిది. అది రక్షకుని యందు మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఆయనపై కేంద్రీకరించడానికి మీకు సహాయపడుతుంది” (ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్, “తిరిగి రండి మరియు పొందుము,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2017,65).