2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జనవరి 4–10. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1–26: “ఒక కాంతి స్తంభమును చూచితిని”


“జనవరి 4–10. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1–26: ‘ఒక కాంతి స్తంభమును చూచితిని,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జనవరి 4–10. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1–26,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

పరిశుద్ధ వనము

పరిశుద్ధ వనము, గ్రెగ్ కె. ఓల్సెన్ చేత

జనవరి 4–10

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1–26

“ఒక కాంతి స్తంభమును చూచితిని”

మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1: 1–26 చదువుతున్నప్పుడు, మీ జీవితము కొరకు ఏ సందేశాలు కనుగొంటారు? మీకు, మీ కుటుంబానికి అత్యంత విలువైనది ఏమిటి?

మీ మనోభావాలను నమోదు చేయండి

సిద్ధాంతము మరియు నిబంధనలు ప్రార్థనలకు సమాధానాలు గల గ్రంథం: ఈ గ్రంథములోనున్న అనేక పరిశుద్ధ బయల్పాటులు ప్రశ్నలకు సమాధానంగా వచ్చాయి. కాబట్టి 1820లో ఒక వనములో జోసెఫ్ స్మిత్ అడిగిన ప్రశ్న అనగా కడవరి-దిన బయల్పాటుల ప్రవాహానికి నాంది పలికిన ఆ ప్రశ్నను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క అధ్యయనం మొదలుపెట్టడం సముచితము. “వాగ్వివాదము మరియు అభిప్రాయభేదములు” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:10 ) మతం మరియు అతని ఆత్మ యొక్క స్థితి గురించి జోసెఫ్‌ను గందరగోళానికి గురిచేసాయి; బహుశా మీరు దీనికి సంబంధం కలిగి ఉండవచ్చు. మన కాలములో చాలా విరుద్ధమైన ఆలోచనలు మరియు ఒప్పించే స్వరాలు ఉన్నాయి, మనము ఈ సందేశాల ద్వారా క్రమబద్ధీకరించాలని మరియు సత్యాన్ని కనుగొనాలని అనుకున్నప్పుడు, జోసెఫ్ చేసిన పనిని మనం చేయవచ్చు. మనం ప్రశ్నలు అడగవచ్చు, లేఖనాలను అధ్యయనం చేయవచ్చు, ధ్యానించవచ్చు మరియు చివరికి దేవుడిని అడగవచ్చు. జోసెఫ్ ప్రార్థనకు ప్రతిస్పందనగా, ఒక కాంతి స్తంభం పరలోకము నుండి దిగివచ్చింది; తండ్రియైన దేవుడు మరియు యేసు క్రీస్తు ప్రత్యక్షమై అతడి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ అద్భుత అనుభవానికి జోసెఫ్ సాక్ష్యం ధైర్యంగా ఇలా ప్రకటించింది, “జ్ఞానము కొదువగా ఉన్నవాడు దేవునిని అడిగి, పొందవచ్చును” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:26). పరలోక దర్శనము కాకపోయినా, మనమందరం కనీసం పరలోకపు కాంతి ద్వారా ప్రకాశింపజేయబడిన ఒక స్పష్టమైన దర్శనము పొందగలము.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1–26

జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్త.

“వాస్తవాలను” మన యెదుట ఉంచడమే జోసెఫ్ స్మిత్ చరిత్ర యొక్క ఉద్దేశ్యం, ఎందుకంటే జోసెఫ్ గురించిన వాస్తవం తరచూ వక్రీకరించబడింది ( జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1). మీరు జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:1–26 చదువుతున్నప్పుడు, ఆయన దైవిక పిలుపుకు సంబంధించిన మీ సాక్ష్యాన్ని ఏది బలపరుస్తుంది? ప్రభువు తన ప్రవచనాత్మక నియమితకార్యము కొరకు జోసెఫ్ స్మిత్‌ను సిద్ధం చేసెననుటకు మీరు కనుగొన్న ఆధారాలను గమనించండి. మీరు చదువుతున్నప్పుడు, జోసెఫ్ స్మిత్ మరియు అతని సాక్ష్యం గురించి మీ ఆలోచనలను, భావాలను కూడా మీరు నమోదు చేయవచ్చు.

Saints, 1:3–19 కూడా చూడండి.

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:5–20

నేను విశ్వాసంతో అడిగిన యెడల, దేవుడు సమాధానమిచ్చును.

ఎప్పుడైనా మీకు “జ్ఞానం కొదువుగా ఉన్నట్లు” లేదా మీరు తీసుకోవలసిన నిర్ణయం గురించి గందరగోళంగా ఉన్నట్లు భావించారా? (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:13). 5–20 వచనాలలో జోసెఫ్ స్మిత్ అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? మీకవసరమైన జ్ఞానము, అధిక అవగాహన గురించి ఆలోచించండి మరియు మీరు సత్యాన్ని ఎలా వెదుకుతారో పరిగణించండి.

1 నీఫై 10:17–19; 15:6–11; రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2018, 93–96 కూడా చూడండి.

ప్రార్థించుచున్న యువతి

ప్రార్థన ద్వారా మనం దేవుడిని మన ప్రశ్నలు అడగవచ్చు.

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:15–20

మొదటి దర్శనము గురించి వివిధ వృత్తాంతాలు ఎందుకు ఉన్నాయి?

తరచూ లేఖకుడిని ఉపయోగిస్తూ జోసెఫ్ స్మిత్ తన జీవితకాలములో కనీసం నాలుగుసార్లు తన పరిశుద్ధ వనపు అనుభవాన్ని నమోదు చేసెను. అదనంగా, జోసెఫ్ తన దర్శనము గురించి మాట్లాడినప్పుడు వినిన అనేకమంది తమ స్వంత వృత్తాంతములు వ్రాశారు. ఈ వృత్తాంతాలు కొన్ని వివరాలతో భిన్నంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకులు మరియు సందర్భమును బట్టి అవి స్థిరంగా ఉంటాయి. నాలుగు సువార్తలలో ప్రతి ఒక్కటి రక్షకుని పరిచర్యను బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడినట్లే, ప్రతి వృత్తాంతము జోసెఫ్ స్మిత్ అనుభవాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే వివరాలను జోడిస్తుంది.

జోసెఫ్ యొక్క ఇతర వృత్తాంతములను చదువుటకు “First Vision Accounts” (Gospel Topics, topics.ChurchofJesusChrist.org) చూడండి. ఈ వృత్తాంతాలన్నీ చదవడం ద్వారా మీరు ఏమి నేర్చుకుంటారు?

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:15–20

మొదటి దర్శనము యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపనను ప్రారంభించింది.

తన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తారని జోసెఫ్ స్మిత్ విశ్వసించాడు, కాని ఆ సమాధానం తన జీవితాన్ని మరియు ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో అతడు ఊహించలేకపోయాడు. మీరు జోసెఫ్ అనుభవం గురించి చదువుతున్నప్పుడు, మొదటి దర్శనము మీ జీవితాన్ని ఎలా మార్చిందో ధ్యానించండి. ఉదాహరణకు, మీరు ఈ వాక్యాన్ని వివిధ రకాలుగా పూర్తి చేయవచ్చు: “మొదటి దర్శనము సంభవించెను గనుక, … అని నాకు తెలుసు.” మొదటి దర్శనము వలన మీరు ఏవిధంగా ఆశీర్వదించబడ్డారు?

“Ask of God: Joseph Smith’s First Vision,” వీడియో, ChurchofJesusChrist.org; Saints, 1:14–19; రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆయనను వినుము,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2020, 88–92 కూడా చూడండి.

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:21–26

ఇతరులు నన్ను తిరస్కరించినప్పటికీ, నాకు తెలిసిన విషయాలకు నేను యధార్థముగా ఉండగలను.

లేఖనాల వలన కలుగు దీవెనలలో ఒకటి ఏదనగా యేసు క్రీస్తుపై విశ్వాసంతో సవాళ్ళను ఎదుర్కొన్న ధైర్యవంతులైన స్త్రీపురుషుల ఉత్తేజకరమైన ఉదాహరణలు వాటిలో ఉండడం. జోసెఫ్ స్మిత్ తన దర్శనము కారణంగా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు, అతడు అపొస్తలుడైన పౌలుతో పోల్చబడ్డాడు, అతడు కూడా ఒక దర్శనమును చూశానని చెప్పినందుకు హింసించబడ్డాడు. మీరు జోసెఫ్ వృత్తాంతమును చదువుతున్నప్పుడు, మీ సాక్ష్యానికి యధార్థముగా ఉండడానికి ఏది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది? మీకు కలిగిన ఆత్మీయ అనుభవాలకు యధార్థముగా ఉండడానికి—మీకు తెలిసిన లేఖనాలు లేదా వ్యక్తుల నుండి ఏ ఇతర మాదిరులు మీకు ధైర్యాన్ని ఇస్తాయి?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:6.ఈ వచనములో వివరించబడిన వ్యక్తుల మాదిరిగా వివాదాస్పదంగా మారకుండా మనము భిన్నాభిప్రాయాలతో ఎలా వ్యవహరించగలం?

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:11–13.ఈ వచనాలను చదవడం, ఒక లేఖన వచనము వారి హృదయాలను తాకి, చర్య చూపించుటకు వారిని ప్రేరేపించిన అనుభవాలను పంచుకునేందుకు కుటుంబ సభ్యులను ప్రేరేపించవచ్చు.

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:16–20.మీ కుటుంబము ఈ వచనాలను చదివేటప్పుడు, ఈ సారాంశాన్ని సమర్థించు చిత్రలేఖనమును లేదా మొదటి దర్శనము యొక్క మరొక చిత్రమును చూపించడాన్ని పరిగణించండి (బహుశా మీ కుటుంబం వారి స్వంత చిత్రణను గీయడాన్ని ఆనందించవచ్చు). “Ask of God: Joseph Smith’s First Vision” (ChurchofJesusChrist.org) అను వీడియోను కూడా మీరు వీక్షించవచ్చు. మీలో ప్రతి ఒక్కరూ ఈ దర్శనము నుండి మనము నేర్చుకున్న సత్యాల జాబితాను తయారు చేసి, మీ జాబితాలను ఒకరితోనొకరు పంచుకోవచ్చు. జోసెఫ్ స్మిత్ మొదటి దర్శనము గురించి సాక్ష్యాలను ఎలా పొందారో పంచుకోవడానికి కుటుంబ సభ్యులకు ఇది మంచి సమయం.

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17.దేవుడు జోసెఫ్ స్మిత్‌కు కనిపించినప్పుడు, ఆయన జోసెఫ్‌ను పేరుపెట్టి పిలిచెను. పరలోక తండ్రికి వారు వ్యక్తిగతంగా తెలుసు అని మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు భావించారు?

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:21–26.జనులు మన సాక్ష్యాలను ప్రశ్నించినప్పుడు మనము ఎలా స్పందించగలం?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Joseph Smith’s First Prayer,” Hymns, సం. 26.

పునఃస్థాపన స్వరముల చిహ్నము

పునఃస్థాపన స్వరములు

జోసెఫ్ స్మిత్ కుటుంబం

మనలో ప్రతి ఒక్కరూ మన కుటుంబ జీవితము వలన తీవ్రంగా ప్రభావితం చేయబడ్డాము మరియు జోసెఫ్ స్మిత్ దానికి భిన్నంగా లేడు. అతని తల్లిదండ్రుల మత విశ్వాసాలు మరియు అభ్యాసాలు పునఃస్థాపనను సాధ్యం చేసే విశ్వాసపు విత్తనాలను నాటాయి. జోసెఫ్ దినచర్య ఈ నివాళిని నమోదు చేస్తుంది: “నాకు చాలా గౌరవప్రదమైన తల్లిదండ్రులను ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పదాలు మరియు భాష సరిపోవు.” 1

ఈ క్రింద ఇవ్వబడినవి అతని తల్లియైన లూసీ మాక్ స్మిత్ ; అతని సోదరుడు విలియం స్మిత్; మరియు ప్రవక్త స్వయంగా ఉదహరించినవి, అవి స్మిత్ కుటుంబములో గల మతపరమైన ప్రభావానికి క్షణ దర్శనాన్ని మనకిస్తాయి.

స్మిత్ కుటుంబము

జోసెఫ్ స్మిత్ కుటుంబము, డాన్ బాక్స్టర్ చేత

లూసీ మాక్ స్మిత్

లూసీ మాక్ స్మిత్

“[సుమారు 1802 లో], నేను అనారోగ్యానికి గురయ్యాను. … నాలో నేను ఇలా అనుకున్నాను, క్రీస్తు మార్గాలు నాకు తెలియదు కాబట్టి నేను చనిపోవడానికి సిద్ధంగా లేను, నాకు క్రీస్తుకు మధ్య అంధకారమయమైన అగాధము ఉన్నట్లు అనిపించింది, దానిని దాటడానికి ప్రయత్నించే ధైర్యం నాకు లేదు. …

“నేను ప్రభువు వైపు చూసాను, నా పిల్లలను పెంచడానికి మరియు నా భర్త హృదయాన్ని ఓదార్చడానికి నన్ను బ్రతికించమని ప్రభువును అర్థించాను మరియు వేడుకున్నాను; ఆవిధంగా నేను రాత్రంతా మేల్కొని ఉన్నాను. … ఆయన నన్ను బ్రతకనిస్తే, ఆయనకు సరైన సేవ చేయడానికి వీలు కల్పించే ఆ మతము అది బైబిల్లో ఉన్నా లేదా ఎక్కడ దొరికినా సరే అది ప్రార్థన, విశ్వాసం ద్వారా పరలోకమునుండి పొందవలసి ఉన్నా సరే దానిని పొందుటకు నేను ప్రయత్నిస్తానని నేను దేవునితో నిబంధన చేసాను. చివరికి ఒక స్వరం నాతో ఇట్లనెను, ‘వెదకుము నీకు దొరుకును, తట్టుము అది నీకు తెరవబడును. నీ హృదయమును ఓదార్పుపొందనిమ్ము. నీవు దేవునియందు విశ్వాసము కలిగియున్నావు; నాయందు కూడా విశ్వాసము కలిగియుండుము.’ …

“ఈ సమయం నుండి నేను నిరంతరం బలము పొందాను. మతం అనే విషయంపై నా మనస్సు పూర్తిగా ఆక్రమించబడినప్పటికీ దాని గురించి నేను కొద్దిగా చెప్పాను, మరియు పరలోక విషయాలు నాకు బోధించడానికి దేవుని మార్గాలు తెలిసిన ఒక భక్తుడిని నేను వెదకగలిగిన వెంటనే నేను పూర్తి శ్రద్ధ వహిస్తానని అనుకున్నాను.”2

విలియం స్మిత్

విలియం స్మిత్

“మా అమ్మ చాలా భక్తిగల స్త్రీ మరియు ఆమె తన పిల్లల సంక్షేమం పట్ల చాలా ఆసక్తి కలిగి ఉండేది, మా ఆత్మల రక్షణ కొరకు మేము నిమగ్నమవ్వడానికి, లేదా (ఆనాడు ఉపయోగించే పదం వలె) ‘మతాన్ని పొందడానికి’ ఇప్పుడు మరియు ఇకమీదట తల్లి ప్రేమ సూచించే ప్రతి మార్గాన్ని ఆమె ఉపయోగించుకుంది. కూడికలకు హాజరుకావాలని ఆమె మమ్ములను ప్రోత్సహించింది, మరియు దాదాపు మా కుటుంబం మొత్తం మతముపై, సత్యాన్వేషణపై ఆసక్తి చూపింది.”3

“నాకు ఊహ తెలిసినప్పటి నుండి మాకు ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థనలు జరిగేవి. నాన్న తన కళ్ళజోడును ఎప్పుడూ తన చొక్కా జేబులో పెట్టుకునేవారని నాకు బాగా జ్ఞాపకముంది, … మరియు అబ్బాయిలమైన మేము ఆయన తన కళ్ళజోడు బయటకు తీయడం చూసినప్పుడు, అది ప్రార్థనకు సిద్ధం కావడానికి ఒక సంకేతమని మాకు తెలుసు, మరియు మేము గమనించకపోతే అమ్మ ఇలా చెబుతుంది, ‘విలియం,’ లేదా నిర్లక్ష్యంగా ఉన్న ఎవరైనా ‘ప్రార్థనకు సిద్ధంగా ఉండండి.’ ప్రార్థన తరువాత మేము ఒక పాట పాడేవారము.”4

లేఖనములపై కళ్ళజోడు

లేఖనాలు అధ్యయనం చేయమని జోసెఫ్ సీ. మరియు లూసీ స్మిత్‌లు తమ కుటుంబానికి నేర్పించారు.

జోసెఫ్ స్మిత్

జోసెఫ్ స్మిత్

“నాకు తెలిసినంతవరకు [నా తండ్రి] తన జీవితంలో నీచమైనది అని చెప్పబడు ఎటువంటి అల్పమైన చర్య ఎప్పుడూ చేయలేదని నేను ఇప్పుడు చెప్తున్నాను. నా తండ్రి మరియు ఆయన జ్ఞాపకశక్తి అంటే నాకు చాలా ఇష్టం; ఆయన చేసిన గొప్ప పనుల జ్ఞాపకం, నా మనస్సుపై గొప్ప ప్రభావము చూపింది; తండ్రిగా ఆయన దయగల మాటలు నా హృదయ ఫలకంపై వ్రాయబడ్డాయి. ఆయన జీవిత చరిత్రను ఎంతో ఆదరించే ఆలోచనలు నా మనస్సును చుట్టుముట్టాయి మరియు నేను పుట్టినప్పటి నుండి నా పరిశీలన ద్వారా అవి అక్కడ నాటబడ్డాయి, ఆ ఆలోచనలు నాకు పవిత్రమైనవి. … నా తల్లి కూడా గొప్పవారిలో ఒకరు, మరియు స్త్రీలందరిలో ఉత్తమురాలు.”5

మొదటి దర్శనము

పునఃస్థాపన యొక్క మొదటి దర్శనము, మైఖేల్ బెడార్డ్ చేత